ఏ తిథి కి ఎవరు అది దేవతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఏ తిథి కి ఎవరు అది దేవతలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జనవరి 2021, మంగళవారం

పక్షం ఎన్ని రోజులు పక్షం లో ఏ తిథి కి ఎవరు అది దేవతలు మహాలయ పక్షం గురించి తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

పక్షం ఎన్ని రోజులు పక్షం లో ఏ తిథి కి  ఎవరు అది దేవతలు మహాలయ పక్షం గురించి తెలుసుకోండి 

ప్రతి నెల లో వచ్చే 15 రోజులను తెలుగు క్యాలండర్ ప్రకారం పక్షం అంటారు. పాడ్యమి తో మొదలై అమావాస్య లేదా పౌర్ణమి వరకు ఉండే తిదులను పక్షం అంటారు. రెండు పక్షాలు కలిపితే ఒక ఆంగ్ల నెల అవుతుంది.  ప్రతి నెలలో రెండు పక్షాలుంటాయి: 

1.'శుక్ల పక్షం' (అమావాస్య నుంచి పున్నమి వరకు)

రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెలుపు అని అర్థం) 

2.'కృష్ణ పక్షం (పున్నమి నుంచి అమావాస్య వరకు) : 

రోజు రోజుకూ చంద్రుడితో బాటే వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నలుపు అని అర్థం).

తిథి  అంటే 

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.

ఏ ఏ అంటే తిథులకు ఎవరు అది దేవతలు 

    • 1.పాడ్యమి- (అధి దేవత - అగ్ని)

    • 2.విదియ (అధి దేవత - బ్రహ్మ)

    • 3.తదియ (అధి దేవత - గౌరి)

    • 4.చవితి (అధి దేవత - వినాయకుడు)

    • 5.పంచమి  (అధి దేవత - సర్పము)

    • 6.షష్ఠి (అధి దేవత - కుమార స్వామి)

    • 7.సప్తమి (అధి దేవత - సూర్యుడు)

    • 8.అష్టమి (అధి దేవత - శివుడు)

    • 9.నవమి (అధి దేవత - దుర్గా దేవి)

    • 10.దశమి (అధి దేవత - యముడు)

    • 11.ఏకాదశి (అధి దేవత - శివుడు)

    • 12.ద్వాదశి (అధి దేవత - విష్ణువు)

    • 13.త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)

    • 14.చతుర్దశి (అధి దేవత - శివుడు)

    • 15.పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి( లేక )అమావాస్య (అధి దేవత - చంద్రుడు)

మహాలయ పక్షము అని దేనిని అంటారు

  • బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. 

  • మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. 

  • అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము దేవతల కాలము గనుక ఉత్తమకాలమని

  • దక్షిణాయణము పితృకాలము గనుక అశుభకాలమని మన పూర్వుల విశ్వాసము. 

  • ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను.

  • ఈవిధంగా చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని  స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.
ఏ రోజున ఏ తిథిని ఏ పండగ ఏ తెలుగు మాసం లో వస్తుంది

ప్రతి సంవత్సరం శుక్ల పక్షం లో వచ్చే పండుగలు 

1రోజు 

పాడ్యమి  

గోవర్ధన పూజ 

కార్తీక మాసం 

2 వ రోజు 

విదియ 

Bhaibeej

Kartika

3 వ రోజు 

తదియ 

Teej

Bhadrapad

3 వ రోజు 

తదియ 

అక్ష య తృతీయ 

వైశాఖ 

4 వ రోజు 

చవితి  

వినాయక చవితి 

భాద్రపద 

4 వ రోజు 


చవితి 

గణేష్ జయంతి 

మాఘ 

5 వ రోజు 

పంచమి 

Nuakhai

భద్రపద 

5 వ రోజు 

పంచమి 

వివాహ పంచమి

మార్గశిర 

5 వ రోజు 

పంచమి 

వసంత పంచమి

మాఘ 

6 వ రోజు 

షష్ఠి 

Sitalsasthi

జేష్ఠ 

9 వ రోజు 

నవమి 

శ్రీ రామ నవమి 

చైత్ర 

10 వ రోజు 

దశమి 

విజయదశమి 

ఆశ్వీజ 

11 వ రోజు 

ఏకాదశి 

శయన ఏకాదశి 

ఆషాడ 

11 వ రోజు 

ఏకాదశి

వైకుంఠ ఏకాదశి 

మార్గశిర 

14 వ రోజు 

చతుర్దశి 

Samvatsari

భాద్రపద 

15రోజు  (పూర్తి చంద్రుడు )

పూర్ణిమ 

గురుపూర్ణిమ 


ప్రతి సంవత్సరం కృష్ణ  పక్షం లో వచ్చే పండుగలు  


4రోజు

చతుర్థి

ఖర్వ చతు

కార్తీక

8రోజు

అష్టమి

కృష్ణ జన్మాష్టమి 

శ్రావణ

11రోజు

ఏకాదశి

వైకుంఠ ఏకాదశి

మార్గశిర

13రోజు

త్రయోదశి

ధనత్రయోదశి

కార్తీక

13రోజు

త్రయోదశి

ప్రదోష

మాఘ

14tరోజు

చతుర్దశి 

మహాశివరాత్రి

మాఘ

14రోజు

చతుర్దశి

నరక చతుర్థి దీపావళి

కార్తీక

ఈ క్రింది యు. వీడియో ఆర్. యల్ లు. చూడండి 


ఈ రోజు సూక్తి : 

"Perseverance is the hard work you do after you get tired of doing the hard work you already did." Newt Gingrich


NOTE:

బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe  చేయండి,  నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.