wowitstelugu.blogspot.com
సామాన్య ధర్మాలు
'ధర్మము' అంటే ఏమిటి? ప్రతి వ్యక్తి తన జీవితంలో సుఖవంతమైన జీవితం సాగించడానికి ఆచరించ వలసిన కనీస ధర్మాలు ఏమిటి ?
"ధర్మో రక్షతి రక్షితః" అన్నారు పెద్దలు. నువ్వు ధర్మాన్ని కాపాడు. అది నిన్ను కాపాడుతుంది అని అర్థం. అసలు ధర్మమంటే ఏమిటి? దాన్ని మనమెలా కాపాడగలం? అది మనల్ని ఎలా కాపాడుతుంది? ఇలాంటి సందేహాలు కొందరికి కలగవచ్చు. అలాటి ప్రశ్నలన్నిటికీ ఇక్కడ మీకు కొన్ని సమాధానాలు లభిస్తాయి.
- మానవుని జీవింప చేసేవి ఏవి ....
1. నిగ్రహం 2. ప్రేమ 3. తృప్తి 4. త్యాగము.
- మనిషిని దహింపజేసేవి ...
1. అసూయ 2.అత్యాశ 3. ద్వేషం 4. పగ.
- జీవితానికి చెరుపు తెచ్చేవి ...
1. అధికారం 2. అహంకారం 3. అనాలోచన.
- జీవితంలో ఆశించకూడనివి ...
1.అప్పుచేయడం 2.యాచించడం
- జీవితంలో చేయకూడనివి...
1. వంచన 2. దూషణ
- జీవితం లో నేర్పరికి కావలసినవి ...
1. లక్ష్యం 2. సహనం 3. వినయం 4. విధేయత .
- జీవితంలో పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవి ..
1. వ్యామోహం 2. స్వార్థం .
- జీవితం లో సంచరించ కూడని మార్గాలు ...
1. ఒంటరితనం 2. అవినీతి 3. అధర్మం .
- ప్రతిదినం ఆచరించి, భోదించ దగినవి ...
1.సుద్దులు 2. నీతులు
- నిత్యమూ ఆచరించేవి...
1.ధర్మము 2. దయ 3. దాక్షిణ్యం
- నిత్యమూ చేయదగినవి ...
1.ధ్యానం. 2.దానము
- నిత్యం ఆలోచించవలసినవి ...
1. సద్భావం 2. సమాజము 3. సమైక్యత .
- నియమబద్దము గా పాటించాల్సినివి ...
1. కరుణ 2. క్రమశిక్షణ
- నిత్యం చేయవలసిన వ్రతాలు...
1. సత్యవ్రతం 2. మౌన వ్రతం .
- పూజింపదగిన వారు...
1.తల్లి 2. తండ్రి 3. గురువు .4. దైవం 5. పరస్త్రీ
- నిత్యం ఎవరిని ఆదుకోవాలి ..
1. దీనులు . 2 ఆపదలు ఉన్నవారిని
- నిత్యం పలుక కూడనివి...
1. అశ్లీలం వాక్యములు 2. అశుభవాక్యములు
- జీవితం లో చేయకూడని వృత్తులు...
1. చోరత్వం 2. వ్యభిచారము
- జీవితం లోనిత్యం కోరుకోవలసినిది...
1. అందరి క్షేమం
- జీవితం లోనిత్యం పనికిరానిది ...
1. పరవిమర్శ 2. పరనింద
- జీవితం లో మనం చేసుకోవలసినవి ...
1. ఆత్మ విమర్శ .2. ఆత్మ రక్షణ
- జీవితం లో వదులుకోవలసినవి ...
1. ఆర్భాటం 2. ఆడంబరం .3. స్కోత్కర్ష
- జీవితం లో కాపాడుకోవలసినవి ...
1. ఆత్మాభిమానం 2. శీలం
- దైవధ్యానానికి పనికిరానివి ...
1. కోపం 2. చింత 3.అపనమ్మకం 3. కోరిక.
- జీవితంలో ఎదుటివానికి చేయకూడనివి ...
1. ఆశపెట్టుట .2. అవమాన పరచుట .
- జీవితములో నమ్మకూడనివాడు ...
- అసత్యవాది
- జీవితం లో నమ్మదగినవాడు...
- భగవంతుడు
- జీవితం లో పట్టి పీడించేవి...
1.అనుమానము .2. అపనమ్మకం
- జీవితం లో కష్టాల నుంచి కడతేర్చెవి...
1. విజ్ఞానము 2. వివేకము
- జీవితం లో మరువకుండా చేయవలసినవి ...
1.పరోపకారం 2. దైవ చింతన
- జీవితంలో ఉండవలసినవి...
1. ఆలోచన తక్కువ 2. ఆచరణ ఎక్కువ
- జీవితం లో రాణించలేకపోవడానికి కారణం ...
1.అలసత్వం 2. అలక్ష్యం 3. కాలాతిక్రమణం
- జీవితం లో నేర్చుకోవలసినవి ...
1మంచి విను 2. మంచి చూడు 3. మంచి ఆలోచించు .
- జీవితం లో ఉన్నతుడు కావాలంటే ...
1. వినయవిధేయతలు 2. భద్రత 3. బాధ్యత. 4.పట్టుదల
- నిత్యం భుజించవలసింది ...
1. మితమైన ఆహారము.
- జీవితం లో నేర్చుకున్నది ... ఆవగింజంత
- జీవితం లో నేర్చుకోవలసింది ... ఆకాశమంత
ధర్మము లో 2 రకాలు ఉన్నాయి. 1. సామాన్య ధర్మం2. విశేష ధర్మం అని రెండు రకాలు.
సామాన్య ధర్మాలు
- మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
- మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
- మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
- మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
- తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
- మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’
- ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.
- చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.
- మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
- పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
- అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించట, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించటం, భయపెట్టటం, రాళ్ళతో కర్రతో హింసించతం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించటం మంచిది కాదు.
- కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అడుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.
వీటిని అన్నిటి ని సామాన్య ధర్మంగా గుర్తించారు పెద్దలు
మానవుడికి ఉండవలసిన విశేష
ధర్మాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి ...
- సామాన్య ధర్మాల వస్తే చెప్పవలసిన ధర్మాలు ఎన్నో వున్నాయి. సామాన్య ధర్మాలు అంటే శాస్త్రాలు చెప్పనివి చెప్పనక్కరలేని చెప్పినవి కూడా సామాన్య ధర్మాల క్రిందకే వస్తాయి.
- విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం గురుధర్మం!
- భయభక్తులతో విద్యను నేర్చుకోవటం శిష్యధర్మం!
- న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించటం యజమాని ధర్మం!
- భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్నీ నడపటం ధర్మం!
- సైనికుడుగా వుండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం!
- వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించటం పుత్రధర్మం!
- తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయటం తండ్రి ధర్మం!
- తన ఇంటికీ, తనను కున్నవారికీ పేరు ప్రతిష్ఠలు తేవటం బిడ్డలందరి ధర్మం!
- తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించటం ప్రతివాని ధర్మం!
- తాను సంపాదించినదాన్ని తనవారితో పంచుకొని తినటం సంసార ధర్మం!
- అసహాయులను కాపాడటం మానవతా ధర్మం!
- చెప్పిన మాటను నిలుపుకోవటం సత్య ధర్మం!
- ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా వుండటం వివాహ ధర్మం!
- తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడుకాకున్నా, నమ్మివుండటం భార్య ధర్మం!
- నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండటం మిత్ర ధర్మం!
- సోమరితనం లేకుండటం పురుష ధర్మం!
ధర్మం అంటే ఏమిటి ?
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్.లు. వదలకుండా చూడండి...
ఈ క్రింది వీడియో యూ.ఆర్ .యల్.లు. వదలకుండా చూడండి...
నాకు సహాయం చేసే చీఫ్ ఎలి డోడోరు చేసిన మంచి పని గురించి ఇది నా సాక్ష్యం .... నేను ఉత్తర కరోలినా USA నుండి ఆన్ ఎర్నిస్. ఈ స్పెల్ క్యాస్టర్ సహాయంతో, గత 3 సంవత్సరాలుగా నన్ను విడిచిపెట్టిన నా భర్త తిరిగి వచ్చాడు, చివరికి నేను ఈ వ్యక్తిని ఒక బ్లాగ్ సైట్‌లో కలుసుకున్నాను, ఒకరు సహాయం కోసం క్లయింట్, నేను అతనికి ప్రతిదీ వివరించాను మరియు అతను నాకు ఒక గురించి చెప్పాడు తనకు తెలిసిన స్పెల్ క్యాస్టర్ మరియు నా సమస్యలను అతనికి చెప్పడానికి స్పెల్ క్యాస్టర్‌కు రాయడానికి అతను తన వాట్సాప్ ఇచ్చాడు. కేవలం 2 వారాల్లో, నా భర్త నా దగ్గరకు తిరిగి వచ్చాడు. ఈ నిజాయితీగల మరియు హృదయపూర్వక స్పెల్ క్యాస్టర్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, సార్ మీరు నాకు చెప్పినవన్నీ పాస్ అయ్యాయి మరియు ధన్యవాదాలు సార్. దయచేసి నేను వారి సమస్యకు ఏదైనా పరిష్కారం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ స్పెల్ క్యాస్టర్‌ను దయతో సంప్రదించమని, అతను నిజమైనవాడు, అతను శక్తివంతమైనవాడు మరియు స్పెల్ క్యాస్టర్ ఏది చెప్పినా ఏమి జరుగుతుందో చెప్పండి, ఎందుకంటే స్పెల్ క్యాస్టర్ నాకు చెప్పినదంతా వచ్చింది పాస్ చేయడానికి. మీరు దయచేసి అతనిని సంప్రదించవచ్చు: whatsapp +2349015088017
రిప్లయితొలగించండినాకు సహాయం చేసే చీఫ్ ఎలి డోడోరు చేసిన మంచి పని గురించి ఇది నా సాక్ష్యం .... నేను ఉత్తర కరోలినా USA నుండి ఆన్ ఎర్నిస్. ఈ స్పెల్ క్యాస్టర్ సహాయంతో, గత 3 సంవత్సరాలుగా నన్ను విడిచిపెట్టిన నా భర్త తిరిగి వచ్చాడు, చివరికి నేను ఈ వ్యక్తిని ఒక బ్లాగ్ సైట్‌లో కలుసుకున్నాను, ఒకరు సహాయం కోసం క్లయింట్, నేను అతనికి ప్రతిదీ వివరించాను మరియు అతను నాకు ఒక గురించి చెప్పాడు తనకు తెలిసిన స్పెల్ క్యాస్టర్ మరియు నా సమస్యలను అతనికి చెప్పడానికి స్పెల్ క్యాస్టర్‌కు రాయడానికి అతను తన వాట్సాప్ ఇచ్చాడు. కేవలం 2 వారాల్లో, నా భర్త నా దగ్గరకు తిరిగి వచ్చాడు. ఈ నిజాయితీగల మరియు హృదయపూర్వక స్పెల్ క్యాస్టర్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను, సార్ మీరు నాకు చెప్పినవన్నీ పాస్ అయ్యాయి మరియు ధన్యవాదాలు సార్. దయచేసి నేను వారి సమస్యకు ఏదైనా పరిష్కారం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నాను, ఈ స్పెల్ క్యాస్టర్‌ను దయతో సంప్రదించమని, అతను నిజమైనవాడు, అతను శక్తివంతమైనవాడు మరియు స్పెల్ క్యాస్టర్ ఏది చెప్పినా ఏమి జరుగుతుందో చెప్పండి, ఎందుకంటే స్పెల్ క్యాస్టర్ నాకు చెప్పినదంతా వచ్చింది పాస్ చేయడానికి. మీరు దయచేసి అతనిని సంప్రదించవచ్చు: whatsapp +2349015088017
రిప్లయితొలగించండి