గోవు పాట దాని విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గోవు పాట దాని విశిష్టత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2019, బుధవారం

హిందువుల పవిత్ర జంతువు గోవు , గోవు పాట - దాని విశిష్టత గురించి తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com
హిందువుల పవిత్ర జంతువు గోవు , గోవు పాట - దాని విశిష్టత గురించి తెలుసు కుందాం 



గోవు పాట దాని విశిష్టత :


ఈ పాటను ఇంటి ఇల్లాలు ప్రతి నిత్యం ప్రాతః కాల సమయాన, సంధ్య సమయాన క్రమం తప్పకుండ పడుతుంటే ఆ యింటిలో సిరులు ఉప్పొంగి  సిరుల శ్రీలక్ష్మి  వెలుగొందు తుంది. 

  • గోవు అడుగుల యందు అస్టైస్వర్యములుండు!
  • గిట్టల మధ్యన గంధర్వులుందురు.!!
  • గిట్టల చివరన పన్నగులుందురు !
  • గిట్టల ప్రక్కలో అప్సరసలుందురు !!
  • పాదాలయందు  చతుర్వేదములుందురు !
  • పిక్క యందు పిడి గుంటలుండు !!
  • తొడల యందు సర్వలోక తీర్దములుండు!
  • పొదుగు న పుండరీకాషుడుండు. !!
  • చనులయందు సాల గ్రామములుండును  !
  •  పితుకుల యందు సప్త సముద్రములువుండును !!
  • నాభి యందు శ్రీ కమలములు ఉండు . !
  • కడుపునా భూదేవి స్థిరముగా నుండు.!!
  • తోఁకన సోముడు నివసించు చుండు !
  • తోక యందలి రోమాల సూర్య రశ్మి ఉండు !!
  • ఉర మధ్యమున ఋషులు నివసించుచుందురు !
  • చర్మమున సకల శుభములు వర్దిల్లు !!
  • శరీరములోని రోమాలా సకల దేవతలుండు !
  • మాంసమున మాధవుడు నిలయమై ఉండు !!
  • ఎముకల యందు బ్రహ్మ నివసించు చుండు !
  • దృష్ట భాగమున ఏకాదశ రుద్రులుందురు !!
  • హృదయమున సాద్యులు నివసించుచుండు !
  • మూపురమున  చుక్కలు మెరయుచుండు !!
  • నాలుక యందు నారాయణుడు ఉండు !
  • దవడల యందు ధర్మ దేవతలు ఉండు !!
  • మెడను ఇంద్రుడు నివసించుచుండు !
  • పెదవులు వైకుంఠ ద్వారములుగును !!
  • నోరున్నా లోకేశము నిలయమై నుండు !
  • హుంకారమున సరస్వతీ దేవి నివసించు !!
  • ముక్కున శీలాధర పుత్రి యుండు  !
  • ముక్కుకాడన కుమారస్వామి, విఘ్నేశ్వరుడు వర్దిల్లు !!
  • గడ్డము కైలాస శిఖర మై నుండు !
  • నుదురున పరమేశ్వరుడు నివసించుచుండు  !!
  • నేత్రముల సూర్యచంద్రులు మెరయుచుండు !
  • కర్ణముల అశ్వని దేవతలా నిలయమై ఉండు  !
  • కొమ్ములున  గోవర్ధన పార్వతియులు అగును  ! 
  • కొమ్ముల కొసలు సర్వ తీర్ధములగును.!!

  • గోవుపాల యందు సరస్వతీ  నదియును 
  • గోవు పెరుగున నర్మదా నది యును 
  • గోవు పంచితమున గంగ నదియును 
  • గోవు  గోమయమున  మహాలక్ష్మి యును 
  • అద్యమున అగ్నిదేవుడును ఉండును.


గోవు పాట -ఫలితము :

01. వేకువ ఝామున పాడితే కోటి వేల నదులలో స్నానము చేసిన ఫలితము కలుగును.

02. ప్రొద్దున్నే పాడితే కోటివేల బ్రహ్మ కలశాల నోము నోచిన  ఫలితము

03. మధ్యాహ్నమున పాడితే కోటి వేల  బ్రాహ్మణులకు అన్నము పెట్టిన ఫలితము.

04.సంధ్యా వేళ  యందు  పాడితే శ్రీ మహాలక్ష్మి నవ్వుతూ ఎదురు వచ్చిన ఫలితము .

05.రాత్రి వేళ పాడితే  కోటి దేవాలయాలలో దీపారాధన చేసిన ఫలితము 

06. అమావాస్యనాడు పడితే ఆరునెలల పాపమూ పోవును 

07. పౌర్ణమి నాడు పాడితే పదినెలల పాపము పోవును .

08. గోవు పాట పాడిన వర్ణించిన ఇహ పరసుఖములు కలుగును 

ఓం శాంతి   ఓం శాంతి   ఓం శాంతిః 

ఈ క్రింది వీడియో లలో ఆవు విశిష్టతను తెలుసుకోండి .



Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe,   కామెంట్  చేయడం మర్చిపోకండి    మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.