wowitstelugu.blogspot.com
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ
వారాహి అమ్మవారి నవరాత్రులు గురించి తెలుసుకొని అమ్మవారి స్తోత్రం పఠిద్దామా
వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒకామెగా, దశ మహా విద్యలలో ఒకామెగా కొలుస్తారు.
ఈమె వరాహ (పంది) ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు.ఈమె వరాహ స్వామి అర్ధాంగి. నేపాల్ లో ఈమెను బారాహి అంటారు.
వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది.
అమ్మవారు అసూయ అనే వికారానికి అధిదేవత.
- మత్స్యపురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు.
- దేవీ పురాణం వారాహీ దేవిని విచిత్రంగా వరాహా స్వామికి తల్లిగా (వరాహజననిగా) వర్ణించింది.
- మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ-నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ(పంది) రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది.
- దేవీ మాహాత్మ్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షశుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే, ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుడ్ని సంహరిస్తుంది. వామన పురాణాం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది.
- మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి, వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది.
- దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని, ఇతర మాతృకలతో పాటుగా, అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది.
- వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది.
శ్రీ వారాహి నవరాత్రులు
- ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
- మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
అమ్మవారి వైభవం
- వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ , గజ , తురగ , సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు.
- లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి. లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి , రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.
- అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి , స్వప్నవారాహి , ధూమ్రవారాహి , కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.
- అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.
- పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు. ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం
- ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.
🙏 శ్రీ వారాహీ దేవీ స్తోత్రమ్ 🙏
అస్యశ్రీ కిరాతవారాహీ స్తోత్రమంత్రస్య కిరాత వారాహి ఋషిః
అనుష్టుప్ ఛందః, శత్రునివారిణీ వారాహీ దేవతా,
తదనుగ్రహేణ సర్వోపద్రవ శాంత్యర్థే జపే వినియోగః
ధ్యానమ్
ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం
క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే II 1 II
స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం
దంష్ట్రాకరాళవచనాం వికతాస్యాం మహారవామ్ II 2 II
ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం
లోచనాగ్ని స్ఫులింగాద్యైర్భస్మీ కృత్వా జగత్త్రయమ్ II 3 II
జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః
ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకమ్ II 4 II
దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం
గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితామ్ II 5 II
వైరిపత్నికంఠసూత్రచ్ఛేదన క్షురరూపిణీం
క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికేవస్థితాం సదా II 6 II
జితరంభోరుయుగళాం రిపుసంహాతాండవీం
రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతామ్ II 7 II
విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః
గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః II 8 II
కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ
సర్వ శత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః II 9 II
విధి విష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః
ఏవం జగత్త్రయక్షోభకారక క్రోధసంయుతామ్ II 10 II
సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహూర్ముహుః
ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్. II 11 II
తేஉపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం
త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా II 12 II
భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం
ఏవం విధాం మహాదేవీం యచేహం శత్రుపీడనమ్ II 13 II
శత్రునాశనరూపాణి కర్మాణి కురుపంచమి
సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః II 14 II
తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం
పాతుమిఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః II 15 II
మారయాశు మహాదేవి తత్కథాం తేన కర్మణా
ఆదపశ్శత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః II 16 II
నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం
శత్రుగ్రామగృహాందేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా II 17 II
ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్
అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరమ్ II 18 II
విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం
యథా వశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు. II 19 II
యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం
ఇదానీమేవ వారాహి భుజ్వేక్షదం కాలమృత్యువత్ II 20 II
మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ
దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ II 21 II
హంతు తే ముసలః శత్రూన్ ఆశనేః పతినాదివ
శత్రుదేహాన్ హలం తీక్ణం కరోతు శకలీకృతాన్ II 22 II
హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే
సింహదంష్ట్రెః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ II 23 II
పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా
తాంస్తాడయంతి శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా II 24 II
కిముక్తైర్బహుభిర్వాక్యై రచిరాచ్ఛత్రునాశనం
కురు వశ్యం కురుకురు వారాహి భక్తవత్సలే. II 25 II
ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం
మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదమ్ II 26 II
త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్తఫలమశ్నుతే
ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే II 27 II
తా తార్‍క్ష్యారూఢాం సువర్ణాభాం జపత్తేషాం న సంశయ
అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృప్య దీయతే II 28 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్
అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ II 29 II
ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్
దష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి II 30 II
దుర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్
సకలేష్టార్థదా దేవీ సాధక స్తత్ర దుర్లభః II 31 II
ఇతి శ్రీ వారాహీ స్తోత్రమ్ సమాప్తం
శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం
ఓంశ్రీమాత్రే నమః
ఈశ్వర ఉవాచ:-1) మాతర్జగద్రచన నాటకసూత్రధార-స్త్వద్రూపమాకలయితుం పరమార్థ తోఽయం
ఈశోఽప్యమీశ్వరపదం సముపైతి తాదృక్- కోఽన్యః స్తవం కిమివ తావకమాదధాతు !!2) నామాని కింతు గృణతస్తవ లోకతుండే నాడంబరం స్పృశతి దండధరస్య దండః !
యల్లేశలంబితభవాంబునిధిర్యతో యత్- త్వన్నామసంసృతిరియం నను నః స్తుతిస్తే !!3) త్వచ్చింతనాదరసముల్లసదప్రమేయా- ఽఽనందోదయాత్సముదితః స్ఫుటరోమహర్షః !
మాతర్నమామి సుదినాని సదేత్యముం త్వా- మభ్యర్థయేఽర్థమితి పూరయతాద్దయాలో !!4) ఇంద్రేందుమౌలివిధికేశవమౌలిరత్న- రోచిశ్చయోజ్జ్వలితపాదసరోజయుగ్మే !
చేతో మతౌ మమ సదా ప్రతిబింబితా త్వం భూయా భవాని విదధాతు సదోరుహారే !!5) లీలోద్ధృతక్షితితలస్య వరాహమూర్తే- ర్వారాహమూర్తిరఖిలార్థకరీ త్వమేవ !
ప్రాలేయరశ్మిసుకలోల్లసితావతంసా త్వం దేవి వామతనుభాగహరా రహస్య !!6) త్వామంబ తప్తకనకోజ్జ్వలకాంతిమంత- ర్యే చింతయంతి యువతీతనుమాగలాంతాం!
చక్రాయుధత్రినయనాంబరపోతృవక్త్రాం తేషాం పదాంబుజయుగం ప్రణమంతి దేవాః !!7) త్వత్సేవనస్ఖలిత పాపచయస్య మాత- ర్మోక్షోఽపి యత్ర న సతాం గణనాముపైతి !
దేవాసురోరగనృపాలనమస్య పాద- స్తత్ర శ్రియః పటుగిరః కియదేవమస్తు !!8) కిం దుష్కరం త్వయి మనోవిషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానవదర్చితాయాం !
కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాదపుంసాం !!ఇతి శ్రీ వారాహ్యనుగ్రహాష్టకం సంపూర్ణం.
హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు
🙏 పంచమి
🙏 దండనాథా
🙏 సంకేతా🙏 సమయేశ్వరి
🙏 సమయ సంకేతా🙏 వారాహి
🙏 పోత్రిణి🙏 వార్తాళి
🙏 శివా🙏 ఆజ్ఞా చక్రేశ్వరి
🙏 అరిఘ్నిఈ అమ్మవారు శాంతస్వరూపిణి
వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం , క్రోధం , లోభం , మోహం , మదం , మాత్సర్యం , అహంకారం , అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.
పీడ కలలు వచ్చే వారికీ వారాహి దేవి మంత్రo
ఈ మంత్రాన్ని జపిస్తే ఏ మంత్రమైనా తొందరగా సిద్ధిస్తుందిట. అలాగే స్వప్న వారాహి మంత్రం చేస్తే కలలో దేవి కనిపించి సాధకుని ప్రశ్నలకు జవాబిస్తుందిట. దుస్వప్నాలని కూడా రాకుండా ఈ శక్తి కాపాడుతుందని నమ్ముతారు. చిన్న పిల్లలకు ఈ మంత్రం తో విబూది పెడితే పీడ కలలు రావంటారు.
"ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా"
ఈ మంత్రాన్ని 108 నుండి 1008 సార్లు పఠిస్తే అనుకొన్న కార్యం ఫలిస్తుంది నమ్మకంతో చేయాలి.. ఉపదేశం లేని వారు అమ్మవారిని గురువుగా భావించి మంత్ర జపం చేసుకోండి
శ్రీ వారాహీ దేవీ మూల మంత్రం వీడియో లింక్
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe చేయండి.
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి