గణపతులు ఎంతమందో మీకు తెలుసా?
ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు).
అవాంతర భేద గణపతులు 11 - మొత్తం - 32. నెల్లూరు లోని జ్యోతి వినాయక ఆలయం లో 32 గణపతి విగ్రహాలు కలవు.
1. శ్రీ మహా గణపతి
- ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు.
- ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
- హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టంశిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే అనే మంత్రంతో ప్రార్థించాలి.
2. శ్రీ వర గణపతి -
శ్రీ వర గణపతి
- పాశం ,అంకుశం, తేనెకుండ, రత్నాల కుండా ఉంటుంది. వరాలు తీర్చే గణపతి
3. శ్రీ శక్తి గణపతి -
![]() |
శ్రీ శక్తి గణపతి
|
- నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం, విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
- ఆలింగ్య దేవీం హరితాంగయష్టింపరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానంభయాపహం శక్తి గణేశ మీదేఅనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి.
4. శ్రీ భక్తి గణపతి
![]() |
శ్రీ భక్తి గణపతి |
- ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు.
- ఈయనను... నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్అనే మంత్రంతో స్తుతించాలి...
- ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.
5. శ్రీ బాల గణపతి -
![]() |
శ్రీ బాల గణపతి
|
- ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు.
- బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి. కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్ బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
- అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.
6. శ్రీ తరుణ గణపతి -
![]() |
శ్రీ తరుణ గణపతి
|
- వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు.
- ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.
7. శ్రీ ఉచ్చిష్ట గణపతి -
![]() |
శ్రీ ఉచ్చిష్ట గణపతి |
- నాలుగు చేతులు వీణ, నీలం కలువ, జపమాల కలిగి, వరి మొక్క కలిగి ఉంటాడు, ఈ దేవుని పూజిస్తే భవిషత్తు గురించి తెలుస్తుంది.
- ఈయనను.... నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్ దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః అనే మంత్రంతో ప్రార్థించాలి.
8. శ్రీ ఉన్మత్త గణపతి -
![]() |
శ్రీ ఉన్మత్త గణపతి |
9. శ్రీ విద్యా గణపతి -
![]() |
శ్రీ విద్యా గణపతి |
10. శ్రీ దుర్గా గణపతి -
![]() |
శ్రీ దుర్గా గణపతి |
- పాశం, జపమాల, విరిగిన దంతం, రోజా పుష్పం కలిగి ఉంటారు.
11. శ్రీ విజయ గణపతి -
![]() |
శ్రీ విజయ గణపతి
|
- సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు.ఈ గణపతిని....
- పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనఃవిఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.
12. శ్రీ వృత్త గణపతి -
13. శ్రీ విఘ్న గణపతి-
- గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు.
- ఈయనను...శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశచక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘైపాణిశ్రి అఅఅ పరిసమీహిత భూషణా శ్రీవిఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.
14. శ్రీ లక్ష్మీ గణపతి-
![]() |
శ్రీ లక్ష్మీ గణపతి |
- ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు.
- ఈ వినాయకుడిని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
- బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరఃశ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికేగౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసి ఉంటుంది
15. శ్రీ నృత్య గణపతి -
![]() |
శ్రీ నృత్య గణపతి |
- సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
- పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్ పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.
16. శ్రీ శక్తి గణపతి -
![]() |
శ్రీ శక్తి గణపతి |
17. శ్రీ మహా గణపతి -
![]() |
శ్రీ మహా గణపతి |
- దంతం,దానిమ్మపండు, రత్నాలకుండ, నీలి కలవ కలిగి వుంటారు
19. శ్రీ దుంఢి గణపతి -
- విలువైన రత్నాల మాల, జపమాల.
20. శ్రీ పింగళ గణపతి -
- కోరికలు తీర్చే గణపతి దేవుడు
21. శ్రీ హరిద్రా గణపతి -
![]() |
శ్రీ హరిద్రా గణపతి |
- మోదకం అనే తీపి పదార్థం
22. శ్రీ ప్రసన్న గణపతి -
![]() |
శ్రీ ప్రసన్న గణపతి |
23. శ్రీ వాతాపి గణపతి -
![]() |
శ్రీ వాతాపి గణపతి |
24. శ్రీ హేరంబ గణపతి
![]() |
శ్రీ హేరంబ గణపతి |
- ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు.
అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామా అనే మంత్రంతో స్తుతించవలసి ఉంటుంది.
- ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.
అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామా అనే మంత్రంతో స్తుతించవలసి ఉంటుంది.
25. శ్రీ త్ర్యక్షర గణపతి -
- కల్పవృక్షం కొమ్మ, కలువ, దానిమ్మ పండు కలిగి వుంటారు.
26. శ్రీ త్రిముఖ గణపతి -
![]() |
శ్రీ త్రిముఖ గణపతి |
- తేనెపాత్ర, పాశం, అంకుశం.
27. శ్రీ ఏకాక్షర గణపతి -
![]() |
శ్రీ ఏకాక్షర గణపతి |
28. శ్రీ వక్రతుండ గణపతి -
![]() |
శ్రీ వక్రతుండ గణపతి |
29. శ్రీ వరసిద్ధి గణపతి
![]() |
శ్రీ వరసిద్ధి గణపతి |
శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః
- ఓం సుముఖాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం గజకర్ణకాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం వికటాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గణాధిపాయ నమః
- ఓం ధూమ్రకేతవే నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం ఫాలచంద్రాయ నమః
- ఓం గజాననాయ నమః
- ఓం వక్రతుండాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం స్కందపూర్వజాయ నమః
16 మంది గణపతులను షోడశ గణపతులంటారు. షోడశ గణపతి స్తోత్రం...
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||
Ganapathi Stotram with Lyrics...
వినాయకుడి ఇంకా చాలా తెలుసుకోండి...
నోట్ :
ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com
నచ్చినట్లైతే like,share and subscribe చేయడం మర్చిపోకండి
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com
కూడా like,share and subscribe చేయడం మర్చిపోకండి .
నచ్చినట్లైతే like,share and subscribe చేయడం మర్చిపోకండి
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com
కూడా like,share and subscribe చేయడం మర్చిపోకండి .
wowitsviral.blogspot.com కూడా చూడండి .... థాంక్యూ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి