8, నవంబర్ 2021, సోమవారం

నాగుల చవితి నాడు అందరూ తప్పకుండా ఇవి పారాయణ చేసుకోవలసిన స్తోత్రాలు

wowitstelugu.blogspot.com

నాగుల చవితి  విశిష్టత  నాగుల చవితి నాడు అందరూ తప్పకుండా పారాయణ చేసు కోవలసిన  స్తోత్రాలు


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. 

కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. హిందూ పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి.

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.

ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయు నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు.   

వెన్నులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది.

మానవ శరీరంలో ఇది నిదురిస్తున్నట్లు నటిస్తూ  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది.

అందుకు 'నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పలు ఉన్న పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది.

అందరి హృదయాలలో నివశించే 'శ్రీమహావిష్ణువు"కు ఆదిశేషువుగా తెల్లటి పాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈనాగుల చవితి.

ఇదే ఈ నాగుల చవితి నాడు పాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

ఈ స్తోత్రాన్ని నాగుల చవితి రోజున పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ  పఠించాలి.

సర్ప సర్ప భద్రాంతే దూరం గచ్ఛ మహావిషమ్|  

జనమేజయ యాగాంతే ఆస్తిక వచనమ్|  

అనంతాయ నమస్తుభ్యం సహస్రశిరస్తేనమః|  

నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయేనమః| 

అనంతో వాసుకిం శేషం తక్షకః గుళికస్తథా|| 

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు,

ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని,

చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి

ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ

సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!

అనంతాది మహానాగ రూపాయ వరదాయచ

తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా
`

అని పఠించాలి 

నాగుల చవితి రోజున ఈ క్రింది కలిదోష నివారణ శ్లోకం పఠిస్తే కలి దోష నివారణ అవుతుందని   శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||

"నాగుల చవితి" నుండి మూడు రోజులు వరుసగా, దీక్షగా, ఈ క్రింది "నవనాగ స్తోత్రం" పారాయణ అందరు చేసి ఫలితం పొందండి
నవ నాగ స్తోత్రం

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


ఫలశృతి:

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!

సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!


సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!

సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!


సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!

తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!


ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి*


ఇతి శ్రీ నవనాగ స్తోత్రం

సర్పసూక్తం నాగుల చవితి రోజున పారాయణం చేయడం ద్వారా శుభ స్థితులు పొందుతారు.

సర్పసూక్తం

బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః
నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

సర్పాలు పితృ దేవతలకు సంకేతం.

వారి అనుగ్రహం ఉంటే ఏ ఇబ్బందులు కలుగవు, జీవితంలో ఉన్నతి కలుగుతుంది.

నాగుల చవితి సందర్భంగా అపురూపమైన సర్ప గాయత్రిమంత్రం

ఓం మహా సర్పాయ విద్మహే

బహు రక్షాయ ధీమహి

తన్నో పితృ ప్రచోదయాత్ ||

నిత్య పూజా స్త్రోత్రం

శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి

నాగ చతుర్థి, నాగ పంచమి సందర్భంగా

ఓం అనంతాయ నమ:

ఓం ఆదిశేషాయ నమ:

ఓం అగదాయ నమ:

ఓం అఖిలోర్విచరాయ నమ:

ఓం అమితవిక్రమాయ నమ:

ఓం అనిమిషార్చితాయ నమ:

ఓం అదివంధ్యానివృత్తయే నమ:

ఓం అశేషఫణామణ్డలమణ్డితాయ నమ:

ఓం అప్రతహతానుగ్రహదాయినే నమ:

ఓం అమితాచారాయ నమ:

ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమ:

ఓం అమరాధిపస్తుత్యాయ నమ:

ఓం అఘోరరూపాయ నమ:

ఓం వ్యాళవ్యాయ నమ:

ఓం వాసుకయే నమ:

ఓం వరప్రదాయకాయ నమ:

ఓం వనచరాయ నమ:

ఓం వంశవర్ధనాయ నమ:

ఓం వాసుదేవశయనాయ నమ:

ఓం వటవృక్షాశ్రితాయ నమ:

ఓం విపవేషధారిణేన నమ:

ఓం వినాయకోదరబద్ధాయ నమ:

ఓం విష్ణుప్రియాయ నమ:

ఓం వేదస్తుత్యాయ నమ:

ఓం విహితధర్మాయ నమ:

ఓం విషధరాయ నమ:

ఓం శేషాయ నమ:

ఓం శత్రుసూదనాయ నమ:

ఓం శంకరాభరణాయ నమ:

ఓం శంఖపాలాయ నమ:

ఓం శ్యామవర్ణాయ నమ:

ఓం శంభుప్రియాయ నమ:

ఓం షడాననాయ నమ:

ఓం పంచశిరసే నమ:

ఓం పాపనాశనాయ నమ:

ఓం ప్రమదాయ నమ:

ఓం ప్రచండాయ నమ:

ఓం భక్తివశ్యాయ నమ:

ఓం భక్తిరక్షకాయ నమ:

ఓం బ హుశిరసే నమ:

ఓం భాగ్యవర్ధనాయ నమ:

ఓం భవభీతిహరాయ నమ:

ఓం తక్షకాయ నమ:

ఓం త్వరితగమనాయ నమ:

ఓం తమొరూపాయ నమ:

ఓం దర్వీకరాయ నమ:

ఓం ధరిణీధరాయ నమ:

ఓం కశ్యపాత్య‌జాయ నమ:

ఓం కాలరూపాయ నమ:

ఓం యుగాదిపాయ నమ:

ఓం యుగంధరాయ నమ:

ఓం యుక్తాయుక్తాయ నమ:

ఓం యుగ్మశిరసే నమ:

ఓం రశ్మివంతాయ నమ:

ఓం రమ్యగాత్రాయ నమ:

ఓం కేశవప్రియాయ న:

ఓం విశ్వంభరభరాయ నమ:

ఓం ఆదిత్యమర్థనాయ నమ:

ఓం సర్వపూజ్యాయ నమ:

ఓం సర్వాధారాయ నమ:

ఓం నిరాశాయ నమ:

ఓం నిరంజనాయ నమ:

ఓం ఐరావతాయ నమ:

ఓం శరణ్యాయ నమ:

ఓం సర్వదాయకాయ నమ:

ఓం ధనంజయాయ నమ:

ఓం లోకత్రయాధీశాయ నమ:

ఓం శివాయ నమ:

ఓం వేద వేద్యాయ నమ:

ఓం పూర్ణాయ నమ:

ఓం పుణ్యాయ నమ:

ఓం పుణ్యకీర్తియే నమ:

ఓం పరేశాయ నమ:

ఓం పారగాయ నమ:

ఓం నిష్కళాయ నమ:

ఓం వరప్రదాయ నమ:

ఓం కర్కోటకాయ నమ:

ఓం శ్రేష్ఠాయ నమ:

ఓం శాంతాయ నమ:

ఓం దాంతాయ నమ:

ఓం జితక్రోధాయ నమ:

ఓం జీవాయ నమ:

ఓం జయదాయ నమ:

ఓం జవప్రియాయ నమ:

ఓం విశ్వరూపాయ నమ:

ఓం విధిస్తుతాయ నమ:

ఓం విథీంద్రశివసంస్తుత్యాయ నమ:

ఓం శ్రేయ:ప్రదాయ నమ:

ఓం ప్రాణదాయ నమ:

ఓం అవ్యక్తాయ నమ:

ఓం వ్యక్తరూపాయ నమ:

ఓం తమోహరాయ నమ:

ఓం యోగీశాయ నమ:

ఓం కళ్యాణాయ నమ:

ఓం బాలాయ నమ:

ఓం బ్రహ్మచారిణే నమ:

ఓం వటురూపాయ నమ:

ఓం రక్తాంగాయ నమ:

ఓం శంకరానందకరాయ నమ:

ఓం విష్ణుతల్పాయ నమ:

ఓం గుప్తాయ నమ:

ఓం గుప్తతరాయ నమ:

ఓం రక్తవస్త్రాయ నమ:

ఓం రక్తభూషాయ నమ:

ఓం కద్రువాసంభూతాయ నమ:

ఓం ఆధారవీధిపధికాయ నమ:

ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమ:

ఓం ఫణిరత్నవిభూషణాయ నమ:

ఓం నాగేంద్రాయ నమ:

ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్. ల లో నాగదేవత స్తోత్రాలు చూడండి



ఈ రోజు సూక్తి:

"Chase the vision, not the money. The money will end up following you."
-Tony Hsieh

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


4, నవంబర్ 2021, గురువారం

దీపావళి అంటే ఏమిటి దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు తెలుసుకోండి

wowitstelugu.blogspot.com
దీపావళి అంటే ఏమిటి దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు తెలుసుకోండి

దీపావళి అంటే దీపాల వరుస. దీపాలతో ప్రపంచాన్ని జ్ఞానం తో వెలిగించలన్నది దీని పరమార్ధం. రాత్రిపూట ఆకాశంలోని నక్షత్రాలు మనకు ఎలా చిన్న దీపాల్లా కనిపిస్తాయో, మన గ్రామాల్లోని వీధుల్లో చూస్తే భూమిపై ఉండే జ్యోతులు కూడా ఆకాశంలోని చుక్కల్లా కనిపిస్తాయి. ఇందులో వైజ్ఞానిక సత్యంతో పాటు ఓ ఆధ్యాత్మిక సందేశం ఉందని భావించవచ్చు. విశ్వంలో ఉన్నది మనలో ఉంది, మనలో ఉన్నది విశ్వంలో ఉందని ఈ దీపాలు సందేశాన్నిస్తున్నాయి.

ఉపనిషత్తులు ‘పద్మకోశప్రతీకాశం’ అని అన్నాయి. శంకరభాష్యంలో దీనికి వివరణ ఉంది. ప్రతి జీవి గుండెలోనూ ఓ దీపం తలకిందులుగా వేలాడే తామర మొగ్గలా ఉంటుంది. అలాంటి దీపాలే ఈ మొగ్గలోని ప్రతి రేకులో ఒకటి వంతున సూక్ష్మరూపంలో ఉన్నాయి పద్మం మధ్యభాగంలో మూల దీపం ఉంది.

‘తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్థ్వా వ్యవస్థితా’ అని వేదాలు చెబుతున్నాయి. ఈ దీపం దేహానికి అవసరమైన వేడిని, రక్తానికి సారాన్ని ఇస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తోంది. అదే మన జీవన దీపం.

మన పురాణాల ప్రకారం నరకాసుర వధ జరిగిన రోజున దీపావళి అని చెబుతారు. హిరణ్యాక్షుడి బారి నుంచి భూమిని రక్షించడానికి విష్ణువు వరాహవాతారంలో వచ్చినప్పుడు పుట్టినవాడు నరకాసురుడు. అతను సత్య, త్రేత, ద్వాపర అనే మూడు యుగాల్లోనూ ఉన్నట్లు చెబుతారు. మరి ఇంత కాలం అతనెందుకు ఉన్నాడు.. అతన్ని చంపడం కోసం కృష్ణుడెందుకు వేచి ఉండాల్సివచ్చిందనే దానికి సమాధానం కాల మహిమ అని చెబుతారు.

రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞాన స్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.

దీపం పెట్టాలంటే వత్తి, చమురు, ప్రమిద, ఆరిపోకుండా ఓ పారదర్శక రక్షణ కవచం అవసరం. అలాగే మనలో జ్ఞానజ్యోతి వెలగాలంటే చమురు మన భక్తి. అది జ్వలించడానికి అవసరమైన వాయువు భగవంతుడి కోసం మనం పడే తపన. ఆశ, ద్వేషాలనే పొగ, మసి మనస్సుకు పట్టకుండా చేసే రక్షణ కవచం మన ఏకాగ్రత. బ్రహ్మచర్యం, వైరాగ్యం, ఆత్మ సంయమనం, సాధారణ జీవనం అనేవి దీపంలో వేసే వత్తులు. ఈ ఉపకరణాల సాయంతో వచ్చే వెలుగులో మనస్సు స్థిరమైన ధ్యానంలో కుదురుకుంటుంది. అనంతానందదాన్ని పొందుతుంది. అలా జ్ఞాన జ్యోతులను ప్రజ్వలింపజేయడమే దీపావళి.

*దీపాగ్రే వర్తతే విష్ణు: దీప మధ్యే మహేశ్వర: దీపాంతే చ తదా బ్రహ్మ దీపం త్రైమూర్తికం విదు:!!*

తాత్పర్యం:-

దీపం అగ్ర భాగం విష్ణువు, మధ్య భాగం మహేశ్వరుడు, దీపం కింది భాగాన బ్రహ్మ కొలువై ఉన్నారు. దీపం త్రిమూర్తిమయం. దీప ప్రజ్వలన త్రిమూర్తి ఆరాధన.


*దీపాగ్రే వర్తతే లక్ష్మీ దీప మధ్యేచ పార్వతీ దీపాంతే శారదా ప్రోక్త దీపం శక్తి మయం విదు:!!*

తాత్పర్యం:-

దీపం అగ్ర భాగం లక్ష్మీ, మధ్య భాగం పార్వతీ, దీపం కింది భాగాన సరస్వతి కొలువై ఉన్నారు. దీపం త్రిశక్తి మయం. దీప ప్రజ్వలన త్రిమాతల ఆరాధన.

దీపావళి అమావాస్య రోజు మాత్రమే మంత్రసిద్ధి కలిగే ఈ మహా మంత్రములు సాధన చేసి అద్భుత ఫలితములు పొందండి

దీపావళిరోజు సాయంకాలం లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం వద్ద ఆవునెయ్యి దీపం వెలిగించాలి. మంత్రసాధనకు ముందు మీకు నాలుగు దిక్కులా నెయ్యి దీపాలను వెలిగించుకోవాలి , మీకు అవసరమయిన మంత్రాన్ని 11 మాలలు అంటే 11 X 108 సార్లు పఠించాలి.

● మహాలక్ష్మి అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రియం దేహి మహాలక్ష్మి ఆగచ్ఛ స్వాహా

● కుబేర అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ నమో భగవతే ధనం దేహి దేహి ఓం

● ఆకస్మిక ధనప్రాప్తికి

ఓం హ్రీం శ్రీమ్ హ్రీం నమః

● నూతన గృహప్రాప్తికి లేక స్థలము ప్రాప్తికి

ఓం హ్రీం వసుధాలక్ష్మియే నమః

● శత్రునివారణకు

ఓం క్లీం కాళీ శతృశమనం కురు కురు ఫట్

● విద్యాభివృద్ధికి
ఓం ఐ0 క్రీమ్ ఐ0 ఓం

● అన్నపూర్ణ అనుగ్రహం కొరకు

ఓం హ్రీం శ్రీమ్ క్లీం అన్నపూర్ణే స్వాహా

● దీర్ఘాయుష్ష్ మరియు అనారోగ్య నివారణ

ఓం ఐమ్ దీర్ఘాయుష్యం సిద్ధయే ఓం నమః

● సత్సంతాన ప్రాప్తి కొరకు

ఓం నమో భగవతే పుత్ర సుఖం సాధయ కురు కురు నమః

● ప్రమాదాలు జరుగకుండా ఉండుటకు

ఓం క్రీమ్ కాళికే హ్రూం ఫట్ స్వాహా

● ఉద్యోగప్రాప్తి కొరకు

ఓం హ్రీం కార్యసిద్ధిం ఓం నమః

● ధనప్రాప్తి కొరకు

ఓం శ్రీమ్ శ్రీమ్ మహాధనం దేహి ఓం నమః

● కీర్తి ప్రతిష్టలు

ఓం ఐ0 కీర్తి వృద్ధిం దేహి దేహి ఓం

● కోపం తగ్గుటకు

ఓం క్రీమ్ క్రోధం సంహారయ వస్య ఓం ఫట్

● వ్యాపార ఆకర్షణకు

ఓం శ్రీమ్ ఇం శ్రీయం సాధయ ఫట్

● భార్యాభర్తల అనురాగముకు

ఓం హ్రీం మొహితే ఆకర్షయ నమః స్వాహా

● కోర్టు కేసులలో విజయం కొరకు

ఓం హ్రూం శత్రూన్ వశ్య విజయ సిద్ధిం ఓం ఫట్

● జీవితములో కష్టములు తొలగుటకు

ఓం క్లీం శ్రీమ్ శ్రీయహ్ స్వాహా

● శ్రీఘ్ర వివాహం కొరకు

ఓం క్లీం వివాహ సిద్ధిం ఓం ఐ0 ఫట్

● నిత్య సుమంగళి గా ఉండుటకు

ఓం శ్రీమ్ సౌభాగ్యం సుమంగళాయ ఫట్

దీపావళి అంటే ఏమిటి ఆ రోజు చేసే పూజలు ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లో తెలుసుకోండి



ఈ రోజు సూక్తి:

"Find out what you like doing best, and get someone to pay you for doing it."
- Katherine Whitehorn

Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com