14, అక్టోబర్ 2021, గురువారం

దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి లేదా దసరా విశిష్టత ఏమిటో తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి లేదా దసరా విశిష్టత ఏమిటో తెలుసుకోండి

ఈ సృష్టి యందు విశ్వం లో ఉన్న అనేక  సూర్యమండలాలు  లో వ్యాపించి ఉన్న  గాలి, నిప్ప, నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది  అందురూ  రూఢిగా ఆమోదించే విషయం. ఆశక్తినే మహేవ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిసూ ఉంటారు. 

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు జగన్మాతను ఆరాధిస్తారు. శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. 

ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, 

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే

👉ఈ శక్తి కనుక లేకుంటే! శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ అమ్మవారు రాత్రి రూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే  సర్వపాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియచెస్తోంది.

👉ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ *'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'* అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో *చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి.* విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

దుర్గాష్టమి

  • దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు.

  • దుర్గ అంటే. దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది.

  • దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు.

  • దుర్గ ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు.

  • అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.

  • ఈరోజు దుర్గా సహస్రనామ పారాయణము, 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు.

  • "ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము",* అని అంటారు.

మహర్నవమి

  • మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే.

  • ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును.

  • కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు.

  • వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును.

  • ఇక క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులు, ఇతర కులవృత్తుల వారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

విజయదశమి

  • దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది.

  • 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది.

  • ఏపనైనా తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా విజయదశమినాడు ఏ పనైనా చేపట్టినచో ఆ కార్యము విజయము సాధించడం తధ్యము.

  • 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది.

  • దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. 

  • మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. 

  • దేనదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే ‘విజయదశమి’గా పేర్కొన్నారు

  • దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. 

  • ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువులు చెబుతారు

శమీపూజ

👉శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే *'జమ్మిచెట్టు'.* అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న *'అపరాజితా'* దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు.

👉 శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి , లంకపై జైత్రయాత్ర ఆరంభించుటవల్ల ఆ శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయినది అని అంటారు. అందువలన భారతీయులంతా దీనిని విజయ ముహూర్తంగా పరిగణిస్తారు. ఇలా అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా? మనకు ఏర్పడిన సర్వ దుఃఖాలు ఉపసమనం పొందాలన్నా? దారిద్యం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆ దేవదేవి కి పూజలతోపాటు శ్రీలలితాసహస్రనామ పారాయణలు నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతాపొందాలి.

👉 ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

*శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*
*అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||*

👉 పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి లేదా దసరా విశిష్టత ఏమిటో తెలుసుకోండి




ఈ రోజు సూక్తి :

"Your true success in life begins only when you make the commitment to become  excellent at what you do."

-Brian Tracy

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి