5, ఫిబ్రవరి 2022, శనివారం

మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన జన్మ మరియు మరణ రహస్యాలు తెలుసుకోండి

wowitstelugu.blogspot.com

మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన జన్మ మరియు మరణ రహస్యాలు తెలుసుకోండి

  • స్వరం ఒకటి మూడు రూపములుగాను , అయిదు రూపములుగాను అగును. ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును. మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.

  • శరీరం నందు స్వరం పుట్టును. స్వరము నందు నాడిపుట్టును. స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.

  • శరీరం పిండం అనబడును. ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును. శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.

  • ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును. అయిదు దినములకు బుడగ వలే అగును. పది దినములకు నెత్తురు అగును. పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.

  • ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.*

  • మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండొవ నెల యందు మేథస్సు కలుగును. మూడోవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగోవ మాసము నందు అవయవములు జనించును.*

  • అయిదవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును. ఆరొవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును .*

  • ఏడొవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.*

  • ఎనిమిదొవ  మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు. తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును. కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.

  • తొమ్మిదోవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదోవ మాసమున గాని పదోవ  మాసమున గాని ప్రాణములతో  పుట్టును .

  • స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము, బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.

  • పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను. స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును .

  • ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు, దరిద్రుడు అగును. గర్బం అయిదోవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును. ఆరొవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.

  • ఏడొవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు , ఎనిమిదొవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు, తొమ్మిదోవ దినమున పతివ్రత అగు కూతురు , పదొవ దినమున మంచి కుమారుడు పుట్టును. ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.

  • ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును.  నెత్తురు, రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.

  • రోమములు, చర్మము, ఎముకలు, మాంసము ఇవి పృథ్వి అంశములు, శుక్లము, పురీషము, మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు .

  • ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు, ముడుచుకొనుట, చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు. కోపం, సిగ్గు, భయం, మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు .

  • నాలిక, చర్మము, చెవులు, ముక్కు, కన్నులు ఈ అయిదు జ్ఞానేంద్రియములు, ఉపస్థము, ఆసనం, వాక్కు , హస్తములు, పాదములు ఇవి కర్మేంద్రియాలు .

  • మూలాధారం నందు నాలుగు దళముల పద్మము , యోని నందు ఆరు దళముల పద్మము , నాభి యందు పది దళముల పద్మము,  హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.

  • కంఠము నందు పదహారు దళముల పద్మము, కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము, బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము  ఉండును.

  • ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును. ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.

  • సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.

  • నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.

  • అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.

  • నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.

  • సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది . అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.

  • ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి. వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద  అనునవి కలవు. వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు  వహించి ఉండును. 

  • సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును. పూషలము , భూషితము అను నాడులు నేత్రముల యందు ఉండును.

  •  గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును. కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.

  • మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును.

  • పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును. నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు , హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .

  • అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను, గుదము, లింగము, నాభి, వృషణము, తొడలు, మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును .

  • వ్యాన వాయవు కన్నులు, చెవులు, కాలి మడములు, పిరుదు, ముక్కు,  ఈ స్థానముల యందు ఉండును. ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును .

  • సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును. భుజించబడిన, తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును.

  • ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు, కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.

  • ధనుంజయ వాయవు వలన ఘోషము, మాటలాడుట నాగము వలన, ఆవులింత దేవదత్తం వలనను, తుమ్ము కృకరము వలనను, కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును. మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం.
పరమేశ్వరుడు పార్వతి కి చెప్పిన 8 మరణ రహస్యాలు

మనలో చాలా మందికి మరణం సంభవించే ముందే కొన్ని సూచనలు వస్తుంటాయి. కొందరు ఆధ్యాత్మిక భావనల ద్వారా దానిని తెలుసుకోగలుగుతారు. మరికొందరు భౌతికం గా కూడా కొన్ని సంకేతాల ద్వారా పసిగట్టవచ్చు.

👉శివపురాణం ప్రకారం, పార్వతి దేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది. “స్వామి..! మరణానికి సంకేతం ఏమిటి, మరణం జరగబోతోందని ఎలా తెలుస్తుంది ఎవరైనా ఓ వ్యక్తి మరణానికి ముందు ఏమి జరగవచ్చు?” అని ప్రశ్నించెను.

👉ఈ ప్రశ్నకు పరమేశ్వరుడు మరణం గురించి వివరం గా  ప్రతిదీ వివరించాడని చెబుతారు. మనకు పురాణం లో వ్రాసిన అందుబాటులో ఉన్న  కొన్ని  శివుని మాటల ప్రకారం,

👉 ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు మరియు కొద్దిగా ఎరుపుగా మారినప్పుడు. ఆ వ్యక్తి మరో ఆరు నెలలో చనిపోవచ్చని గ్రహించవచ్చు . ఇంకా శివ పురాణం లో ఏమి చెప్పబడిందో తెలుసుకోవాలంటే క్రింది వివరాలు చదవండి.

1 నీరు, నూనె మరియు అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి 6 నెలల కాలంలో చనిపోతాడనడానికి ఇది సంకేతం. ఒకవేళ, ఎవరైనా తమ మరణ సమయం కంటే ఒక నెల ఎక్కువ జీవిస్తే, వారు తమ సొంత నీడలను చూడలేరు. ఒకవేళ చూసినా.. ఆ నీడ కి తల భాగం ఉండదు.


2 ఎవరికైనా ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుంటే ఆ వ్యక్తి కూడా త్వరలోనే లోకాన్ని వీడబోతున్నారని అర్ధం. అలాగే కనీసం వారం రోజుల పాటు ఓ వ్యక్తి ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా.. అతను మరణించబోతున్నాడని అర్ధం.


3 ఒక వ్యక్తి నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టి గా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణించబోతున్నాడని అర్ధం.

4 ఒక వ్యక్తి చంద్రుడు, సూర్యుడు లేదా అగ్ని యొక్క కాంతిని చూడలేనప్పుడు, ఆ వ్యక్తి 6 నెలలు మాత్రమే సజీవంగా ఉండబోతున్నాడని అర్ధం.


5 ఒక వ్యక్తి యొక్క నాలుక అకస్మాత్తుగా ఉబ్బి, దంతాలు చీమును స్రవించడం ప్రారంభిస్తే, ఆ వ్యక్తి 6 నెలలకు మించి బతకడు అనడానికి ఇది సంకేతం.


6 ఆకాశం లో ఉండే ధ్రువ నక్షత్రం కంటికి కనిపించకపోయినటైతే ఆ వ్యక్తి మరో ఆరునెలల్లో మరణించవచ్చని చెప్పవచ్చు.


7 ఏ వ్యక్తి అయినా సూర్యుడు, చంద్రుడు మరియు ఆకాశాన్ని కూడా ఎరుపు రంగులోనే చూస్తే, మరో ఆరు (6) నెలల్లో అతను మరణించవచ్చని చెప్పవచ్చు.


8 ఒక వ్యక్తి గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు లేదా ఏదైనా గ్రామాన్ని ఖాళీ గా, వినాశనం చేయబడిన గ్రామాన్ని చూసినపుడు అతనికి మరణం దగ్గరలోనే ఉందని తెలుస్తుంది.

ఈ మరణ రహస్యాలను డీకోడ్ చేసుకునిఅర్ధం చేసుకోవాలి:

👉 హిందూ ధర్మ గ్రంధముల  ప్రకారం, మరణం తరువాత, వ్యక్తి యొక్క ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో చేసిన పనులను బట్టి స్వర్గంలో లేదా నరకంలో స్థానం పొందుతుంది. 

👉 హిందూ నమ్మకాల ప్రకారం, మరణం తరువాత, 84 లక్షల ఆత్మలలో ఒక ఆత్మ మాత్రమే శరీరాన్ని కనుక్కోగలదు. 

👉ఎవరైనా, మృతదేహాన్ని ఎత్తే వ్యక్తుల గురించి కలలుగన్నట్లయితే, సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తికి చాలా డబ్బు లభిస్తుందని ఈ కల అంతరార్ధం. 

👉 ఒక వ్యక్తి తన కలలో ఒకరిని చంపడం చూస్తే, ఆ వ్యక్తి తన సన్నిహితుడికి ఎక్కువ గా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అర్ధం.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ లో శివుడు పార్వతికి చెప్పిన విషయాలు చూడండి 


Lord Shiva told life lessons to Parvati || పార్వతిదేవికి శివుడు చేసిన ఉపదేశం ? Pregnya Bhakthi ||

శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు | Mana Nidhi


దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి.


My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి