8, అక్టోబర్ 2019, మంగళవారం

శ్రీ సూక్తం తెలుగు లో అర్థసహితం తెలుసుకోండి జన్మ చరితార్థం చేసుకోండి

wowitstelugu.blogspot.com

శ్రీ సూక్తం తెలుగు లో అర్థసహితం తెలుసుకోండి జన్మ చరితార్థం చేసుకోండి 


ఓం || హిర'ణ్యవర్ణాం హరి'ణీం సువర్ణ'తస్ర'జాంంద్రాం హిరణ్మ'యీం క్ష్మీం జాత'వేదో  ఆవ' ||

అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము

తాం  ఆవ' జాత'వేదో క్ష్మీమన'గామినీ''మ్ |
స్యాం హిర'ణ్యం విందేయం గామశ్వం పురు'షాహమ్ ||

ఎవరి కరుణ, కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము.

అశ్వపూర్వాం 'ధ్యాం స్తినా''-ప్రబోధి'నీమ్ |
శ్రియందేవీముప'హ్వయే శ్రీర్మా దేవీర్జు'షతామ్ ||

గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను.తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము.

కాం సో''స్మితాం హిర'ణ్యప్రాకారా'మార్ద్రాం జ్వలం'తీం తృప్తాం ర్పయం'తీమ్ |
పద్మే స్థితాం ద్మవ'ర్ణాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను

చంద్రాం ప్ర'భాసాం సా జ్వలం'తీం శ్రియంలోకే దేవజు'ష్టాముదారామ్ |
తాం ద్మినీ'మీం శర'హం ప్రప'ద్యేఽక్ష్మీర్మే' నశ్యతాం త్వాం వృ'ణే ||

చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. దేవీనిన్ను ప్రార్థిస్తున్నానునా దారిద్ర్యం పోయేలా కరుణించు

ఆదిత్యవ'ర్ణే సోఽధి'జాతో స్పతిస్తవవృక్షోఽథ బిల్వః |
స్య ఫలా'ని సాను'దంతు మాయాంత'రాయాశ్చబాహ్యా 'క్ష్మీః ||

సూర్యుని తేజస్సు కలిగిన తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!

ఉపైతు మాం దేఖః కీర్తిశ్చ మణి'నా  |
ప్రాదుర్భూతోఽస్మి' రాష్ట్రేఽస్మిన్ కీర్తిమృ'ద్ధిం దాదు' మే ||

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు!

క్షుత్పి'పాసామ'లాం జ్యేష్ఠామ'క్షీం నా'యామ్యహమ్ |
అభూ'తిమస'మృద్ధిం  ర్వాం నిర్ణు' మే గృహాత్ ||

ఆకలి దప్పికలతో కృశించినది,శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని (అలక్ష్మి)నేను నాశనం చేస్తాను.
నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు.


గంధద్వారాం దు'రాధర్షాం నిత్యపు'ష్టాం రీషిణీ''మ్ |
శ్వరీగ్^మ్' సర్వ'భూతానాం తామిహోప'హ్వయే శ్రియమ్ ||



సుగంధానికి నిలయమైనదిజయింప అలవికానిదిఎల్లప్పుడూ పుష్టినిచ్చేదిసకల సంపదలు కలిగినసమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను.

మన'సః కామాకూతిం వాచః త్యమ'శీమహి |
పశూనాం రూపమన్య'స్య యి శ్రీః శ్ర'తాం యశః||

 శ్రీదేవిమనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూసంతోషమువాక్కులో సత్యముగోసంపద చేఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలినాకు కీర్తి కలుగచేయుము

ర్దమే' ప్ర'జాభూతా మయి సంభ' ర్దమ |
శ్రియంవాసయ' మే కులే మాతరం' ద్మమాలి'నీమ్ ||

కర్దమ మహర్షినీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలితామరపువ్వుల మాల ధరించినసిరిసంపదలకు అధిదేవతతల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి

ఆపఃసృజంతుస్నిగ్దాని చిక్లీ ' మే గృహే |
ని దేవీం మారం శ్రియంవాసయ' మే కులే ||

మహాలక్ష్మి పుత్రుడవైన చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి. దేవీ, నీ మాత అయిన మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. 

ర్ద్రాం పుష్కరి'ణీం పుష్టిం సువర్ణామ్ హే'మాలినీమ్ |
సూర్యాం హిరణ్మ'యీం క్ష్మీం జాత'వేదో  ఆవ' ||

అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము.

ర్ద్రాం యః కరి'ణీం ష్టిం పిలామ్ 'ద్మమాలినీమ్ |
ంద్రాం హిరణ్మ'యీం లక్ష్మీం జాత'వేదో  ఆవ' ||

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము

తాం  ఆవ' జాత'వేదో క్షీమన'గామినీ''మ్ |
స్యాం హిర'ణ్యం ప్రభూ'తం గావోదాస్యోఽశ్వా''న్విందేయం పురు'షాహమ్ ||

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి

ఓం మహాదేవ్యై విద్మహే' విష్ణుత్నీ ' ధీమహి | తన్నో' లక్ష్మీః ప్రచోదయా''త్ ||

మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను.

శ్రీ-ర్వర్చ'స్వ-మాయు'ష్య-మారో''గ్యమావీ'ధాత్ పవ'మానం హీయతే''
ధాన్యం నం శుం హుపు'త్రలాభం తసం''త్సరం దీర్ఘమాయుః' ||

సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత. పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు. గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు

ఓం శాంతిః శాంతిః శాంతిః' ||

అందరు శాంతి సుఖాలతో ఉండాలి శాంతి , శాంతి, శాంతి ...


 ఈ  క్రింద యు.ట్యూబ్ యు.ఆర్ .యల్. లు  (లింక్లు) చూడండి 

SRI SUKTAM TELUGU LYRICS AND MEANING - YouTube







Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.





4 కామెంట్‌లు: