26, జనవరి 2019, శనివారం

Learn what you can do, and not to do in Hindu traditions

wowitstelugu.blogspot.com
Learn what you can do, and not to do in Hindu traditions.

హిందూ సంప్రదాయం ప్రకారం చేయాల్సినవి ఏవిచేయకూడనివి ఏవి?

వేద సంస్కృతిలో అంతర్భాగమైన ఆనాటి సత్సంప్రదాయాలు, సంస్కారాలు మరుగున పడిపోతున్న దుస్ధితి పట్టింది ఈనాడు మనకు. ప్రాశ్చాత్యుల విద్యా ప్రభావము చేత భావదాస్యము కల్గి సనాతన భావములమీద వ్యతిరేకత ఏర్పడిన ప్రస్తుత కాలమిది. మన సంప్రదాయాలు, ఆచారాలు అర్ధంలేనివని త్రోసిపుచ్చే ఆధునికుల సంఖ్య ఎక్కువైనది. మన సంస్కృతిలోని అమూల్యమైన విషయాలను మనం మర్చిపోతుంటే పాశ్చాత్య దేశాలెన్నో మన వేద సంప్రదాయాలను, విశేషాలను గ్రహించి శాస్త్రీయతను గుర్తించి ఆచరిస్తున్నారు. కనుక మన సంస్కృతిలోని సంప్రదాయాలను ఆచరించి తరించడం మన ధర్మం.
  • శుక్రవారం లో ధనాన్ని ఎవరికీ అరువు ఈయరాదు.
  • శుక్రవారం  జుట్టు  కత్తిరించుకోరాదు . 
  • బయటకి వెళ్ళేటప్పుడు శవం, ఇద్దరు బ్రాహ్మలు  ఎదురు వస్తే మంచిది.
  • ఒంటి బ్రాహ్మణుడు, పిల్లి ఎదురు రాకూడదు.
  • దాన, దైవపూజజపహొమ సమయాల్లో అంచులేని వస్త్రాలను ధరించకూడదు.
  • పురుడప్పుడుసంక్రాంతి పర్వదిన్నాల్లో , శ్రాద్దములప్పుడుతమ తమ పుట్టినరోజు నాడు వేడి వేడి నీటిలో స్నానాలు చేయరాదని శాస్రాలు చెపుతున్నాయి.
  • స్రీ వాడిన దుస్తులు పురుషులుపురుషులు వాడిన దుస్తులు భార్యాభర్తలైన వాడరాదు.
  • కంచు పాత్రలో పాలు ,కొబ్బరి వంటి పదార్థాలను తీసుకోకూడదు.
  • ఎప్పుడూ భార్యతో గూడా ఒకే కంచం లో భోజనం చేయగూడదు. భార్య భోజనం చేస్తున్నా, తుమ్ముతున్నా, ఆవులిస్తున్నా, హాయిగా కాళ్ళు చాపుకుని కూర్చొనివున్నా ఆమెను భర్త చూడకూడదు.
  • బ్రాహ్మణుడు తన భార్య కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నా, తలంటు పోసు కుంటున్నా, పైట లేకుండా ఉన్నా, ప్రసవిస్తున్నప్పుడు ఆమెను చూడకూడదు.
  • తానూ నొచ్చుకున్నా యితరులు నొచ్చుకునేట్లు మాట్లాడకూడదు. ఇతరులకు ద్రోహం కలిగించే కార్యాలను మనసులోకి కూడా రానివ్వకూడదు
  • ప్రజలకు భయము, ఆందోళన కలిగించే మాటలు మాట్లాడకూడదు.
  • అవమానాలను ఓర్పుతో సహించాలి. ఇతరులు అవమానిచారని విచారపడకూడదు. అలా అవమానాన్ని దిగమ్రింగుకొని విచారపదనివాడు సుఖంగా నిద్రపోతాడు. సమాజంలో సుఖంగా తిరుగుతాడు. అవమాన పరచినవాడు పాపముతో నశిస్తాడు.
  • స్నానం చేసేటప్పుడు కాలు మీద కాలు పెట్టి రుద్దుకోవటం చేయకూడదు. శరీరాన్ని రుద్దుకున్నట్టే కాళ్ళను చేతులతోనే రుద్దుకోవాలి
  • ఆదివారము ఉసిరి పచ్చడి తినరాదు.
  • భోజనం చేసేటప్పుడు అతిగా మాట్లాడ రాదు.
  • నేతిని పదార్థములపై కాకుండా , విడిగా వేడి చేయరాదు.
  • పూలబారినపుడు తలపై చిన్నగా చరుచుకోవాలి 
  • రసం వంటి వాటి మధ్యలో , పాయసమప్పుడు, మజ్జిగ మరియు పెరుగన్నం తినే సందర్భాలలో నీళ్ళు తాగరాదు.
  • వాకిట్లో ఉదయం, సాయంత్రం చీపురుతో తుడిచి,నీళ్ళు చల్లి ముగ్గులేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
  • ఆవు, గేదె ఈనిన  పదకొండు రోజులలోపు పాలు తీయకూడదు. వాడకూడదు
  • వ్రతాలూ , అభిషేకాలు భార్య భర్తలు ఇరువురు కలిసే చేయాలి.
  •  దీపం, ధూపం, ప్రసాదం లేకుండా పూజలు చేయరాదు.
  • భర్తను వదిలేసి ముక్కోటి దేవతలకు పూజలు ఎన్నడు చేయకూడదు.
  • ఆలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకరాదు.
  • భోజనం తర్వాత చేతిని నాకరాదు.
  • అన్నం ఉడికేటప్పుడు అతిగా మాట్లాడ రాదు మౌనంగా  ఉండాలి
  • స్త్రీలు ఒకే ఒక గాజు అనేది ధరించకూడదు.
  • స్రీకి సహజంగా ఉండాల్సిన ఆభరణాలు అనగా ముక్కుకి , చెవులకి , మేడలో ఏమి లేకుండా భర్తకి, సాటి స్రీలకు ఎత్తి పరిస్థితుల్లోను కనిపించకూడదు.
  • స్నానం  చేయకుండా  దైవ పూజ చేయ రాదు 
  • మంగళవారం, శుక్రవారాలు సముద్ర స్నానం చేయటం మంచిది కాదు
  •  దైవ పూజ చేస్తున్నప్పుడు, అలాగే పూజాది కార్యాలు అయ్యాక మంచి ముహూర్త సమయములలో అన్నమాట అక్షర సత్యమవుతుంది.
  • కామార్తుడైనా బహిష్టు దినాలలో మూడు రోజులు స్త్రీతో కలవకూడదుఒకే ప్రక్కమీద పడుకోగూడదు.
  • తల చిక్కుముడులు ఇంట్లో విడదీయడము పేలు ఏరడం చేయ రాదు. ఆరుబయలు చేసుకోవాలి.
  • ముసలి వారు అయిన  పెద్దలు వారు  వింటుండగా చావు కబురులు చెప్పుకో కూడదు. 
  • ముఖ్యమైన కార్యాలపై బయటి వెళ్ళేటప్పుడు, మగవారి కి  తన భార్య లేదా తన తల్లి గాని ఎదురు వస్తే మంచిది .
  • ఒకే ఇంట్లో అత్తా కోడలు విడి విడి గా  వేరు వేరు పూజలు  చేయరాదు .

  • వివాహం అయినా ప్రతి స్త్రీ బొట్టు, కాటుక పెట్టుకోవాలి, మంగళ సూత్రం ఎప్పుడు ధరించాలి .

  • పురుషుడు ప్రతి రోజు విభూతి , లేదా తిలకం ధరించాలి.
  • కాళ్ళు ఊపుతూ కూర్చో రాదు. 
  • వయసులో పెద్దవారికి తల్లితండ్రులకి,గురువులకు, సందర్భానుసారం నమస్కారం చేస్తుండాలి.
  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి .
  • మధ్యాహ్న వేళల్లో నిద్ర పోరాదు.

నా ఫేస్బుక్ Page లింక్ చూడండి ...

Hindu culture and traditional valueshttps://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

నా ఫేస్బుక్ Group లింక్ చూడండి ..

.Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు@iamgreatindian

https://www.facebook.com/groups/dharmalingam/

Note: మీకు నా ఈ బ్లాగ్ wowitstelugu.blogspot.com నచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి. మరియు బ్లాగ్ wowitswiral.blogspot.com నచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి.
మీకు నా ఈ వెబ్సైటు  www.iamgreatindian.com నచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి.
మీకు నా ఈ బ్లాగ్ teluguteevi.blogspot.com నచ్చినట్లైతే లైక్ ,షేర్, మరియు సబ్స్క్రయిబ్ చేయండి.
comment  చేయడం మర్చిపోకండి ...





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి