శ్రీరాముడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీరాముడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, నవంబర్ 2018, బుధవారం

What is the original story hidden behind the sindore devotion of Lord Hanuman

హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక దాగివున్న అసలు కథ ఏమిటి?

సింధూరం ధరించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకొందాం 
హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు. హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.
  • పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన "సిందూరం"  పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై  వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడుఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగాసీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము.నీవు రాకూడదు,   వెళ్ళు హనుమా..  తరువాత రావచ్చుఅనెను. రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమాఇప్పుడు రావద్దు" అన్నారు. 
  • అంతట ఆంజనేయుడురామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా.  మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమిమీరు కూడా  స్త్రీ దాసులై పోతిరేమి రామ”  అనగా, రాములవారు హనుమంతునితోనేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం  పెట్టితిని
    అందుకు కారణంగా ఆమెకు 
    దాసుడనై  తిని అని తెలిపాడు.
  • హనుమంతుడు ఆశ్చర్యంతోఅమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికిఅని అడిగాడు. అప్పుడు సీతాదేవినాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించాననిచెబుతుంది.
  • వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.
  • హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసిహనుమా! ఇదేమిటిఅని అడగగా
  • హనుమంతుడు "మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించు కున్నాను".  మరి మీరు నాకు వశ మవుదురు కదా  ప్రభూ! మాకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.
మంగళవారం నాడు, హనుమంతుడి జన్మదినమైన శనివారం ఎందుకు ఎందుకు ప్రాముఖ్యమైనవంటే...

  • హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా "ఆంజనేయా! నీవంటి భక్తుడు పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి
  • అని శ్రీరాముడు  హనుమంతునికి  వరదానం చేశాడు.   అందుకే   భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి  సింధూర ప్రియుడు అయినాడు. అందుకే సింధూ రాన్ని ధరించిన భక్తులకు రామబంటు అయినా హనుమంతుడి కృపకు, శ్రీరాముడు దీవెనల కు అర్హులవుతారు అనేది హిందువుల గాఢ విశ్వాసం.
ఈ క్రింది వీడియో యూ.ఆర్. యల్  లు చూసి హనుమంతుడి సిందూరం గురించి తెలుసుకోండి.

హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ...

Nov 22, 2017 - Uploaded by YOYO TV Channel
Why Hanuman Likes Sindhuram - Importance of Hanuman Sindoor Puja One day Sita mata was wearing a red ...
Jul 6, 2017 - Uploaded by Mahilalu News
Hanuman Sindoor, Why Anjaneya Swamy Likes Sindhuram?, Hanuman Sindhuram, Hanuman Sinduram ...
May 12, 2017 - Uploaded by Telugu Mantra
హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది మీకు తెలుసా | Lord Hanuman |Sinduram | Telugu Mantra Health Tips Telugu Telugu Health Tips ...
May 10, 2018 - Uploaded by Bhakthi TV
హనుమంతుడికి సిందూరం అంటే ఎందుకు అంత ఇష్టం? || Special Discussion on "Hanumate Namaha" || Sri Mylavarapu Srinivasa Rao, Sri Inavolu ...
Oct 10, 2017 - Uploaded by Bhakthi TV
Please try again later. Published on Oct 10, 2017. హనుమంతుడికి ఒంటినిండా సిందూరంఎందుకు ఉంటుంది.|| Dharma ...
Jul 13, 2017 - Uploaded by Telugu Kiranam
హనుమంతుడిని సిందూర ప్రియుడని ఎందుకు అంటారు | శ్రీరాముడు హనుమంతునికి ఇచ్చిన వరం ఏమిటి|Telugu Kiranam Telugu Kiranam Channel, the most ...
Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .

అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .