ప్రాచీన హిందూ సాంప్రదాయ కాలచక్రం కాల గణన ఎంత గొప్పదో ఎలా ఉందొ తెలుసుకుందాం
కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం ఋషులు భారతీయులకిచ్చిన సంప్రదాయం.
కాలం అంటే ఏమిటో, దాని స్వరూపం ఏమిటో తెలుసుకున్న వారు సమస్తమూ తెలుసుకున్నట్టే. వీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని, కాలవేదులు కనుక కాలవిజేతలవుతారని ఆర్యోక్తి. అందుకే, సంవత్సరంలో ఒక్క రోజైనా కాలసంబంధమైన జ్ఞానసముపార్జనకి కేటాయించాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల
సంవత్సరాది నాడు పంచాంగశ్రవణం చేయాలని విధించారు. దీనినే నిత్యం సంద్యావందన సమయంలో కాని, పూజా సమయం లో కాని సంకల్పం అనే పేరుతో స్మరించుకునే పద్ధతినికూడా అలవాటు చేసారు. సంకల్పంలో అనంత విశ్వంలో మనం ఉండేచోటు, అఖండకాలంలో మనం తలచు కుంటున్న సమయం గుర్తించటం అవసరమై వుంటుంది.
ఉత్తరాలలోను,ఇతర పత్రాలపైన తేదీ, స్థలం వేసే అలవాటు లాగా. చోటు విషయం అటుంచి, సాంప్రదాయ హిందూ కాలగణన కాలానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పునశ్చరణ చేసు కోవాల్సిన తెలుసు కోవలసిన అవసరముంది.కాలచక్రం
1. కాలగణనం2. రోజులు
3. వారాలు4. పక్షాలు
5. నెలలు6. ఋతువులు - కాలాలు
7. సంవత్సరాలు8. తిధులు
9. నక్షత్రాలు10. రాశులు
ప్రాచీన హిందూ భారతీయ శాస్త్రవేత్తలకాలగణనం
60 లిప్తలు .........................1 విఘడియ/24 సెకన్లు
60 విఘడియలు ..............1 ఘడియ/24 నిమిషాలు
2 1/2 విఘడియలు ..........1 గంట/60 నిమిషాలు2 ఘడియలు ......................ముహుర్తము/48 నిమిషాలు
7 1/2 గంటలు .....................2ఝూము/3 గంటలు
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు)
2.5 చడి = 1 హొరా (ఒక గంట)
24 హొరా = 1 దినం
రెప్ప పాటుకాలం = 1 సెకను
60 సెకన్లు = 1 నిమిషం
60 నిమిషాలు = 1 గంట
24 గంటలు = 1 రోజు లేక దినం
7 దినములు = ఒక సప్తాహం, వారం
15 రోజులు = 1 పక్షము
4 సప్తాహాలు = 1 నెల
2 నెలలు = 1 ఋతువు
2 ఋతువులు = 1 కాలం
6 ఋతువులు = ఒక సంవత్సరం
100 సంవత్సారాలు = ఒక శతాబ్దం
10 శతాబ్దాలు = ఒక సహస్రాబ్దం
432 సహస్రాబ్దాలు = 1 యుగం
2 కలియుగాలు = ఒక ద్వాపరయుగం
3 ద్వాపరయుగాలు = ఒక త్రేతాయుగం
4 త్రేతాయుగాలు = ఒక కృతయుగం లేదా సత్వయుగం
10 యుగాలు = ఒక మహాయుగం (43 లక్షల 20 వేల సంవత్సరాలు)
1000 మహాయుగాలు = ఒక కల్పం(43 కోట్ల23 లక్షల సం.లు )
కాలగణన ఇంకొక పద్దతి
1 క్రాంతి ........................1 సెకనులో 34000 వ వంతు1 తృటి........................... 1 సెకనులో 300 వ వంతు
1 తృటి ...................... 1 లవము,లేశము
2 లవాలు ........................ 1 క్షణం
30 క్షణాలు .....................1 విపలం
60 విపలాలు ..............1 చడి (24 నిమిషాలు)
2.5 చడులు ................1 హొర
54 హొరలు .............................. 1 దినం (రోజు)
6 కనురెప్పలపాటు కాలము ........... 1 సెకండు
60 సెకండ్లు ..............................1 నిమిషము
60 నిమిషాలు ................ 1 గంట
24 గంటలు ............................ 1 రోజు
7 రోజులు ........................... 1 వారం
2 వారములు ....................... 1 పక్షం
2 పక్షములు .......................1 నెల
2 నెలలు .............................1 ఋతువు
2 ఋతువులు ..........................1 కాలము
4 వారములు .........................1 నెల
6 ఋతువులు .........................1 సంవత్సరము
12 నెలలు .............................1 సంవత్సరము
365 రోజులు .............................1 సంవత్సరము
52 వారములు ...........................1 సంవత్సరము
366 రోజులు ..................... 1 లీపు సంవత్సరము
10 సంవత్సరాలు ...........................1 దశాబ్ది
12 సంవత్సరాలు ............................1 పుష్కరం
40 సవత్సరాలు ........................1 రూబీ జూబ్లి
100 సంవత్సరాలు....................1 శతాబ్ది
1000 సంవత్సరాలు ....................1 సహస్రాబ్ది
25 సంవత్సరాలు .......................రజత వర్షము
50 సంవత్సరాలు .......................స్వర్ణ వర్షము
60 సంవత్సరాలు ........................వజ్ర వర్షము
75 సంవత్సరాలు .................. .అమృత వర్షము
100 సంవత్సరాలు ...................శత వర్షము
2. రోజులు
సూర్యుడు ఉదయించినది మొదలు అస్తమించే వరకు గల కాలం పగలు.
సూర్యుడు అస్తమించినది మొదలు మరల ఉదయించే వరకు గల కాలం రాత్రి.
ఒక పగలు, ఒక రాత్రి కలసి ఒక రోజు.
ఏడు రోజులు ఒక వారం.
౩. వారాలు
1. ఆదివారము, Sunday
2. సోమవారము, Monday
3. మంగళవారము, Tuesday4. బుధవారము, Wednesday
5. గురువారము, Thursday6. శుక్రవారము, Friday
7. శనివారము, Saturday4. పక్షాలు
- పదిహేను రోజులు ఒక పక్షం
- అమావాస్య వెళ్లిన దగ్గరి నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేక శుద్ద పక్షం అని
- పౌర్ణమి వెళ్లిన దగ్గరి నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.
- కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.
పక్షానికి (15) పదిహేను తిధులు:
1. పాడ్యమి
2. విదియ
3. తదియ
4. చవితి
5. పంచమి
6. షష్ఠి
7. సప్తమి
8. అష్టమి
9. నవమి
10. దశమి
11. ఏకాదశి
12. ద్వాదశి
13. త్రయోదశి
14. చతుర్దశి
15. పూర్ణిమ లేక అమావాస్య
5. నెలలు
1. చైత్రము
2. వైశాఖము
3. జేష్టము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వీజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము
6. ఋతువులు- కాలాలు
సంవత్సరానికి ఆరు(6)ఋతువులు
వసంత ఋతువు ---- చైత్ర, వైశాఖ మాసాలు
గ్రీష్మ ఋతువు ------ జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు
వర్ష ఋతువు -------- శ్రావణ, భాద్రపద మాసాలు
శరత్ ఋతువు -------- ఆశ్వయుజ, కార్తీక మాసాలు
హేమంత ఋతువు ------- మార్గశిర, పుష్య మాసాలు
శిశిర ఋతువు --------- మాఘం, ఫాల్గుణం మాసాలు
7. కాలములు:
రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...
1. వేసవి కాలం
2. వర్షా కాలం
3. శీతా కాలంవేసవి కాలం ------- చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.
వర్షా కాలం -------- శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.
శీతా కాలం -------- మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.
8. తెలుగు సంవత్సరాలు:
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6.అంగీరస
7. శ్రీముఖ
8. భావ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాది
14. విక్రమ
15. వృష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్ధివ
20. వ్యయ
21. సర్వజిత్తు
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవిళంబి
32. విళంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృతు
37. శోభకృతు
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృతు
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాలయుక్త
53. సిద్ధార్ధి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుభి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
9. నక్షత్రాలు : నక్షత్రాలు (27)ఇరువై ఏడు
1. అశ్విని
2. భరణి3. కృత్తిక
4. రోహిణి
5. మృగశిర
6. ఆర్ద్ర
7. పునర్వసు
8. పుష్యమి
9. ఆశ్లేష
10. మఖ
11. పుబ్బ
12. ఉత్తర
13. హస్త
14. చిత్త
15. స్వాతి
16. విశాఖ
17. అనూరాధ
18. జ్యేష్ఠ
19. మూల
20. పుర్వాషాఢ
21. ఉత్తరాషాఢ
22. శ్రవణం
23. ధనిష్ఠ
24. శతభిషం
25. పూర్వాభాద్ర
26. ఉత్తరాభాద్ర
27. రేవతి
10 .రాశులు
రాశులు (12) పన్నెండు
1.మేషం, Aries
2.వృషభం, Taurus
౩.మిధునం, Gemini
4.కర్కాటకం, Cancer
5.సింహం, Leo
6.కన్య, Virgo
7.తుల, Libra
8.వృశ్చికం, Scorpio
9.ధనస్సు, Sagattarius
10.మకరం, Capricorn
11.కుంభం, Aquarius
12.మీనం, Pisces
Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో వెబ్సైటు itsgreatindia.blogspot.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .
youtube channel bdl 1tv