26, అక్టోబర్ 2021, మంగళవారం

శక్తి పీఠాల పురాణ గాథ ముఖ్యమైన 18 శక్తి పీఠాలు 18 శక్తి పీఠాల అమ్మవారి ధ్యానం

wowitstelugu.blogspot.com

శక్తి పీఠాల పురాణ గాథ ముఖ్యమైన 18 శక్తి పీఠాలు 18 శక్తి పీఠాల  అమ్మవారి ధ్యానం

హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యతను  సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను  శక్తి పీఠాలు (Sakti Peethas) అని అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో అనేక రకాలైన  విభేదాలున్నాయి. కొంతమంది 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108నీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే  మనకు తెలిసి 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని  అంటారు.

పురాణగాథ
  • దీనికి ఒక పురాణగాథ వున్నది. దక్షప్రజాపతి, మహాయజ్ఞం సంకల్పించి ఆ కార్యకమానికి  ఋషులను, మునులను దేవతలను, ఆహ్వానించి  కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (పార్వతి దేవి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుంటుంది. 

  • అప్పుడు సతీదేవి (పార్వతి దేవి) తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ఆశక్తి పడుతుంది. పార్వతీ దేవి పుట్టింటివారు నన్ను ప్రత్యేకంగా పిలవాలేమిటి అని ఈశ్వరుడు చెప్పిన  వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని తన తండ్రి చేస్తున్న యజ్ఞస్థలానికి వెళుతుంది. 

  • అక్కడ దక్షప్రజాపతి సతి దేవిని అవమానించారు. ముఖ్యంగా శివానంద భరించలేక  అక్కడే ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఇది తెలుసుకున్న ఈశ్వరుడు  అక్కడికి వచ్చి రుద్రరూపంలో కాలభైరవుని సృష్టించి యజ్ఞాన్ని నాశనం చేయిస్తాడు. 

  • సతీ వియోగదుఃఖం తీరని పరమేశ్వరుడు  ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు.

  • సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ముక్కలుగా ఛేదించి వానిని భూమిమీద పడేటట్లు చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు  ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తిపీఠాలు ఉద్భవించాయని మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి. 

  • అప్పటి నుంచి సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలకు పవిత్రత, అత్యంత శక్తి ప్రాముఖ్యత ఏర్పడ్డాయి.

అష్టాదశ శక్తిపీఠాలు లకు  ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే


అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా


ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే


హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా


వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్


సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


పై శ్లోకం లో చెప్పినట్లు  మరియు ఒక పరిశోధనా వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

1. శ్రీ శాంకరీ దేవి  - 

శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం  ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

ధ్యానం : 

శ్రీ సతీ శాంకరీ దేవీ ట్రింకోమలి పురస్థితా | 

ఉత్తమాంగ ప్రభా గౌరీభక్తకామ ఫల ప్రదా || 

2.    కామాక్షి దేవి - 

కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ధ్యానం : 

కాంచిపురాశ్రీతే  దేవీ కామాక్షీ సర్వ మంగళా 

చింతా తన్మాత్ర  సంతుష్టా చింతితార్ధ ఫలప్రదా  || 

3.   శృంఖలా దేవి  

ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

ధ్యానం : 

ప్రద్యుమ్మ్నే  వంగరాజ్యాయాం  శృఖలానామ  భూషితే | 

విశ్వవిమోహితే  దేవీ శృంఖలా బంధనాశనీ  || 

4.    శ్రీ చాముండేశ్వరి దేవి  

క్రౌంచ పట్టణం, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

ధ్యానం : 

క్రౌన్చపుర  స్థితమాతా చాముండా దుష్టనాశిని  | 

సర్వసిద్ది ప్రదా దేవి  భక్త పాలన  దీక్షితా  || 

5.    శ్రీ జోగులాంబా దేవి  - 

ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' & Krishna నదులు కలిసే స్థలంలో ఉంది.

ధ్యానం : 

జోగులాంబా మహాదేవీ  రౌద్రవీక్షణ లోచనా  | 

అలంపురీ స్టితామాతా  సర్వార్థ ఫల సిద్ధిదా || 

6.    శ్రీ భ్రమరాంబికా దేవి  - 

శ్రీశైల క్షేత్రం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

ధ్యానం : 

శివ పార్శ్వ స్థితా మాతా  శ్రీశైలే  శుభ పీఠికే   | 

భ్రమరాంబా  మహాదేవి కరుణారసవీక్షణా  || 

7.  శ్రీ మహాలక్ష్మీ దేవి - 

కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

ధ్యానం : 

మహాలక్ష్మ్య భిదా దేవీ  కరవీర పుర స్థితా  | 

పురుషార్థ ప్రదామాత సంపూర్ణామృత వర్షిణీ ||

8. శ్రీ ఏకవీరిక దేవి  

మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

ధ్యానం : 

ఏకవీరా మహాశక్తి మాహుగ్రామ గుహస్థితా   |  

భవానీ వీర విఖ్యాతా ధర్మ రక్షణ తత్పరా ||

9   శ్రీ మహాకాళి దేవి  - 

ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

ధ్యానం : 

ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరేశ్వరీ  |  

క్షిప్రా తీరస్థితా మాతా వాంఛితార్థ ప్రదాయినీ  ||

10. శ్రీ  పురుహూతిక దేవి  

పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

ధ్యానం : 

పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా |  

పుత్ర వత్పలితా దేవీ భక్తానుగ్రహదాయిని ||

11.     శ్రీ గిరిజా దేవి 

ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.

ధ్యానం :

ఓడ్ర దేశే భువనేశీ గిరిజానామ  సంస్థితా  |  

పలికాఖిల లోకానాం పల్లవారుణ పాణినా  ||

12.    శ్రీ  మాణిక్యాంభా దేవి  

దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

ధ్యానం :

దక్షవాటీ స్థితా శక్తీ  విఖ్యాతా మాణిక్యాంభికా   |  

వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయినీ ||

13.     శ్రీ కామరూపణీ దేవి  

హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

ధ్యానం :

కామరూపిణి విఖ్యాతా హరిక్షేత్రే సనాతనీ  |  

యోని ముద్రాత్రి ఖండేశీ  మాసే మాసే నిదర్శితా  ||

14.  శ్రీ మాధవేశ్వరి దేవి -

ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

ధ్యానం :

మాధవేశ్వరీ మంగళ్యా ప్రయాగ స్థలవాసినీ   |  

త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయిని  ||

15.   శ్రీ  వైష్ణవీదేవి  - 

జ్వాలాక్షేత్రం,  కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

ధ్యానం :

తుహినాద్రి స్థితమాతా జ్వాలాముఖీతి విశ్రుతా  |  

జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్దినీ   ||

16.    శ్రీ మంగళ గౌరి దేవి  - 

గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

ధ్యానం :

సర్వమంగళ మాంగల్యా గయా మాంగల్య గౌరికః   |  

అర్ధదా మోక్షదా దేవీ అక్షయ్య ఫలదాయినీ  ||

17.    శ్రీ విశాలాక్షి  దేవి - 

వారాణసి, ఉత్తర ప్రదేశ్.

ధ్యానం :

విశాలాక్షీ దేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే |  

నిరతాన్న ప్రధాత్రీచ నిర్భాగ్య జనతోషిణీ  ||

18.     శ్రీ సరస్వతీ దేవి  - 

జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు

ధ్యానం :

జ్ఞాన ప్రదా  సతీ మాతా కాశ్మీరేతు సరస్వతీ  |  

మహావిద్యా మహామాయా భుక్తి ముక్తి ప్రదాయినీ   ||


ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల లో అష్టాదశ శక్తి పీఠాలు  గురించి తెలుసుకోండి 




Today's Quote:

"Success is not final, failure is not fatal: it is the courage to continue that counts."    - Winston Churchill

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి