టైపు 1 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టైపు 1 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2018, శుక్రవారం

Do you know how much bitter truth is hidden in sweet sugar?

తీయటి చక్కరలో ఎంత చేదు నిజం దాగి ఉందో తెలుసా? 
ఈక్రింది సందర్భాలలో మీకు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ.

  1. మీరు ఉండవలసిన దానికంటే బరువు ఎక్కువ ఉంటె ? ఉండవలసిన బరువు ఎంత అనేది మన ఎత్తు  వయస్సును బట్టి డాక్టర్లు నిర్దారిస్తారు. డాక్టర్ను అడిగి , తన వయస్సుకు ఎంత బరువుండాలో తెలుసుకోండి ?
  2. ఒకవేళ మీరు 40 వయస్సు పైన బడి ఉంటె కనుక ? మీ దగ్గర బంధువులు అంటే మేన మామ, మేనత్త ,తల్లి. త్రండి, సోదరీ, సోదరులు , ఎవరికైనా ఉన్నట్లయితే ?
  3. ఆడవారిలో ఎక్కువ బరువుఉన్న పిల్లలు పుట్టినట్లైతే, abortion (గర్భవిచ్చిన్నము ) ఎప్పుడైనా అయినట్లయితే?
  4. మీకు ఎక్కువ నీరసం, అధికంగా దాహం , ఎక్కువుగా మూత్ర విసర్జన చేస్తూ ఉన్నట్లయితే ?
  5. మీకు దెబ్బలు, కురుపులు మానడానికి ఎక్కువ కాలం పడుతున్నట్లైతే?
  6. దురదలు, హఠాత్తుగా బరువు తగ్గడం, కీళ్ల సమస్యలు, కాళ్ళనొప్ప్పులు, చూపు మందగించడం, సెక్స్ కోరికలు తగ్గడం .

పై లక్షణాలలో ఏవొక్కటి ఉన్న మీకు షుగర్ వ్యాధి ఉన్నట్లు అనుమానించి డాక్టర్ ను సంప్రదించాలి...
అసలు చక్కర వ్యాధి (డయాబిటీస్) అంటే ఏమిటి?
ఆరోగ్యం గా ఉన్నవాళ్లలో  మనం తీసుకొన్న ఆహారం గ్లూకోస్ గా మారి అది మన జీవ కణాలు కి  అందించ బడుతుంది. శక్తి కోసం గ్లూకోస్ అవసరం రక్తం నుండి గ్లూకోస్ కణాలు లోకి చేరుకోవాలంటేశరీరం లో ఇన్సులిన్ అనే హార్మోన్ ఒకటి అవసరమవుతుంది. ఈ ఇన్సులిన్ క్లోమ గ్రంధి నుండి విడుదల అవుతుంది. ఈ ఇన్సులిన్ తక్కువ ఉన్నప్పుడు మనకు కావలసిన గ్లూకోస్ రక్తం నుండి కణాలకు చేరుకోలేదు. అందువల్ల రక్తం లో గ్లూకోస్ పెరిగి పోతుంది. అలాగా రక్తం లో ఉండవలసిన గ్లూకోస్ స్థాయి కన్నా ఎక్కువ ఉంటె  దానినే చక్కర వ్యాధి లేదా diabetes  అని అంటారు. సూక్ష్మం గా చెప్పాలంటే diabetes  అంటే సెల్స్ లోకి కావలసిన గ్లూకోస్ పంపేటంత  ఇన్సులిన్ విడుదల కాక పోవడం , ఇన్సులిన్ విడుదల సరిగా లేకపోవడం  మొదలైన పరిస్తుతులను చక్కర వ్యాధి లేదా diabetes అంటారు.

ఈవ్యాధి వల్ల  వచ్చే అవలక్షణాలు :
ఈ వ్యాధి జాగ్రత్తగా అదుపులో పెట్టుకోక పొతే అనేకరకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
  •  ఎప్పటి కప్పుడు సంప్రదించి తగిన మందులు వాడుతుంటే ఈ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది లేకుంటే అపస్మారక స్థితి.
  • మూత్ర పిండాలు చెడిపోవడం, గుండెపోటు, పక్షవాతం, కంటిచూపు మందగించడం, రక్తనాణాలలో రక్తం సరిగా ప్రసరించక పోవడం వల్ల కాళ్లు, చేతులు కి పక్షపాతం , ఒక్కసారి కాలి వేళ్ళు చేతి వేళ్ళు తీసి వేయడంలాంటివి జరగ వచ్చు .
  • నపుంసకత్వం రావచ్చు.
సమస్యలు రాకుండా తీసుకోవావలసిన చర్యలు :
  • షుగర్ వ్యాధి ఉన్నట్లు అనుమానం రాగానే మీ దగ్గర లో ఉన్న షుగర్ డాక్టర్ ను సంప్రదించండి  
    డాక్టర్ ఇచ్చినా మందుల మోతాదు క్రమం తప్పకుండ వాడండి.
  • డాక్టర్ చెప్పిన ఆహార నియమాలు పాటించండి. క్రమం తప్పకుండవ్యాయామం యోగ చేయండి .
  • ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒక్క సారి డాక్టర్ దగ్గర ఏమి తినక ముందు, ఏదైనా ఆహారం తిన్న తరువాత గంటకు రక్త పరీక్ష చేయించుకోవాలి .
  • ఏవిధంగా క్రమం తప్పకుండా చేస్తుంటే షుగర్ వ్యాధి వల్ల మనకు అంత భయం ఉండదు .
  • ఏమీతినక ముందు 80-110మి.గ్రా ఉండాలి. భోజనం చేసిన తరువాత గంటకి 80-140(160) మి .గ్రా ఉండాలి. రక్త పరీక్షలో దీనిని డాక్టర్ మనకు చెబుతారు . కొలెస్ట్రాల్ రక్తం లో 160 మి .గ్రా., ట్రీగ్లిజరైడ్స్ 120 మి.గ్రా. హెచ్. డి.యల్. 100 మి. గ్రా. లోపున ఉంటే మంచిదని డాక్టర్లు చెబుతారు.
  • లోసుగర్ 60నుంచి -40కి తగ్గరాదు . హై షుగర్ 180నుంచి -400 దాటితే ప్రమాదం. డాక్టర్ను అడిగి తెలుసుకోండి ...
ఈ వ్యాధి గురించి మెడికల్ జర్నల్ లోంచి సేకరించ బడింది. (డయాబెటిస్ డాక్టరు గారి మధుమేహవ్యాధి అవగాహన పుస్తకం లోంచి )
మధుమేహం (diabetes ) గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ క్రింది యూ.ర్. యల్ . youtube video లు చూడండి...

Results

Nov 22, 2017 - Uploaded by PlayEven
ఇలా చేస్తే షుగర్ రమ్మన్నారాదు | Prevention Of Diabetes | Diabetes Telugu #PlayEven. Simple Steps to Preventing Diabetes | The ...
Dec 5, 2017 - Uploaded by TeluguOne
Diabetes Diet Plan Telugu | Food Habits. TeluguOne. Loading ... Dr Janaki Srinath gaaru explains right diet ...
Nov 27, 2017 - Uploaded by PlayEven
ఇవి తింటే షుగర్ మటుమాయం | Food For Diabetes | Sugar | Diabetes Telugu | PlayEevn. Top 25 Power Foods for Diabetes ...
Sep 13, 2017 - Uploaded by Dr. Murali Manohar Chirumamilla
Know about Home Remedies for Diabetes in Telugu | షుగర్ వ్యాధికి ఇంటి వైద్యం by Dr. Murali Manohar Chirumamilla, M.D. ...
Nov 24, 2017 - Uploaded by PlayEven
షుగర్ పేషంట్స్ తినాల్సిన మరియు తినకూడని ఆహారాలు | Good And Bad Food For Diabetes | Diabetes Telugu | Sugar # ...
Jun 27, 2017 - Uploaded by PlayEven
12 Natural Foods That Cure Diabetes #Diabetes Telugu Thanks For Watching PlayEven.
Jun 10, 2016 - Uploaded by Lifestyle
Diabetes mellitus (DM), commonly referred to as diabetes, is a group of metabolic diseases in which there ...
Nov 21, 2017 - Uploaded by TeluguOne
Type 1 Diabetes Child Diet: Usually, kids with type 1 diabetes need to eat a healthy and balanced diet ...
Nov 20, 2013 - Uploaded by teluguhomeveda
(TeluguDiabetes - Natural Ayurvedic Home Remedies for Diabetes ... Treatdiabetes with natural home ...
Jun 10, 2016 - Uploaded by Lifestyle
All About Diabetes Diabetes Mellitus Telugu Life Style ... Diabetes mellitus (DM), commonly referred to as ...
Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .