సంక్రాంతి సందర్భం లో హరిదాసు ప్రాధాన్యత గురించి తెలుసుకోండి
తెలుగు ప్రజలకు ఉన్న అన్ని పండగలలో కంటే మకర సంక్రాంతి చాల పెద్ద పండుగ. దీనినే నెల రోజుల పండుగ అని అంటారు, సంవత్సరమంతా కష్టించి పండించుకున్న పంటని ఇంటికి తెచ్చుకున్న కష్టజీవులైన రైతులందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండగే సంక్రాంతి పెద్ద పండుగ. ఈ సమయం లోనే హరిదాసులు మనకు కన్నుల పండుగ చేస్తుంటారు.
సంక్రాంతి శోభలు:
సంక్రాంతి పండుగ ధనుర్మాసం నెలరోజులూ గ్రామాలన్నీ శోభాయమానంగ్దా వుంటాయి. ప్రతి ఇంటికి సున్నాలు కొటి సుందరంగా అలంకరిస్తారు. నెలరోజులూ ఇళ్ళముందు రంగు రంగుల ముగ్గులు తీర్చి దిద్దుతారు. యువకులందరూ కోడి పందాల కోసం సరదాతో కోడి పుంజులను తయారు చేస్తారు.
సంక్రాంతికి సంకేతం, హరి దాసులు:
సంవత్సర కాలంలో ఎప్పుడూ కనిపించని హరి దాసులు సంక్రాంతి నాడు కనిపిస్తారు. వీరు ధనుర్మాసం నెలరోజులూ వారి భక్తి పాటలతో ప్రతి ఇంటినీ పావనం చేస్తారు. తెల్లవారే 4 నాలుగు గంటలకే వారు స్నానం చేసి కాషాయ వస్త్రాలను ధరించి ముఖానికి నామాలు దిద్దుకుని మెడలో పూల దండలను రుద్రాక్ష మాలలను ధరించి నెత్తిమీద నామాలతో అలంకరించిన అక్షయ పాత్రను నెత్తిమీద పెట్టుకుని, భుజంమీద తంబురాను మీటుకుంటూ ఒక చేతితో చిరుతలతో తాళం వేస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ గజ్జెలు కట్టిన కాళ్ళతో, పాటకు తగిన నృత్యం చేస్తూ హరిలోరంగహరి అంటూ బయలుదేరి ప్రతి ఇంటి ముందూ పాట పాడుతూ నృత్యం చేస్తూ తిరుగుతూ ఉంటారు.
ఇంటిలోని ఇల్లాలు గాని, పిల్లలు గాని, దోసెడు బియ్యాన్ని తీసుకువస్తే, హరిదాసు వినమ్రతతో మోకాటి మీద కూర్చుని అక్షయ పాత్రలో వేయించుకుంటూ వారిని పుత్రపౌత్రాభివృద్ధి ప్రాప్తి రాస్తూ అని దీవించి మరో ఇంటికి పోయి, ఇలా వూరంతా తిరిగి తన వృత్తి ధర్మాన్ని పూర్తి చేస్తాడు.
- గుమ్మం ముందుకు వచ్చి నాలుగు బియ్యం గింజలు కూడ వేయలేని పరిస్ధితిలో ఉన్నారు మన జనం.
- నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు
- సంక్రాంతి ముందు మాత్రమే వీళ్ళు కనపడతారు మళ్ళి సంవత్సరం దాకా రారు.
- శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయి అని ప్రతీతి.
- హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగాలని దీవించేవారే ఈ హరిదాసులు.
- సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర హరిదాసులు వారి శిరస్సుపై ధరించిన పంచలోహ పాత్రగా భావిస్తారు.
- శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం.
- ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.
- ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.
- హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు.
- శ్రీమద్రరమారమణ గోవిందో హరీ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఐ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు.
- అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు.
- హరిదాసు అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుక బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.
- హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.
- హిందూ బంధువులారా హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్న ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండం మర్చిపోకండి.
హరిదాసు పాడే పాటలు ఇలా ఉంటాయి:
అదిగో భద్రాద్రీ, గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతా రామముదిత లక్ష్మణల
కలిసి కొలువగా రఘుపతి యుండెడి................॥అదిగో॥
అదిగో భద్రాద్రీ, గౌతమి అదిగో చూడండి
ముదముతో సీతా రామముదిత లక్ష్మణల
కలిసి కొలువగా రఘుపతి యుండెడి................॥అదిగో॥
ఏమీరా రామా, నావల్ల నేరమేమీరా రామా
ఏమీరా రామ యిలాగు కష్టము
నీ మహిమో నా ప్రారబ్ధమో
కుండలిశయన వేదండ రక్ష
శాఖండ తేజ నాయకుండవే..............॥ఏమీరా॥
పలుకే బంగారామాయెనా
కోడండ పాణి పలుకే బంగారామాయెనా
పలుకే బంగారమాయె పిలిచిన పలుక వేమి
కలలో నీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రి............॥పలుకే॥
ఎందరో హరి దాసులు అందరికి వందనాలు :
👉 ఇలా ఒక్కరు కాదు. ఇద్దరు ముగ్గురు హరి దాసులు కూడ కోలాహలంగా పూరంతా వారి గానంతో ముంచెత్తుతారు. ఇలా వచ్చిన ప్రతి హరి దాసుకూ, భిక్షను అందచేస్తారు.
👉ఇలా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడ గ్రాసాన్ని సంపాదించుకుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు.
👉ప్రతి సంవత్సరం ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్ప ఇతరులు రారు.
👉 ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు, దాసరులు, రాజులు, మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.
👉పండగ నెల రోజులు గ్రామవీథుల్లో హరిదాసులిలా హరిభజనచేయడం కోలాహలంగా వుంటుంది.
👉 హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి ఇంటి ఇల్లాళ్లు బాల బాలికలు పోటీలు పడతారు.
👉హరిదాసులిలా ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.
👉హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వ దినాలలో, గంగి రెద్దులవారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి.
👉 పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి నాడు అందరి హరిదాసులను ఆదరిస్తారు.
ఈ క్రింది వీడియో యు. ఆర్ . యల్ . ల లో హరిదాసు గురించి తెలుసుకోండి
ఈ రోజు సూక్తి :
"You will never find time for anything. If you want time you must make it."