జుట్టు రాలకుండా ఇంట్లోనే పాటించే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే పొడవైన నల్లని జుట్టు మీ సొంతమవుతుంది ...
- తల్లో దువ్వెన పెడితే చాలు వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి, బట్టతల వచ్చేస్తుందేమో అని బాధపడే మగవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ మధ్య. దాంతో బట్టతల రాకుండా నివారించుకునేందుకు ఎంతో ఖర్చు పెట్టి సెలూన్ల చుట్టూ తిరిగి హెయిర్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేయించుకుంటున్నారు. అసలు కారణాన్ని తెలుసుకోకుండా ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా వృథానే. అందులోను జుట్టు రాలడాన్ని నియత్రించేందుకు డబ్బులుపోసి పార్లర్లకు పరిగెత్తక్కర్లేదు. ఇంట్లోనే చేసుకునే ఎన్నో మంచి చిట్కాలు ఉన్నాయి.
- ముందుగా జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని ఆ తరువాత వాటికి తగ్గ రెమెడీలు పాటిస్తే చాలు బట్టతలకు దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.
- పోషాకాహరం తీసుకోకపోవడం, విటమిన్, జన్యు లోపాలు, అధిక ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు, టైఫాయిడ్, రక్తహీనత, విరేచనాలు, కామెర్ల వంటి దీర్ఘకాల అనారోగ్యాల వంటివి జుట్టు రాలడానికి కారణాలవుతాయి. వీటితోపాటు రక్త సరఫరా సరిగా లేకపోవడం, తల సరిగా శుభ్రం చేసుకోవడం వంటివి కూడా కారణాలే. జుట్టు రాలకుండా ఇంట్లోనే పాటించే పదమూడు జాగ్రత్తలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. వీటిని అనుసరించి బట్టతల బారిన పడకుండా జాగ్రత్తపడండి.
యుక్తవయసులో తెల్లవెంట్రుకలా..!
చిన్నవయసులోనే కొంతమంది యువతీయువకులకి తలలో తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా బాగా మొహమాటపడతారు. తమ వెంట్రుకల రంగు చూసి ఎవరు నవ్వుతారో...వెక్కిరిస్తారోనని భయపడుతుంటారు. చాలా ఇబ్బందిపడుతుంటారు. ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు లేకపోలేదు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి వంటి వాటి వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవే కాకుండా వయసు మీద పడ్డా కూడా నల్లగా ఉన్న జుట్టు కాస్తా తెల్లబడుతుంది. దీనికి కారణం. జుట్టును నల్లగా ఉంచే మెలొనిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే.
ఈ తెల్లజుట్టు కనిపించకుండా ఉండడానికి తాత్కాలికంగా కొన్నిరకాల టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. అవి చిన్నా పెద్దా అందరికీ ఉపయోగపడతాయి.
- ఉదాహరణకు శిరోజాల్లో ఏవో కొన్ని పాయలు తెల్లగా ఉన్నాయనుకోండి ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కారా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని మస్కారా కవరప్ చేస్తుంది. ఇది ఇన్స్టాంట్ కిటుకు.
- అలాగే కాజల్‌ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ కనిపిస్తుంది.
- డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్‌ను కూడా తలలోని తెల్ల పాయాలపై అప్లై చేయొచ్చు.
- ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్లజుట్టు సమస్యను అధిగమించవచ్చు.
ఇంట్లో వస్తువులతో ఎలా అంటారా? ఈ క్రింది విషయాలు కొద్దిగా గమనించండి...
- ఉదాహరణకు 100 మిల్లీ గ్రాముల కొబ్బరినూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి. ఆ రెండింటిని కలిపి బాగా ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్లరంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్‌ని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి.ఈనూనెను ప్రతి రోజూ రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాలు పాటు మర్దనా చేసుకొని, ఆ మర్నాడు తలస్నానం చేయాలి. జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కూడా ఎంతో బాగా పనిచేస్తాయి.
- ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దించి అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి.
- అలాగే నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగ నిగ లాడేలా చేస్తుంది. వంద మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీ గ్రాముల కమలాపండు రసం,50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది.
- హెన్నాతో సైతం ఈ సమస్యను అధిగమించవచ్చు. హెన్నా పొడిని పేస్టులా చేసి అందులో కాస్తంత కాఫీ పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ పేస్టును తలకు రాసుకుని రెండు గంటల సేపు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత షాంపుతో తలరుద్దుకుని, నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి.
- ఉడకబెట్టిన తేయాకు ఆకులతో వెంట్రుకల తెల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు. తొలుత తేయాకు ఆకుల్ని నీళ్లల్లో ఉడకబెట్టాలి. అది చల్లారిన తర్వాత ఆ ఆకుల్ని పిండి దాని నుంచి వచ్చే నీటిని తలకు రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత గంటకు చల్లటి నీళ్లతో జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. తలకు షాంపును మాత్రం పెట్టుకోవద్దు.
- ఉల్లి పాయను సగానికి కోసి జుట్టుపై రుద్దండి. ఒక గంట ఆగి ఆరిపోయాక తలకు స్నానం చేయండి. ఇలా ప్రతి వారము తలా స్నానం చేసినప్పుడల్లా చేసి చూడండి . కొన్ని నీళ్లలో మీ జుట్టు నల్లగా అవడమే కాకుండా పొడవుగా పెరుగుతుంది.
- కుంకుడు కాయలలో మందారాకులు కలిపి ముద్దలా చేసి తలకు రుద్దుకుంటే కొన్నాళ్ల కు జుట్టు నల్లగా అయి ఒత్తుగా పెరుగుతుంది .
- బియ్యం కడుగు తీసి ఉంచి 12 గంటలు నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తలకు పట్టించి తల రుద్దుకుంటే మీ జుట్టు త్వరగా వత్తుగా పెరిగి నిగనిగ లాడుతూ నల్లగా ఉంటుంది.
- 100 గ్రాముల ఆవు నెయ్యిని తీసుకొని దానిలో 15 గ్రాముల తేనే, 100 గ్రాముల ఉసిరి రసాన్ని కలిపి బాగా వేడిచేయాలి. దానిలోని నీరు అంతా ఆవిరైపోయే అంత వరుకు వేడి చేస్తూనే ఉండాలి. ఆ ద్రావణం తయారు అయిన తరువాత ఒక గాజు సీసలోకి తీసుకోవాలి. దానిని తలస్నానం చేసే ముందు తలకి రాసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు మళ్ళి నల్ల జుట్టుని పొందే అవకాశం ఉంది.
- కొన్ని మామిడి ఆకులను తీసుకొని వాటిని పేస్టుచేసి జుట్టుకి అప్లై చేసి 15-20 నిమిషముల తరువాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మీకు జుట్టు తొందరగా పెరుగుతుంది అలానే నల్లగా కూడా అవుతుంది.
- కొన్ని మామిడి ఆకులను మరియు కొన్ని పచ్చిమామిడి తొక్కలను తీసుకొని కలిపి వాటిని ఆయిల్లో వేసి చాల కాలం వరకు సూర్యరశ్మి తగిలేల ఎండలో ఉంచాలి. ఆ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు రాలటాన్ని ఆపి నల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది.
- మామిడి విత్తనం యొక్క నూనెను వాడటం వలన తెల్లజుట్టు నల్లజుట్టుగా మారుతుంది. అలానే జుట్టు రాలటాన్ని ఆపి, చుండ్రు రాకుండా చేస్తుంది.
- అర లీటరు నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని మరియు నిమ్మరసాన్ని (సగం నిమ్మ ముక్క) కలపాలి. తలస్నానం చేసే ముందు ఆ నీటిని తలకు అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
- ఈ చిట్కా మీకు పోయిన మేలనిన్ అనే ఒక వర్ణద్రవ్యం మళ్ళి పునరుద్ధరించడానికి తోడ్పడుతుంది. ఎండిన బీరకాయ ముక్కలను తీసుకొని దానిని కొబ్బరి నూనెలో మూడు రోజులపాటు నానపెట్టాలి. ఆ ఆయిల్ నల్లరంగు వచ్చే వరకు వేడి చేయాలి. ఈ ఆయిల్‌ని తలమీద మసాజ్ చేసి ఒక గంట తరువాత కడగాలి.
- నారింజ రసం ఆరోగ్యవంతమైన మరియు బలమైన హెయిర్‌ని పొందడంలో సహాయ పడుతుంది. ఉసిరి రసం జుట్టుని మందంగా మరియు నల్లరంగుని ఇవ్వడానికి సహాయ పడుతుంది. నారింజ గుజ్జుని తీసుకొని దానిలోకి ఉసిరి పొడిని కలిపి పేస్టు చేసి తలకి అప్లై చేసి 30 నిమిషముల తరువాత కడగవలెను. ఇది మీ జుట్టుకు నల్లటి రంగును ఇవ్వడానికి సహాయపడుతుంది.
ఈ చిట్కాలు మీరూ ప్రయత్నించి చూడండి.మీ జుట్టును నిగనిగలాడేట్టు చేసుకోండి..
ఈ క్రింది సూచనలు పాటించండి నిగనిగలాడే పొడవైన జుట్టు మీ సొంతమవుతుంది ...
- ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
- రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి.
- ప్రతిరోజూ రాత్రి ఐదు ఆల్మండ్ గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.
- మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.
- ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినాలి.
- ప్రొటీన్ల కోసం ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి. కోడి కూర కూడా తినాలి.
- టీ, కాఫీలు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మంచిది.
- తలస్నానం చివర్లో ఒక టీ స్పూను నిమ్మరసంతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. చుండ్రు రాదు.
- రోజుకి రెండు గ్లాసుల వెన్న తీసిన పాలు తాగితే ఎంతో లాభం ఉంటుంది.
- వారానికి ఒకసారి మెంతి గింజల గుజ్జును మాడుకు పట్టించి అరగంట తరువాత తల శుభ్రం చేసుకోవాలి. అలాగే పరగడుపున మెంతులు నానపెట్టిన నీళ్లు తాగాలి.
- స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, సపోట, ద్రాక్షలను రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే మంచిది.
- కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.
- చేపలు, కోడి, గుడ్లు వాడకం పెంచితే జుట్టు బాగుంటుంది. రెడ్ మీట్‌కి దూరంగా ఉండాలి.
మరి కొన్ని సహజమైన టిప్స్ మీకోసం చూడండి ...
- జుట్టుని ఎప్పుడు ఆయిల్ తో ఉంచండి .
- తలస్నానమ్ చేసిన తరువాత గంటలోనూనె వ్రాయండి .
- ఎక్కువ రోజులు జుట్టుని పొడిగా ఉంచవద్దు .
- జుట్టుని గట్టిగ దువ్వవద్దు . వదులుగా దువ్వండి . రసాయనాలు ఉన్న క్రీములు ,ఆయిల్స్ వాడవద్దు . ఎక్కువుగా సహజ సిద్ద మైనవే వాడండి .
- జుట్టు ఊడిపోయేలా గట్టిగ దువ్వకండి. పెద్ద పెద్ద , దూరంగా పళ్ళు వున్నా దువ్వెనలు వాడండి. తరచు అదేపనిగా దువ్వరాదు.
- కొబ్బరి నూనె ,ఆముదం, ఆల్మండ్ ఆయిల్ రిఫైన్ చేయనివి వాడండి. కుత్రిమ నూనెలు వాడవద్దు.
- గడ్డకట్టిన కొబ్బరి వాడవద్దు నూనె కొద్దిగా వేడి చేసి చలికాలం లో వాడండి .
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ర్.యల్ లు చూసి ఇంకా తెలుసుకోండి.
Dec 26, 2017 - Uploaded by your health telugu
జుట్టు పొడవు రెండు వారాల్లో పెరగాలంటే || How to Get Long Hair in 2 weeks Naturally ||Telugu Beauty Tips how to get long hair ...
Aug 6, 2017 - Uploaded by Dr. Murali Manohar Chirumamilla
Ayurvedic Tips for Thick and Long Hair (in Telugu) by Dr. Murali | ఒత్తయిన ... Watch this video explained in ...
Mar 7, 2018 - Uploaded by Good Health and More
How to Get Long and Strong and Black Hair in Telugu I Hair Growth Tips I Good Health and More. Good ...
Feb 27, 2017 - Uploaded by Mana Health And More
... పొడవు పెరగాలంటే || How to Get Long Hair ,Thicker Hair,Hair ... Remedies to Remove Dandraff easly//Dandraff cure ...
Jul 14, 2017 - Uploaded by your health telugu
మందార పువ్వులు,ఆకులతో మీ తెల్లజుట్టు ని |change white hair to black hair naturally inTelugu | white hair tips in Telugu
Dec 17, 2017 - Uploaded by your health telugu
long hair telugu tips,long hair, long hair telugu,hair growth teluguhair growth, hair growth telugu lo, hair ...