wowitstelugu.blogspot.com
Do you know about Sumant Moolgaokar
Do you know about Sumant Moolgaokar
సుమంత్ మోలగోకర్ గురించి తెలుసు కొంటె సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది.
సుమంత్ మోలగోకర్
మార్చి 5వ తేదీ 1907 లో ముంబై లో జన్మించారు. ఇంపీరియల్ కాలేజీ లండన్ లో ఇంజనీరింగ్ చేసారు.. భారత పారిశ్రామికవేత్త. టాటా మోటార్స్ మోటార్స్ ఆర్కిటెక్ట్. టాటా ఇంజనీరింగ్ మరియు లోకోమోటివ్స్ కంపెనీ కి ప్రధాన కార్యనిర్వహణ అధికారి. టాటా స్టీల్ కంపెనీ కి వైస్ చైర్మన్ గా కూడా సేవలు అందించారు. మారుతీ సుజికి కంపెనీ కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సేవలు అందించారు. భారత పద్మభూషణ్ అవార్డు విజేత...
" టాటా సుమో " పేరు ఎలా పెట్టారో ఎందుకు పెట్టారో తెలుసా ....
'సు' అంటే సుమంత్, 'మో' అంటె మోలగోంకర్...
ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు. ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి నాణ్యతను పెంచే దిశగా ఎంతో విషయసేకరణ చేశాడు.
అలా ఆ డ్రైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్.ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరును " టాటా సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది. ఇలాంటి మహనీయులను కన్న భారతమాత పునీతమైనది. శ్రీ సుమంత్ మోలగోంకర్ కు మనం కూడా నివాళులు అర్పిద్దాం.
'సు' అంటే సుమంత్, 'మో'అంటె మోలగోంకర్.
అలా ఆ డ్రైవర్లు చెప్పిన విషయాలతో టాటా వాహానాల నాణ్యతను పెంచి, వాటిని ప్రపంచంలోనే ఉన్నతికి తీసుకు వచ్చాడు శ్రీ సుమంత్ మోలగోంకర్.ఆయన చేసిన సేవకు టాటా మోటార్సు ఆయన పేరును " టాటా సుమో " వాహనానికి ఆయన పేరు పెట్టారు. ప్రపంచంలో ఉద్యోగికి ఒక కంపెనీ ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇది. ఇలాంటి మహనీయులను కన్న భారతమాత పునీతమైనది. శ్రీ సుమంత్ మోలగోంకర్ కు మనం కూడా నివాళులు అర్పిద్దాం.
'సు' అంటే సుమంత్, 'మో'అంటె మోలగోంకర్.
సుమంత్ మోలగోకర్ పేరుతో ఉన్న పార్క్ వీడియో చూడండి...
Sumant Mulgaonkar Park, Telco, Jamshedpur
నోట్ :
If you like my telugu blog wowitsviral.blogspot.com like, share and subscribe
If you like my telugu blog wowitsviral.blogspot.com like share and subscribe
If you like my telugu blog teluguteevi.blogspot.com don’t forget to comment
thankyou,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి