జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1935 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో సినిమా గాయకురాలు
అత్యధిక ప్రాచుర్యం పొందిన గీతాలు:
- జిక్కి - పి.జి. కృష్ణవేణి .
- జననం: నవంబరు 3, 1935
- మరణము : 16ఆగష్టు -2004. బ్రెస్ట్ కాన్సర్ కి ఆపరేసన్ అయిన ౩ సం తరువాత అదే కాన్సర్ కిడ్నిస్కి సోకడం వలన చనిపోయారు.
- భర్త :ఎ.యం.రాజా గాయకుడు(ప్రేమ వివాహము -1958 లో)1989 లో రైలు యాక్సిడెంట్లో చనిపోయారు.
- చదువు :బి.ఎ. పచయ్యప్ప కాలేజె, మద్రాసు
- జన్మించిన ఊరు : చంద్రగిరి - చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ .
- వృత్తి: నేపధ్య గాయని
- పిల్లలు : 4 కూతుర్లు , 2 కొడుకులు . క్రియాశీల కాలం : (1935 – 2004)
జవళి గీతాల జిక్కి:-
- జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1935 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకుంది.
- జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినప్పుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నప్పుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖ గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసు కుంది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు.
- హాయి హాయిగా ఆమనిలా..పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఆమె ప్రముఖ గాయని అని ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించారామె.ఒకే స్వరంలో అటు మధురానుభూతిని, ఇటు కవ్వింపునీ పలికించ గల గాయని జిక్కి. ఆమె పాట వింటే పులకించని మది పులకిస్తుంది, ఆమని హాయిగా సాగుతుంది.
- ఎన్ని సార్లు విన్నా ఆమె గాత్రంపై మోజు తీరలేదు అనిపిస్తుంది. 'హాయి హాయిగా ఆమని'లా సాగే జాణ పదాల స్వరం - 'పులకించని మదిని సైతం పులకింపచేసే భా'స్వరం' జిక్కీ సొంతం. ఆమె గుర్తుకు రాగానే శృంగార, జానపద బాణీలు మదిలో మెదులుతాయి. ''రాజశేఖరా నీపై మోజు తీరలేదురా'' లాంటి విరహగీతాలే కాదు, పోలీసెంకటసా మిని మరవలేని మనసూ, బంగారిమా మని పిలిచే పిలుపూ ఆమె పాటలో మిళితమైంది.
- బాలనటిగా ఎంట్రీ లో ఆమె సినీరంగానికి పరిచయమైంది గాయనిగా కాదు, 'పంతులమ్మ' చిత్రంలో బాలనటిగా పరిచయ మయ్యారు. అదే సినిమాలో పాట కూడా పాడారు. ఇంకా త్యాగయ్య, మంగళసూత్రం, గొల్లభామ చిత్రాల్లో నటించారు. తర్వాత 'జ్ఞానసుందరి' అనే తమిళ సినిమాతో పూర్తి గాయనిగా మారారు. ఈ చిత్రంలో జిక్కి పాడిన పాట బాగా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో అప్పటి సినీ సంగీత దర్శకులందరి దృష్టి జిక్కిమీదనే. 1950 దశకంలో దక్షిణ సినీ పరిశ్రమలో గాయనిగా జిక్కికి తిరుగులేదు.
- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ... ఇలా ఏ భాషలోనైనా ఆమె గాత్రమే వినిపించేది. మొత్తం పది వేలకు పైగా పాటలు పాడారు. సహ గాయకుడు ఎ.ఎం.రాజాతో కలిసి హిందీ చిత్రంలో పాడారు. హిందీ భాషలో పాడిన తొలి తెలుగు గాయకులు వీరిద్దరే. ఎన్నో హిట్ పాటలు పాడిన వీరిద్దరూ తర్వాత వివాహం చేసుకున్నారు.
- ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్న ఎవరికి పాడుతున్నాం అనేది దృష్టిలో పెట్టుకుని పాడటం ముఖ్యమని భావంచేవారు జిక్కి. అలా పాడిన పాటే 'రోజులు మారాయి' చిత్రంలో ''ఏరువాక సాగారో రన్నో చిన్నన్న'' పాట. ఈ పాట ఆమెకే కాదు, ఆ సినిమకూ మంచి పేరు తెచ్చింది. తెలుగు సినిమాల్లో జానపద గీతాల రచనకు పెట్టింది పేరు కొసరాజు, మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తాజాగానే ఉంది.
- ఘంటసాల, జిక్కి ఆలపించిన ''హాయి హాయిగా ఆమని సాగే'' అల్టైమ్ హిట్ పాట. వినటానికి ఎంతో శ్రావ్యంగా, సులువుగా సాగిపోతున్నట్లు అనిపించే పాట. ఇదే పాటను హిందీలో పాడిన మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు 'ఘంటసాల, జిక్కిలా ఈ పాటకు న్యాయం చేయలేం' అన్నారంటేనే తెలుస్తుంది ఈ పాటలోని స్వరాలు పాడటం ఎంత కష్టమో.
- 'అనార్కలి' చిత్రంలో అందరూ ఇష్టపడే ''జీవితమే సఫలము రాగసుధా భరితము, ప్రేమకథా మధురము'' పాటలో జిక్కి తీయని గాత్రాన్ని మర్చిపోలేం. హిందీ అనార్కలీలో ''ఏ జిందకీ ఉసీకీ హై'' పాటకి అనుసరణే తెలుగులో పెట్టారు సంగీత దర్శకులు ఆదినారాయణరావు. ఇందులో ఎక్కువ జనాదరణ పొందిన మరో పాట ''రాజశేఖరా నీపై మోజు తీరలేదురా''. ఈ పాటలో ఈ చిత్ర దర్శకుడు, నృత్య దర్శకుడు అయిన వేదాంతం రాఘవయ్య అక్బర్ ఆస్థాన గాయకుడిగా కనిపిస్తారు.
ఆమె పడిన అద్భుతమైన పాటలు :
- ''పులకించని మది పులకించు'' (పెళ్ళి కానుక),
- ''చాంగురే బంగారు రాజా'' (శ్రీకృష్ణపాండవీయం),
- ''చెట్టులెక్కగలవా.. ఓ నరహరి పుట్టలెక్కగలవా...'' (చెంచులక్ష్మి),
- ''చిగురాకులలో చిలకమ్మా'',
- ''రావోయి మా ఇంటికి'' (దొంగరాముడు),
- ''ఎక్కడమ్మా చంద్రుడు'' (అర్ధాంగి),
- ''ఓహో బస్తీ దొరసాని'' (అభిమానం),
- ''బతుకు నీ కోసమే'' (ఇంటిగుట్టు),
- ''వగలోరు వగలు తళుకు బెళుకు వగలు'' (పాతాళభైరవి),
- ''కొమ్ములు తిరిగిన మగవారూ కొంగు తగిలితే పోలేరు'',
- ''జాణవులే వర వీణవులే'' (ఆదిత్య 369),
- ''నిన్నే పెళ్ళాడేస్తా నంటూ'' (నిన్నే పెళ్ళాడతా),
- ''అలనాటి రామ చంద్రుడు అన్నింటా సాటి'' (మురారి)
- ''చల్లని వెన్నెల సోనలు'' (వెలుగునీడలు),
- ''రాధ రావే రాణీ రావే'' (శాంతినివాసం),
- ''ఓ దేవదా... చదువూ ఇదేనా'' (దేవదాసు),
లాంటి ఎన్నో మరపురాని, మర్చిపోలేని పాటలు ఆమె సొంతం.
- తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈమె విరహగీతాలతో పాటు ఉల్లాసకరమైన పాటలు, ప్రేమగీతాలు ఎన్నో పాడారు. కొన్ని కారణాల వల్ల సినిమాల్లో పాడటం మానేసినా, కచేరీలు చేశారు.
- భర్త ఎ.ఎం.రాజా రైలు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తన ఇద్దరు కొడుకులతో కలిసి సంగీత బృందాన్ని ప్రారంభించి, విదేశాల్లో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
- ఆమె ఎప్పుడూ డబ్బు ముఖ్యమనుకోలేదు. దానికి ఉదాహరణ ఓ తమిళ సినిమాలో మొత్తం పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు, నిర్మాత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినా తనంత టతానే ఆ డబ్బులు తగ్గించుకున్నారు.
- చాలా కాలం తర్వాత ఆమె 'ఆదిత్య - 369, సీతారామయ్యగారి మనవరాలు, నిన్నే పెళ్ళాడుతా, చివరిగా 'మురారి' చిత్రంలో పాడారు.
అత్యధిక ప్రాచుర్యం పొందిన గీతాలు:
- వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
- జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
- 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
- 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
- పులకించని మది పులకించు లాంటి పాటలు
- వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
- జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
- 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
- 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
- పులకించని మది పులకించు లాంటి పాటలు
అద్భుతమైన జిక్కి చిత్ర మాలిక :
- నిన్నే పెళ్ళాడుతా (1996),
- ఆదిత్య 369 (1991),
- సీతారామయ్యగారి మనవరాలు (1991),
- వట్టత్తుక్కుళ్ చతురమ్ (1978),
- సంపూర్ణ రామాయణం (1971),
- శ్రీమంతుడు (1971),
- తిరుపతమ్మ కథ (1963),
- లవకుశ (1963),
- భీష్మ (1962),
- గులేబకావళి కథ (1962),
- సిరి సంపదలు (1962),
- సీతారామ కళ్యాణం (1961),
- బాటసారి (1961),
- శభాష్ రాజా (1961),
- పెళ్ళి కానుక (1960),
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960),
- శాంతినివాసం (1960),
- శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960),
- కృష్ణలీల (1959),
- రాజమకుటం (1959),
- చెంచులక్ష్మి (1958),
- మాంగల్యబలం (1958),
- సువర్ణ సుందరి (1957),
- భలేబావ (1957),
- మాయాబజార్ (1957),
- పాండురంగ మహత్యం (1957),
- సారంగధర (1957),
- తోడికోడళ్ళు (1957),
- చిరంజీవులు (1956),
- భలేరాముడు (1956),
- జయం మనదే (1956),
- కనకతార (1956),
- పెంకి పెళ్ళాం (1956),
- దొంగ రాముడు (1955),
- రోజులు మారాయి (1955),
- అనార్కలి (1955),
- అర్ధాంగి (1955),
- రేచుక్క (1954),
- తోడుదొంగలు (1954),
- ఆహ్(1953),
- బ్రతుకు తెరువు (1953),
- దేవదాసు (1953),
- పర్దేశీ (1953),
- ప్రతిజ్ఞ (1953),
- ధర్మదేవత (1952),
- పల్లెటూరు (1952),
- పాతాళ భైరవి (1951),
- నవ్వితే నవరత్నాలు (1951),
- పల్లెటూరి పిల్ల (1950),
- షావుకారు (1950),
- సంసారం (1950),
- మనదేశం (1949),
- పంతులమ్మ (1943)
జిక్కి తెలుగు చిత్రలలోని పాటలు క్రింద ఉన్న యూ.ర్.యల్, క్లిక్ చేసి చూడండి . అద్భుతం పరమాద్భుతం ఈమె పాటలు ...
May 25, 2017 - Uploaded by Tollywood Mirapakai
Published on May 24, 2017. Untold Successful Career and Struggles Of GreatSinger "JIKKI"|TELUGU| For ...
May 15, 2012 - Uploaded by TV5 News
She sang over nearly 10000 songs in Telugu, ... ... Pillavalu Gajapathi Krishnaveni aka Jikki , was a popular ...Jikki Telugu Golden Songs || Playback Singer Jikki Super Hit Video ...
Sep 3, 2013 - Uploaded by iDream Telugu Movies
Watch and enjoy Playback Singer Jikki Telugu Golden Songs. Pillavalu Gajapathi Krishnaveni, also known as ...
Jan 9, 2016 - Uploaded by Volga Video
Jikki Madhura Gaanam Vol 1 - Telugu Back 2 Back Old Video Songs ... గీతాలు |Singer Jikki Golden Hits ...
Nov 29, 2017 - Uploaded by TeluguOne
Jikki was a famous female singer during the golden era of Indian music. ... గీతాలు | Singer Jikki Golden Hits ...
May 15, 2012 - Uploaded by TV5 News
கிருஷ்ணவேணி) aka Jikki (Telugu: జిక్కి, Tamil: ... Tamil: ஜிக்கி), was a popular film playback singer from Andhra ...
Dec 21, 2015 - Uploaded by Saregama South
Pillavalu Gajapathi Krishnaveni, aka, PGK, or more commonly known as Jikki, the veteran singer of South ...