23, ఫిబ్రవరి 2019, శనివారం

Let's learn about the God Vigneswaras Sankastahara chaturdi and its vratam of hindus.

wowitstelugu.blogspot.com

గణపతికి సంబంధించిన సంకష్టహర చతుర్థి ని హిందువులు  చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే    వ్రతాన్ని గురించి తెలుసుకుందాము 

సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.


సంకష్టి చతుర్థి

  • గణేశుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించే పవిత్రమైన రోజు. దీన్ని ప్రతి పౌర్ణమికి నాలుగో రోజు లేదా హిందూ మతక్యాలెండర్ ప్రకారం కృష్ణ పక్షాన జరుపుకుంటారు
  • మహిళలు వారివారి కుటుంబక్షేమం కోసం చేసే పూజలలో సంకష్టి చతుర్థి చాలా వేగవంతంగా ప్రసిద్ధి చెందింది. సంకష్టి అంటే కష్టకాలం నుండి విమోచన కలగటం. అందువలన, ఈ వ్రతం ఆచరించటం వలన భగవాన్ గణపతి స్వామి ఒక వ్యక్తి జీవితంలో అన్ని సమస్యలు మరియు అన్ని అడ్డంకులను నిర్మూలిస్తాడని నమ్ముతారు. 

  • సంకష్టి చతుర్థి రోజున పగలంతా కఠినమైన ఉపవాసముండి, రాత్రి చంద్రుని చూసిన తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు. సంకష్టి చతుర్థిని ప్రతి నెల జరుపుకుంటారు.  
  • ప్రతి నెల జరుపుకునే సంకష్టి చతుర్థిన భగవాన్ గణేశుడికి పూజలు జరిపిన తరువాత కథాశ్రవణం కూడా చేస్తారు. 

వ్రతం ప్రాముఖ్యత: 
  • సంకష్టి చతుర్థి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పూజను కుటుంబం యొక్క సౌభాగ్యం మరియు శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు. 
  • ఈ సంకష్టి చతుర్థి పూజ సాయంత్రం చంద్రుని వీక్షించిన తర్వాత నిర్వహిస్తారు. 
  • మొదటగా వినాయకుని విగ్రహం స్వచ్ఛమైన వేదిక మీద ఉంచుతారు. 
  • పూలు మరియు గడ్డితో పూజిస్తారు. 
  • ఉండ్రాళ్ళు మరియు కుడుములు వంటి పిండివంటలు గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.

గణేశుడి విశిష్టత:

  • ణేశుడి కథ మనందరికీ తెలిసిందే! దేవతామూర్తి అయిన పార్వతిదేవి అభ్యంగన స్నానం ఆచరించే ముందు ఆమె శరీరానికి పట్టించిన నలుగుపిండితో గణేశుడిని సృష్టించింది. అప్పుడే ఆమె ఆ బాలుని కొడుకుగా స్వీకరించింది. ఒక రోజున ఆమె స్నానం ఆచరించటానికి వెళుతూ ఆ బాలుని ద్వారం వొద్ద కాపలాగా ఉంచింది. అదే సమయంలో శివుడు తన గణాలతో ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నానికి గణేశుడు అడ్డుపడి వెళ్ళనివ్వలేదు.

  • పార్వతి విషయం తెలుసుకుని ఆగ్రహంతో ఆదిశక్తిగా మారింది. విశ్వమంతా నాశనం చేయటానికి సిద్ధపడింది. అప్పుడు శివుడు విషయం తెలుసుకుని తన భార్య ఆగ్రహావేశాలను చూసి, ఆ బాలుని తలకు బదులుగా, ఒక ఏనుగు తలను అతికించి జీవం పోశాడు. ఆ బాలుని విశ్వమంతా బుద్ధి,జ్ఞానం మరియు శ్రేయస్సుకు అధిపతిగా పూజిస్తారని శివుడు వరమిచ్చాడు.

  • అప్పటి నుండి వినాయకుడు ఏ వేడుకలో అయినా మొదటి పూజ అందుకుంటున్నాడు మరియు అతను అన్ని అడ్డంకులు తొలగించే దైవం అని ప్రజలు నమ్ముతారు. ఈ వరం శివుడు సంకష్టి చతుర్థి రోజున భగవాన్ గణేశుడికి ప్రసాదించాడని ఒక నమ్మకం. అందువలన, ప్రజలు వారి జీవితాల్లో అన్ని అడ్డంకులను వదిలించుకోవటం కోసం సంకతారా లేదా విఘ్నహర్తుడిని పూజిస్తారు.
సంకష్టి చతుర్థి వ్రతం విధి విధానం: 
  • ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వుంటుందొ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

  • సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు అని భక్తులు భావిస్తుంటారు.  ఈ ప్రతాన్ని దేవాలయం లో ఆచరించవచ్చు లేదా ఇంటిలో గాని చేసుకో వచ్చును .

  • వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు

  • సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి

  • ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు / 3 గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి

  • 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

  • ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి

  • ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు

  1. సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన /కలిసిన / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు
  2. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి
  3. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
  4. మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
  5. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

ఈ క్రింది వీడియో యూట్యూబ్ యూ.ఆర్. యల్ .లు చూడండి ....

సంకష్ట హర చతుర్థి వ్రత విధానం | Story of Sankatahara 


https://www.youtube.com/watch?v=gUXvhj26CeE

సంకటహర చతుర్థి ప్రత్యేకత | Sankatahara Chaturthi - YouTube



Sri Sankashta Chathurthi Vratham - YouTube


What Is Sankashtahara Chaturthi ? | Lord Ganesh Archana ... - YouTube

what is the importance of sankatahara chaturthi pooja I vinayaka pooja ...

సంకష్టి చతుర్థి వ్రతం ఫలితం కథ గొప్పదనం  : 

  • ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి తో (వినాయకుని కి గొప్ప భక్తుడు)  కలిసి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్సేన్అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
  • అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి  విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
  • అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
  • అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. రోజు మరణించిందిఅని చెప్పాడు.
  • అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి విమానం ఆగిపోయిన చోట చేరి విస్పోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
  • వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ  వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన వ్రత మహత్యం వలన  వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని      అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయక లోకానికి తీసుకు వెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

సంకష్టి చతుర్థి వ్రతం ఫలితం కథ గొప్పదనం వీడియో యూ.ఆర్. యల్ లు చూడండి ....



Sankashtahara Ganapathi Vratham | Importance | Shubha Dinam ...


https://www.youtube.com/watch?v=cziAdkFHIos

వ్రతాచరణ ఫలితాలు :

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే ఫలితాలు తెలియ జేయబడి ఉన్నాయి 
  • పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. 

  • నేటి కాలం లో  గణేశ ఉపాసకులు సాధారణంగా వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

  • పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగు తుంది.
సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే


ప్రథమం వక్రతుండం ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం


లంబోదరం పంచమం షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం ధూమ్రవర్ణం తధాష్టకం


నవమం ఫాలచంద్రం దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్


ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో


విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్


జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః


అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


సంకటహర గణపతి స్తోత్రం వీడియో యు.ఆర్ యల్ . లు.చూడండి. 

Sankatanasana ganapati stotram telugu lyrics and meaning - YouTube



sankatanasana ganesha stotram telugu lyrics and meaning - YouTube


Sankata Nashana Ganapathi Stotram With English Lyrics (Happy ...




Sankata nashana ganesha stotram - YouTube


https://www.youtube.com/watch?v=CDhHaNCahag

Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  
like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి