wowitstelugu.blogspot.com
జప మాలకు ఏమి వాడాలి జప మంత్రం వేగంగా సిద్ధించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి
జపమాల గురించి వివరణ
ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును. జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము. దాని ఫలితము రాక్షసులకు పోవును .
- జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము .
- 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల .
జపమాల తో జపము చేయు విధానం:
- మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను.
- దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును.
- మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను.
- మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును.
- జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను
- దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను.
- జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను.
- జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును.
ఏ మాల తో జపం ఏ ఫలితం వస్తుంది
- రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును.
- పద్మమాలిక సర్వబీష్ట సిద్ది,పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము ,
- పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం ,
- ఉశిరిక గింజల మాల జ్వరశాంతి ,
- పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును.
- ఔదుంబర మూలికామాల సర్వసిద్ది ,
- తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను .
- హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది ,
- మణులతో చేసిన మాల సామ్రాజ్యము ,
- స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట ,
- పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం ,
- రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును.
జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లతో జపం చేసిన ఏమి ఫలము కలుగును
- ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను. మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును.
- బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది .
- చూపుడువేలు ఉచ్చారణ కొరకు ,
- కనిష్ఠఅంగుష్ఠములు మరణము ,
- చూపుడు వ్రేలు శత్రునాశనము ,
- మధ్యవ్రేలు రోగహరి ,
- ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ ,
- అంగుష్ఠము మోక్షమును ఇచ్చును.
👉జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను.
👉 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు.
👉 ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును.
జప మంత్రం తొందరగా సిద్ధించడానికి కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటంటే
- రోజూ స్నానం చేయాలి.లేదా కాళ్ళూ,చేతులూ కడుక్కోవాలి.ఉతికిన వస్త్రాలు ధరించాలి.స్నానం చేసిన తర్వాత జపం పూర్తయ్యేవరకూ ఎవరినీ ముట్టుకోకూడదు.
- సంప్రదాయం ప్రకారం జంధ్యం వివాహితులు ధరించాలి.
- రోజూ మానకుండా చేయాలి.చుట్టాలొచ్చారని,స్నేహితులు వచ్చారని..ఇలా ఏదో వంక పెట్టి జపం మానకూడదు.అయితే ప్రయాణాలు, వివాహాలకు వెళ్ళినప్పుడు తప్పన సరి పరిస్తుతుల్లో మానవలసి వస్తుంది.
- రోజూ ఒకే సమయం జపం మొదలుపెడితే వేగంగా సిద్ధిస్తుంది.ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి మీరు ఎప్పుడు చేసినా ఒకే టైమ్ కు జపం చేయాలి.
- మీరు చేసే జపమాలను మీరు తప్ప వేరే వాళ్ళు తాకకూడదు.
- జపం చేస్తున్నప్పుడు మనం నేలను తాకకూడదు.కింద శుభ్రమైన వస్త్రం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి.జపమాల కూడా నేలను తాకకూడదు.
- జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి.వాసన రాకూడదు.
- ఎట్టి పరిస్థితి లోనూ ధర్మం తప్పకూడదు.
- భోజనం చేసిన 3 గంటల తర్వాత జపం చేయాలి. టిఫిన్ కు ఈ పట్టింపు లేదు.
- కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం,పేదవారికి దానం చేయడం,ఆకలితో ఉన్న మనుషులకు, పశుపక్ష్యాదులకు భోజనం పెట్టడం,పూజ,ధ్యానం చేయడం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి.
- ఇతరులను తిట్టకూడదు.తిట్టడం వల్ల వాళ్ళ పాపాలు మనకు అంటుకుంటాయి.
- మనం జపం చేసేటప్పుడు జపమాల ఎవ్వరికీ కనిపించకూడదు.దానిపై ఉతికిన గుడ్డ కప్పి చేయాలి లేదా తలుపు గడియపెట్టి చేయాలి.
- జపమాల కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కింద కూడా ఒక మంచి గడ్డ పరచుకోవాలి.
- జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలకు తగలకూడదు.
- మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు.జపం మనసులో చేసుకోవాలి.
- అప్పుడప్పుడూ గుడిలో,నదీ తీరాల వద్ద,కొండ గుహలలో,పర్వత శిఖరాల వద్ద చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.
- ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది(ఉదా:- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి...మొదలైనవి ., )
- గ్రహణం చాలా పవర్ పుల్.గ్రహణం నాడు చేసే మంత్రం లక్షతో సమానం.
- అయితే విష్ణు,శివ,లలిత వంటి సాత్విక మంత్రాలు గ్రహణం నాడు చేయకూడదు. రాజస, తామస మంత్రాలు మాత్రమే గ్రహణం నాడు చేయాలి.
ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ లు పై క్లిక్ చేసి జపమాల విశిష్టత తెలుసుకోండి
Search Results
Today's Quote:
Believe in yourself! Have faith in your abilities! Without a humble but reasonable confidence in your own powers you cannot be successful or happy."
Note:
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి