bdl 1tv లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bdl 1tv లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2020, శనివారం

శివ నిర్వాణ షట్కమ్ ఉద్భవం మరియు నిర్వాణ షట్కమ్ గురించి తెలుసుకొని మోక్ష మార్గాన్ని అన్వేషించండి

wowitstelugu.blogspot.com
శివ నిర్వాణ షట్కమ్ ఉద్భవం మరియు  నిర్వాణ  షట్కమ్  దాని అర్ధం  తెలుసుకొని మోక్ష మార్గాన్ని అన్వేషించండి

ఎవరు ‘నేను’?

ఈ ప్రశ్న మనిషిని  సాధకుడిని శోధకుడిని  మహర్షిని మరియు మహోన్నతుడిని చేసింది. ‘నేను’ అనే పరమ సత్యాన్ని కనుక్కోవడమే సిసలైన జ్ఞానంగా పెద్దలు  చెబుతారు. నాకు జ్ఞానాన్నివ్వండి అని కోరిన భట్టపాదుడికి ఆదిశంకరులు అదే చెప్పారు. మనిషి సమగ్ర రూపాన్ని ఆవిష్కరించి జ్ఞానాన్ని ప్రసాదించారు. మోక్ష మార్గాన్ని చూపించిన ఆ జ్ఞాన సంపదే  ఈ నిర్వాణ షట్కం.

నిర్వాణఅష్టకమ్ ఉద్భవం 

కాశీక్షేత్రానికి రెండు వందల (200) మైళ్ల దూరంలో రుద్రపురం ఉన్న ఊరులో  పండితుడైన భట్టపాదుడు అగ్ని గుండాన్ని ఏర్పాటు చేసుకుని, దాని మధ్యలో కూర్చుని ఆత్మార్పణకు సిద్ధమయ్యాడు. మంటలు అలుముకుంటున్నాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడకు నవ యువకుడైన ఆది శంకరాచార్య ప్రవేశించారు. దీంతో అగ్ని మధ్యలో కూర్చుని కళ్లు మూసుకుని ఉన్న భట్టపాదుడికి ఒక్కసారిగా శరీరమంతా చల్లనిగాలులు సోకాయి. శంకరులు వచ్చినట్లు గుర్తించిన భట్టపాదుడు ‘తండ్రీ వందనాలు గురువుగారికి ద్రోహం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా నేను ఈ పని చేస్తున్నాను. నన్ను అనుగ్రహించి, జ్ఞానాన్నివ్వండి’ అని వేడుకున్నాడు. అప్పుడు  ఆదిశంకరుల నోటి నుంచి అద్భుతమైన ఆరు శ్లోకాలు వెలువడ్డాయి. సృష్టిలోని ప్రతిదాంట్లోనూ ఉన్న శివతత్త్వాన్ని ఆవిష్కరిస్తూ సాగే ఈ శ్లోకాల పరంపర నిర్వాణ షట్కంగా మారింది.

నిర్వాణం అంటే ఏమిటి?

నిర్వాణం అంటే మోక్షం. ఆనందం, ప్రశాంతత, స్వేచ్ఛ మిళితమైన సచ్చిదానంద స్థితి. అన్ని విషయాల్లో సంపూర్ణ సమదృష్టి కలిగి ఉండడం. ఈ విషయాన్ని షట్‌ అంటే ఆరు శ్లోకాల్లో వివరించారు. అదే నిర్వాణ షట్కమైంది. అద్భుతమైన ఆత్మావిష్కరణ కూడా ఇందులో ఉండడం వల్ల దీన్ని ఆత్మషట్కం అని కూడా అంటారు. నీలో సచ్చిదానందం ఉంది. అందుకే నువ్వు సాక్షాత్తు శివుడివి అని ఆయన వెల్లడిస్తారు. 

ఈ ప్రపంచములో  ఆనందమే అని వివరిస్తూ, వైరాగ్యభావాన్ని బోధిస్తూ శంకరులవారి స్తోత్ర రచన సాగిందిభట్టపాదుడు ఆత్మార్పణ చేస్తూ మోక్షం ప్రసాదించమని కోరినప్పుడు నిర్వాణషట్కం చెప్పారు. హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు గోవింద భగవత్పాదులు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించినప్పుడు శంకరుల నోట నిర్వాణ మంజరి జాలువారింది. ఆంధ్రదేశంలోని మోపిదేవి సందర్శించినప్పుడు నిర్వాణ దశకం చెప్పినట్లు ఉంది.

నిర్వాణ అష్టకమ్ 

‘మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోతం న జిహ్వానిచఘ్రాణ నేత్రే!
నచవ్యోమ భూమి ర్న తేజో న వాయు
శ్చిదానంద రూప శివోహం శివోహం!

అంతఃకరణ చతుష్టయాలైన మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం నేను కాదు. నాలుక, ముక్కు, చర్మం, కళ్లు, చెవులు కూడా కాదు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అంతకన్నా కాదు... నేను చిదానందరూపుడైన శివుడిని.

‘న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు
ర్నవా సప్తధాతు ర్నవా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థ పాయీ
చిదానందరూప శివోహం శివోహం!’

నేను ప్రాణాన్ని కాదు, పంచవాయువులనూ కాదు. రక్తం, మాంసం, మేధస్సు వంటి సప్త ధాతువులనూ కాదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని చెప్పే పంచ కోశాలూ నేను కాదు. వాక్కు కాదు, కాళ్లు, చేతులూ కాదు, నేను చిదానంద రూపుడైన శివుడిని.

‘న మే ద్వేషరాగౌ నమే లోభమోహే
మదోనైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో నచార్థో న కామో నమోక్ష
చిదానంద రూప శివోహం శివోహం’

నాకు రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, ధర్మార్థ కామమోక్షాలు లేవు. ఎందుకంటే నేను చిదానంద రూపుడను. కష్టసుఖాలన్నీ నాకు సమానమే అనే భావాన్ని పెంపొందింపజేసుకుంటే స్థితప్రజ్ఞుడిగా మనిషి మారతాడు ఆ స్థితిలో మనిషి సాక్షాత్తు శివుడే అని ఈ శ్లోకం వివరిస్తుంది.

‘న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానందరూప శివోహం శిహోహం’

నాకు పాపపుణ్యాలు లేవు. సుఖదుఃఖాలు లేవు. మంత్రజపాలు, తీర్థసేవలు, వేదయజ్ఞాలు లేవు. భోజన పదార్థాలు, భోజనం, భోక్త నేను కాదు. చిదానంద రూపుడైన శివుణ్ణి నేను.


‘న మృత్యుర్న శం కా నమే జాతిభేదః
పితానైవ మేనైవ మాతా చ జన్మః
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్య
చిదానంద రూపా శివోహం శివోహం!

నాకు మృత్యువు, భయం, జాతి భేదాలు లేవు. తల్లిదండ్రులు లేరు. జన్మలేదు. నాకు బంధువులు లేరు. మిత్రులు లేరు. గురువు లేడు. శిష్యులు లేరు. అంటూ అన్ని బంధాలకు, బంధుత్వాలకు అతీతంగా ఉండడం చిదానందానికి కారణమవుతుందని వివరిస్తారు శంకరులు.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభూత్వచ్ఛ సర్వత్ర సర్వేన్ద్రియాణామ్‌
న చో సంగతం దైవ ముక్తిర్నమే య
చిదానందరూపా శివోహం శివోహం

నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని-

హిందీ లో


मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ।
न च व्योम भूमिर्न तेजो न वायुः
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥

न च प्राणसंज्ञो न वै पञ्चवायुः
न वा सप्तधातुः न वा पञ्चकोशः ।
न वाक्पाणिपादं न चोपस्थपायु
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥२॥

न मे द्वेषरागौ न मे लोभमोहौ
मदो नैव मे नैव मात्सर्यभावः ।
न धर्मो न चार्थो न कामो न मोक्षः
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥३॥

न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ ।
अहं भोजनं नैव भोज्यं न भोक्ता
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥४॥

न मृत्युर्न शङ्का न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्मः ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यं
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥५॥

अहं निर्विकल्पो निराकाररूपो
विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
न चासङ्गतं नैव मुक्तिर्न मेयः
चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥६॥














ఈ క్రింది వీడియో యు .ఆర్ . యల్.ల పై క్లిక్  చేసి వీడియో లు చూడండి 


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ













13, జూన్ 2020, శనివారం

శివమానస స్తోత్రం తెలుగు ఇంగ్లీష్ మరియు సంస్కృతం లో పఠించండి

wowitstelugu.blogspot.com

శివమానస స్తోత్రం తెలుగు ఇంగ్లీష్ మరియు సంస్కృతం లో పఠించండి


శివమానస స్తోత్రం తెలుగు


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ |
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే || 6 ||

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం|
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే || 8 ||

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ||

Siva manasa Stotram English
ratnaiḥ kalpitamāsanaṃ himajalaiḥ snānaṃ cha divyāmbaraṃ
nānāratna vibhūśhitaṃ mṛgamadā modāṅkitaṃ chandanam |
jātī champaka bilvapatra rachitaṃ puśhpaṃ cha dhūpaṃ tathā
dīpaṃ deva dayānidhe paśupate hṛtkalpitaṃ gṛhyatām ‖ 1 ‖

sauvarṇe navaratnakhaṇḍa rachite pātre ghṛtaṃ pāyasaṃ
bhakśhyaṃ pañchavidhaṃ payodadhiyutaṃ rambhāphalaṃ pānakam |
śākānāmayutaṃ jalaṃ ruchikaraṃ karpūra khaṇḍojjcalaṃ
tāmbūlaṃ manasā mayā virachitaṃ bhaktyā prabho svīkuru ‖ 2 ‖

Chatraṃ chāmarayoryugaṃ vyajanakaṃ chādarśakaṃ nirmalaṃ
vīṇā bheri mṛdaṅga kāhalakalā gītaṃ cha nṛtyaṃ tathā |
sāśhṭāṅgaṃ praṇatiḥ stuti-rbahuvidhā-hyetat-samastaṃ mayā
saṅkalpena samarpitaṃ tava vibho pūjāṃ gṛhāṇa prabho ‖ 3 ‖

ātmā tvaṃ girijā matiḥ sahacharāḥ prāṇāḥ śarīraṃ gṛhaṃ
pūjā te viśhayopabhoga-rachanā nidrā samādhisthitiḥ |
sañchāraḥ padayoḥ pradakśhiṇavidhiḥ stotrāṇi sarvā giro
yadyatkarma karomi tattadakhilaṃ śambho tavārādhanam ‖ 4 ‖

kara charaṇa kṛtaṃ vākkāyajaṃ karmajaṃ vā
śravaṇa nayanajaṃ vā mānasaṃ vāparādham |
vihitamavihitaṃ vā sarvametat-kśhamasva
jaya jaya karuṇābdhe śrī mahādeva śambho ‖ 5 ‖
Iti śrīmacchaṅkarācāryaviracitā śivamānasapūjā samāptā||

Sivamanasa Stotram Sanskrit

रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्।
जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥१॥
सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम्।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु॥२॥
छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा।
साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो॥३॥
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्॥४॥
करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधम्।
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो॥५॥
इति श्रिमच्छङ्कराचार्यविरचिता शिवमानसपूजा समाप्ता॥

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ

















11, ఏప్రిల్ 2020, శనివారం

కరోనా మనల్నిచేరకుండా హనుమాన్ చాలీ సా తెలుగులో ధ్యానం చేసుకుంటూ ఇంట్లో నే ఉండండి

wowitstelugu.blogspot.com

కరోనా మనల్నిచేరకుండా హనుమాన్ చాలీ సా తెలుగులో ధ్యానం చేసుకుంటూ ఇంట్లో నే ఉండండి



ఇది రాముని సుప్రసిద్ధ  ప్రసిద్ధ భక్తుడైన   తులసీదాసు  అవధి భాషలో వ్రాసినదని హిందువులు పండితులు  నమ్ముతున్నారు. తులసీదాసు యొక్క ప్రసిద్ధ రచన  రామ చరితమానస. "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. 

దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకములు ఉంటాయి. చాలీసా అంటే సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలుబది శ్లోకములు అని చెబుతారు.

రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి

యధాతథ తెలుగు లిపి లో 

దోహా

శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా
అంజనిపుత్ర పవనసుతనామా | 2

మహావీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా
కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై
కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన
తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర
రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా
రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా
వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే
శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం
అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే
కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషన మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ
జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై
తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై
మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా
తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై
సోయీ అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై
జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ
జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ
కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా
కీజై నాథ హృదయ మహ డేరా | 40


దోహా


పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప్
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ 

హనుమాన్ చాలీసా చదవడం వల్ల వచ్చే ఫలితం

  • హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట, వాక్సుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.

  • హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును. 

  • స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును. 

  • హనుమంతుని  పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును.

  • రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.

  • విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు గాని, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

  • ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదవడం మంచిది.

  • హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు పఠించడం వల్ల  అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.

  • దీనిని తరుచుగా చదవటం వల్ల శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తుల ప్రభావం పోతుంది.

  • హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.


హనుమాన్ చాలీసా చరిత్ర



ఒక రోజు 'తులసీదాసు' నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.
ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ శ్రీ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. ఇదంతా  గమనించిన శ్రీ హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు శ్రీ హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే శ్రీ హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు.
హనుమాన్ చాలీసా క్రింది వీడియో యు. ఆర్. యల్ .ల లో చూడండి...



గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.