wowitstelugu.blogspot.com
కొమ్ము శనగలతో మనం పొందే వండర్ హెల్త్ బెన్ఫిట్స్ ఏమిటో తెలుసుకుందాం
కొమ్ముశనగలు మన భారతీయ హిందూ సంప్రదాయానికి, పూజలకు ప్రసాదాలకి పెట్టింది పేరు. శ్రావణ మాసం లో స్త్రీలు ముత్తైదువులకు పూజ అయిన తరువాత వాయనం కింద ఇస్తారు. అలాగే ఏ ఆలయంలోనైనా, ఏ ఇంట్లోనైనా ప్రత్యేక పూజలు చేశారంటే శనగలు ప్రసాదంగా, నైవేద్యంగా సమర్పిస్తారు. ఉడికించి నైవేద్యంగా సమర్పించే ఈ శనగ లంటే ఇష్టపడని వారుండరు. అంతేకాదు సాయంకాలం స్నాక్స్ రూపంలో ఈ కొమ్ము సెనగలు వేగించుకొని పోపు వేసుకొని తింటారు.
- ఉడికించుకుని తీసుకున్నా, పులావ్ లో వేసుకున్నా, ఫ్రై చేసి తీసుకున్నాకూర రూపంలో తిన్నా. కొమ్ము శనగల రుచే వేరు. అంతేకాదు మొలకెత్తిన శనగలతో గారెలు వేసుకున్నా భలే రుచికరంగా ఉంటాయి. ఇవి రుచినే కాదు.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నాయి.
- శనగల్లో మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు పీచు, ఫైథో నూట్రియంట్స్ కలిగి ఉన్నాయి. బెంగాల్ గ్రామ్‌గా పిలవబడే ఈ శనగలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయి.
కొమ్ము సెనగలలో ఉండే పోషక విలువలు
ప్రతి వంద గ్రాముల శనగలలో ...
61.2 శాతం పిండిపదార్ధాలు,
5.3 శాతం కొవ్వు,
17.1 శాతం మాంసకృత్తులు,
190 మిల్లీగ్రాముల కాల్షియం,
168 గ్రాముల మెగ్నీషియం,
9.8 శాతం ఇనుము,
71 మిల్లీగ్రాముల సోడియం,
322 మి.గ్రా.పొటాషియం,
3.9 మి.గ్రా పీచుపదార్ధం,
361 కేలరీలు ఉంటాయి.
- రోగనిరోధక శక్తి శనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి.
- చర్మ సంరక్షణకు శనగలు చర్మ సంరక్షణలో పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఇవి యాక్నే, పింపుల్స్, ఎగ్జిమా, డెమ్మటైటిస్ వంటి రకరకాల సమస్యలను మాయం చేస్తాయి. శనగ పిండికి పాలు కలిపి ముఖానికి అప్లై చేస్తే ఎలాంటి చర్మ సమస్య అయినా దూరమవుతుంది
- మగవారి వీర్యకణాల సంఖ్య మరియు వాటి సజీవత్వం పెరుగుతుంది.
- రుతుక్రమం సమయంలో నొప్పి రుతుక్రమం సమయంలో స్ర్తీలకు వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలకు మంచి పరిష్కారం ఇది. ఈ శనగల కొమ్మను తీసుకుని వేడి నీళ్లలో వేసి స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- బలం, శక్తి మరియు సజీవత్వం కోసం 5 చెంచాల కొమ్ము సెనగలు మరియు ఐదు (5) బాదం గింజలను రాత్రంతా నానబెట్టండి, ప్రొద్దున్నలేవగానే తినండి. కానీ బాగా నమిలి తినాలి అనే సంగతి మర్చిపోకండి. దీని తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని పాలని త్రాగండి. నానబెట్టినసెనగలు ఉదయం పూట ఒక స్పూన్ నిండా తేనె తీసుకొని అందులో కలుపుకొని తినండి.
- మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే రక్తంలో తగినంత గ్లూకోజ్, చక్కర స్థాయిలని అదుపులో ఉంచటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ఉండే పీచు చక్కెరను నియంత్రిస్తుంది.
- కాన్సర్ నివారణకు శనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్, ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.
- రక్తహీనత గల స్త్రీలకు శనగలు చాలా అవసరం. ఇందులో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఇనుము అందుతుంది. దీనివల్ల రక్త హీనతకు దూరంగా ఉండవచ్చు.
- రక్తపోటు తో బాధపడే వాళ్లు రోజు వారి భోజనం లో శనగలు చేర్చుకోవడం మంచిది. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
- జీర్ణవ్యవస్థ పనితీరుకు నానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఏ వయస్సు వారు శనగలు తీసుకున్నా.. త్వరగా అరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
- పోషక విలువలు శనగలను నానబెట్టి ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల మంచి ప్రొటీన్లుగా ఉపయోగపడతాయి
- గుండె ఆరోగ్యానికి సహజ ప్రయోజనాలు పొందాలంటే శనగలు డైట్ లో చేర్చుకోవాలి. శనగల్లో గుండెకు అధిక బలం చేకూర్చే గుణం ఉంది. అంతేకాదు ఇవి గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అవటానికి కూడా తోడ్పడతాయి.
- కొలెస్ర్టాల్ తగ్గించడానికి శనగల్లో చెడు కొవ్వును కరిగించే గుణం కూడా మెండుగా ఉంది. వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ర్టాల్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇంకా వివరం గా ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్. లు చూసి తెలుసుకోండి.
శోథన ఫలితాలు
ఉదయం సెనగలు తింటే మీకు అది ... - YouTube
Health Benefits of Chickpeas (Senagalu) Telugu I ... - YouTube
శనగలు తింటే ఇన్ని లాభాలా ! Amazing Health Benefits ...
Senagalu uses in telugu | Molakalu preparation in ... - YouTube
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి