9, నవంబర్ 2021, మంగళవారం

విష్ణువు రచించి చెప్పిన శివపూజావిధానం గురించి బ్రహ్మ, నారదుడుకి చెప్పిన విషయాలు తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

విష్ణువు రచించి  చెప్పిన శివపూజావిధానం గురించి  బ్రహ్మ, నారదుడుకి చెప్పిన విషయాలు తెలుసుకోండి

శివాభిషేకం 








మానవజీవితంలో ఉండే సమస్యల నుండి బయటపడటానికి స్వయంగా, శ్రీమహావిష్ణువు రచించి లోకానికి ఇచ్చి, విష్ణువు చెప్పిన శివపూజావిధానం ఏమిటనేది బ్రహ్మ, నారదుడుకి చెప్పాడు.

1) ఐశ్వర్య వృద్ధికి :-

తామర పూలు, బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో శివుడ్ని శ్రద్ధతో అర్చిస్తే సంపదలు లభిస్తాయి. శతరేకులున్న తామరపువ్వులతో (హిమాలయాల్లో ఉంటాయి) శివుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే 1 సం || లో మహదైశ్వర్య సంపన్నుడవుతాడు.

2) మహాపాపాలు తొలగడానికి:

తామరపూల రేకులని విడదీసి, శివ శత అష్టోత్తరం 108 నామాలతో శ్రద్ధగా "నమః" పలుకుతూ ఒక్కోనామానికి ఒక తామరరేకు, వేస్తూ పూజించాలి, మహాపాపాలు తొలగి, సంపదలు వస్తాయి.

3) అన్ని కోరికలు తీరడానికి:

11 రోజులు‌ విడిచిపెట్టకుండా, శివుడ్ని ఏరోజుకారోజు 20 తామరపువ్వులు, వెయ్యి మారేడుదళాలతో అర్చిస్తే ఈశ్వరుడు సంపూర్ణ ప్రీతిచెంది, ఎప్పుడు ఏది కావాలో క్రమంగా తీరుస్తాడు.

4) మంచి పదవి పొందడానికి:

మంచి పదవి కావాలంటే, 10 కోట్ల పుష్పాలతో పార్థివలింగార్చన చేస్తే అద్భుతమైన పదవి లభిస్తుంది, పార్థివలింగానికి చందనం పూసి అభిషేకించి జలంతో కూడా అభిషేకం చేస్తే, అనుకున్నపని తొందరగా ఫలిస్తుంది. కోరికలు ఉన్నంతవరకు భౌతికపూజ తప్పనిసరిగా చేయాలి.

5) శారీరక ఆరోగ్యం, మనఃశాంతిని పొందడానికి:

మారేడాకులను నీటిలో కడిగి 15 రోజులు శివ పూజకి వాడవచ్చు (దొరకనప్పుడు మాత్రమే), శివుడ్ని మంత్రసహితంగా, మారేడు దళాలతో, ఒక్కో దళంతో పరమశివుని పూజిస్తే, శారీరిక ఆరోగ్యం, మనఃశాంతి, కైవల్యం ప్రసాదిస్తాడు. గురోపదేశ మంత్రంతో చేయవచ్చు, ఒక్కోనామానికి ఒక దళం వేస్తూ పూజించాలి.

6) జ్ఞానవృద్ధి పొందడానికి :

ధూపం వల్ల భౌతికసంపదలు పెరుగుతాయి. దీపం వల్ల జ్ఞానవృద్ధి, అర్ఘ్యం, పాద్యం, హారతి, ప్రదక్షిణ, నమస్కారం, ఈ ఐదింటినీ ఈశ్వరుడికి సమర్పిస్తే, ఆ క్షణమే మహాపాపాలు తొలగిపోతాయి. అర్చనానంతరం మృష్టాన్నభోజనం ఎవరికైనా పెడితే కైలాసాన్ని ప్రసాదిస్తాడు.

7) కారాగార విముక్తి సాధించడానికి :

కారాగార విముక్తికై, శివ లింగానికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి, శంఖు పూలు, బిల్వ పత్రాలు లక్ష పత్రాలకు తక్కువ కాకుండా శివుడ్ని భక్తితో అర్చిస్తే, జైలు నుంచి విముక్తి పొందుతారు.


8) విద్యఅభివృద్ధికి :

తాజా పూలతో శివుడ్ని పూజిస్తే విద్య పొందుతారు.

9) శత్రుపీడతొలగిపోవడానికి

శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే, అష్టమి, చతుర్దశి తిథులల్లో ఒక్క లక్ష బిల్వపత్రాలతో, శంఖ పుష్పాలతో భక్తితో శివుడ్ని అర్చిస్తే శత్రుపీడ పొతుంది. కీర్తి కావాలంటే, సహస్ర తులసీ దళాలు పరమశివునికి సమర్పించాలి.

10) జ్ఞానసముపార్జనకు

జ్ఞానం కావాలంటే సదా శివనామం అనంతంగా మానసికంగా జపించాలి, పరమేశ్వరుడి ముందు కదలకుండా 24 నిమిషాలు (ఎవ్వరితో మాట్లాడకుండా) శివుడిపై మనస్సుని నిలిపి ధ్యానిస్తే, ఈ జన్మలో మోక్షం కలుగుతుంది.

11) శివ దర్శనం లభ్యమవ్వాలంటే:

5 లక్షల పర్యాయాలు ఒక మనిషి జీవితపర్యంతంలో మహామృత్యుంజయ మంత్రం జపిస్తే శివుడిలో ఐక్యమవుతాడు, 11 రోజులు, 1 సారి బిల్వం, 1 సారి తులసీ దళాలను వేస్తూ, శివ సహస్రనామాలు చదువుతూ ఈశ్వరుడికి సమర్పిస్తే శివ దర్శనం తప్పక లభ్యం అవుతుంది.

12) మంచి సంతానం పొందడానికి:

స్త్రీ రజస్వలయిన 5వ రోజు స్నానానంతరం శ్రీ రామాయణం, లలితా సహస్రనామములను పఠిస్తే సత్సంతానం కలుగుతుంది.

13) ఆయుర్దాయం పెరగడానికి :

దర్భలతో ఈశ్వరుడ్ని శివనామాలతో అర్చిస్తే ముక్తి, ఆయుర్దాయం కోసం 2 గరికలు కలిపి శివునిపై వేస్తూ పూజించాలి. యథాశక్తి దానం అర్చనానంతరం చేస్తే ఆ పూజాఫలం అధికం.

14) యోగ్యుడైన పుత్ర సంతానం కొరకు:

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, భర్త ఉమ్మెత్తపువ్వులతో 15 రోజులు ఈశ్వరుడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తే చురుకైన సంతానం కల్గుతుంది. ఎర్ర కాండ ఉన్న ఉమ్మెత పువ్వులతో శివుడ్ని అర్చిస్తే, జ్ఞానబుద్ధివంతుడు యోగ్యుడైనవాడు, మాతృపితృ భక్తి కల్గిన పుత్ర సంతానం కలుగుతుంది.

15) మహాకీర్తి పొందడానికి:

అవిసె (అగస్త్య) పూలతో పూజిస్తే మహాకీర్తి వస్తుంది, ఒక్క నెలరోజుల తులసీ దళాలతో ఈశ్వరుడిని అర్చిస్తే భుక్తి, ముక్తి లభిస్తుంది.

16) ఆయాస,ఉబ్బస రోగాల నుండి తక్షణ ఉపశమనానికి:

ఆయాస,ఉబ్బస రోగాల తక్షణ ఉపశమనానికి ఎర్ర గన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి.

17) పురుషుడు మంచి భార్య పొందడానికి:

పురుషుడికి మంచి భార్య కావాలంటే, వికసించిన నవమల్లెలను శివుడికి సమర్పించాలి.

18) స్వగృహప్రాప్తి కొరకు :

జీవితాంతం స్వగృహప్రాప్తి భాగ్యం నిలవాలంటే, ముడి, వరి, వడ్ల ధాన్యాన్ని రెండు చేతుల గుప్పెళ్ల తో వేస్తూ ఈశ్వరుడ్ని మంత్రంతో అభిషేకించాలి.

19) మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలంటే:

కార్తిక మాసంలో ఈశ్వరుడికి లక్షబిల్వార్చన, అనుకున్న కోరికలను సక్రమంగా మార్చి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నల్ల ఆవాల (రాజిక) పువ్వులతో అర్చిస్తే తక్షణం శత్రుపీడ తొలగుతుంది.

21) జ్వరబాధనుండి విముక్తి పొందడానికి :

జ్వరబాధ నివారణకు, ప్రాణాపాయస్థితిలో ఉన్నప్పుడు, ఆవుపాలలో పంచదార కలిపి శివుడ్ని పార్థివలింగానికి అభిషేకించి, ఆ తీర్థం పుచ్చుకున్న, ఆ స్థితి నుంచి బయటపడతారు, వృద్ధులైతే ఉత్తమలోకాలు పొందుతారు.

22) పోయిన జ్ఞాపకశక్తి తిరిగి పెరగాలంటే:

వృద్ధాప్యంలో పోయిన జ్ఞాపకశక్తి పెరగాలంటే శివలింగాన్ని పంచదార కలిపిన పాలని సన్నని ధారగా పోస్తూ అభిషేకించి,ఆ తీర్థాన్ని ప్రసాదం గా స్వీకరిస్తే తిరిగి జ్ఞాపకశక్తితో బుద్ధి చురుకుగా ఉంటుంది.

23) శత్రుపీడ నాశనమునకు:

శివలింగంపై తెల్లని వస్త్రం పరిచి నల్ల ఆవాలు 8 కిలోలు శివాభిషేకం చేస్తే ఎంతటి భయంకర శత్రుపీడైనా నశిస్తుంది. తెల్ల ఆవాలతో శివుడ్ని అర్చిస్తే శత్రువు కూడా మిత్రుడవుతాడు.

24) ఇంట్లో ప్రశాంతత ఒనగూరడానికి:

కంది పువ్వులరేకులతో శివుడిని పూజిస్తే, భార్యాభర్తల మధ్య, బంధువులమధ్య, దాయాదుల మధ్య ఆత్మీయ ఐకమత్యం బలపడుతుంది. ఇంట్లో గోడవలు పోయి ప్రశాంతతకోసం శివుడిపై గోముఖ పాత్రలో, నల్లనువ్వులనూనెని ధారాపాత్రలో వేసి, కలిసి ఉండాలనే భక్తి తో అభిషేకించిన ఇంట్లో ప్రశాంతత ఉంటుంది.

25) వాహన, భోజన, వస్త్ర భోగాల ప్రాప్తికి :

సంపెంగ నూనె (సువాసన) తో అభిషేకిస్తే వాహన, భోజన, వస్త్ర భోగాలు లభిస్తాయి,


26) అమితమైన ఆనందాన్నిపొందడానికి:

చెఱకు రసాభిషేకంతో ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడు.

27) వాక్ శుద్ధి మధురకంఠం రావడానికి:

ఆవునేతితో అభిషేకిస్తే వాక్కు శుద్ధి, తేనె తో అభిషేకిస్తే, మధుర కంఠంతో బాటు సంగీతం వస్తుంది.

28) ఏ జన్మలోను వైధవ్యం పొందకుండా ఉండడానికి:

భర్త పోయిన స్త్రీ, భక్తితో లలితా సహస్రనామం పఠిస్తే, ఏ జన్మలోను వైధవ్యం పొందదు.

29) భార్యకు భర్త వశం అవడానికి:

స్త్రీ రాత్రి పూట సహస్రనామములను పఠిస్తే భర్త వశం అవుతాడు. 15 రోజులు మారేడు దళాలను, నీటితో కడిగి, తుడిచి శివుడి పూజలో వాడవచ్చు. (దళాలు దొరకనప్పుడు మాత్రమే).

30) బల పరాక్రమాలు వృద్ధి కి :

జిల్లేడు,ఎర్ర కలువ పూలతో, ఉత్తరేణి ఈ మూడింటితో శివుడ్ని అర్చిస్తే బల పరాక్రమాలు లభిస్తాయి.

31) శత్రునాశనానికి:

ఎర్ర గులాబీలతో పూజిస్తే శత్రువు తనంతతానే నశిస్తాడు.

32) భుక్తి, ముక్తినీ పొందడానికి:

గంగాభిషేకంతో భుక్తి, ముక్తినీ పొందుతాము. మనస్సుతో చేసే ప్రతి కైంకర్యంతో ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు.

33) మోకాళ్ళ నొప్పులుతగ్గడానికి:

ఆవాల నూనెతో శివుడ్ని అభిషేకిస్తే మోకాళ్ళ నొప్పులు తొలగుతాయి.

34) క్షయ లాంటి దీర్ఘ వ్యాధులు పోవాలంటే

క్షయ,దీర్ఘ వ్యాధులు పోవాలంటే 11 సోమవారాల్లో శివుడ్ని తేనె తో అభిషేకించాలి.

35) వాహనసౌకర్యం పొందడానికి:

జాజి పూలతో ఈశ్వరుడ్ని పూజిస్తే వాహనసౌకర్యం,

36) ముక్తి లభించడానికి:

జమ్మి పత్రితో శివుడ్ని అర్చిస్తే ముక్తి లభిస్తుంది.

37) మంచి వస్త్రాల ప్రాప్తి కి

కొండగోగు పూలతో పూజ వలన మంచి వస్త్రాల ప్రాప్తి.

38) స్త్రీ కి మంచి భర్త కావాలంటే:

స్త్రీ కి మంచి భర్త కావాలంటే, మల్లె మొగ్గలతో పూజించాలి. జీవితభాగస్వామి అనుకులమైనవారు లభిస్తారు.

39) నిర్మలమైన మనస్సు లభించడానికి:

వావిలి పూలతో పూజ వలన నిర్మలమైన మనస్సు (అశాంతి లేని) లభిస్తుంది.

40) పాండిత్యం లభించడానికి:

సింధూరపూలతో పూజిస్తే పాండిత్యం లభిస్తుంది.


చంపకం (సంపంగి), కేతకం (మొగలి) పువ్వులు విడిచి, మిగతా పుష్పాలను ఈశ్వరుడికి సమర్పించవచ్చు‌. శివపురాణం ప్రామాణికంగా, రుద్రాధ్యాయంతో తరచు శివుడ్ని అభిషేకిస్తూ, ధాన్య పుష్పాలతో చేసిన అర్చనకి ఈశ్వరుడు ఎక్కువ సంతోషిస్తాడు. భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడు ఉన్నాడని సంపూర్ణ విశ్వాసంతో అర్చన చేస్తే అన్ని శుభాలు ప్రాప్తిస్తాయి.

ఓం నమో నమ శివాయ నమః

శివ పూజావిధానం వీడియో యు. ఆర్. యల్. లు చూడండి:


Todays Quote:

"The greatest danger for most of us is not that our aim is too high and we miss it, 
but that it is too low and we reach it."
-Michaelangelo

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి