24, జులై 2020, శుక్రవారం

ఉపచారము అంటే ఏమిటి భగవంతుణ్ణి పూజించే ఉపచార సేవ విధానాలెన్ని అవి ఏవి ? వీటి గురించి సమగ్రంగా తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

ఉపచారము అంటే ఏమిటి భగవంతుణ్ణి పూజించే ఉపచార సేవ విధానాలెన్ని అవి ఏవి ? వీటి గురించి సమగ్రంగా  తెలుసుకుందాం

భగవంతుణ్ణి పూజించే విధానాలలో మనకు 16 ఉపచారాలు మాత్రమే  సాధారణం గా చాలామంది కి తెలుసు. అవే షోడశోపచారాలు హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవున్ని పూజిస్తారు. షోడశ అనగా పదహారు, ఉపచారాలు అనగా సేవలు. షోడశోపచారాలు అనగా పదహారు సేవలు అని అర్ధం. తెలుగు వ్యాకరణంలో ఇది గుణ సంధి.
ఈ ఉపచారాలు గురించి మనం మరింత సమగ్రంగా తెలుసుకుందాము రండి 
సంక్షేపం విస్తారం అని షోడశోపచారాలు అనేక విధాలుగా ఉన్నాయి
.
ఐదు(5), పది(10), పదహారు(16), పదునెనిమిది(18), ముప్ఫైఆరు(36), అరవైనాలుగు(64). వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచోపచారాలు(5)
 1. గంధం 
2. పుష్పం 
3. ధూపం 
4. దీపం 
5. నైవేద్యం
దశోపచారాలు(10)
1. పాద్యం 
2. అర్ఘ్యం 
3. ఆచమనం 
4. స్నానం 
5. వస్త్రనివేదనం 
6. గంధం 
7. పుష్పం 
8. ధూపం 
9. దీపం 
10. నైవేద్యం
షోడశోపచారాలు (16)
1. ఆవాహనం
2. ఆసనం
3. పాద్యం
4. ఆర్ఘ్యం
5. ఆచమనీయం
6. స్నానం
7. వస్త్రం
8. యజ్ఞోపవీతం
9. గంధం
10. పుష్పం
11. ధూపం
12. దీపం
13. నైవేద్యం
14. తాంబూలం
15. నమస్కారం
16. ప్రదక్షిణం
అష్టాదశోపచారాలు (18)
1. ఆసనం 
2. స్వాగతం 
3. పాద్యం 
4. అర్ఘ్యం 
5. ఆచమనీయం 
6. స్నానీయం 
7. వస్త్రం 
8. యజ్ఞోపవీతం 
9. భూషణం 
10. గంధం 
11. పుష్పం 
12. ధూపం 
13. దీపం 
14. నైవేద్యం 
15. దర్పణం 
16. మాల్యం 
17. అనులేపనం 
18. నమస్కారం
ముప్ఫైఆరు ఉపచారాలు(36)
1. ఆసనం 
2. అభ్యంజనం 
3. ఉద్వర్తనం 
4. నిరుక్షణం 
5. సమ్మార్జనం 
6. సర్పిఃస్నపనం 
7. ఆవాహనం 
8. పాద్యం 
9. అర్ఘ్యం 
10. ఆచమనం 
11. స్నానం 
12. మధుపర్కం 
13. పునరాచమనం 
14. యజ్ఞోపవీతం, వస్త్రం 
15. అలంకారం 
16. గంధం 
17. పుష్పం 
18. ధూపం 
19. దీపం 
20. నైవేద్యం 
21. నైవేద్యం 
22. పుష్పమాల 
23. అనులేపనం 
24. శయ్యా 
25. చామరం 
26. వ్యంజనం 
27. ఆదర్శం 
28. నమస్కారం 
29. గాయనం 
30. వాదనం 
31. నర్తనం 
32. స్తుతిగానం 
33. హవనం 
34. ప్రదక్షిణం 
35. దంతకాష్ఠం 
36. విసర్జనం 
చతుష్షష్టి (64) ఉపచారాలు  
1. ద్యానం 
2. ఆవాహనం 
3. ప్రభోధనం 
4. మణి మందిరం 
5. రత్న మండపం 
6. దంత ధావనం 
7. సిబికాం 
8. రత్న సింహాసనం 
9. వితానం 
10. పాద్యం 
11. అర్ఘ్యం 
12 ఆచమనీయం 
13 మధుపర్కం 
14. అభ్యంగనమ్‌ 
15. ఉద్వర్తనం 
16. పంచామృతం 
17. ఫలోదకం 
18. శుద్దోదకం 
19. సమ్మార్జనమ్‌ 
20. వస్త్రం 
21 పాదుకా 
22 ఆభరణం 
23 కిరీటం 
24 కుండలం 
25 కవచం 
26 యజ్ఞోపవీతం 
27 శ్రీ గంధం 
28 అక్షతం 
29 హరిద్రాచూర్నమ్‌ 
30 కుంకుమ 
31 పరిమళ ద్రవ్యం 
32 సింధూరం 
33. పుష్పాణి 
34. దూర్వాదళం 
35. ధూపం 
36. దీపం 
37. కుంభ నీరాజనం 
38. నైవేద్యం 
39. హస్త ప్రక్షాళనం 
40 కరో ద్వర్థనమ్‌ 
41. పానీయం 
42ఫలసమర్పణ 
43.తాంబూలం 
44.దక్షిణ 
45 ఛత్రం 
46 చామరం 
47. దర్పణం 
48. మంగళ నీరాజనం 
49. మంత్రపుష్పం 
50. ప్రదక్షిణం 
51 నమస్కారం 
52. తురంగవాహనమ్‌ 
53. మదగజం 
54. రధం 
55. సైన్యం 
56. దుర్గం 
57. మూషిక వాహనం 
58 ఆయుధం 
59. వ్యజవీజనం (వింజామర)
 60. నృత్యం 
61. వాద్యాని 
62. గీతశ్రవణం 
63. అబినయం 
64. క్షమా ప్రార్ధన
64 ఉపచారాలు ప్రధానమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి.
ఉపచార విధానం లో  పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో అలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు. అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.
  • ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
  • ఆసనము -- వచ్చిన వారిని కూర్చోబెట్టడం
  • పాద్యము -- కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
  • ఆర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
  • ఆచమనీయము -- దాహమునకు నీళ్ళివ్వడము
  • స్నానము -- ప్రయాణ అలసట తొలగుటకు స్నానింపచేయడం
  • వస్త్రము -- స్నానానంతరము పొడి బట్టలివ్వడం
  • యజ్ఞోపవీతము -- మార్గమధ్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం

ఈ క్రింద యు. ట్యూబ్ .వీడియో  లింక్లు. చూడండి


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv
నా యూట్యూబ్ ఛానల్ bdl telugu tech-tutorials

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి