19, మార్చి 2020, గురువారం

కరోనావైరస్‌ అంటే ఏమిటి దాని లక్షణాలు ఏమిటి దీని నుండి మనం ఎలా తప్పించుకోవాలి

wowitstelugu.blogspot.com

కరోనావైరస్‌ అంటే ఏమిటి  దాని లక్షణాలు ఏమిటి  దీని  నుండి మనం ఎలా తప్పించు కోవాలి 

కరోనా వైరస్ 

కరోనా అంటే కిరీటం అని అర్థం. సూర్యుడు చుట్టూ వుండే దట్టమైన కాంతి ని కూడా ఆంగ్లం లో  క రోనా  అంటారు.ఈ  సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది.

మొత్తం ఏడు (7) కరోనావైరస్లు ఉన్నాయి, వాటిలో 

  • ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్.

  • రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’

  • ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు వస్తుంది. 

  • ముఖ్యమైన కరోనావైరస్లలో సార్స్ SARS మరియు మెర్స్ MERS ఉన్నాయి

  • ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని. ‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది.

  • ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని వెల్లడైంది., 

  • ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎంత తేలికగా వ్యాపిస్తుందో అనే విషయం మీద స్పష్టమైన ఆధారాలు లేవు .
కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందింది 

  • కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే  ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.

  • పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

  • చైనాలో తిరిగి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వైరస్ ను  కరోనా  వైరస్‌  గా గుర్తించారు 

  • ఈ వైరస్‌ వుహాన్‌ లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త  ఈ వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు.

  • వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు

  • లండన్ప పరిశోధనల్లో దీనిని  "కరోనావైరస్‌" గా గుర్తించారు. 

  • ఈ వ్యాధికి ఇంత వరకు ఎటువంటి టీకాలు కనుగొన బడలేదు 

కోవిడ్-19 (Covid-19) అంటే  ఏమిటి? 

  • వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు

  • ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు

  • కరోనావైరస్ అనే పేరుగల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్-19( Covid  19).  Coronavirus లోని  Co vi లకు డిసీస్ (disease) లోని d ని చేర్చి Covid అనే పేరు పెట్టారు.

 కోవిడ్-19 (Covid-19) లక్షణాలు ఏమిటి? 

  • కరోనావైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు ఒక(1) రోజు నుండి (14) పద్నాలుగు  రోజుల వరకు పట్టవచ్చని, సాధారణంగా ఇది ఐదు (5)  రోజుల్లో బయట పడుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

  • ఇప్పుడు చైనా లో  కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

  • ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరందగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది

  • చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

    • మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. 

    • COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాలతొ (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 

    • 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 

    • 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు. 

     కోవిడ్-19 (Covid-19) తీసుకోవలసిన జాగ్రర్తలు 

    • నావల్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇతరులతో మాట్లాడుతుండగా వారి నోటి నుండి వచ్చే తుంపర్లు ఇతరులపై పడితే ఇతరులకు సోకవచ్చు. 

    • తుమ్మితే వారి ముక్కు నుండి బయటకు వచ్చే క్రిములు ఇతరులపై పడితే సోకవచ్చు. 

    • ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతరులు ఆలింగనం చేసుకున్నా, కరచాలనం చేసినా ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. 

    • అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడినా ఇతరులకు సోకవచ్చు. 

    • లిఫ్ట్‌లలో, మెట్లు ఎక్కేటప్పుడు పట్టుకునే రాడ్లపై కరోనా వైరస్ చేరితే అది 12 గంటల వరకు ఉంటుంది. 

    • 12 గంటలలోగా ఎవరైనా ఈ ప్రాంతంలో చేతులుపెట్టినా, శరీరంలోని ఇతర భాగాలు పెట్టినా వారికి సోకవచ్చు. 

    • కరోనా సోకిన వ్యక్తి అందరికీ దూరంగా ఉండటం మంచిది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిరుమాలు, లేదా నాప్కిన్ అడ్డుగా పెట్టుకోవాలి.

    • తరచూ చేతులు రెండు కనీసం 20 సెకండ్స్ కు తక్కువ కాకుండా శుభ్రం చేసుకోవాలి .

    • చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

    • విదేశాలకు వెళ్లినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారం మాత్రమే తీసుకోవాలి.

    • పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.

    • కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. 

    • అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

    • మరీ ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం (1 ఒక)  మీటరు  లేదా (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి.

    • అనుమానితుల కు కనీసం 1 మీటరు (3 అడుగులు ) దూరం లో ఉండి మాట్లాడాలి.

    • మార్కెట్లు  సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్ మీటింగ్స్ ల కు కొంతకాలము (అనేక ఈ వైరస్ పూర్తిగా సద్దుమనిగింది తెలిసేంతవరకు ) దూరం గా ఉండాలి . 

     కోవిడ్-19 (Covid-19) ఉన్న అపోహలు :

    • చేతులు కడుక్కున్న తరువాత వేడి గాలి వచ్చే పరికరం కింద చెయ్యి పెడితే వైరస్ చచ్చిపోతుందనుకోవడం కూడా ఒక అపోహ. 

    • ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్లినా కరోనా రాదనుకోవడం అపోహ మాత్రమే. డాక్టర్లు వాడే అత్యంత కాస్ట్‌లీ మాస్కుల వల్ల మాత్రమే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి 

    • మాస్క్ అనేది నేరుగా కరోనా సోకిన వ్యక్తి నుంచి విడుదల అయ్యే తుంపర్లు మనలోకి ప్రవేశించకుండా మాత్రమే ఆపగలవు.

    • ఒక మాస్కు ను మళ్ళీ  మళ్లీ వాటినే వాడుతున్నారు. అది మరింత ప్రమాదం.

    • ఎండ పెరిగితే కరోనా రాదా? - అలా రుజువు కాలేదు. ఇదివరకు వచ్చిన స్వైన్ ఫ్లూ సహా చాలా వైరస్‌లు ఎండా కాలంలో కూడా ప్రభావం చూపాయి

    • ఒంటిపై మద్యం, క్లోరిన్ చల్లుకుంటే వైరస్ చనిపోతుందా?  అప్పటికే ఒంట్లోకి ప్రవేశించిన వైరస్ బయటి నుంచి మద్యం, క్లోరిన్ చల్లుకున్నంత మాత్రాన చనిపోదు. పైగా అవి చర్మానికి, కళ్లకు హాని చేస్తాయి

    • యాంటీబయోటిక్స్ తో కరోనాను ఆపగలమా అంటే  యాంటీబయోటిక్స్ & బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నయం చేయటానికే తోడ్పడతాయి. వైరస్ ల మీద పనిచేయవు.

    • నువ్వుల నూనె కాపాడుతుందా? - నువ్వుల నూనె ఒంటికి రాసుకుంటే కరోనా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించదని అనుకోవటం అపోహ. 

    • బ్లీచ్/క్లోరిన్; ఆధారిత క్రిమినాశకాలు, ఈథర్ ద్రావణాలు, 75% ఇథనాల్, పెరాసెటిక్ యాసిడ్& క్లోరోఫాం వంటివి ఆయా వస్తువులు, ఉపరితలాల మీద అంటుకున్న వైరస్ లను చంపగలవు. 

    • గోమూత్రం తాగడం వలన వైరస్ రాకపోవడం అనేది అపోహ వెల్లుల్లి తింటే కరోనా రాదా?  ఇది కూడా అపోహ మాత్రమే.

    • వెల్లుల్లికి సూక్ష్మక్రిములను చంపే శక్తి ఉంది. అంతమాత్రాన వెల్లుల్లిని తింటే కరోనా వైరస్‌ రాదని  చెప్పలేము. 

    • వెల్లుల్లి కరోనాను పోగొడుతుందని రుజువు కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది.
    ప్రభావిత దేశాలు ఏవి  ప్రపంచ దేశాలు 
    తీసుకునే జాగర్తలు ఏమిటి 

    2020 మార్చి 5 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 95,000 కంటే ఎక్కువ కేసులు నిర్ధారణ  అయ్యాయి. వాటిలో 7,100 తీవ్రమైనవి. 85 దేశాలు ప్రభావితమయ్యాయి, మధ్య చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్లలో పెద్దయెత్తున వ్యాపించింది. 3,200 మందికి పైగా మరణించారు: మరణించిన వారిలో చైనాలో దాదాపు 3,000, ఇతర దేశాలలో 275 మంది ఉన్నారు. 51,000 మందికి పైగా కోలుకున్నారు.
    • చైనా తీసుకున్న చర్యల్లో హుబీ లాక్డౌన్, వివిధ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించడం వంటివి ఉన్నాయి; జపనీస్ జలాల్లో బ్రిటిష్ క్రూయిజ్ షిప్ డైమండ్ ప్రిన్సెస్ ను దిగ్బంధించారు; 

    • ఇటలీలో లాకౌట్ విధించారు. కొన్ని విమానాశ్రయాలు, రైలు స్టేషన్లు ఉష్ణోగ్రత తనిఖీలు, ఆరోగ్య ప్రకటన బోర్డులు, డెమోన్స్ట్రేషన్స్  వంటి స్క్రీనింగ్ పద్ధతులను ఏర్పాటు చేశాయి. 

    • చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలకు ప్రయాణాలు చేయవద్దని అనేక దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. చైనా, ఇరాన్, జపాన్, ఇటలీలోని అన్ని పాఠశాలలను మూసివేసారు .

    • ఇండియా లో మర్చి నెలాఖరు వరకు ప్రభుత్వ పాఠశాలలకు కొన్ని కార్యాలయాల కు సెలవులు పరకటించారు. జనసందోహాలు ఉండే చోట ప్రజలు మసల వద్దని ప్రకటనలు చేస్తున్నారు.

    పూర్తి వివరాలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ లో  చూడండి 


    కరోనా పైన యూట్యూబ్ వీడియో లు చూడండి 



    వీడియో  లింక్లు చూడండి 

    Coronavirus disease 2019 - World Health Organization
    https://www.who.int › Emergencies › Diseases 

    When and how to use masks - World Health Organization


     - ఈ పేజీని అనువదించు

    ట్విట్టర్ లో పోస్ట్లు చూడండి 

    TWEETS ON TWITTER

    ఈ జనతా కర్ఫ్యూ  వల్ల వచ్చే ఫలితం ఏమిటి అని ఎవరికైనా సందేహం కలగ వచ్చు. ఇది ఎందుకంటే ?

    ఒక ప్రదేశంలో "కరోనా వైరస్" జీవితం సుమారు 12 గంటలు మరియు జనతా కర్ఫ్యూ 14 గంటలు. కాబట్టి, కరోనా నివసించే బహిరంగ ప్రదేశాలు లేదా జనం తిరిగే ప్రదేశాలు 14 గంటలు తాకబడవు.

    ఇది కరోనా వైరస్ వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తుంది.14 గంటల తర్వాత మనకు లభించేది సురక్షితమైన  మన దేశం. కాబట్టి, అది వెనుక ఉన్న ఆలోచన. సమీప భవిష్యత్తులో ఎక్కువ సమయం అవసరమైతే ఇది ఒక డెమో  ప్రాక్టీస్ గా మనం అలవర్చుకోవాలి.  ఈ క్రింది లింక్ చూడండి ..

    MoHFW
    గమనిక :

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

    అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
    నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.



    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి