4, మార్చి 2019, సోమవారం

There are so Many donations in Hindu Mythology that you do not know actually and their results

wowitstelugu.blogspot.com

పురాణాలలో రక రకా లైన ధర్మ కార్యాలు దానికి సంబందించిన  ఫలితాలు గురించి వ్రాసి ఉంది వాటి గురించి తెలుసుకుందాం.


  • సనాతన ధర్మంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రకరకాల దానాలు వాటికి ఫలితాలు కూడా పురాణాలలో ఉన్నాయి.   ధర్మకార్యాలకు దానం చేయాలని చాలా మంది భావిస్తుంటారు
  • దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును  కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం  ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. 
  • మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పర లోక  సుఖాలను  అందించడమే  కాకుండా,  ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. 
  • కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
  • సాధారణంగా పేదలకు అవసరార్థం  దేహి అన్నవారికి కొన్ని దానాలు చేస్తారు.  వాటికీ కూడా ఒక్కొక్క  దానానికి  ఒక్కొక్క ఫలితం ఉంటుంది .



1.  పేదప్రజలకు, బ్రాహ్మణోత్తములకు,సాధువులకు చేసే దానాలు ఫలితాలు:
1. అన్నదానం దాతకు  లేదా దాతలకు వాళ్ళ దారిద్యం నశిస్తుంది. రుణబాధ తగ్గి పోతుంది .


2. వస్త్ర దానం చేస్తే దాతకు  లేదా దాతలకు ఆయుష్షు పెరుగుతుంది.

3. భూమి దానం చేస్తే దాతకు  లేదా దాతలకు బ్రహ్మ లోక ప్రాప్తి , ఈశ్వర దర్శనం 

4. నెయ్యి, నూనె దానం చేస్తే దాతకు  దాతలకు ఆరోగ్యం, రోగం నివారణ, యజ్ఞ ఫలం దక్కుతుంది.


5. బంగారం దానం చేస్తే దాతకు  లేదా దాతలకు కుటుంబ దోషాలు కలహాలు నివార అవుతాయి .

6. వెండిని దానం చేస్తే దాతకు  లేదా దాతలకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.

7. గోధుమలు దానం చేస్తే  దాతకు  లేదా దాతలకు ఋషి ఋణం, పితృ ఋణం,దేవ ఋణం తొలగి పోతాయి.

8. దీపం దానం చేస్తే దాతకు  లేదా దాతలకు కంటి చూపు పెరుగుతుంది.

9. తేనెధానం చేస్తే దాతకు పుత్ర ప్రాప్తి కలుగుతుంది.

10. ఉసిరికాయ దానం చేస్తే దాతకు  దాతలకు అపరిమిత ధన ప్రాప్తి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

11. బియ్యం దానం చేస్తే దాతకు  దాతలకు  సకల పాపాలు తొలిగి పోతాయి.

12. పళ్లు దానం చేస్తే దాతకు  దాతలకు సకల సిద్దులు బుద్దులు సంప్రాప్తిస్తాయి.

13.  శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన  నువ్వులు దానం  చేసిన దాతకు  దాతలకు సమస్త పాపములు                     నశిస్తాయి. 

14.  బెల్లం దానం చేస్తే దాత  లేదా దాతలు అష్ట ఐశ్వర్యాలు పొందుతారు.

15. ఉప్పును దానం చేస్తే దాత  లేదా దాతలు మృత్యు వును జయిస్తారు. ఆయువును బలాన్ని పొందుతారు.

16. గోదానం  చేస్తే  గోవును గోవుతో పాటు  పాలు పితుకుకొనే పాత్ర ,  కనీసం  6 నెలల పశుగ్రాసం,   
      దానం చేస్తే దాతకు లేదా దాతలకు  స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.


  • ఆలయ నిర్మాణం కూడా ధర్మ  కార్యం కిందకే వస్తుంది కనుక కొందరు కొత్తగా ఆలయాలు నిర్మిస్తుంటే దానికి ఆర్థికసాయం చేయడం పరిపాటి
  • అలాగే రకరకాలుగా ధ్వజస్తంభం ఒకరుమకర  తోరణం  మరొకరు బయట  మండప  నిర్మాణానికి ఇంకొకరు సాయం చేయడం కూడా కనిపిస్తుంటుంది
  • అయితే  దేవాలయానికి ఎటువంటి దానం చేస్తే ఎటువంటి పుణ్య ఫలం లభిస్తుందో    విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉందని పెద్దలు చెబుతారు
  • మన ఆలయాలలో దేవునికి పవిత్రంగా అర్చనాదులు చేయడం కని పిస్తుందిగాని ఆలయాలు  శుభ్రంగా   ఉంచడంలో  కొంత  అశ్రద్ధ కనిపిస్తుంటుంది
  • ఆలయ గోడలకు వెల వేయించడంప్రాంగణాన్ని శుభ్రం చేసి ముగ్గులతో  అలంకరించడంవంటివి  చేస్తే  విష్ణులోక  ప్రాప్తి  వంటివి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.  
  • ఆలయాలకు వివిధ వస్తువులు దానం చేయడం వల్ల వేర్వేరు  ఫలితాలు ఉన్నాయి.

2.  దేవాలయాల నిర్మాణానికి దానాలు చేయడం, ఏ దేవాలయ సామాగ్రి దానం ఏమి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం  

  • గంట దానం చేస్తే దాతకు గొప్ప  కీర్తి
  • శంఖ దానం వల్ల  దాతకు విష్ణులోక ప్రాప్తి
  • ఆలయం ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే దాతకు కీర్తిధర్మబుద్ధి కలగటానికి దోహదం.
  • గజ్జలను, మువ్వలను ఇస్తే దాతకు సౌభాగ్యం

  • ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చిన దాత భూస్వామి అవుతాడు.
  • పతాకాలను ఇస్తే దాత సకలపాపాల నుండి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. (పతాకాలు గాలిలో ఎగురుతాయి కనుక లోకానికి వెళతారు). 

  • పతాకాల దానం  వల్ల దాతకు ఆలయానికి ఎంత శోభ వస్తుందో అంత కీర్తిని పొందుతారు.
  • కుండను ఇచ్చిన దాత  వరుణలోకాన్ని పొందుతాడు (కుండలు నీటికి ఆవాసాలు అవుతాయి కనుక వరుణ లోకాన్ని పొందుతాడు).

  • నాలుగు కలశాలను దానం ఇచ్చిన దాత  సుఖాన్ని అనుభవిస్తాడు.
  • కమండలాన్ని దానం చేసిన దాత గోదాన ఫలితం పొందుతారు.
  • వట్టివేళ్ళతో తయారు చేసిన చాపలు వంటివి ఇస్తే దాతకు సర్వపాపాలు నశిస్తాయి.
  • ఆలయంలో గోవులను మేపటానికి గోపాలకుడిని ఇస్తే దాతకు  పాప విముక్తి.
  • దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే  దాతకు సర్వత్రా ఉత్తమ స్థానం (దేవునికి ఇచ్చే ఆసనం మనకు ఉన్న స్థానాన్ని ఇస్తుంది).
  • పాదపీఠ దానం వాళ్ళ దాతకు ఉత్తమగతికి దారితీస్తుంది.
  • ధ్వజ సమర్పణంతో దాతకు  కీర్తికి అవకాశం.
  • దేవుడికి ముఖానికి అలంకరించే సుగంధ ద్రవ్యాలను ఇస్తే దాతకు ఉత్తమరూపం పొందుతాడు.
  • దర్పణం (అద్దం) దానం వల్ల దాతకు మంచి రూపం లభిస్తుంది.
  • చిన్న చిన్న పాత్రలను దానం ఇస్తే దాతకు యజ్ఞం చేసినంత ఫలం.
  • ధాన్యం, సస్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇస్తే దాతకు పుణ్య ఫలితాన్ని పొందుతారు
  • వెండి దానం ఇస్తే దాతకు మంచి రూపానికి కూడా కారణమవుతుంది
  • బంగారం వల్ల దాతకు సర్వకామ్య సిద్ధి.
  • పాడి ఆవును దానం ఇస్తే దాతకు గోలోకప్రాప్తి.
ఏ దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఈ యూట్యూబ్ వీడియో యు. ఆర్.యల్.లు.  చూసి తెలుసుకోండి ..


Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. 
మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి