21, జూన్ 2020, ఆదివారం

హిందూ భారతీయ సమాజం లో గోరింటాకు, పసుపు పారాణి ల కున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

హిందూ భారతీయ  సమాజం లో గోరింటాకు, పసుపు, పారాణి ల కున్న  ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం


పారాణిని పెళ్ళి సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాళ్ళకు చేతులకు పూసి అందంగా పెయింట్ చేసుకుంటారు. పసుపు సున్నం నీరు కలిపితే వస్తుంది చక్కని ఎర్రని పారాణి. ఇది గోరింటాకు వలె ఉన్నప్పటికి వాడినప్పటికి దీనికి ప్రత్యేక మైన ప్రయోజనం ఉంది. దీనిని పెళ్ళి సమయంలో వధువరుల అలంకరణలో ఒక సాంప్రదాయంగా వాడుతున్నారు.

గోరింటాకును ఆషాఢమాసం లో ను పండగలు శుభ కార్యాలలోను వేసుకుంటారు దీనినే మెహిందీ అని కూడా అంటారు 

పారాణి ప్రయోజనాలు  :

  • పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేది పారాణి. బాగా పల్చగా ఉంటే దీనిని వసంతం అంటారు. పూర్వం వసంతం అడటానికి పిచికారి గొట్టంలో ఈ ఎర్రని ద్రవాన్నే పోసే వారు. 

  • ఈ రంగులు సహజమైనవి కనుక ప్రమాదకారులు కావు. ప్రమోదకారులు మాత్రమే. 

  • చూడడానికి ఆహ్లాద కరంగా ఉండటమే కాదు త్వరగా పోతాయి కూడాను. 

  • దిష్టి తియ్యటానికి, ముఖ్యంగా శుభ సందర్భాలలో పారాణి నీటిని [ఎర్ర నీళ్ళు అంటారు] ఉపయోగిస్తారు. 

  • స్త్రీలు కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం పారాణి ముద్దని మింగటం కాని, పారాణి నీటిని తాగటం కాని చేస్తారు. 

  • ఆరోగ్యం చెడకుండా ,ప్రమాదాలు రాకుండా ఉండే సురక్షిత మార్గం అని భావిస్తారు 

  • పసుపులో సున్నం కలపటం వల్ల ఇది పసుపు కన్నా తీవ్రమైన క్రిమి సంహారకం, ఘాటుగా ఉంటుంది. 

  • అందుకనే గోరు చుట్టు వస్తే పారాణి ముద్దని గోరింటాకు లాగా పెట్టి కట్టు కడతారు. పిప్పి గోళ్ళకి, పుచ్చు గోళ్ళకి ఇది దివ్యమైన ఔషధం. 

  • ఈ ఆరోగ్య రహస్యాలు తెలిసినా తెలియక పోయినా అన్నీ శుభకార్యాలలో కాళ్ళకి పారాణి పెట్టే సంప్రదాయం ఈ నాటికీ కొనసాగుతోంది..

  • ఇది అందరికి వర్తించే సంప్రదాయం. కనుకనే పెళ్లిళ్లు, వడుగులు మొదలైన సందర్భాలలో పెళ్లి కొడుకుకి పసుపు రాసి పారాణి పెడతారు. 
  •  పసుపు పారాణి మంగళ ద్రవ్యాలు. ఐదోతనానికి చిహ్నాలు.

  • పసుపు పారాణి మంగళ ద్రవ్యాలు. ఐదోతనానికి చిహ్నాలు. ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు పూజ చేసే వారూ వారి చేత ముత్తైదువలుగా పూజింప బడే వారూ పాదాలకి పసుపు పారాణి విధిగా అలంకరించుకోవలసి ఉంటుంది.

  • అందంతో పాటు ఆరోగ్యం.అప్పుడప్పుడు పారాణి పెట్టుకోవటం కాలి గోళ్ళ ఆరోగ్యానికి మంచిది.

గోరింటాకు లేదా మెహిందీ విశిష్టత

హెన్నా' అనే పదం నుంచి ‘హెన్నా' వచ్చింది. గోరింటాకు పొడిని హెన్నాగా పేర్కొంటుంటారు. ప్రాచీన కాలం నుండి సౌందర్య సాధానాలలో గోరింటాకు ప్రధాన పాత్రపోషిస్తూ వస్తోంది.సంసృతంలో గోరింట చెట్టును ‘మేంధికా' అంటారు. ఆ పదం నుంచి మెహిందీ వచ్చింది.ఈజిఫ్ట్ ‘మమ్మీల' జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకు వాడేవారని వార్త ఉంది. క్రీ. పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిఫ్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఝలు చెబుతున్నారు.అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకును ప్రతీకగా అరబ్ దేశాలలో ఐదువేల ఏళ్ల క్రితమే వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి

  • గోరింటాకును మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు  పండుగైనా, ఫంక్షనైనా గోరింటాకు పెట్టాల్సిందే.

  • ఆషాఢమాసాన అరచేతుల్లో అందంగా మెరిసిపోయే గోరింట ఆధునిక జీవనంలో ఎన్ని పుంతలు తొక్కిందో తెలుసుకుందాం...కోమలమైన చేతుల కోసం ఎర్రని గోరింట మోసుకువచ్చే ఊసులేమిటో కనుక్కొందాము

  • గోరింటాకు చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, చేతులకు పెట్టి, రెండు నుంచి 6గంటల సేపు ఉంచితే చాలు ఎరుపు రంగులో మారుతుంది. 

  • ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు.

  • చర్మ సంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజైన్లెన్నో సృష్టించారు సృజనకారులు.

  • గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

  • ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా.. డాక్టర్లు కూడా చెప్తున్నారు. 

  • ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

  • గోరింటాకు పండేక  పండిన ఎరుపు రంగు సూర్యునికి పత్రీకగా చెప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. జ్ఝాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావిస్తారు.

  • గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు దరిచేరవని, మంచి భావాలను కలిగిస్తుందిని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకొనేవారు. వీటి వల్ల సంతానోత్పత్తి పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని భావించేవారు.

  • క్రిస్టియన్, హిందూ, ముస్లిమ్..ఇలా ఏ మతం వారికైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. క్రిస్టియన్ పెళ్లివేడుకలలో వెలిగిపోతుంది. తెలుగింటి పల్లెపడచు చేతుల్లో ఒదిగిపోతుంది. ముస్లిమ్ మగువన ముంజేతులను చక్కగా అలంకరిస్తుంది.

పసుపు  పారాణి ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది వీడియో లింక్ లలో చూడండి

శోథన ఫలితాలు

వివాహ సమయంలో పారాణి ఎందుకు పెడతారు ...

కాళ్ళకు పారాణి ఎందుకు పెడతారో మీకు ...

సాంప్రదాయకంగా పారాణి తాయారు చేయటం ...

పసుపు వల్ల ఇన్ని అద్భుతమైన లాభాల? | Benefits ...

Amazing health benefits of turmeric || పసుపు వల్ల ఇన్ని ...

గోరింటాకు ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది వీడియో లింక్ లలో చూడండి 

గోరింటాకు | Health Secrets of Gorintaku in ... - YouTube

గోరింటాకు ఉపయోగాలు | health secrets of ... - YouTube

గోరింటాకు చెట్టు ఉపయోగాలు || health secrets of ...

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి