హిందూ పురాణాల లో వ్రాసిన కాలమానం యుగాలు గురించి తెలుసుకుందాము.
మన జీవితకాలం చాల స్వల్పం, దేవతలు , ఋషి పుంగవులు, వేలు, లక్షల సంవత్సరాలు జీవించినట్టు, హిందూ పురాణాలూ, పవిత్రగ్రంధాలు చెబుతున్నాయి. లక్షల సంవత్సరాలు కాల గణన చేయటం వల్ల మానవ మాత్రులకు శాస్త్ర బద్ధత దొరకక పోవచ్చు. ఏది ఏమైనప్ప టికీ ఈ యుగాలంటే ఏమిటో ఇప్పటి తరం వారికీ తెలియ జేయాలన్నదే నా ప్రయత్నం.
![]() |
పై చిత్రం - యుగముల గురించి వేదాలలో |
యుగాలు, మహా యుగము:
- దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము.
- అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).
- మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము.
- ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
- మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము అందురు.)
- ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు.
- బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు.
- మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.
- ఈ రాత్రిని ప్రళయము అంటారు.
- అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.
- అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ,
త్రేతాయుగంలో మూడు పాదాలపైన,
ద్వాపర యుగంలో రెండు పాదాలపైన,
కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.
బ్రహ్మ దేవుడు ఒక్కరు కాదు.
బ్రహ్మ ఒక్కడే కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు (3,091,76,00,00,000 మానవ సంవత్సరాలు).
ఇప్పటివరకు...
1.మానవ బ్రహ్మ,
2.చాక్షువ బ్రహ్మ,
3.వాచిక బ్రహ్మ,
4.శ్రావణ బ్రహ్మ,
5.జన్మ బ్రహ్మ,
6.నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ
2.చాక్షువ బ్రహ్మ,
3.వాచిక బ్రహ్మ,
4.శ్రావణ బ్రహ్మ,
5.జన్మ బ్రహ్మ,
6.నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ
అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్థుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది.
బ్రహ్మ సంవత్సరం అంటే ఎంతకాలం?
- బ్రహ్మ సంవత్సరం అంటే (మానవులకి)మనకి 360 రోజులు గా ఉండేవి అనగా, బ్రహ్మకి 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు.
- అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి.
- 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి.
- 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి.
- కనుక పంచాంగ కర్తల అంచనా ప్రకారం మొత్తం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక 100 సంవత్సరాలు.
దీని గురించి వివరంగా తెలుసుకోవాలాంటే ఈ క్రింది యూ.ఆర్ .యల్ English లో తెలుగు లో ఉన్నాయి చూడండి :
Jan 27, 2017 - Uploaded by The Magical Indian
Every Hindu Must know these things about our Hindu Sanatan dharma. There are 4 yugas, Satya Yuga ..
Jun 10, 2012 - Uploaded by Swami Vivekananda - The Inspirational Leader
Four Yugas in Human Years - Time in Vedas Hindu units of measurement KritaYuga Krita Yuga Dwápara ...
Apr 22, 2017 - Uploaded by RECTV INDIA
There are 4 yugas, Satya Yuga, Treta Yuga, Dwapar Yuga and Kaliyuga. ... Rahasyavaani - Unknown ...
Jul 30, 2014 - Uploaded by SatyaN G
Dvapara Yuga, Satya Yuga, Treta Yuga ,Kali Yuga, yugas, kalabramanam, About birth of universal ...
Satya Yuga - YouTube
Nov 9, 2015 - Uploaded by Audiopedia
The Satya Yuga, also called Sat Yuga, Krta Yuga and Krita Yuga in Hinduism, is the "Yuga of Truth", when ...
Mar 20, 2017 - Uploaded by VTube Telugu
Check out the full video and know what veda's revealed avout Kali Yuga. For more Interesting Unknown ...
Oct 26, 2016 - Uploaded by Know World's Fact
Yuga in Hinduism is an epoch or era within a four age cycle. ... starts with the Satya Yuga, via Treta Yuga and ...
Mar 2, 2017 - Uploaded by TriConZ
Interesting Facts about Kaliyugam Kalagnanam in Telugu|How many kinds ofYugas are there? TriConZ ...Search Results
Aug 22, 2016 - Uploaded by Hindu Religion
how Satya yuga will be Want to know how satya yuga will be? How peoples in satya yuga will be? what ...
Jul 5, 2017 - Uploaded by Shivay Tech
yuga descriptions in hindi/the science of the four yugas/satya yuga/treta yuga/
Dec 18, 2015 - Uploaded by Naresh Sandapaga
Four Yugas ... Mahabharatam in Telugu Web Series Episode 1 | Krishna Mahabharat - Mahabharata War in ...
Dec 7, 2010 - Uploaded by Ananda Sangha Worldwide
Part 78 - Chapter 2, Stanza 43. http://www.crystalclarity.com/product... The Essence of the Bhagavad Gita ...
May 21, 2017 - Uploaded by WikiTubia
The Dvapara Yuga, also spelt as Dwapara Yuga, is the third out of four Yugas, or ages, described in the ...
Jun 14, 2008 - Uploaded by alfay06
Kali yuga ends finally by the death of biggest EVIL on earth .... Meantime I am living in 318 years in ascending ...
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి. నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like, share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.