2, సెప్టెంబర్ 2019, సోమవారం

హిందువుల వినాయక చవితి పూజలో వాడ వలసిన పత్రి వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకోండి ఆచరించండి

wowitstelugu.blogspot.com
హిందువుల వినాయక చవితి పూజలో వాడ వలసిన పత్రి వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకోండి ఆచరించండి
You should know the importance of Patri (leaves) and their medical valued used in the worship of Lord Ganesha of Hindus 


  • పురాణాల  ప్రకారం  ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి  పూజ గణ నాధుడికే.  అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. 

  • హిందువులకు తొలి పండుగ వినాయక చవితితల్లిదండ్రుల నే  సమస్త లోకాలుగా భావించి, విఙ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధివంతుడు.  

  • గణపతిని  పూజించడానికి  వినాయక  చవితి నాడు  ఔషధ గుణాలు కలిగిన పత్రాలే ప్రధానమైనవి. అన్నిరకాల పత్రాలు వాడరాదు 

  • పెద్దలు చెప్పిన కొన్నిరకాలైన పత్రాలు మాత్రమే వాడాలి .

  • వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త'మట్టినే ఎంచుకోవాలి. 

  • దానికి ఔషధ గుణాలు కలిగిన 21 పత్రాలతో పూజచేయాలి.

  • గణపతిని నవరాత్రులు పూజించాక పారుతున్నసుద్ద జలం లో కానీ చెరువులో గానీ, నీరు బాగా ఉన్న బావిలో గానీ నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి.

విఘ్నేశ్వరుని పూజలో  21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఈ 21 ఆకుల పేర్లేంటని తెలుసుకోవాలంటే ఈ క్రిందన చెప్పిన వివరాలు  చూడండి

1. మాచీ పత్రం: 







మాచపత్రి అనేది తెలుగు పేరు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చామంతి ఆకుల మాదిరిగానే ఉంటాయి

2. దూర్వార పత్రం:





దూర్వం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి

3. అపామార్గ పత్రం






తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్లు ఉండే పత్రాలు పెరడులోనే లభిస్తాయి. 
4. బృహతీ పత్రం: 













దీనిని ములక అంటారుదీనిలో చిన్న ములకపెద్ద ములక అని రెండు రకాలున్నాయిఇవి వంగ ఆకులు మాదిరితెల్లని చారలతో గుండ్రం పండ్లతో ఉంటాయి. 
5. దుత్తూర పత్రం







దుత్తూరం అంటే ఉమ్మెత్త. ఇది వంగ జాతికి చెందింది. దీని కాయలకు ముళ్లు ఉంటాయి. పూలు తెల్లగా ఉంటాయి
6. తులసీ పత్రం: 













హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తులసీ అత్యంత పవిత్రమైందిదేవతార్చనలోనే కాదు దీనకి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారు
7. బిల్వ పత్రం: 







బిల్వ పత్రానికి మరోపేరు మారేడు. మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఇవి శివుడికి చాలా ప్రీతికరమైనవి. మహాలక్ష్మీకి కూడ ఎంతో ఇష్టమని అంటారు
8. బదరీ పత్రం

బదరీ అంటే రేగుదీనిలో రేగుజిట్రేగుగంగరేగు అని మూడు రకాలు ఉంటాయి
9. చూత పత్రం






చూత పత్రం అంటే మామిడాకు. వీటికి శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు. 
10. కరవీర పత్రం
గన్నేరు పత్రానికి మరోపేరు కరవీర. తెలుపు, పసుపు,  ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో పూలకు విశిష్ట స్థానం ఉంది
11. మరువక పత్రం

వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లడం పత్రం ప్రత్యేకత. 
12. శమీ పత్రం
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
13. విష్ణుక్రాంత పత్రం

    ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు
14. సింధువార పత్రం
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు. ఆరోగ్యం పరంగా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది
15. అశ్వత్థ పత్రం
     రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టును పూజించడం హైందవ సంప్రదాయం. దీనిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులు ఉంటారని నమ్మకం
16. దాడిమీ పత్రం
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం
17. జాజి పత్రం

   జాజి పత్రం సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. 
18. అర్జున పత్రం


దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. 
20. గండలీ పత్రం
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది 
21. అర్క పత్రం
జిల్లేడు ఆకులనే అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేడుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం లభిస్తుంది. 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుంది.

ఈ పత్రాల లో ఉన్న ఔషధీ గుణాలుతెలుసు కుందాం 

  • మాచీ పత్రం- గాలిని శుద్ధిచేసి ఉబ్బసాన్ని నియంత్రిస్తే
  • జాజి పత్రం- తలనొప్పిని తగ్గిస్తుంది
  • దేవదారు- జ్ఞాపకశక్తి
  • విష్ణుకాంత పత్రం-పైత్య కఫ జ్వర నివారణ
  •  మరుపక పత్రం- జట్టురాలడాన్ని అరికడుతుంది
  • కరవీర పత్రం చర్మ, బొల్లి వ్యాధులను నియంత్రిస్తే
  • దాడిమ పత్రం రక్తహీనత, నోటి పూతను నివారిస్తుంది
  • తులసి- దగ్గు, జలుబు, గొంతు సమస్యలను, 
  • అశ్వత్థ పత్రం- కంటి వ్యాధులు, అతిసారం మటుమాయం చేస్తాయి
  • బిల్వ పత్రం- కంటి సమస్యలు
  • చూత పత్రం-చిగుళ్ల బాధ, నోటిపూత నుంచి ఉపశమనం కలిగిస్తాయి
  • బదరీ పత్రం- జీర్ణశక్తిని పెంచితే
  • దత్తూర పత్రం కీళ్ల రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
  • బృహతీపత్రం- వ్యాధి నిరోధకత శక్తిని
  • దుర్వాయుగ్మ పత్రం-అజీర్తి, చర్మవ్యాధులను నివారిస్తుంది. 
  • సింధువార పత్రం-పంటి, కీళ్ల నొప్పులకు స్వాంతన కలిగిస్తే
  • శమ పత్రం-చర్మ వ్యాధులను నివారిస్తుంది. 
  • గండకీ పత్రం రక్తాన్ని శుద్ధిచేస్తుంది.

ఈ  క్రింది వీడియో లింక్లు చూడండి




21 Leaves for Ganesh Chaturthi Puja | 21 Leaves used in Vinayaka ...



https://www.youtube.com › watch


Names Of 21 Leaves For Ganesh Pooja | Vinayaka ... - YouTube



 - Translate this page

21 Sacred Leaves used For Vinayaka Chavithi Pooja 2019 - Vinayaka ...


Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
Also see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి.
 మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి