22, ఫిబ్రవరి 2020, శనివారం

ప్రదోష వేళ శివ పూజా మహిమ శివ ప్రదోష స్తోత్రం శివ అష్టోత్తర శతనామావళి

wowitstelugu.blogspot.com

ప్రదోష వేళ శివ పూజా మహిమ  శివ ప్రదోష స్తోత్రం శివ అష్టోత్తర శతనామావళి 



ప్రదోష కాలం లో చేయు శివ పూజ శివుడికి ఇష్టమైనది ..ఇది త్వరితగతిన శివానుగ్రహము కలిగిస్తుంది. ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారం తో కైలాసం చేరి నన్దికేశ చండికేశ ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు


ప్రదోష కాలం అంటే ఎప్పుడు ?

  • సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.


  • మనము రోజూ ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకుని, మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.


  • ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది.

త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు.


  • ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది.

  • పరమ శివుడు సదా ప్రదోషకాలంలో, హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.

  • త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.

  • ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. 

  • ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది.

  • ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం.

  • శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.


శివ ప్రదోష స్తోత్రము

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం

గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే

నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ

దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః

తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా

విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా

సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య

విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ

యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః

ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

హర హర మహాదేవ శంభో శంకర

శివ అష్టోత్తర శతనామావళి


ఓం శివాయ నమఃఓం మహేశ్వరాయ నమఃఓం శంభవే నమఃఓం పినాకినే నమఃఓం శశిశేఖరాయ నమఃఓం వామదేవాయ నమఃఓం విరూపాక్షాయ నమఃఓం కపర్దినే నమఃఓం నీలలోహితాయ నమఃఓం శంకరాయ నమః (10)ఓం శూలపాణయే నమఃఓం ఖట్వాంగినే నమఃఓం విష్ణువల్లభాయ నమఃఓం శిపివిష్టాయ నమఃఓం అంబికానాథాయ నమఃఓం శ్రీకంఠాయ నమఃఓం భక్తవత్సలాయ నమఃఓం భవాయ నమఃఓం శర్వాయ నమఃఓం త్రిలోకేశాయ నమః (20)ఓం శితికంఠాయ నమఃఓం శివాప్రియాయ నమఃఓం ఉగ్రాయ నమఃఓం కపాలినే నమఃఓం కౌమారయే నమఃఓం అంధకాసుర సూదనాయ నమఃఓం గంగాధరాయ నమఃఓం లలాటాక్షాయ నమఃఓం కాలకాలాయ నమఃఓం కృపానిధయే నమః (30)ఓం భీమాయ నమఃఓం పరశుహస్తాయ నమఃఓం మృగపాణయే నమఃఓం జటాధరాయ నమఃఓం క్తెలాసవాసినే నమఃఓం కవచినే నమఃఓం కఠోరాయ నమఃఓం త్రిపురాంతకాయ నమఃఓం వృషాంకాయ నమఃఓం వృషభారూఢాయ నమః (40)ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమఃఓం సామప్రియాయ నమఃఓం స్వరమయాయ నమఃఓం త్రయీమూర్తయే నమఃఓం అనీశ్వరాయ నమఃఓం సర్వజ్ఞాయ నమఃఓం పరమాత్మనే నమఃఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమఃఓం హవిషే నమఃఓం యజ్ఞమయాయ నమః (50)ఓం సోమాయ నమఃఓం పంచవక్త్రాయ నమఃఓం సదాశివాయ నమఃఓం విశ్వేశ్వరాయ నమఃఓం వీరభద్రాయ నమఃఓం గణనాథాయ నమఃఓం ప్రజాపతయే నమఃఓం హిరణ్యరేతసే నమఃఓం దుర్ధర్షాయ నమఃఓం గిరీశాయ నమః (60)ఓం గిరిశాయ నమఃఓం అనఘాయ నమఃఓం భుజంగ భూషణాయ నమఃఓం భర్గాయ నమఃఓం గిరిధన్వనే నమఃఓం గిరిప్రియాయ నమఃఓం కృత్తివాససే నమఃఓం పురారాతయే నమఃఓం భగవతే నమఃఓం ప్రమధాధిపాయ నమః (70)ఓం మృత్యుంజయాయ నమఃఓం సూక్ష్మతనవే నమఃఓం జగద్వ్యాపినే నమఃఓం జగద్గురవే నమఃఓం వ్యోమకేశాయ నమఃఓం మహాసేన జనకాయ నమఃఓం చారువిక్రమాయ నమఃఓం రుద్రాయ నమఃఓం భూతపతయే నమఃఓం స్థాణవే నమః (80)ఓం అహిర్భుథ్న్యాయ నమఃఓం దిగంబరాయ నమఃఓం అష్టమూర్తయే నమఃఓం అనేకాత్మనే నమఃఓం స్వాత్త్వికాయ నమఃఓం శుద్ధవిగ్రహాయ నమఃఓం శాశ్వతాయ నమఃఓం ఖండపరశవే నమఃఓం అజాయ నమఃఓం పాశవిమోచకాయ నమః (90)ఓం మృడాయ నమఃఓం పశుపతయే నమఃఓం దేవాయ నమఃఓం మహాదేవాయ నమఃఓం అవ్యయాయ నమఃఓం హరయే నమఃఓం పూషదంతభిదే నమఃఓం అవ్యగ్రాయ నమఃఓం దక్షాధ్వరహరాయ నమఃఓం హరాయ నమః (100)ఓం భగనేత్రభిదే నమఃఓం అవ్యక్తాయ నమఃఓం సహస్రాక్షాయ నమఃఓం సహస్రపాదే నమఃఓం అపపర్గప్రదాయ నమఃఓం అనంతాయ నమఃఓం తారకాయ నమఃఓం పరమేశ్వరాయ నమః (108)


ఈ శివరాత్రి పర్వదినం నాడు చదివి ఆ శివయ్య కరుణాకటాక్షాలు పొందండి.

ఈ క్రింది లింక్ ల లో  యు ట్యూబ్  వీడియోలు చూడండి 


https://www.youtube.com › watch










Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి