14, నవంబర్ 2021, ఆదివారం

శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్ | శ్రీ మల్లికార్జున ప్రపత్తిః | శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్ |

wowitstelugu.blogspot.com

శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్ | శ్రీ మల్లికార్జున ప్రపత్తిః | శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్ | 

శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్


ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II

కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II

నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ II

శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II

మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II

శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II

సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II

ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే 
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II

పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II

శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II
II శ్రీ మల్లికార్జున స్తోత్రం II
నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం
పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I
నగేంద్రకన్యావృషకేతనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I
విభూతి పాటీరవిలేపనాభ్యాం
నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ II

అనఘం జనకం జగతాం ప్రథమం
వరదం కరశూలధరం సులభమ్ I
కరుణాంబునిధిం కలుషాపహరం
ప్రణమామి మహేశ్వరమేకమహమ్ II

అమలం కమలోద్భవగీతగుణం
శమదం సమదాసురనాశకరమ్ I
రమణీయరుచిం కమనీయతనుం
నమ, సాంబశివం నతపాపహరమ్ II

శివం, శంకరం బంధురం సుందరేశం
నటేశం, గణేశం, గిరీశం, మహేశం I
దినేశేందునేత్రం సుగాత్రం మృడానీ
పతిం శ్రీగిరీశం హృదా భావయామి II

భృంగీచ్ఛానటనోత్కటః, కరిమదగ్రాహీ, స్ఫురన్మాధవా
హ్లాదో, నాయుదతో, మహసితవపుః, పంచేషుణా చాదృతః I
సత్పక్షః సుమనోవనేషు, స పునస్సాక్షాన్మదీయే మనో
రాజీవే, భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః II

సోమోత్తంసస్సురపరిషదామేష జీవాతురీశః
పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః I
ద్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగః
శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాధురీణః II

ఏణం పాణౌ, శిరసి తరుణోల్లాసమేణాంకఖండం
పార్శ్వే వామే వపుషి తరుణీం, దృక్షు కారుణ్యలీలామ్ I
భూతిం ఫాలే, స్మితమపి ముఖే, గంగమంభః కపర్దే,
బిభ్రత్ప్రేమ్ణా, భువనమఖిలం శ్రీగిరీశస్స పాయాత్ II

శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృషాళిశీతే
స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురితనవగృహే దివ్యపీఠే శుభార్హే I
ఆసీనస్సోమచూడస్సకరుణనయనస్సాంగనస్స్మేరవక్త్రః
శంభుశ్శ్రీభ్రామరీశః ప్రకటితవిభవో దేవతాసార్వభౌమః II

యా యోగిబృందహృదయాంబజరాజహంసీ
మందస్మితస్తుతముఖీ మధుకైటభఘ్నీ I
విఘ్నాంధకారపటభేదపటీయసీ సా
మూర్తిః కరోతు కుతుకం భ్రమరాంబికాయాః II

కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖపురామోదోల్లసద్వీటికామ్ I
లోలాపాంగతరంగితైరతికృపాసారైర్నతానందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II

రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్ I
రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II

శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజ్ఞయౌవనలసద్గంథర్వకన్యావృతామ్ I
దీనానామతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే II


ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ
దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ I
కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర
స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్ II

శ్రీ మల్లికార్జున ప్రపత్తిః

జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్ II

వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్ I
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః II

కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః I
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః II

సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ II

యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః I
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ II

యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే I
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః II

శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా I
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్ II

II శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్ II

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే I
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ II

సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే I
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ II

సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే I
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II

ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే I
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II

శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్ 

గౌరీమనోహర ! సురాసురమౌనిబృంద
సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

భక్తార్తిహార ! భవబంధవినాశకేశ !
దివ్యాపగాకలితకాంతజటాకలాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

భృంగీశసేవిత ! గణేశకుమారతాత !
మృత్యుంజయ !  త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్తమృగడామరుకత్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

నాగేంద్రచర్మవసనాగ్నిరవీందునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో !
మౌనిప్రియాశ్రితమహాఫలదోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహారకలితోత్తమమూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతిదాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !
సర్పాస్థిరుండకలితామలహారధారిన్ !
భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

సర్వాగమస్తుత ! పవిత్రచరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవగణోత్తమాంగ !
కల్పద్రుమప్రసవపూజితదివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !
శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II

 శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే II

II శివమానస పూజ II
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ I
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ ! దయానిధే ! పశుపతే ! హృత్కల్పితం గృహ్యతామ్ II

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ I
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో ! స్వీకురు II

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలాగీతం చ నృత్యం తథా I
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో ! పూజాం గృహాణ ప్రభో II

ఆత్మా త్వం,  గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం,
పూజా తే విషయోపభోగరచనా, నిద్రా సమాధిస్థితిః I
సంచారః, పదయోః, ప్రదక్షిణవిధిః, స్తోత్రాణి సర్వా గిరో,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో ! తవారాధనమ్ II

కరచరణకృతం వా, కర్మ వాక్కాజయం వా,
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ I
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ ! శివ ! కరుణాభ్ధే ! శ్రీ మహాదేవ ! శంభో ! II

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో మల్లికార్జున సుప్రభాతం చూడండి 
Todays Quote:
"Success means doing the best we can with what we have. Success is the doing, not the getting; in the trying, not the triumph. Success is a personal standard, reaching for the highest that is in us, becoming all that we can be."
Zig Ziglar

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


13, నవంబర్ 2021, శనివారం

కార్తీక దీపం అంటే ? దీపం ఎలా వెలిగించాలి? దీపాలు ఎన్నిరకాలు ? ఏ దీపం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి ?

wowitstelugu.blogspot.com

కార్తీక దీపం అంటే ? దీపం ఎలా వెలిగించాలి? దీపాలు ఎన్నిరకాలు ?  ఏ దీపం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి ?

🪔దీపము లేదా దివ్వె (ఆంగ్లం Lamp) ఒక విధమైన కాంతినిచ్చే సాధనము. చిన్న దీపమైనా చీకటిని తరిమేస్తుంది. దీపావళి దీపాల సమాహారంతో ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగ. సాధారణంగా హిందూ ధర్మంలో దీపారాధన అనేది చాలాపవిత్రమైన కార్యం. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని భావిస్తాం. ఇక పంచాయ తన ఆరాధనలో అయితే దీపాన్ని కార్తీకేయ స్వరూపంగా భావిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక. కార్తీక మాసాన్ని దేవ దీపావళి అని కూడా అంటారట. ఎక్కువగా ఈ నెలలో దీపాలను వెలిగిస్తూ వుంటారు. ఇక ఈ కార్తీకపౌర్ణమి రోజున ముఖ్యంగా శివునికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులట. ముఖ్యంగా ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, దీపాలు వెలిగిస్తే మనం కోరుకునే విధంగా ఫలితాలు అందుతాయి.

👉 కార్తీక మాసంలో దీపం విశిష్టత : 

  • దీపాలకి పెట్టడానికి కార్తీకమాసం చాలా శ్రేష్టమైనది. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మర్నాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక ఆ రోజు నుండి కార్తీకమాసం ముగిసే వరకు ప్రతిరోజు సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తే అన్ని శుభాలు చేకూరి మహాశివుని అనుగ్రహం లభిస్తుంది.

  • సృష్టిలో తొలిదీపం భగవంతుడే! ఆయన జ్యోతి స్వరూపుడు. అందుకే ఏ దేవుని, దేవత నామావళిని మనం గమనించినా - పరంజ్యోతి, జ్యోతిసే నమః అని పరంజ్యోతియే నమః, జ్యోతిస్వరూపాయై నమః అని ఉంటుంది. తాను ప్రకాశిస్తూ అన్నింటినీ ప్రకాశింప చేసే రూపం ఏదో అదే జ్యోతి. అదే భగవంతుడు. వెలుగులకు వెలుగు, సమస్త లోకాలను కాంతిమయం చేయగలిగిన వాడు పరమాత్ముడే.

  • పరమాత్మ ఎక్కడో ఉండడు. మన లోపలే ఉంటాడు. మనం పూజానంతరం చెప్పుకునే "మంత్రపుష్పం" ఆయన అనేక జ్వాలల సమాహారమని వర్ణిస్తుంది. ఇంకా హృదయ క్షేత్రంలో పరమాత్మ జ్యోతిలా వెలుగుతుంటాడంటుంది. 

  • ఉపాసనామార్గంలో తన లోపలికి తానే వెళ్ల గలిగితే ఆ జ్యోతి తానే అని తెలుస్తుంది. ఆ తెలుసుకోగలగడమే మనిషి జన్మకు సార్థకం. ఇదే మనిషి జన్మకు ప్రధానమైన లక్ష్యం కావాలి. లోపల ఉన్న వస్తువే తాను అనే విషయాన్ని అవగాహన చేసుకుని అక్కడే స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరతత్త్వం అర్ధం అవుతుంది. తద్వారా మోక్షం సిద్ధిస్తుంది. 

  • దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అన్నారు. శరీరం లోపల ఈశ్వర ప్రకాశం ఉండి శరీరం పని చేస్తుండగానే శాస్త్రాన్ని, గురువును ఆధారం చేసుకుని భగవన్మార్గంలో ప్రయాణం చేసి పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం

జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే!

జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్

తస్మె శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

అన్నారు శంకరాచార్యులు

  • అంటే కొన్ని రంధ్రాలున్న కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీప కాంతి అన్ని వైపులకు ప్రసరించి కాంతిని వెదజల్లుతుంది.

  • అలాగే, మన శరీరంలోని జ్ఞానజ్యోతి జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకాశిస్తుంటే మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాం.  లోపలి పరంజ్యోతి తెలుసుకునేందుకు ఆధారభూతమైనది బయట మనం వెలిగించే దీపం. ఈ దీప సహాయంలో లోపలి దీపాన్ని తెలుసుకోవాలి. అంటే బయటి దీపాన్ని గురువుగా భావించాలి.

  • ఆలయాల్లో కూడా సాధారణంగా గర్భగుడిలో ఎప్పుడూ కేవలం ఒక్క నూనె దీపం మాత్రమే ఉంటుంది. ఆ దీప సాయంతోనే ఆలయం లోపలి పరమాత్మను చూడగలుగుతాం. అదే విధంగా హృదయంలోని పరమాత్మను కూడా జ్ఞానజ్యోతి ద్వారా దర్శించగలగాలి. అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ" అన్నారు. బయట వెతికితే కనిపించదు. ఆర్తితో, ఏకాగ్రతతో లోపల శోధించాలి. అప్పుడే పరమేశ్వరి దర్శనం లభిస్తుంది.

  • దీపం వెలిగించి పూజ చేసే సమయంలో  'దీపం దర్శయామి' అన్న ఉపచారం వచ్చినప్పుడు దీపకాంతిలో పరమాత్మ పాదాలను దర్శించాలి. అంటే దీపాన్ని దేవుని పాదాల చెంత ఉంచి అక్కడనుంచి పాదాలు దర్శించమని కాదు. అలా మనోనేత్రంతో దర్శించగలగాలి. 

  • ఉజ్జ్వలమైన దీపకాంతిలో అంతకంటే తేజోమయమైన దైవం పాదాలు ప్రకాశిస్తుంటే ఆ కాంతిని మనం చూడగలగాలి. అలా చూడాలంటే సాధారణ దీపాలతో సాధ్యం కాదు. ఎవ్వరూ వెలిగించనవసరం లేకుండా వెలిగే సూర్యభగవానుడే అసలైన దీపం. అందుకే, *సూర్యే మధ్యది హిః* అంటాం. సూర్యభగవానుడే దీపమై ఉన్నాడని అర్థం.

👉 ఆకాశదీపం అంటే ఏమిటి :

కార్తీక మాసంలో, ముఖ్యంగా శివాలయాలలో ఎత్తైన చోట, అవసరమైతే ఒక గడకు కట్టి, సాయం సంధ్యవేళ, మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన ఒక చిల్లుల పాత్రలో నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఒత్తులను వెలిగించడం ఒక సంప్రదాయంగా ఉంది. కార్తీక మాసం అంతా ప్రమిదలు వెలిగించే ఈ దీపాన్ని ఆకాశదీపం అంటారు; సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు వెలిగించే దీపం; కార్తీక దీపం అని కూడా వ్యవహరిస్తారు.

👉 కార్తీక దీపం విశిష్టత:

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి.

  • రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మెుత్తాన్ని సూచిస్తాయి

  • ఈ ఒత్తులు. అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు.
  • మనం తెలియక చేసిన కొన్ని పాపాలు ఈ మాసంలో పూజలు చేస్తే తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ నెలలో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందట. 

  • ప్రతిరోజు నదీ స్నానం చేసి ఆ తర్వాత పూజ గదిలో దీపాలను వెలిగించి, తులసి చెట్టు దగ్గర మరొక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందట. 

  • ఇక ఇలా వెలిగించిన దీపాలను ఏదైనా నదిలో కాని, ఎటువంటి కాలువలో కానీ అరటి ఆకు మీద పెట్టి వదిలితే చాలా మంచిదట.

  • ఈ మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు సమానమట. దీంతో శివుని కృప మన మీద ఉంటుందట. సుఖసంతోషాలతో ఆనందంగా వెదజల్లుతూ ఉంటాము. ముఖ్యగా దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందట.

  • ఇక ఇలా దీపాలు పెట్టడం తో పాటు, హోమాలు చేయడం కూడా మంచిదని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు. 

  • దీపాలను  సూర్యుడు ఉదయించక ముందే పెట్టాలి. 

  • సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించే టప్పుడు పెట్టాలి. 

  • మనం ఉదయం పూట దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర పెడితే అది కార్తీక దామోదరుడు కి చెందుతుందట. 

  • మనం శివుని దగ్గర పెట్టే దీపం అది శివునికి చెందుతుందట. 

👉 పరిశుభ్రమైన దీపారాధన

  • శుభ్రమైన దీపారాధన కుంది/సెమ్మలో దీపం పెట్టాలి.

  • ప్రతీరోజు శుభ్రంగా కడిగిన దానిలో మాత్రమే దీపం పెట్టాలి.

  • నిన్న దీపం పెట్టిన కుంది కడగకుండా దీపారాధన చేయకూడదు.

  • దీపారాధన వెలిగించేటప్పుడు అగ్గిపుల్లలతో కాకుండా కర్పూరంతో వెలిగించాలని పండితులు తెలియజేస్తుంది.

👉 దీపారాధన కు ఎటువంటి నూనె వాడాలి :

  • భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించి పూజిస్తే శత్రుపీడ విరగడ అవుతుంది. సూర్యభగవానుడి ప్రసన్నం కోసం నేతిదీపం వెలిగించాలి.

  • శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనె తో దీపారాధన చేయాలి.

  • నల్ల నువ్వుల నూనె తో శనీశ్వరునికి దీపారాధన శుభము.

  • వ్యాపారస్థులు ఆర్ధిక లాభాల కోసం నియమపూర్వకంగా పూజగదిలో లేదా దేవాలయాలలో స్వచ్చమైన నేతి దీపం వెలిగించాలి. 

  • ఏ దేవీదేవతల పూజలో అయినా  ఆవునేయ్యి దీపం, నువ్వులనూనె దీపం తప్పకుండా వెలిగించాలి. 

  • దుర్గాదేవి, లలితాదేవి, సరస్వతీదేవీల అనుగ్రహం కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. ఇలా ఆయా దేవతలకు దీపారాధన చేస్తే వారికి దేవతానుగ్రహం శ్రీఘ్రంగా కలుగుతుంది 
  • దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది 

  • విప్ప, వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 

  • అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

  • ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు. 

👉 దీపానికి ఏ ప్రమిద వాడాలి


మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో ఏ దీపం వెలిగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటివి ఇప్పుడు తెలుసుకుందాం

  • పంచలోహాలు,వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు

  • తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం.

  • సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

  • దీపాన్ని క్రింద పెట్టకూడదు.

  • దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి.

👉 దీపం ఎటువైపు వుండాలి :


దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరో సందేహం. దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి. బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.

  • తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు

  • పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది.

  • ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు,విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి.

  • దక్షిణంవైపు దీపారాధన చేయరాదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు,కష్టాలు, దుఖం బాధ కలుగుతాయి.

  • దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు.

  • రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.

  • ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.

  • నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కానీ ఇంట్లో స్థలం, నూనె, ఆర్థిక పరిస్థితులను చూసుకుని పెట్టాలి. 

  • అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి.  భక్తి, శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే. 

👉 దీపారాధనకు ఎటువంటి వత్తులు ఎన్ని వత్తులు ఉండాలి

  • దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు.

  • తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు

  • అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించుకునుటకు మంచిది. 

  • ఒకే ప్రమిదలో మూడువత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు.

  • అవకాశం ఉంటే దేవుని రూపాలు/ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు.

  • ప్రతి దాంటో మూడు వత్తులను కలపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలింగచవచ్చు.

👉 దీపాలు ఎన్ని రకాలు :

నందాదీపం🪔

దీన్నే అఖండదీపం అని కూడా అంటారు. ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఈ దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామి శిలారూపంలో స్వయంభువుగా పద్మపీఠంపై ప్రతిష్ఠితులైనప్పుడు ఆ తేజోమయ మూర్తి ముందు తొలి దీపాన్ని చతుర్ముఖ బ్రహ్మ వెలిగించాడు.

అర్చాదీపం 🪔

మనం పూజలో ఉపయోగించే దీపాన్ని అర్చాదీపం అంటారు.

లక్ష్మీదీపం 🪔

లక్ష్మీదేవి అంతరాలయంలో వెలిగించిన దీపాన్ని లక్ష్మీ దీపంగా పిలుస్తారు.

బలిదీపం 🪔

ఆలయంలో బలిహరణ స్తంభం వద్ద వెలిగించే దీపాన్ని బలిదీపం అంటారు.

ఆకాశదీపం 🪔

దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తికమాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఈ దీపం వెలిగించరు. కార్తికమాసం ఆరంభంనుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడుసాయంతో ఆకాశదీపం వెలిగిస్తారు. దీనిని చూడడం, వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది.

నిరంజన దీపాలు 🪔

అనేకమైన కుందుల్లో గుత్తులు గుత్తులుగా దీపాలు వెలిగిస్తే వాటిని నిరంజన దీపాలంటారు.

👉 జ్వాలా తోరణం అంటే ఏమిటి

కార్తిక పున్నమినాడు ప్రతీ శివాలయంలోనూ జ్వాలా తోరణం నిర్వహిస్తారు. అంటే ఇరుపక్కలా రెండు గడకర్రలను పాతిపెడతారు. ఆ రెండు కర్రలను కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు. కొత్త గడ్డిని తాడులా పురిటని దాన్ని వరుసలుగా చుడతారు. యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగానే పెద్ద చక్రంలా తయారు చేస్తారు. ఆ చక్రం చుట్టూ ఇంధనంగా నెయ్యి పోసి దాన్ని గడకర్రలకు అడ్డంగా కట్టిన కర్ర మధ్యలో వేలాడదీస్తారు. అనంతరం అగ్నిని ప్రజ్వలింప చేస్తారు. ఈ గడ్డి తాడే కాలభైరవుడు.

  • మానవుడు ప్రాణాలు విడిచిపెట్టగానే ముందుగా కనిపించేది అతి భయంకరంగా ఉండే నల్లని కుక్క. ఆరు ముఖాలతో భౌభౌమంటూ క్రూరంగా అరచుకుంటూ మనల్ని తరుముకుంటూ వస్తుంది. ఆ సమయంలో మన ముందు ఏమీ కనిపించ చిక్కటి చీకటి. వెనక తరుముతూ కుక్క. ఆ కుక్కకు చిక్కకుండా ఎటువెళ్లాలో కూడా తెలియని అయోమయ స్థితిలో అలా పరిగెడుతూనే చివరకు యమద్వారం చేరుకుంటుంది దేహం.

  • భగభగమంటలతో వెలుగుతూ వలయంలా తిరుగుతూ ఉంటుందా ద్వారం. ముందుకు వెడదామఁ కాల్చి బూడిద చేసే భయంకరమైన అగ్నిజ్వాల. వెనక్కి వెడదామంటే నాలికలు బార చాచి, తన పదునైన ఇనుప పళ్లతో దేహాన్ని ఒడిసిపట్టి రక్కేసేందుకు భైరవం తరుముకు వస్తుంటుంది. చేసేది లేక ఒళ్లంతా బొబ్బలు పెడుతున్నా అగ్నితోరణం (జ్వాలావలయాన్ని) దాటి లోపలికి ప్రవేశిస్తుంది దేహం. అప్పటి వరకూ తరముకు వచ్చిన ఆ కుక్క కాల భైరవుడు. ఉగ్రభైరవుడు.

  • ఆ నరకద్వారం లోపల మరింత భయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితి దాపురించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని అలనాటి మహర్షులంతా కలిసి మహాదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన కరుణించి మహా మృత్యుంజయ మంత్రంతో ధ్యానించి తనను శరణు కోరుకున్న వారు నరకద్వారాన్ని చేరుకోరని వరాన్ని ప్రసాదించాడు. అందుకు అనువుగా కార్తికమాసం నాటి పున్నమినాడు తప్పనిసరిగా జ్వాలాతోరణాన్ని వెలిగించి దాని మధ్యనుంచి దాటిన వారు నరకద్వారాన్ని చేరుకోరంటూ అనుగ్రహించాడు అశుతోషుడు.

  • జ్వాలాతోరణం ఎదుట "నా మరణానంతరం ఈ ద్వారాన్ని దాటే పరిస్థితి కల్పించకు శంకరా" అని ప్రార్థించాలి. శివుడు అర్థాంగితో సహా పల్లకీలో గడ్డిచక్రం మధ్యనుంచి మూడు సార్లు దాటతాడు. అది యమద్వారం నుంచి మనల్ని రక్షిస్తాడనే దానికి సంకేతం. భక్తులు కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఆ పల్లకి వెనకే దాటతారు. ఈ విధంగా చేసిన వాళ్లకు నరక బాధ ఉండదని భక్తుల విశ్వాసం.

  • భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు దాక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు.

  • కార్తిక వేళ భీమశంకరుని నగర మందు దూరునెవ్వారు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణనిర్వాణ వేళ భీకరమగు యమద్వార తోరణంబు* అంటాడు.

  • అందుకే కార్తికపున్నమినాడు జ్వాలాతోరణం జరిగే సమయంలో ఆ తోరణమధ్యనుంచి పార్వతీపరమేశ్వరుల పల్లకి వెడుతుంటే దాని వెనుక భక్తులు కూడా అటు, ఇటూ మూడుసార్లు వెళ్లివస్తారు. 

  • ఆ అగ్నికి ఆహుతి కాగా మిగిలిన గడ్డిని కొంత ఇంటి చూరులోను, పశువుల గడ్డివామిలోనూ, ధాన్యాగారాల్లోనూ, పొలాల్లోనూ ఉంచుకుంటారు. ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంటిలోకి ఏ దుష్టగ్రహాలూ ప్రవేశించవు. అలాగే, ధాన్యాగారాల్లో ధాన్యం అక్షయంగా ఉంటాయి. ప్రశాంత జీవితానికి అది రక్షగా ఉంటుందని భక్తుల విశ్వాసం.

ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల లో దీపం గురించి తెలుసుకోండి. 












ఈ రోజు సూక్తి:

"I never dreamed about success. I worked for it."
-Estee Lauder

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్, చేయండి. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com