weight loss tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
weight loss tips లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, అక్టోబర్ 2018, ఆదివారం

Some good and reliable Ayurveda tips to reduce fat and reduce weight around the stomach

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గి బరువు తగ్గడానికి కొన్ని నమ్మకమైన ఆయుర్వేదిక్ టిప్పులు  
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు , స్ధూలకాయంతో సతమతమవుతున్నారు . వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికిచాలా మంది మధ్య వయస్సు లోనే ఎక్కవగా బరువు  పెరుగుతుంటారుశారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు, ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్ల అలవాటు వంటి జీవనశైలితో స్ధూలకాయం వస్తుంది . స్ధూలకాయం కారణంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, సంతాన సమస్యలు, క్యాన్సర్, ఊపిరితిత్తుల జబ్బులుపిత్తాశయంలో కిడ్నీల్లో రాళ్ళు, అల్సర్లుగ్యాస్ట్రిక్ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, మొదలగునవి చుట్టుమడుతున్నాయి స్త్రీలు రజస్వల అయినపుడు గర్భం ధరించినపుడు, ముట్లుడిగన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది . 

దీని వల్ల  మనకి  వచ్చే నష్టం ఏమిటి ?

1. స్తూలకాయులు కఫ , వాత రోగులు గా మారే అవకాశం ఎక్కువ. 

2. శారీరక దుఃఖాలలో 90 % పొట్ట వల్ల వచ్చేవి

3. మనము తిన్న ఆహారం పొట్టలో సక్రంగా జీర్ణం అవ్వడం చాలా ముఖ్యం . కాబట్టి తినడం ఎంత ప్రధానమో, సక్రమంగా జీర్ణమటం అంతే ముఖ్యం

4. భోజనం కుళ్ళినప్పుడు శరీరంలో L.D.L. / V.L.D.L. (చెడు కొలెస్ట్రాల్ ) తయారవుతుంది . మీకు చెడుకొలెస్ట్రాల్ వల్లనే స్ధూలకాయం వస్తుంది.

5. మేలు చేసే కొలెస్ట్రాల్ ( H.D.L.) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది .

6. శరీరంలో కాల్షియం , విటమిన్ ' సి ' లోపించిన స్ధూలకాయం వస్తుంది.

7. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి అదనపు సమస్యలు తలెత్త వచ్చు .     

ఆయుర్వేదం పద్ధతుల్లో అనేక రకాల బరువు తగ్గే మార్గాలు

1.

అందరు నీళ్లు ఎక్కువ తాగాలి తగిన సమయంలో తాగాలి   

నీరు ఎక్కువ తాగాలి నీరు తాగే విధానం కూడా సక్రమంగా ఉండి నీటిని గుటక గుటకగా త్రాగాలి. బ్రేక్ ఫాస్ట్, భోజనమునకు 1 గంట ముందు నీళ్ళు త్రాగాలి. బ్రేక్ ఫాస్ట్, భోజనము తర్వాత 1 1/2 గంటల తర్వాత త్రాగాలి. భోజనము మధ్యలో త్రాగాలని పిస్తే 1 లేక 2 గుటకలు త్రాగవచ్చు. భోజనము తర్వాత గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగ వచ్చునుఈ  పద్దతిలో నీళ్ళు త్రాగిన యెడల తిన్న ఆహారం సక్రమంగా  'జీర్ణం' అవుతుంది . ఆహారం కుళ్ళి పోదు. L. D. L. /V.L.D.L. అనే చెడు కొలెస్ట్రల్ తయారవదు .అధిక బరువు సమస్య వుండదునీటిని గుటక గుటకగా త్రాగితే ఎలాంటి గుండె జబ్బులు, మధు మేహం, అధిక బరువు వంటి సమస్యలు రావు. 

2.

వంట నూనె వాడకము విధానము : 



మీరు వంటకు ఉపయోగించే శుద్దమైన నూనె (Non Refined Oil) మీ వాతాన్ని పెరగనీయ కుండా ఉంచుతుంది. స్ధూలకాయం సమస్యవుండదుశుద్ధమైన నూనె తీసుకుంటే శరీరంలో  లివర్  సహాయంతో మంచి  కొలెస్ట్రాల్ ( H.D.L) ఎక్కువ మోతాదులో తయారవుతుంది.  (H.D.L) మంచి చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం, అధిక బరువు తగ్గిపోతుందిహాని చేసే కొలెస్ట్రాల్ (L.D.L./ V.L.D.L ) వల్లనే స్ధూలకాయం వస్తుంది . కావున ఎటువంటి (Refined Oils) రిఫైండ్ నూనెల ను వాడరాదు రీఫైండ్ నూనెను తయారు చేసేటప్పుడు  6 నుంచి  13 రకాల హానికరమైన కెమికల్స్ ని కలుపుతారు . కెమికల్స్ ముందు ముందు వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయ .శుద్దమైన నూనెను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు . వేరు శనగ నూనె , నువ్వుల నూనెకుసుమల నున్ మరియు కొబ్బెర నూనెలు,  శుద్దమైన  నునెలు,  ఆవునెయ్యి వాడాలి.  మనిషి రోజుకు 10 నుండి  20 గ్రాములకు లోపు నూనెను వాడాలి. 
    3.  

    త్రిఫల చూర్ణం తయారీ చేయు విధానం: 

    • కరక్కాయ + తానెకాయ + ఉసరికాయలు కలిసినదే త్రిఫల చూర్ణం   వాత,   పిత్త,  కఫముల మూడింటినీ అద్భతముగా శమింప చేస్తుంది త్రిఫలము.  ఈ త్రిఫల యొక్క మోతాదు ఈవిదంగా తయారు చేయాలి. భాగం కరక్కాయ +2 భాగాలు తానేకాయ + 3 భాగాలు ఉసరికాయలు కలుప వలెను .  మోతాదులో తయారు చేసిన  త్రిఫల చూర్ణంనే వాడవలెను. ఉత్తమమైన దాన్ని కొన్ని రకాల ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే సమపాళ్ళలో ఉన్న త్రిఫల చూర్ణం ని తీసుకోవలసి వస్తుంది.  ఆయుర్వేద షాపులలో సమపాళ్ళలో వున్న త్రిఫల చూర్ణం లభిస్తుంది. కావున మీరే 1:2:3. నిష్పత్తిలో త్రిఫల చూర్ణంని తయారు చేసుకొనండి
    • త్రిఫల వాడే విధానము: ఉదయం పరగడపున అల్పాహారినికి 45 నిమిషాల ముందు త్రిఫలని తీసుకొనవలెను.ఒక  పెద్ద స్పూన్  త్రిఫల చూర్ణం + బెల్లం లేక తేనెను కలిపి తినవలెను. తర్వాత ఆవు పాలు త్రాగవలెను.  దీని వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి పెరిగి అధిక బరువు తగ్గుతారు. ఉదయం పూట త్రిఫల తీసుకోవడం వలన శరీరానికి కావలసిన  విటమిన్స్ , మైక్రో నూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ అన్నిరకాల పోషకాలు అందుతాయి. దీనివల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు . 

    4. 

    ఆవు పాలు  మరియు ఆవు నెయ్యి : 

    దేశీయ ఆవు పాలు అమృతం తో సమానం  . ఆవు పాలు ఎంత వేడి చేసినా దానిలో ఉన్న గుణం నశించదు . ఆవు నెయ్యిలో అద్భతమైన ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు కలవు . ఆవు నెయ్యి శరీరం యొక్క బరువును సమతూకం లో ఉంచుతుంది . అధిక బరువు వున్న వారు బరువు తగ్గుతారు .ఆవు నెయ్యిని తీసుకొనే విధానం ఈ విధంగా ఉంటుంది  రాత్రి భోజనం తర్వాత  1 గ్లాసు   వేడి  వేడి  ఆవుపాలలో 1 లేక  2  గ్లాసుల చెంచాల ఆవు నెయ్యిలో  చిటికెడు పసుపు కలిపి, రెండు గ్లాసులతో ఎక్కువ సేపు, సుమారుగా 20-25 సార్లు పైకీ క్రిందికి తిరగ తిప్పాలి. అప్పుడు పాలను గుటక గుటకగా త్రాగ వలెను. దీనివల్ల కచ్చితంగా బరువు తగ్గుతారు.

    5. 

    సబ్జాగింజలు తో బరువు తగ్గే  వైద్యం :

      పానీయాలలో వాడే సబ్జాగింజలు మీకు తెలిసే ఉంటాది . సబ్జాగింజలు రోజు ఒక స్పూన్ ఒక గ్లాస్ నీటిలో నానవేసి ప్రతి రోజు ఉదయం పరగడుపున కానీ , రాత్రి పడుకునేటప్పుడు గాని, ఒకటి రెండు గ్లాసులు తాగాలి.  ఈ విధంగా ప్రతి రోజు చేస్తుంటే కొంత కాలానికి కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం కాయం. 

      6.

      పులవు ఆకులుతో బరువు తగ్గడం : 


      పులవు ఆకులూ నీటిలో 3-4 ఆకులూ బాగా మరిగించి , చల్లారాక ఉదయం పరగడుపున 1 కప్పు రోజు తాగుతుండాలి.

        నిమ్మరసం  తో బరువు తగ్గడం

        ప్రతిరోజూ ఒకటి  లేదు రెండు నిమ్మకాయల గ్లాసు నీళ్లలో రసం పిండి, అరస్పూన్ లేదా తేనే లేదా చిటెకెడు ఉప్పు కలుపుకొని రోజు తాగితే  బరువు తగ్గుతారు. 




        8.  

        బెండకాయలు తో బరువు తగ్గడం:   

        రోజు 5 నించి 6 బెండకాయలు నానవేసి , లేదా పచ్చికాయలు తింటుంటే బరువు తగ్గుతారు .

          అల్లం వాటర్ తో బరువు తగ్గడం

          నడుము, తొడలు, పిరుదుల చుట్టూ కొవ్వు పేరుకున్నప్పుడు చాలా  అసహ్యంగా  కనిపిస్తుంది. లావుగా మారిన  విషయం   భాగాల్లో  పేరుకున్న కొవ్వును  చూస్తేనే అర్థమవుతుంది. అయితే  ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కారంగా ఉపయోగ‌  డుతుందిఅల్లం మాత్రమే వేగంగా కొవ్వుని కరిగించగలదు. అల్లంను ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుండి ల్ని కాపాడతాయి. అయితే అధిక కొవ్వుని కరిగించడంలో కూడా అల్లం ర్థవంతంగా పనిచేస్తుందిముఖ్యంగా నడుము, తొడలు, పిరుదుల భాగంలో పేరుకున్న కొవ్వుని తేలికగా కరిగిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీరంలో ఉన్న అధిక నీటిని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనివల్ల కొవ్వు కరిగిపోతుంది. అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలా పొట్టలో బ్లోటింగ్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. అలాగే అల్లం మెటబాలిక్ రేట్ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది. మెటబాలిజం పెరిగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి జింజర్ వాటర్ ఎలా తయారుచేసుకుని, ఎలా తీసుకోవడం వల్ల ఫ్యాట్ కరిగించడం తేలికవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

          అల్లం వాటర్ తయారు చేయు విధము :  

            • అల్లం వాటర్ తయారుచేసే విధానం ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిముషాలు ఉడికించాలి. నీటిని చల్లార్చి, వడకట్టి, తాగాలి

            • నీటిని రోజంతా మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని గమనిస్తారు. తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతూ ఉంటుంది

            • అల్లం వాటర్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. అయితే రోజుకి రోజు అల్లం వాటర్ తయారుచేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.
            బరువు,పొట్ట తగ్గించు కోవడానికి పాటించ వలసిన నియమాలు:
            • సైంధవ లవణం (Rock Salt ) వాడవలెను . 

            • ప్రతి రోజు ఉదయం 10-15 నిమిషాలీ (స్త్రీలు) తిరగలి తిప్పాలి. 

            • స్త్రీలు తిరగలి తిప్పిన యెడల మోనోపాజ్ సమస్యల నుండి రక్షిస్తుంది . 

            • పొట్ట తగ్గాలన్నా, ఎసిడిటి, విరేచన, జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే ప్రతి రోజు తిరగలి తిప్పండి . 

            • భోజనం తర్వాత నల్ల నువ్వులను లేదా జీలకర్ర  బాగా నమిలి తినండి . 3 లేక 4 నెలల్లో 7 లేక 8 కిలోల బరువు తగ్గుతారువేసవిలో నువ్వులను తినరాదు.

            • ఫ్రిజ్ నీటిని, ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగరాదు . 

            • పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు సుఖాసనంలో కూర్చోని భోజనం చేసిన యెడల 2 లేక 3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళి ఉంటుంది 

            • మైదా తో చేసిన పదార్థాలు ఎక్కువ తిన కూడదు.

            • పరోటా, పూరీలు రాత్రి ఎక్కువ తినటం వల్ల పొట్ట పెరిగే అవకాశం ఎక్కువుగా  వున్నది. కావున తిన రాదు. 

            • రోజు నడక, వ్యయం, యోగ చేయడం మంచిది.

            • వేఫుళ్లు , ఊరగాయలు, ఎక్కువ తినరాదు. పొడులు తినవచ్చు. 

            • వెల్లుల్లి,కరివేపాకు ,జీలకర్ర , పోపులలో ఎక్కువ వాడండి 

            • ఉలవపిండి మరగపెట్టి చారు చేసుకొని భోజనం తో తరచు తీసుకోండి 

            • ఆకు కూరలు తో వండిన (రిఫైన్డ్ నూనెలు వాడకుండా ) కూరలు చేసుకోండి. 

            • అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినండి .

            • పలచగా చేసిన వెన్న చిలికిన  మజ్జిగ రోజు మధ్యాహ్నం రెండు గ్లాసులు తాగండి.

            • అలాగే రోజూ జీరా రైస్ చేసుకుని తింటే తొందరగానే బరువు తగ్గిపోతారు. మరికెందుకు ఆలస్యం ఒంట్లోని అధిక బరువును అధిగమించేందుకు చిన్న టెక్నిక్  ట్రై చేయండి. బంధువులు, సన్నిహితులకు ఉపయోగపడేలా షేర్ చేయండి.
            • తీపి పదార్దాలు అసలు ఎక్కువ తినరాదు. షుగర్ ఉన్నవారు అసలు తినరాదు.

            • వ్యాయామం చేసేటప్పుడు గుంజీలు తీయడం, మెట్లు ఎక్కడం దిగడం ఒక భాగం గా మార్చుకోండి.

            • రాత్రి భోజనం చేయగానే నిద్రపోకండి, రాత్రుళ్ళు తేలికగా జీరమైయ్యే ఆహారం తీసుకోండి.

            నోట్:  

            పైన చెప్పిన ఆయుర్వేదిక్  టిప్పులు  అన్ని ఎవరికీ వారు కొద్దీ కొద్దీగా వాడి వచ్చే ఫలితాన్ని పట్టి ఎంత వాడాలి  అనేది నిర్ణయించు కోవాలి. అన్నిరకాలు  ఒకేసారి ప్రయత్నించకండి. కొందరికి కొన్ని ఆహార పదార్దాలు తొందరగా ఫలితాన్నిస్తే  కొందరికి నెమ్మది గా ఫలితాన్నిస్తాయి .

            ఈ క్రింది 'యుట్యూబ్' వీడియో యూ.ర్.యల్. చూసి బరువు తగ్గడం ఎలాగో తెలుసుకోండి ...


            Note:
            అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. 
            నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
            మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
            కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .