wowitstelugu.blogspot.com
శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం లోని కొన్ని పద్యాలు
Note:
శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం లోని కొన్ని పద్యాలు
వేదవాక్యాలు
శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాల జ్ఞానం, ఆత్మజ్ఞానం (భక్తి మార్గం ,ముక్తి మార్గం) లోని మచ్చుకు కొన్ని పద్యాలు ...
కాల జ్ఞానం పద్యాలు
(కాలాన్ని అర్ధం చేసుకోవడం)
వీరబ్రహ్మము యెక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!
(వీర బ్రహ్మం గారు చెప్పేవి వేదం వాక్యాలు ఈ భూమిలో తప్పక జరుగుతాయి. కలి మాయలో పడకుండా నన్ను నమ్మి మీరు తప్పించుకొనే మార్గం వెతకండి)
స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!
(స్వయంగ తనంత తాను ఎవరు వెలగరు అంటే పెద్దవారు కారు సూర్య చంద్రులు, గ్రహములు అన్ని ఆ పరమేశ్వరుని వల్లే వెలుగును )
అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!
(ఈ అనంత మైన విశ్వములో మన భూగోళ మెంత ఉన్నది . అందులో ఉన్న మన శక్తి ఎంత , సర్వమును కాపాడు శక్తి వంతుడవు నీవు, శరణు పొందుట నీ ధర్మము )
వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆధి పురుషుని నమ్ము!
ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు. మన బ్రతుకుతున్నపుడు ఏమవుతామో తెలియదు. ఇలాంటి జన్మ గురించి గర్వపడటం ఎందుకు అందరిని కాపాడు ఆదిపురుషుని నమ్ము ((పరమేశ్వరుడిని).
నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
(ప్రతి వ్యక్తి ఇది నాది అది నాది అని గర్వం గా చెబుతుంటారు. కానీ మీరు తల్లి నుండి పుడుతూనే ఏమి తేలేదు కదా . సమాధి చేయడానికి మాత్రం ఆరడుగుల నేల కావాలి అది కూడా మీది కాదు)
సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలోను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
( సముద్రాలను పొంగేలా, గాలి కదిలా చేసే శక్తి ప్రతి మనిషిలో ఉంది, నీలో శక్తిని భక్తి తో ధ్యానిస్తే దేవుడి దర్శనం కలుగుతుంది)
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!
(మనుషులు దానం చేయడం పోవడం వల్లే తాము దరిద్రులు అవుతారు దానికి దేవుడిని నిందించి ఫలితమేముంది పదిమంది కి చేసే పుణ్యఫలం మాత్రమే మనకి అన్ని జన్మల లో మనతో వస్తుంది)
బాహ్యా విషయములకై పరుగెత్తినావంటే
యేడ్పించి నీపై స్వారి జేసేను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటే
ప్రకృతే నీపాద సేవ జేసేను!
(తాత్కాలిక విషయాలపైనా మనసు లగ్నం చేస్తే అవి మనని ఏడ్పించి మనపైన సవారీ చేస్తాయి. దేవుడి పైన మనసు లగ్నం చేస్తే ప్రకృతి అంతా మన వశమవుతాది)
దైవ ధ్యానము కన్న మించినది లేదయ
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు, కఠిన రోగంబులకు
దివ్యౌషధంబని నమ్మండయ!
(దేవుడిని ధ్యానించడం కంటే మించిన మంచి మార్గము ఇంక ఏది ఉండదు. అన్ని శక్తులు అందులోనే ఉంటాయి. అన్ని కష్టాలకు , రోగాలకు అదే గొప్ప మందు అని నమ్మండి )
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!
(దేవుడనే వాడవు నీవే అనవసమైన కోర్కెలతో మనిషిగా మారిపోయావు. పనికి రాని కోర్కెలను మానివేస్తే నీవు కోదండ రాముడుగా ఉంటావు )
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగ కాపాడుకొనియేరయ!
తమవెంట వచ్చేది మనస్సు బుద్దనుమాట
యోచింపకుండనే బ్రతికేరయ!
(చనిపోయేటప్పుడు మన శరీరము బట్టలు స్మశానని కి వెళ్లి పోయేవే వాటిని చాల శుచిగా శుభ్రం గా ఉంచుకొంటే చాలదు చివరవరకు ఉండేది మంచి మనస్సు అది మన వెంటే వస్తాదనే విషయాన్ని ఎందుకు ఆలోచించకుండా బ్రతుకుతారు)
ఆత్మ జ్ఞానం
(మనలో ఉన్న శక్తిని వెతకడం)
సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాసరూపములో హంసగా సంచరిస్తున్న ఓ కాళీ మాతా!
కాలికాంబా యనుట లీలా వినోదంబు
కాదు కాదు! హంస! కాళికాంబే
హంస కాళికాంబె! ఆత్మ కాళిక సుమా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| కాళికాంబ అనుట వల్ల ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది సకల జీవులందు శ్వాస రూపములో సంచరిస్తున్న ।హంస। గూడ ఒక ఆనందమైన అనుభూతిని
ఇచ్చేదే. ఆత్మశక్తి హంసరూపములో సంచరిస్తు ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆనందమైన అనుభూతియే ఆత్మ. ఆత్మశక్తియే కాళీమాతా.
గాలిరీతి విశ్వ గోళాలలో నుందు
దివుల భువుల మధ్య తిరుగగలవు
నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళి మాతా! గాలి రూపములో, విశ్వగోళాలలో ఉంటావు. భూమి ఆకాశముల మధ్య తిరుగుతుంటావు... నీవులేని చోటు అంటు కచ్చితముగా ఎక్కడలేదు.
తల్లిదండ్రీ గురువు దైవమ్ములందున
తల్లి పూజ్యముఖ్య మెల్లరకును
సృష్టి కంతటికిని స్త్రీ ప్రధానముగదా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళీ మాతా! తల్లి తండ్రి, గురువు, దైవము, ఈ నాల్గింటియందు, సమస్త ప్రజలకు మొదటగా పూజింప దగినది తల్లి మాత్రమే. స్త్రీ ముఖ్యముగా సృష్టి అంతటికీ ప్రధానమై యున్నది.
కాలజ్ఞానం లో ఇప్పడి వరకు జరిగినవి మచ్చుకు కొన్ని :
- నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
- ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
- కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
- ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
- తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
- రాచరికాలు, రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు( ఇందిరాగాంధీ రాజభరణాల రద్దు)
- ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
- జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.( ఉదాహరణ : చైనా, మరియు ఇండియా )
- బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.(వంశపారపర్య పౌరోహిత్యాలు రద్దు)
- హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
- దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దేవస్థానాలలో దొంగతనాలు
- చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
- రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. (శ్రీలంకలోని తీవ్రవాద నేపథ్యం లో జరిగిన పరిణామాలు)
- గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. (లాల్ బహుద్దూర్ శాస్త్రి)
- కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
- అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి
- నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి (నేపాల్ భూకంపము)
- కోరంకియ అను (కరోనా) జబ్బుతో కోట్లాది మంది కోడిలాగా తూగి చస్తారు ( ఇప్పుడు జరుగుతున్నది అదే )
ఈ క్రింది వీడియో లింకులు చూడండి ...
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share
and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి