29, డిసెంబర్ 2018, శనివారం

What is meant by Danagunamulu, Astavida Puspamulu దైవత్వము సిద్ధించే దానగుణములు,అష్టవిధపుష్పములు అంటే ఏమిటి

What is meant by Danagunamulu, Astavida Puspamulu దైవత్వము సిద్ధించే దానగుణములు,అష్టవిధపుష్పములు అంటే ఏమిటి

దైవత్వము సిద్ధించే దాన గుణములు

 1. రజో గుణము  - వచ్చినవారు చిన్నవారైననూ, పెద్దవారైననూ విసుగుకుంటు, పాత్రమెరుగక, నేను ధనవంతుడను నేను ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తన అంతస్థుకు తక్కువగా ఎడమచేతితో పడవేయిట ఇది రజోగుణదానము. నిరర్ధకము.

2.  తమోగుణదానము - పాత్రమెరుగకుండ, ఎవరు ఎంత దానము చేసినారో చూసి, ఎదో నల్గురు ఇచ్చినారు మనమివ్వకుంటే బాగుండదు అని ఎంతో కొంత ఇచ్చుట, ఇది తమోగుణదానము. నిష్ప్రయోజనము.

3.  సత్వగుణదానము -  వచ్చినవారు చిన్నవారైనపెద్దవారైన సమానంగా చూసి, మాట్లాడి  పాత్రమెరిగి   తన   అంతస్థుకు తగినట్లుగా, దానము చేయుట, ఇది సత్వగుణదానము మానవులకు శ్రేష్టము.

భగవంతుని అనుగ్రహముకై అష్టవిధ పుష్పములు...

  1.  అహింస - (జీవహింస చేయకుండుట) ప్రధమ పుష్పము.
  2. ఇంద్రియ నిగ్రహము   (మాట్లాడకుండ, వినకుండ, కళ్ళతో చూడకుండ ఉండడము) పరమత్మునికి   రెండవ పుష్పము.
  3. సర్వభూతదయ - (పేదవారిని, రోగులను, నిస్సహాయులను ఆదరించుట, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టుట మొదలగునవి) మూడవ పుష్పము.
  4. శాంతము - (అపకారము చేసిన వారికి ఉపకారము చేయడము, జరిగినది మన కర్మానుసారముగా వచ్చినదని భావించడము) నాల్గవ పుష్పము.
  5. క్షమ - (తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరడము, ఇతరులు చేసిన తప్పులను క్షమించడము) ఐదవ పుష్పము.
  6. జ్ఞానము - (తెలియనిది తెలుసుకోవడము) ఆరవ పుష్పము.
  7. తపము - (సదాదేవుని తలంచుటయే తపస్సు అనెడి) ఏడవ పుష్పము.
  8. సత్యము (సత్యమును తెలుసుకొనుట) ఎనిమిదవ పుష్పము.
ఈ క్రింద ఇంకా వివరంగా తెలుసుకోండి...

అరిషడ్వర్గం: (ఆరు అంతర్గత శత్రువులు) భారతీయ శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శతృవులను జయించాలి. కామం (శ్రుంగారపరమైన కోరిక). క్రోధం (కోపం). లోభం (పిసినారితనం లేదా స్వార్ధం).

మరియు యు. ట్యూబ్ వీడియో యూ.ఆర్ యల్. లో తెలుసుకోండి...

అరిషడ్వర్గాలు -డాక్టర్ బ్రహ్మారెడ్డి -తెలుగులో ...
https://www.youtube.com/watch?v=xZ75KMm5n6M

ఇంకా అష్టవిధ పుష్పములు గురించి తెలుసుకోండి ..

ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస

ఇది కూడా చదవండి ....
https://wowitstelugu.blogspot.com/2020/06/blog-post.html

Note:  

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి