జ్యోతిలక్ష్మి 70, 80 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు . క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎంత పెద్ద హీరో అయినా ఆ మూవీలో జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూకట్టేవారు. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు.
- జ్యోతి లక్ష్మి .జన్మ నామం జ్యోతి
- ఈమె అసలు పేరు : జ్యోతి , పెంచుకున్న అమ్మ పేరు ధనలక్ష్మి ,, సినిమాల్లో రెండు కలిపి =జ్యోతిలక్ష్మి అయ్యింది.
- ఈమె తోబుట్టువులు ": తన తో కలిపి 8 మంది . 5 గురు ఆడపిల్లలు , 3 మగ : పెద్దమ్మ కొడుఫు -అన్నయ్య -కె.ఆర్ .రామన్ ప్రొడ్యూసర్ /దర్శకుడు ),ఆడ పిల్లల లో తనే పెద్దది , చెల్లి- జయమాలిని-ఆఖరిది ,
- ఈమె జననం 2 నవంబర్, 1948 కాంచీపురం చెన్నై, తమిళ్నాడు.
- ఈమె మాతృబాష :తమిళం
- ఈమె భర్త: సాయిప్రసాద్, కెమెరామెన్
- ఈమె కూతురు : జ్యోతిమీనా
- ఈమె చిన్న చెల్లెలు : జయమాలిని, ప్రముఖ శృంగార నృత్య నటి
- ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది.
- ఈమె నటించిన సినిమాలు : దాదాపుగా 300 సినిమాలు
- జ్యోతి లక్ష్మి మరణం : 8 ఆగుస్టు 2016, చెన్నై ( బ్లడ్ కేన్సర్‌తో ).
- ఈమె క్రియాశీలక సంవత్సరాలు 1963 - 2016
జ్యోతిలక్ష్మి (1948-ఆగష్టు 8, 2016) దక్షిణ భారత శృంగార నృత్య నటి. ఈమె జయమాలిని అక్క. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వెయ్యికి పైగా పాటల్లో నర్తించింది. వీటిలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఒక ఇరవై దాకా ఉంటాయి. తమిళంలో పది సినిమాలలో కథానాయకిగా నటించింది.
- జననం: జ్యోతిలక్ష్మి తమిళ అయ్యంగార్ల కుటుంబంలో 1948లో జన్మించింది. జ్యోతిలక్ష్మి పూర్వీకం తంజావూరు. తండ్రి పేరు టి.కె.రామరాజన్, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. వారిలో ముగ్గురు రాజ్‌కుమార్, టి.ఆర్.బాలసుబ్రమణ్యం, టీఆర్.రవికుమార్ కొడుకులు, జ్యోతిలక్ష్మి, ప్రతిమాదేవి, లక్ష్మీ, లత, జయమాలిని కూతుళ్లు. వీరిలో నటి జ్యోతిలక్ష్మి పెద్ద కూతురు. చిన్న కూతురు నటి జయమాలిని. జ్యోతిలక్ష్మిని మేనత్త ప్రఖ్యాత నటి ధనలక్ష్మి దత్తత తీసుకున్నారు. ప్రముఖ నాట్యాచారులు తంజై రామయ్యదాస్ వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందిన జ్యోతిలక్ష్మి శివాజీగణేశన్ సమక్షంలో భరతనాట్య తెరంగేట్రం చేశారు.
- కుటుంబం: ఈమె కెమెరామెన్ సాయిప్రసాద్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఈమెకు జ్యోతిమీనా అనే ఒక కూతురు ఉంది. జ్యోతిమీనా కూడా సినిమాలలో నటించింది కాని నిలదొక్కుకోలేకపోయింది. మరో ప్రముఖ సినిమా శృంగార నృత్యతార జయమాలిని ఈమెకు చెల్లెలు.
- సినీ జీవితం: ఈమె చిన్నతనం నుండి ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి వద్ద పెరిగింది. ధనలక్ష్మి అప్పటికే ప్రసిద్ధ నటి. జ్యోతిలక్ష్మికి ఐదేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆమె అన్న వరస అయిన దర్శక నిర్మాత టి.ఆర్.రామన్న (పెద్దమ్మ కొడుకు) ఒక ఎం.జీ.ఆర్ సినిమాలో జ్యోతిలక్ష్మిచే నాట్యం చేయించాడు. ఎనిమిదేళ్ళ వయసులో శివాజీ గణేశన్ చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్స్ చేసింది. ఆ తరువాత పెద్దయ్యాక 1963లో విడుదలైన ఎం.జీ.ఆర్ చిత్రం పెరియ ఇడత్తు పెణ్ తో చిత్రం రంగంలో ప్రవేశించింది. ఈ చిత్రంలో నగేష్ సరసన వల్లి అనే హాస్యపాత్రలో నటించింది. ఈమె చిన్నతనంలో రామయ్య పిళ్ళై వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈ నాట్యశిక్షణ సినిమాలో నాట్యాలు చేయటానికి సహకరించింది.
తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో విడుదలైన పెద్దక్కయ్య.
- 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు అన్న పాటతో ఆంధ్రదేశపు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జ్యోతిలక్ష్మి తిరిగి అదే పాటకు కుబేరులు సినిమాలో నర్తించింది.
- ఇండస్ట్రీలో ఓ నయా ట్రెండ్ కు తెరలేపింది జ్యోతిలక్ష్మి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడు వందల సినిమాలకు పైగా నటించిన జ్యోతిలక్ష్మి.. వెయ్యికి పైగా పాటల్లో డ్యాన్స్ చేసింది. దాదాపు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 1948లో తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టింది. తెలుగులో ఆమె మొదటి సినిమా ‘పెద్దక్కయ్య’ 1967లో విడుదలైంది.
- 70, 80 లలో తన డ్యాన్సులతో కుర్రకారు మతిపోగొట్టారు జ్యోతిలక్ష్మి. క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎంత పెద్ద హీరో అయినా ఆ మూవీలో జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ఉందంటే జనం క్యూకట్టేవారు. జ్యోతిలక్ష్మి డ్యాన్స్ చూసేందుకే సినిమాలకు వచ్చేవారు.
- ఆమె చేసే నృత్యం చిత్రసీమకు బాగా వుపయోగపడింది. తెలుగులో 1979లో వచ్చిన 'గంధర్వకన్య'తో పేరు తెచ్చుకుంది. సీతారాములు, ప్రేమ్‌నగర్, గోలనాగమ్మ, భోగిమంటలు, బాబులుగాడి దెబ్బ, స్టేట్‌రౌడీ, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, బెబ్బులి.. వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించింది. అదే ఆమె కెరీర్‌కు సోపానాలుగా మారాయి.
ముగ్గురు ముఖ్యమంత్రులతోనటించిన గొప్ప సినీ డాన్సర్ ....
- ఎన్టీ.రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన చరిత్ర జ్యోతిలక్ష్మిది. 300 చిత్రాలకు పైగా వివిధ రకాల పాత్రలకు వన్నె తెచ్చిన జ్యోతిలక్ష్మి కొంత కాలం బుల్లి తెరపైనా మెరిశారు. పలు టీవీ సీరియళ్లలో నటించారు. బతికున్నంత కాలం నటించాలని కోరుకున్న జ్యోతిలక్ష్మి అదేవిధంగా జీవించారు. తెలుగులో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన కుబేరులు చివరి చిత్రం కాగా తమిళంలో ఇటీవల యువ సంగీత దర్శకుడు హీరోగా నటించిన త్రిష ఇల్లన్న నయనతార చివరి చిత్రం.
- మరణం: జ్యోతిలక్ష్మిఆగష్టు 8,2016 న తెల్లవారుజామున చెన్నైలోని రామరాజ్ వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈమె కొన్ని రోజులు అపోలో ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందారు. అనంతరం ఇంట్లోలోనే చికిత్స పొందుతూ వచ్చారు. కేన్సర్ వ్యాధి ముదరడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
జ్యోతి లక్ష్మి నటించిన చిత్రాలు:
- అందరికీ మొనగాడు
- అగ్గిమీద గుగ్గిలం
- ఉత్తమురాలు
- ఋష్యశృంగ
- ఒకే రక్తం
- కత్తుల రత్తయ్య
- కథానాయిక మొల్ల
- కల్యాణ చక్రవర్తి
- కొరడారాణి
- ఖడ్గవీరుడు
- గండర గండడు
- గుండెలు తీసిన మొనగాడు
- గోవా సి.ఐ.డి 999
- చిన్నాన్న శపధం
- చెయ్యెత్తి జైకొట్టు
- జన్మభూమి
- జీవితం
- జేబు దొంగ
- జేమ్స్ బాండ్ 777
- జ్యోతిలక్ష్మి
- దేవుడిచ్చిన భర్త
- నేనే మొనగాణ్ణి
- పంజరంలో పసిపాప
- పగబట్టిన పడుచు
- పగ సాధిస్తా
- పట్టిందల్లా బంగారం
- పడుచు పిల్ల పగటి దొంగలు
- పిల్లా-పిడుగా
- పెద్దక్కయ్య
- పెద్దిల్లు చిన్నిల్లు
- ప్రజా నాయకుడు
- బస్తీ బుల్బుల్ భలేపాప
- బాలమిత్రుల కథ
- భారతంలో శంఖారావం
- మంచి రోజులొచ్చాయి
- మనుషులు - మట్టిబొమ్మలు
- మహా శక్తి
- మానవుడు - దానవుడు
- మాయా మోహిని
- మావూరి మొనగాళ్ళు
- మేమే మొనగాళ్లం
- మొనగాడొస్తున్నాడు జాగ్రత్త
- మోసగాళ్ళకు మోసగాడు
- వరలక్ష్మీ వ్రతం
- సర్కార్ ఎక్స్‌ప్రెస్
- సర్దార్ పాపారాయుడు
- సీతారాములు
- సోమరిపోతు
- హంతకులు దేవాంతకులు
ఈమె గురించి వీడియోలు చూసి మరింత తెలుసుకోండి ....
యూట్యూబ్ వీడియో . యూ.ర్.యల్ .లు చూడండి .....
Madhavi. Director: K ...
Oct 1, 2017 - Uploaded by King Lear
Mix - Very Hot Jyothi Lakshmi Item Song Big AssetsYouTube. Simha BaluduSongs - Sannajaajuloi ...
Sep 26, 2016 - Uploaded by Telugu Full Movies
Watch Jayamalini, Jyothi Lakshmi Masala Item Song - Mahanagaramlo Mayagadu Movie | Chiranjeevi ...
Jul 11, 2012 - Uploaded by TeluguOne
Watch Krishna Jyothi Lakshmi Raja Sulochana's Monagadosthunnadu Jagratha Telugu Movvie Song With ...
Aug 9, 2016 - Uploaded by Volga Video
Jyothilakshmi Telugu Full Josh Video Songs - Telugu Item Video Songs - 2016 Watch more movies @ http ...
Jun 12, 2016 - Uploaded by Tollywood
Watch Jyothi Lakshmi Romantic Videos Songs Jukebox || Birthday Special 2016 Subscribe to Tollywood ...
Mar 8, 2013 - Uploaded by Vega Music
Watch Full Song From Sanchalanam Telugu Movie Starring: Mohan Babu,
Aug 10, 2016 - Uploaded by Tamil cinema
Jyothi Lakshmi Hit songs | ஜோதிலட்சுமி ஹிட்ஸ். Tamil cinema. Loading... Unsubscribe from Tamil ...
Jan 28, 2014 - Uploaded by Volga Video
Jyothi Lakshmi Songs || Ekkadunnaado Movie: Jagath Janthreelu, Cast: Shobhan Babu, Vanisri, Renuka ...
Sep 28, 2011 - Uploaded by TeluguOne
Jyothilakshmi Cheerakattindhi Video Song From Sardar Paparayudu Movie. Directed by Dasari Narayana
Note:
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి. నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .