ప్రముఖ ఆధ్యాత్మిక పాటల రచయిత మరియు స్వరకల్ప సామ్రాట్ యం. యస్. రామారావు గారి జీవిత చరిత్ర.
Note: ఎమ్మెస్ రామారావు అనగానే సుందరం.. సమ్మోహన గానం
ఎం.ఎస్.రామారావు అనగానే తెలుగు సినిమాల తొలి నేపథ్య గాయకుడుగా సంగీతాభిమానులందరకూ పాత తరం ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులు. ఇంకా వివరంగా వ్రాయాలంటే ‘సుందరదాసు’ అనగానే ఆయన యావత్ ఆంధ్రదేశానికీ ప్రసిద్ధులు. ఆయన రచించి, సంగీతం సమకూర్చి గానం చేసిన ‘సుందరకాండ’ గీతాలు యావదాంధ్ర దేశంలోనూ మారుమ్రోగాయి. మారుమ్రోగుతున్నాయి. ఇంకా మారు మ్రోగుతూనే ఉంటాయి. శ్రీమద్ రామాయణంలోని మధురమైన ‘సుందరకాండ’ కథను, తేట తెలుగులో, మృదు మధురమైన శైలిలో ఆయన పాడిన తీరు అపూర్వం, అద్వితీయం. ఈ విధంగా త్రిపాత్రాభినయం చేసిన వారు (రచన, సంగీతం, గానం) ఆయనకు ముందు మరొక గాయకులు లేరనడం అతిశయోక్తి కాదు.
వ్యక్తిగత వివరములు:
- జననం : మోపర్తి సీతారామారావు, మార్చి 7,1921,గుంటూరు జిల్లా, అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు
- మరణం: 20 ఏప్రిల్ 1992 (వయసు 71), హైదరాబాదు
- ఇతర పేర్లు: సుందరదాసు
- వృత్తి: నేపథ్య గాయకుడు
- ప్రసిద్ధి: సుందరకాండ
- మతం: హిందూ
- భార్య : లక్ష్మీ సామ్రాజ్య
- పిల్లలు : ఒక కుమార్తె (వెంకట సరోజిని),ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు)
- తండ్రి: మోపర్తి రంగయ్
- తల్లి: మంగమ్మ
- "సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 - ఏప్రిల్ 20, 1992) గారి పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. వీరు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము'(రామాయణం లోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు.ఈ రెండూ వీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
- తొలినాళ్లు ఎమ్మెస్ రామారావు 1921 మార్చి 7 న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మోపర్తి రంగయ్య మరియు మంగమ్మ గార్లు సీతారామ భక్తులు. చిన్నతనం నుండే రామారావు గారు పాటలు పాడుతుండేవారు. ఈయన విద్యాభ్యాసము నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో మరియు గుంటూరు హిందూ కళాశాలలో జరిగింది. రామారావు గారికి 1942 లో లక్ష్మీ సామ్రాజ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె (వెంకట సరోజిని) మరియు ఇద్దరు కుమారులు (బాబూరావు, నాగేశ్వరరావు)
- సినీరంగంలో 1942 సంవత్సరంలో బి.ఎన్.రెడ్డిగారి నిర్మాణ, దర్శకత్వంలో వెలువడిన వాహినీ వారి ‘దేవత’ చిత్రంలో మొట్టమొదటిసారిగా ఒక నేపథ్య గీతం పాడారు. ‘‘ఈ వసంతమూ నిత్యము కాదోయ్’’ అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ (నేపథ్య గీతం) పాడి, తెలుగు చలనచిత్ర తొలి నేపథ్య గాయకుడుగా ప్రసిద్ధి కెక్కారు.
- ఆ తరువాత ‘చెంచులక్ష్మీ’ (1943), ‘తహసీల్దార్’ (1944), ‘మనదేశం’, ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’, ‘మొదటిరాత్రి’, ‘మానవతి’ వంటి అనేక చిత్రాలలో నారాయణరావు గారికి రామారావు గారు పాడిన పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి.
- ‘తహసీల్దార్’ చిత్రంతో పడవ నడిపేవాడుగా, తానే ఆ పాత్ర ధరించి పాడిన పాట (నండూరి సుబ్బారావు గారు రచించిన ‘ఎంకిపాట’) ‘ఈ రేయి నన్నోల నేరవా రాజా’ అన్న పాట ఎం.ఎస్. రామారావు గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చింది.
- ‘మనదేశం’లో కథానాయిక కృష్ణవేణి గారితో కలిసి, రామారావుగారు నారాయణరావు గారికి పాడిన యుగళగీతం ‘ఏమిటీ ఈ సంబంధం - ఎందుకో ఈ అనుబంధం’ తెలుగు సినిమా యుగళ గీతాలలో, మొదట్టమొదటి 10 స్థానాలలో నిలిచే యుగళగీతాలలో ఒకటి అని ప్రఖ్యాత సినీ సంగీత విశే్లషకులు వి.ఎ.కె.రంగారావుగారు పేర్కొన్నారు. ఇది అక్షరాల నిజం.
- ఇవిగాక విషాద గీతాలూ, నేపథ్య గీతాలూ ఆలపించటంలో ఎం.ఎస్.గారు బహుదిట్ట. ‘పోరా బాబూ పో’ (దీక్ష), ‘శోకపు తుపాను చెలరేగిందా’ (పిచ్చిపుల్లయ్య), ‘జీవిత మింతేరా మానవ జీవితమింతేరా’ (జయసింహ), ‘బ్రతుకిదేనా సంఘమునా’ (పరదేశి), ‘కనీసం ప్రతి మనిషికీ కూడు గుడ్డ నీదైనా ఉండాలా (మేరికం) వంటి పాటలు, ఆయన పాడిన పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్నాయి.
- 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్(ఈఆF)లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ.
- ఆయన సుందరకాండను, తేట తెలుగులో రచించి, సంగీతం అందించి తన మృదుమధుర కంఠస్వరంతో గానం చేశారు. ‘శ్రీ హనుమాను గురుదేవులు నాయెడ పలికిన సీతారామ కథా, నే పలికెద సీతారామ కథా’ అనే మకుటంతో వీరు పాడిన ‘సుందరకాండ’ అశేష తెలుగు ప్రజానీకానికి ఒక పెన్నిధి వంటిది. ఇప్పటివరకూ అనేకసార్లు రేడియోలోనూ, టీవీలలోనూ, ఆంధ్ర దేశమంతటా మారు మ్రోగింది. ప్రతీ తెలుగువాడి ఇంట్లోనూ ఎప్పుడో ఒకప్పుడు, వినిపిస్తూనే వుంటుంది. అంతేగాక 1972 నుండి 74 వరకు తులసీదాసుగారి హనుమాన్ చాలీసానుకూడా తేట తెలుగులో అనువదించి గానం చేశారు. ఈ రెండూ తెలుగువారికి తరిగిపోని నిధి నిక్షేపాలు.
- 1975 నుంచి హైదరాబాదులోని చిక్కడపల్లిలో నివసించారు. ఈ మహానుభావుని ప్రతిభను గుర్తించి, తెలుగు గానాభిమానులు 7-4-1977 తేదీన వీరికి ఘనసన్మానం చేసి ‘సుందర దాసు’ అని బిరుదును ప్రదానం చేశారు.
- ఈ మధుర గాయక భక్త శిఖామణులు 20-4-1992 తేదీన హైదరాబాద్లో పరమ పదించారు. ఎం.ఎస్.రామారావుగారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చును. రామారావు, ఘంటసాల వంటి అమరగాయకులకు మరణం లేదు. వీరు పాడిన సినిమా పాటలూ, ముఖ్యంగా సుందరకాండ తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆంజనేయస్వామి వారు చిరంజీవులు. అలాగే ఎం.ఎస్.రామారావుగారి పాటలూ, వారి సుందరకాండ కూడా చిరంజీవులే.
ఈ క్రింది వీడియోలు యు.ఆర్ఎల్. అదనపు వివరాల కోసం చూడండి ...
ఇంగ్లీష్ లో వివరాలు ....
M. S. Ramarao - Wikipedia
M. S. Ramarao (July 3, 1921 – April 20, 1992) is an Indian singer and composer. He was popular for his devotional songs, especially sundarakandamu in ...
తెలుగులో హనుమాన్ చాలీసాల కు ఈ క్రింది యుఆర్ఎల్ క్లిక్ చేయండి...
M. S. Ramarao (July 3, 1921 – April 20, 1992) is an Indian singer and composer. He was popular for his devotional songs, especially sundarakandamu in ...
తెలుగులో హనుమాన్ చాలీసాల కు ఈ క్రింది యుఆర్ఎల్ క్లిక్ చేయండి...
MS Rama rao Full interview || Hanuman chalisa || Sundarakanda ...
Jul 15, 2017 - Uploaded by TDL Interviews
MS Ramarao was born in 3rd Juy 1921 at Moparthi, Tenali, Guntur District, Andhra Pradesh to Sri.Moporthi ...
Jul 15, 2017 - Uploaded by TDL Interviews
MS Ramarao was born in 3rd Juy 1921 at Moparthi, Tenali, Guntur District, Andhra Pradesh to Sri.Moporthi ...HANUMAN CHALISA - MS RAMA RAO - TELUGU LYRICS - YouTube
Dec 2, 2017 - Uploaded by Vijnatha
MS Ramarao sundarakanda part 1 || devotional songs || sundarakandam - Duration: 58:08. రాముని వారము 10,951 ...
Dec 2, 2017 - Uploaded by Vijnatha
MS Ramarao sundarakanda part 1 || devotional songs || sundarakandam - Duration: 58:08. రాముని వారము 10,951 ...Sundara Kanda M S Ramarao - YouTube
Dec 23, 2016 - Uploaded by bhakti- shakti
devotional videos
Dec 23, 2016 - Uploaded by bhakti- shakti
devotional videosఅలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .