wowitstelugu.blogspot.com
భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించే క్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను ఎలా జయించాలి అవి ఏమిటి
అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మహ, మద మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలె.
ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. భారతీయ ధర్మ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి అంటారు
- కామం (మితిమీరిన ఏదైన కోరిక)
- క్రోధం (కోపం)
- లోభం (పిసినారితనం లేదా స్వార్ధం)
- మోహం(ఆకర్షణ వలన కలిగే వలపు)
- మదం (అహంకారం)
- మాత్సర్యం(ఈర్ష్య, అసూయ, మత్సరము, పగ,)
1. కామము –
ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
- నరకాసురుడు, జరాసంధుడు అనేక స్త్రీలను, రాజులను చెఱపట్టి నశించుట.
2. క్రోధము –
కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
- శిశుపాలుడు తను వివాహమాడదలచిన రుక్మిణిని కృష్ణుడు వివాహమాడెనని కృష్ణుని క్రోధించి నశించుట.
3. లోభము –
కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
- దుర్యోధనుడు లోభము వలన నశించుట.
4. మోహము –
తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
- దశరథుడు కైక మీది మోహముచేత నశించుట
5. మదము –
తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
- కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.
6. మాత్సర్యము –
తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
- శిశుపాలుడు కృష్ణుని వైభవము చూసి ఓర్వలేక వదరి నశించుట

ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగు చున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.
ఇక అరిషడ్వర్గాలలో మొదటిది కామాన్నే తీసుకున్నారు. ఎందుకంటే కామం వెనుక ఉండేవన్నీ దాని నుంచే కలుగుతాయి కాబట్టి ఇక్కడ మొదట దీన్నే ప్రస్తావించారు. ఇదే విషయాని గీతలో శ్రీకృష్ణభగవానుడు తెలియజేశాడు. విషయ వాంఛలు గురించి సదా మననం చేయువానికి, దానిపైనే ధ్యాస పెరిగి కామంగా మారి చివరకు క్రోధమవుతుందిట. క్రోధం వల్ల అవివేకం దీనివల్ల జ్ఞాపకశక్తి నశించి తత్ఫలితంగా మనిషి తన బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి పాలవుతాడని గీతా భోద లో కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు.
వీటిని ఎలా అదుపులో ఉంచగలము అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవ దేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసు కుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.
ఈ క్రింది యూట్యూబ్ వీడియో లు చూడండి
అరిషడ్వర్గాల విశిష్ఠత | Arishadvargas | Importance Of ...
https://www.youtube.com › watch
- Translate this pageNote:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి