👉 విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువైన శ్రీకనక మహాలక్ష్మీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల తరహాలో ఈ ఆలయానికి పైకప్పు గానీ, గోపురం గానీ ఉండదు. అంతేకాదు, అమ్మవారికి వామ హస్తం (ఎడమ చేయి) కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు.
👉 వరలక్ష్మీ వ్రతం, దసర పండుగల మార్గశిర మాసం సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూవు గా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు
శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం సంభందించిన కథ-1
ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించారని చెబుతారు.
బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై.. తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు, తలుపులు లేకుండా ప్రతిష్టించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు.
మరో కథనం ప్రకారం.. సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మనుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు.
ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై.. తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని కోరుతుంది.
అయితే, ఆ బ్రాహ్మనుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మనుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది.
దీంతో బ్రాహ్మనుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. అంతే కాకుండా కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు.
అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.
శ్రీ కనక మహాలక్ష్మి స్తోత్ర మాలిక :
1.
సకలైశ్వర్య వరదాయిని - సమున్నత స్థానేశ్వరి
విశాఖ పురాధేశ్వరీ -విశేష కీర్తి ప్రదాయినీ
విలక్షణ శోభిత శుభచరణ భక్త జనావళి శుభకరిణి -శ్రీ కనకమహాలక్ష్మి
ఓం జననీ సకల జనుల సౌభాగ్య లక్ష్మి -శ్రీ కనకమహాలక్ష్మి
2.
నిరాలయ దారి -నిరాడంబరి -నిత్యదర్శిని -అఖిలాండేశ్వరి
నిత్య భక్త జన మనోరాజ్యా - ఇష్ట కామ్యార్ధ ఫలదాయని
పసుపు కుంకుమార్చిత శోభిత శుభరూపిణి
నారికేళ క్షీరాభిషేకిని - మాతా శ్రీ కనకమహాలక్ష్మి
3.
నిజరూపదర్శినీ , శక్తి స్వరూపిణి -నిఖిల లోక సంచారిణి
పాపశోక భవ భాంధహారిణి - భావ తిమిర సంహారిణి
మార్గశిర లక్ష్మీవార పూజితే - మాం పాహిమాం శ్రీ లక్ష్మి
శరణాగత భక్త వత్సలే -శుభకర శ్రీ వరదాయినీ
గుణమాతా శ్రీ కనకమహాలక్ష్మి
4.
బ్రోవ వమ్మ మము సకల వేళలను
కావ వమ్మ మా పిల్లలను పాపాలను కరుణాంతరంగవే మాతా
చల్లని చూపుల మెల్లని తలి - సత్యదేవేత
మహిమాన్విత శ్రీ మాతా శ్రీ కనకమహాలక్ష్మి
శ్రీ కనక మహాలక్ష్మి దండక రత్నావళి
- ఓం జననీ సకల జన సౌఖ్యా లక్ష్మి శ్రీ కనక మహా లక్ష్మీ నీదు రూపంబు దర్శింప పాపముల్ తొలిగేను ,
- నీ నామ స్మరణతో శుభములే కల్గెను మార్గ శిర గురువార శుభ దినమునన్ , పసుపు కుంకుమ లతో అర్పించి నారి కేళ క్షీర అభిషేకముల్ గావించి ,
- వీరు మహిమలే కీర్తించి నీ పూజ గావించి మనసార నిను కొలిచి , ఉపవాసముల్ చేసి నీ దర్శన బాగ్యంనొంది, నీ కరుణా కటాక్షంబులకై నీ ముందు నిలిచి యున్నావమ్మ,
- జగదేక జననీ నీ శరణు కోరితిమి, నిన్నే వేడితిమి ముమ్మాదు కోవమ్మ విశాఖ పురాధీశ్వరీ , బురుజుపేట స్థానాలంకరీ,
- శ్రీ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మీ, ఈ దండమున్ , నిత్యమున్ జపించు భక్తులన్, కటాక్షించి కష్టముల్ తొలగించి శుభములందించు వరదాయినీ నమో నమః
Search Results
Search Results
ఈ రోజు సూక్తి :
Note: