wowitstelugu.blogspot.com
ప్రతి రోజు మన దేవుడిని నేను బాగుండాలనో, డబ్బు బాగా సంపాదిం చాలనో, లేక ఇల్లు కట్టుకోవాలనో, మన ఇష్ట దైవానికి లేదా దేవుళ్ళకి కోరుకుంటాం. స్వార్థం తో కోరుకొనే కోరికలు దేవుడు అనుగ్రహించడు . నిజం గా మనం కష్టాల్లో ఉండి నీకు అవి తీర్చ గలిగే కష్టాలైతేనే దేవుడు తీరుస్తాడు కోరికలు, కోరుకోవడాని కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం
- మన ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.
- మనం బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు మీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ మీరు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ మీకు సంపాదన ఉంటుంది అని అర్ధం .
- నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.
- భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం
- మీ కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనం చేసుకోవాలనుకోవడం
- మీ ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.
- నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..
- నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే మీ క్షేత్ర దర్శనం జరుగుతుంది ఇంక ఏమీ కావాలి మీ జీవితానికి
- చివరిగా నేను (స్త్రీ ) పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
- మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారినికాక మరి ఇంక ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక కూడా ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది
ఈ పొరబాట్లు మనం ఎప్పుడు చేయకూడదు ఇవే మన పాలిట మహా గ్రహాపాట్లు...
తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం విషయం. ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు కనుక తెలియ చేయడం వరకు నా బాధ్యత అవి ఏమిటో తెలుసుకుని పాటించడం పాటించక పోవడం అనేది అది మీ ఇష్టం .
- పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు, సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు.
- నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.
- తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చో వాలి కానీ చై కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు.
- మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు అలిచిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు అందులో జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.
- ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.
- వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు..
- సంధ్య కాలంలో సంసారం నిషేధం ,నిద్రపోకూడదు, ఆహారం తిన కూడదు గొడవలు పడకూడదు, ఆ సమయం ప్రదోషం కాలం ,ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.
- పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు , లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి,
- పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.
- పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి,
- ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..
- రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికెవి తెచుకోకండి నువ్వుల నూనె, ఆవు నైయి స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి, కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..
- పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తెసివేయాలి అలానే 5 min కూడా ఉంచకూడదు
- సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచుకున్నట్టు..
- పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి అవి లక్ష్మీ స్థానాలు.
- .శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..
- జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
- శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.
- ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
- పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు
- రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మాత్రమే మంగళసూత్రంకి పెట్టాలి.
- అపశకునపు మాటలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.
- వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.
- వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు
- ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు
- దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి.
- గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు.
- శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మన బొటన వీలుకు మించి ఉండకూడదు
- ప్రతినిత్యం శివలింగానికి అభిషేకం చేయాలి.
- నటరాజు ప్రతిమ ఇంట్లో ను దేవుడి గదిలోనూ ఉండకూడదు.నాట్య శాల లో ఉంటె తప్పు లేదు
- ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉంటె మంచిది.
- తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు ఆడవారు అసలు కోయకూడదు.
- పొద్దు పోయాక తులసికి నీరు పోయాకుడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి.
- ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
- స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు
- మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు.
- మంగళవారం, శుక్రవారంగోర్లు తీయకూడదు
- మంగళవారం, శుక్రవారంపేనులు తీయడం, పేలు దువ్వడం చేయకూడదు.
- మన రెండు చేతులతో తల గోక కూడదు.
- ఎప్పుడు చేతులతో గోర్లు కొరుకుతూ ఉండకూడదు
- కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు
- గుమ్మం గొళ్ళెం, చిలుక ఆడించ కూడదు.
- తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి.
- వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.
- ఇంటి గుమ్మాo ముందు చెప్పులు వదల కూడదు కొంచెం దూరంగా వదలాలి,
- ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు.
- దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.
- విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు,
- స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.
- ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్క సారి అయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.
- ఉదయం లేవగానే మొహం కడుక్కో కుండా అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు.
- భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు.
ఇవన్నీ పెద్ద కష్టమై పనులేవీ కాదు మనము తప్పని సరిగా పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీఇవి ఏవీ పాటించ కుండా ఎదో విధంగా కానిచ్చాం అంటూ పైగా ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము అంటే దాని వల్ల ఏమీ ఫలితం ఉండదు. దయచేసి ఇది గ్రహించండి.
ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింక్ లో చూడండి
అన్నం తిన్నకంచంలో చేయికడగకూడదా | Annam ...ఈ క్రింది వీడియో లింక్ లు చూడండి...
Search Results
https://www.youtube.com › watch
Search Results
ఇంట్లో ఈ మూలన చీపురు ఉంటే ఐశ్వర్యం ...
https://www.youtube.com › watch
గమనిక :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe చేయండి