26, జనవరి 2021, మంగళవారం

జప మాలకు ఏమి వాడాలి జప మంత్రం వేగంగా సిద్ధించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి

wowitstelugu.blogspot.com

జప మాలకు ఏమి వాడాలి జప మంత్రం వేగంగా సిద్ధించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి


జపమాల గురించి వివరణ


ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును. జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము. దాని ఫలితము రాక్షసులకు పోవును .  

  • జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము .

  • 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల .

జపమాల తో జపము చేయు విధానం:

  • మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను.

  • దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును.

  • మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను.

  • మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును.

  • జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను

  • దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను.

  • జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను.

  • జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును.

ఏ మాల తో జపం ఏ ఫలితం వస్తుంది

  • రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును.

  • పద్మమాలిక సర్వబీష్ట సిద్ది,పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము ,

  • పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం ,

  • ఉశిరిక గింజల మాల జ్వరశాంతి ,

  • పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును.

  • ఔదుంబర మూలికామాల సర్వసిద్ది ,

  • తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను .

  • హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది ,

  • మణులతో చేసిన మాల సామ్రాజ్యము ,

  • స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట ,

  • పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం ,

  • రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును.

జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లతో జపం చేసిన ఏమి ఫలము కలుగును

  • ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను. మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును.

  • బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది .

  • చూపుడువేలు ఉచ్చారణ కొరకు ,

  • కనిష్ఠఅంగుష్ఠములు మరణము ,

  • చూపుడు వ్రేలు శత్రునాశనము ,

  • మధ్యవ్రేలు రోగహరి ,

  • ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ ,

  • అంగుష్ఠము మోక్షమును ఇచ్చును.

👉జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను.


👉 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు.

👉 ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును.

జప మంత్రం తొందరగా సిద్ధించడానికి కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే

  • రోజూ స్నానం చేయాలి.లేదా కాళ్ళూ,చేతులూ కడుక్కోవాలి.ఉతికిన వస్త్రాలు ధరించాలి.స్నానం చేసిన తర్వాత జపం పూర్తయ్యేవరకూ ఎవరినీ ముట్టుకోకూడదు.

  • సంప్రదాయం ప్రకారం జంధ్యం వివాహితులు ధరించాలి.

  • రోజూ మానకుండా చేయాలి.చుట్టాలొచ్చారని,స్నేహితులు వచ్చారని..ఇలా ఏదో వంక పెట్టి జపం మానకూడదు.అయితే ప్రయాణాలు, వివాహాలకు వెళ్ళినప్పుడు తప్పన సరి పరిస్తుతుల్లో మానవలసి వస్తుంది.

  • రోజూ ఒకే సమయం  జపం మొదలుపెడితే వేగంగా సిద్ధిస్తుంది.ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి మీరు ఎప్పుడు చేసినా ఒకే టైమ్ కు జపం చేయాలి.

  • మీరు చేసే జపమాలను మీరు తప్ప వేరే వాళ్ళు తాకకూడదు.

  • జపం చేస్తున్నప్పుడు మనం నేలను తాకకూడదు.కింద శుభ్రమైన వస్త్రం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి.జపమాల కూడా నేలను తాకకూడదు.

  • జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి.వాసన రాకూడదు.

  • ఎట్టి పరిస్థితి లోనూ ధర్మం తప్పకూడదు.

  • భోజనం చేసిన 3 గంటల తర్వాత జపం చేయాలి. టిఫిన్ కు ఈ పట్టింపు లేదు.

  • కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం,పేదవారికి దానం చేయడం,ఆకలితో ఉన్న మనుషులకు, పశుపక్ష్యాదులకు భోజనం పెట్టడం,పూజ,ధ్యానం చేయడం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి.

  • ఇతరులను తిట్టకూడదు.తిట్టడం వల్ల వాళ్ళ పాపాలు మనకు అంటుకుంటాయి.

  • మనం జపం చేసేటప్పుడు జపమాల ఎవ్వరికీ కనిపించకూడదు.దానిపై ఉతికిన గుడ్డ కప్పి చేయాలి లేదా తలుపు గడియపెట్టి చేయాలి.

  • జపమాల కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కింద కూడా ఒక మంచి గడ్డ పరచుకోవాలి.

  • జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలకు తగలకూడదు.

  • మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు.జపం మనసులో చేసుకోవాలి.

  • అప్పుడప్పుడూ గుడిలో,నదీ తీరాల వద్ద,కొండ గుహలలో,పర్వత శిఖరాల వద్ద చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. 

  • ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది(ఉదా:- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి...మొదలైనవి ., )

  • గ్రహణం చాలా పవర్ పుల్.గ్రహణం నాడు చేసే మంత్రం లక్షతో సమానం.

  • అయితే విష్ణు,శివ,లలిత వంటి సాత్విక మంత్రాలు గ్రహణం నాడు చేయకూడదు. రాజస, తామస మంత్రాలు మాత్రమే గ్రహణం నాడు చేయాలి.

ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ లు పై క్లిక్ చేసి  జపమాల విశిష్టత తెలుసుకోండి 


Search Results


Today's Quote:

Believe in yourself! Have faith in your abilities! Without a humble but reasonable confidence in your own powers you cannot be successful or happy."
- Norman Vincent Peale
Note:

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com








23, జనవరి 2021, శనివారం

శరీరం లో కొవ్వు తగ్గి నాజూకుగా అవడానికి అద్భుతమైన 11 రకాలైన ఆహార పదార్థాలు

wowitstelugu.blogspot.com

శరీరం లో కొవ్వు తగ్గి నాజూకుగా అవడానికి అద్భుతమైన 11 రకాలైన ఆహార పదార్థాలు

నీరు:

ఉద‌యం లేవ‌గానే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మకాయ‌ను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది. కొవ్వును క‌రిగించే గుణాలు నిమ్మర‌సంలో ఉన్నాయి. అయితే ఈ మిశ్రమానికి కావాల‌నుకుంటే కొంత తేనెను కూడా క‌లుపుకోవ‌చ్చు.

పుదీనా

కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని వాటిని బాగా న‌లిపి ర‌సం తీయాలి. ఆ ర‌సాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. దీంతో పొట్ట ద‌గ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగించ‌డంలో తోడ్పడుతుంది.

అలోవెరా జ్యూస్


ఉద‌యం, సాయంత్రం భోజనానికి అర‌గంట ముందు అలోవెరా జ్యూస్‌ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో బాగా క‌లిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో అద‌నంగా కొవ్వు చేర‌దు. అంతేకాదు మ‌ల‌బ‌ద్దకం ఉన్నా పోతుంది.

పుచ్చకాయ


భోజ‌నానికి ముందు పుచ్చకాయ ముక్కల‌ను తినాలి. దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇది మ‌నం తినే ఆహారాన్ని త‌గ్గించి బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.


బీన్సూ



బీన్స్‌ నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్నా ఫ‌లితం ఉంటుంది. ఇవి శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి. జీర్ణక్రియ‌ను మెరుగు పరుస్తాయి. చాలా సేపు ఉన్నా క‌డుపు నిండిన భావన‌ను క‌లిగిస్తాయి. దీంతో ఆహారం తిన‌డం త‌క్కువై బ‌రువు త‌గ్గుతారు.


కీర‌దోస‌కాయ



కీర‌దోస‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో భోజ‌నానికి అర‌గంట ముందు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో తాగితే కొవ్వు క‌రిగిపోతుంది. ఇది క‌డుపు నిండిన భావ‌నను క‌లిగించి ఎక్కువ ఆహారం తిన‌కుండా చేస్తుంది.


ట‌మాటాలు



రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున బాగా పండిన 1 లేదా 2 ట‌మాటాల‌ను తినాలి. దీంతో పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది. ట‌మాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే ప‌దార్థం ర‌క్తంలో ఉన్న కొవ్వును తొల‌గిస్తుంది

అల్లం  :



మ‌న శ‌రీరానికి మేలు చేసే అనేక ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాలు అల్లంలో ఉన్నాయి. ఇది కొవ్వును క‌రిగించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత అల్లం ర‌సం క‌లుపుకుని తాగుతున్నా ఫ‌లితం ఉంటుంది.


వెల్లుల్లి :



శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. నిత్యం కొన్ని వెల్లుల్లి రేకుల‌ను ఉద‌యాన్నే తిన‌గ‌లిగితే చాలు. పొట్ట ద‌గ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.


బాదంప‌ప్పు


బాదంప‌ప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగించ‌డంలో తోడ్పడుతాయి. ప్రతి రోజూ కొన్ని బాదం ప‌ప్పుల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

యాపిల్


ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని భోజనానికి క‌నీసం అరగంట ముందు తాగాలి. దీంతో ఆక‌లి బాగా త‌గ్గుతుంది. క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఈ క్రమంలో ఆహారం త‌క్కువ‌గా తింటారు. అంతేకాదు, కొవ్వును క‌రిగించే గుణాలు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో ఉండ‌డంతో బ‌రువు కూడా త‌గ్గుతారు.


ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . ల లో వీడియో లు చూడండి

Note:

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com