wowitstelugu.blogspot.com
గత నెల రోజులుగా ఒక పదం ప్రజల లో విస్తృతం గా ప్రచారం అవుతుంది అదే కరోనా వైరస్ కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.కరోనా ఎక్కువుగా జంతువుల నుండి జంతువులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. లండన్ పరిశోధనల్లో దీనిని "కరోనావైరస్" గా గుర్తించారు. ఇది మనుషుల నుండి వేరొకరికి వ్యాపిస్తాడని గుర్తించారు . దీనిని కోవిడ్ -19 గా పిలుస్తున్నారు.
కోవిడ్-19( Covid 19). దీనిని ఒక జబ్బుగా గుర్తించారు .చైనా తీవ్రం దీని ప్రభావము గురి అయి దాదాపు 3000 మంది వరకు చని పోయారు .ఇటలీ ఇపుడు దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాడు. ఇంతకు ముందు ఇలాటి వైరస్ లు చాల వచ్చి నప్పటి కి ఇంత విస్తృత ప్రచారం జరగలేదు.
మన దేశం లో ప్రధాన మంత్రి పిలుపు మేరకు 22-3-2020 పూర్తి జనతా కర్ఫ్యూ ఆచరించాలని పిలుపు ఇచ్చారు . ఈ పిలుపు మేర పూర్తిగా కర్ఫ్యూ సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కర్ఫ్యూ ని ఇంకా పొడిగిస్తున్నాయి.
జనతా కర్ఫ్యూ లు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ?
- ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది . చేతులు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కోవడమనేది మన సంస్కృతి లో ఒక భాగం గా ఉన్నప్పటికీ చాలామంది కి వైరస్ పై ఇప్పుడు అవగాహనా ఇప్పుడే కలుగుతున్నది.
- జనసందోహం లో తిరగకూడదనేది మంచి అవగాహన ఏ వైరస్ కూడా దీని వల్ల వ్యాప్తి చెందదు.
- మనిషి కి మనిషి కి మధ్య కనీసం ఒక (1) మీటర్ (3 అడుగులు ) దూరాన్ని ఉంచడం ఎప్పటికైనా మంచిదే ఈ జనతా కర్ఫ్యూ వల్ల కొంత వరకు ప్రజలకు ఇది అలవాటు గా మారింది.
- షేక్ హ్యాండ్లూ కౌగలించు కోవడం ఈ మధ్య ఫాషన్ గా మారింది ఇలాంటి కర్ఫ్యూ ల వల్ల సాంఘిక అవగాహనా కలుగుతుంది.
- మాంసాహారం తినడం తగ్గిస్తే మంచిదే. ఏది తిన్నా తినే ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి అనే అవగాహన వస్తుంది.
- మాస్కులు ధరించి తిరగడం వల్ల మననించి వచ్చే తుంపర్లు ఇంకొకరికి సోకకుండా ఉంటాయి. ఇంకొకరినించి వచ్చే తుంపర్లు మనకి సోకవు .
- ప్రజలు మసలే చోట కెమికల్ స్ప్రే , బ్లీచింగ్ పవుడర్ జల్లడం విరివిగా తరచూ చేస్తుంటే మంచిదే. ముఖ్యం గా ఇలాంటి సందర్భాలలో తప్పని సరిగా కెమికల్ స్ప్రే చేస్తున్నారు .
- వైరస్ సద్దు మణిగే వరకు వర్క్ టు హోమ్ మంచిదే .
- రోజువారీ పనులు చేసుకొనేవారు. కొన్ని రోజులు విశ్రాంతి దొరుకుతుంది.
- నిరంతరం పనిచేసే హోటళ్లు , షాపులకు కొంత విశ్రాంతి దొరుకుతుంది .వైరస్ వ్యాప్తి కొంత అరికట్ట బడుతుంది .
- ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు.
జనతా కర్ఫ్యూ లు వల్ల వచ్చే అనర్ధాలు ఏమిటి ?
- ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది . చేతులు కడుక్కోవడం. కాళ్ళు కడుక్కోవడమనేది మన సంస్కృతి లో ఒక భాగం గా ఉన్నప్పటికీ నోటికి ముక్కుకి చేతులు తగల కుండా ఉండాలంటే అది ఇంచు మించు అసాధ్యం.
- ముఖ్యం గా ఈ రోజులో ప్రతి ఒక్కరు స్నో లు పౌడర్ మోకానికి రాసుకుంటున్నారు.
- జనసందోహం లో తిరగకూడదనేది మంచి అవగాహన అయినప్పటికీ మనం సాంఘిక జీవులం జనసందోహం లో తిరగకుండా ఉండడమనేది దాదాపు అసాధ్యం. తాత్కాలికం గా పరవాలేదు గాని దీర్ఘ కాలం లో సమస్యలు వస్తాయి.
- మనిషి సాంఘిక జీవి మనిషికి మనిషికి మధ్య దూరం (తాత్కాలికం గా పర్వాలేదు) ఉండాలనటం వాళ్ళ విద్వేషాలు వైషమ్యాలు పెరిగే అవకాశం ఎక్కువ.
- మాంసాహారం తినడం తగ్గిస్తే మంచిదే. అలవాటు ఉన్నవారు తట్టుకోవడం కష్టం.
- కొన్ని రకాలైన మాంసాలు తినడం తగ్గిస్తే క్రమం గా ఆహార కొరత వచ్చే ప్రమాదం ఉంది.
- మాస్కులు ధరించి తిరగడం మంచిదే అయినప్పటికీ అవి శానిటైజ్ చేసి ఉండి ప్రతి రోజు మారుస్తుండాలి .
- మురికి పట్టిన మాస్కులు ప్రతి రోజు ధరించడం ఇంకా ప్రమాదం.
- కెమికల్ స్ప్రేలు ,బ్లీచింగ్ పవడర్లు, ప్రజలకి చెప్పినట్లుగా ప్రభుత్వాలు అంతగా స్ప్రే చెయ్యట్లేదు .
- వైరస్ ఎలా వస్తుంది. ఎలా సోకుతుంది అనేది ఇప్పటికీ సరిఅయిన అవగాహన లేదు. దీని వల్ల అనవసమైన భయాలు ప్రజల్లో పెరిగి పోతున్నాయి.
- వైరస్ నిర్ధారణ కాకుండా కోరంటైన్ 14 రోజులు చేయడం ప్రజాస్వామ్య దేశాలలో సాధ్యం కాదు .
- వైరస్ సద్దు మనిగె వరకు వర్క్ టు హోమ్ మంచిదే. కానీ అని రకాలైన పనులు వర్క్ తో హోమ్ సాధ్యం కాదు. క్రమేణా ఉద్యోగులు సోమరులు అయ్యే అవకాశం ఉంది.
- ఈ కర్ఫ్యూ లు ఇలాగె కోన సాగితే రోజు వారి పనులు చేసు కొనేవారు చాల నష్ట పోతారు. ఒక వేళ ప్రభుత్వాలు నష్ట పరిహారం ఇవ్వాలను కున్న ఎంత ఇవ్వాలి ఎవరికీ ఇవ్వాలనేది లెక్కించడం కష్టమే .
- హోటలు స్కూల్, వ్యాపారసంస్థలు తరచూ మూసివేయడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి .దీర్ఘకాలం కోన సాగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది.
- ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు అని అంటున్నారు కానీ ఇంటి లోని ఇంటి ఆవరణలోని గోడల వద్ద ఈ వైరస్ ఉండదని చెప్పలేము.
- పైగా ఇంటిలోనే ఉంటె సూర్యరశ్మి కొంతకాలం దూరం గా మనిషి ఉండవలసి ఉంటుంది
- ఏది ఏమైనప్పటికి ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతగా ప్రతిస్పందించడం మంచి పరిమాణమే.
- మన దేశము లో ఈ వైరస్కు అంతగా ఎవరు గురికాలేదు.
- గురికాకూడదనే ఆశిద్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ గైడ్ లైన్ పాటించడం మంచిదే అని అన్ని దేశాలు నమ్ముతున్నాయి.
- ఈ కర్ఫ్యూల వల్ల మనకు ఒన గూరేదెంత అని ప్రభుత్వాలు ప్రజలు ఎవరికీ వారు తర్కించు కోవాలి తప్ప మనం (సామాన్య ప్రజలు ) చేయగలిగేది ఏమి లేదు.
- త్వరలోనే ఈ వైరస్ కు మందు దొరికి ఈ వివాదాలకు తెర పడుతుందని ఆశిద్దాం
ఈ క్రింది యూట్యూబ్ వీడియో యు.ఆర్.యల్.లుచూడండి
కరోనా వైరస్ పై స్పెషల్ రిపోర్ట్ | Coronavirus in India
కరోనా వైరస్ నుంచి భారత్ తప్పించుకుందా? - 10tv
Advantages and Disadvantages of Going Public Using an IPO ...
The Coronavirus Outbreak Is Now A Crisis, How Might That ...
Can China's Economy Withstand the Coronavirus? by Michael ...
SARS wiped $40 billion off-world markets; what will ...
Corona virus precautions కరోనా వైరస్ అంటే ఏమిటి దీని నుండి ఎలా మనం తప్పించు కోవాలి
COVID-19 CHECK LIST కోవిడ్ -19 చెక్ లిస్ట్ చూడండి
Adapted from DOH Guidelines www.doh.gov.ph
Note :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి