23, డిసెంబర్ 2020, బుధవారం

విష్ణుమూర్తి కి సంభందించిన ఆయుధములు, ఆభరణములు, సంబంధీకులు, ఏ చేతికి ఏ ఆయుధం, మున్నగు వివరాలు ఏమిటో తెలుసు కుందామా

wowitstelugu.blogspot.com

విష్ణుమూర్తి కి సంభందించిన ఆయుధములు, ఆభరణములు, సంబంధీకులు, ఏ చేతికి ఏ ఆయుధం, మున్నగు వివరాలు ఏమిటో తెలుసు కుందామా

ఆయుధములు

శంఖము= పాంచజన్యము

చక్రము =సుదర్శనము

గద =కౌమోదకి

ధనుస్సు= శార్ఙ్గము

ఖడ్గము= నందకము

రథము తేరు= శతానందము 

వాహనము=గరుత్మంతుడు

సేనానాయకుడు=విష్వక్సేనుడు

సారథి=దారకుడు

గుఱ్ఱములు= 1 సైబ్య , 2 సుగ్రీవ,  3 పుష్ప , 4 వలాహకములు

ఆభరణములు 

తలపై ఉండునది = కిరీటము 

చెవులకు=మకరకుండలాలు

వనమాలిక (కంఠమునందలి మాల)=వైజయింతీమాల

కంఠమునందలి మాల=తులసీమాల

కంఠమునంద=హారాలు

వక్షస్థలమందలి పుట్టుమచ్చ=శ్రీవత్సము

వక్షమునందలి మణి, కంఠమాలలో=కౌస్తుభము

వక్షమునందు అలంకరించి యుండునది =లక్ష్మీదేవి

దేహమున=సరిక్రొత్త పచ్చని పట్టు బట్టలు

దండలకు కడియాలుగా=అంగదములు

భుజములకు=భుజకీర్తులు

చేతులకు=కంకణములు

చేతులలో=శంఖ చక్ర గదాలు

చేతిలో=పద్మము

చేతిలోని మణి=శమంతకము

కటిప్రదేశమున=మొలత్రాడు

కాళ్ళకు=బంగారు అందెలు

అష్టభుజ విష్ణుమూర్తి ఎనిమిది (8) చేతులలో ఉండే ఆయుధాలు:

  1. చక్రం,

  1. ధనుస్సు,

  1. పద్మం,

  1. శంఖం,

  1. ఖడ్గం,

  1. పాశం,

  1. డాలు,

  1. గదాదండం.

సంబంధీకులు


భార్య

లక్ష్మీదేవి

పరిచరులు

సునంద, నంద, జయ, విజయ,జయంత, ప్రబల, ఉద్బల, కుముద, కుముదాక్ష,తార్క్ష్య, పుష్పదంత, శ్రుతదేవ, సాత్వత,విష్వక్సేన

పాన్పు

ఆదిశేషుడు

లోకము

వైకుంఠము

భక్త సమూహములు

వైష్ణవులు

భక్తులు

నారదుడు,తుంబురుడు,ప్రహ్లాదుడు,పరీక్షిత్తు,ధ్రువుడు,అంబరీషుడు


ఆయుధములు పేర్లు వాటి అర్ధం 

కౌమోదకి

1) కౌమోదకి = విష్ణుమూర్తి గద పేరు
వ్యుత్పత్తి: కుం భూమిం మోదయతి హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ,
భూమిని సంతోషింపజేయు విష్ణు సంబంధమయినది
వ్యుత్పత్తి: కోః మోదకః - కుమోదకః=విష్ణుః, కుమోదకస్య ఇయమ్ - కుమోదక+ఇణ్
త.ప్ర. కుమోదకుని (విష్ణుని) ఆయుధము.

కౌస్తుభము

2) కౌస్తుభము : విష్ణువు వక్షస్థలమందలి మణి.
వృత్పత్తి - కుం (భూమిమ్) స్తుభ్నాతి = కుస్తుభః = సముద్రః - కుస్తుభే భవః = కుస్తుభః+ అణ్ = కౌస్తుభః
భూమిని ఆవరించి ఉన్నది అగుటచే సముద్రము కుస్తుభము అనబడును, అందు పుట్టినది కౌస్తుభము

పాంచజన్యము

పాంచజన్యము విష్ణుమూర్తి శంఖము, శ్రీకృష్ణుని శంఖము
వ్యుత్పత్తి: పంచజనః +ఞ్ - ఞ్యాః వా
పంచజనుడు అను రాక్షసుని ఎముకచే నిర్మింపబడుటచే దీనికి ఈ వ్యవహారము

శ్రీవత్సము 

శ్రీవత్సము = శ్రీమహావిష్ణువు వక్షమున గల ఒక సుడి / మచ్చ.

శ్వేతరోమావర్తము
వృత్పత్తి - వద+స = వత్సః; శ్రీ.యుతః వత్సః
శాకసా. మహత్వమును తెలియజేయు చిహ్నము.

శమంతకము

శమంతకము : విష్ణువు హస్తమునందలి మణి, సత్రాజిత్తు శ్రీకృష్ణునకు సత్యభామతో పాటు సమర్పించిన ఒక మణి

ఈరోజు సూక్తి :

"It is during our darkest moments that we must focus to see the light."

- Aristotle Onassis


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.





భక్తి అంటే ఏమిటి ,ఏ ఏ మార్గాలలో మన భక్తి ని చూపిస్తాము, నిజమైన భక్తి ఏది, భక్తి లో ఏ ఏ మార్గాలు ఉన్నాయి

wowitstelugu.blogspot.com

భక్తి అంటే ఏమిటి ,ఏ ఏ మార్గాలలో మన భక్తి ని చూపిస్తాము, నిజమైన భక్తి ఏది, భక్తి లో ఏ ఏ మార్గాలు ఉన్నాయి 


👉భక్తి  మన మనస్సులలో ఉండే  ఒక పవిత్రమైన ఊహ జనితమైన మానసిక  భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు.

👉వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది.

👉భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.

👉భక్తి అంటే భక్తుని హృదయం వేరే ఇంకో ప్రయోజనం కోరక సదా పరమాత్మ స్వరూప సాయుజ్యం కోసమే నిరీక్షించడం.

👉 అంకొల వృక్షము యొక్క బీజములు చెట్టుచే ఆకర్షింపబడి నట్లుగా, అయస్కాంతము చేత సూది(అయస్కాంత క్షేత్రములోకి వచ్చిన వెంటనే చటుక్కున అతుక్కుపోయినట్లుగ, సాధ్వి (ఎల్లప్పుడూ తన విభుని చేరునట్లుగా (సాధ్వి అలోచనలు ఎల్లప్పుడూ తన విభునియందే ఉండునట్లుగా) లత (పూలతీగ) చెట్టుని పెనవేసుకున్నట్లుగ, నదులు తమ వల్లభుడైన సముద్రములో లీనమైనట్లుగా (నామ రూపాలను వదలి),చిత్త వృత్తులు పరమేశ్వరుని పాదారవింద ద్వయమునందు చేరి ఎల్లప్పుడూ ఉంటవో దానినే భక్తి అందురు.

  • భక్తి పూర్వజన్మ  సుకృతాన్ని బట్టి వస్తుంది. మనకు పార్వతి పరమేశ్వరులు తల్లి తండ్రుల్లాంటి వారు.

  • ధర్మమార్గమున ఉండు సోదరులు, దైవభక్తి పరాయణులు,సత్యాన్ని నమ్మి అనుసరించేవారు, మనకు ఆరాద్యులు. 

  • భగవంతుడు మనను పరీక్షించినా మనము నిరుత్సాహ పడరాదు. భగవంతుడి పై పూర్తి నమ్మకాన్ని ఉంచి ఆరాధించాలి. అప్పుడే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు.

  • భగవంతుడు మనలో ఉండే నిర్మలత్వాన్ని పరిశీలిస్తాడు. మనలో ఉండే హృదయాన్ని అతడు పరిశీలిస్తాడు. 

  • హృదయ శుద్ధిని భగవంతుని హృదయమున ప్రదర్శించి  భక్తిచే భగవంతుని ఆరాధించుటయే  మానవ జీవితం యొక్క పరమార్థం.

  • ధనమునకు భగవంతుని దూరం ఎక్కువ ధనం తో భగవంతుడిని పొందలేము. ధనం ఖర్చు పెట్టి చేసే ఆరాధనలు భక్తి కాదు.

  • అన్ని సమయాలలో దైవాన్ని నమ్మి మనస్ఫూరిగా దైవనామాన్ని జపిస్తూ ఉండడమే నిజమైన దైవ భక్తి.

  • ఎట్టి కష్ట సమయంలోనైనా ఈశ్వరుని నమ్మిన వారికీ అన్ని రకాల శాంతి సౌభాగ్యాలు లభించును.

  • దేవాలమున కేగి ఇతర ప్రాపంచిక విషయాలకు తావీయక ప్రార్దించిన మనస్సు నిర్మలత్వమును పొందును.

  • మధురమగు భగవన్నామమును స్మరించుచు పసిపాపలవలె నిర్మలంగా ఉండడమే భక్తి అంటే. 

మహా ఫిలోసోఫెర్ వేమన భక్తి గురించి ఇలా అన్నారు :

01

ఆత్మ శుద్ధి లేని యాచరమదియేల 

భాండశుద్ధి  లేని పాకమేల 

చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా 

విశ్వదాభి రామ వినుర వేమ

02

యెన్ని  యెన్నిపూజలెన్నిజేసిననేమి

భక్తి లేని పూజ ఫలము లేదు 

భక్తి కల్గు పూజ బహుకారణంబురా 

విశ్వదాభిరామ వినురవేమ

 

భగవంతునిపొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః

స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం

సఖ్యమాత్మ నివేదనం

పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధంఏమిటంటే 

తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన భక్తి మార్గాలు న్నాయి అవి ఏమిటంటే- 

  • శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

  • కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

  • స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

  • పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని  పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.

  • అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చా రూపం లో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను  ప్రతిష్ఠించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.

  • వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.

  • దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

  • సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

  • ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు. 

భగవంతుని మాత్రమే కాకుండా ఈ  భక్తి అనేది ఇతర రూపాల కూడా ఉంటుంది ఆ రూపాలు ఏమిటంటే

    • దేశ భక్తి 

    • పతిభక్తి
    • పితృభక్తి
    • రాజభక్తి
    • గురుభక్తి
    • దైవభక్తి

ప్రాచీనకాలం నుండి ఎందరో భక్తులు పైన పేర్కొన్న వివిధ పద్ధతులలో శివున్ని కొలిచి ముక్తిని పొందారు. వారిలో కొందరు ప్రముఖులు:

  • ఆది శంకరాచార్యుడు

  • నయనార్లు

  • భక్త కన్నప్ప

  • మార్కండేయుడు

  • రావణుడు

విష్ణు భక్తులు 

  • నారదుడు

  • తుంబురుడు

  • ప్రహ్లాదుడు

  • పరీక్షిత్తు,

  • ధ్రువుడు

  • అంబరీషుడు

 

భక్తి వీడియో యు. ఆర్.యల్ .లు చూడండి

భక్తి అంటే ఏమిటి | What is Bhakthi ... - YouTube




భక్తి అంటే ఏమిటి?|| Special ... - YouTube

ఈరోజు సూక్తి :

"If you don’t like something, change it. If you can’t change it, change your attitude."

- Maya Angelou


Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.







22, డిసెంబర్ 2020, మంగళవారం

వీర శైవం అంటే ఏమిటి ? వీర శైవం మతం గురించి కొన్నివివరాలు తెలుసుకుందామా

wowitstelugu.blogspot.com

వీర శైవం అంటే ఏమిటి ? వీర శైవం మతం గురించి కొన్నివివరాలు తెలుసుకుందామా

వీర శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.

వీరశైవం ఉద్భవం :

🙏🙏ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.

🙏🙏ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది.

🙏🙏ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

🙏🙏శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.

🙏🙏కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వీరశైవ మతం ఆంధ్ర దేశములో అదుగుపెట్టే సమయానికి దేశములో మరొక రూపంలో శైవమతం అప్పుడే ప్రారంభం అయింది. 

🙏🙏శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో వీరశైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. 

🙏🙏వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యుడు మొదలైన వీరు  ముగ్గురిని పండిత త్రయం అని చెబుతారు.

ఈ మతం గురించి విశేషాలు :

  • శివుడు "దక్షాధ్వర హరుడు " దక్షుడు చేసిన యజ్ఞాన్ని  హరించినవాడని అర్ధం . దక్షుడి యజ్ఞాన్ని శివుడు ఎందుకు పాడుచేయవలసి వచ్చిందంటే తనకు జరగవలసిన మర్యాద అల్లుడుగా జరగనందుకు కాదు, దక్షుడు చేసిన పనికి తన సతి బలి అయిపోయినందుకు. 

  • దక్షయజ్ఞాన్ని హరించడమనేది వీరశైవం లో ప్రధాన అంశం. దక్షయజ్ఞం సమయం లోనే వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు లేకుంటే దక్షయజ్ఞ హరణం అనేదే లేదు . ఒకవిధం గా చెప్పాలంటే వీరశైవ మతానికి  ఇదే పునాది గా చెప్పవచ్చు .

  • వీర శివ మతస్తులకు వీరభద్రుడు ఆరాధ్యుడు. ప్రపంచం లోని అనాచారాన్ని,అనౌచిత్యాన్నీ సహించని మతం. అనౌచిత్యాని సహించలేన్నప్పుడు భక్తావేశం లో ఆత్మార్పణ చేసుకొవడం ఈ మతస్తుల్లో కనిపిస్తుంది.
వీర శైవుల భక్తావేశం శ్రీశైలం ప్రాకార కుడ్యం లో చూడవచ్చు 

  • పరమ శివునికి ఆత్మార్పణ కావించడం అనేది అంత సులభమైన విషయం కాదు. కోట్లాది మందిలో    ఏ  ఒక్కరికో  ఈ అవకాశం లభిస్తుంది

  • వీర శైవులు ఆత్మార్పణకు శ్రీశైలాన్ని ఎన్నుకొనే వారు.  

  • ఒక్కప్పుడు వీర శైవులు ప్రోలయ వేమారెడ్డి కట్టించిన వీర శిరో మండపం లో తమ శిరస్సులను ఖండించుకొనేవారట. ఈ విషయాన్నీ తెలిపే చిత్రాన్ని శ్రీశైలం తూర్పు ప్రకారం పైన ఇప్పటికి మీరు చూడవచ్చు .

  • ఈ కాలం లో ఇలాంటి సంప్రదాయాలు చట్టవిరుద్ధం నేరం కూడా .అయినప్పటికీ వీరశైవులు భక్తవేశం తో ఈటెలను తమ నాలుకలా లోను పెదవుల లోను, కంఠం లోను పొట్టల లోనూ గ్రుచ్చు కొని  ఆలయాల దగ్గర ఊరేగింపుగా వెళ్లడం సంప్రదాయం గా కనిపిస్తుంది.

  • శ్రీశైలం లో వీర శైవు భక్తులు  ప్రతి ఉగాదికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాల తో ఊరేగింపులు చేస్తుంటారు . నిప్పులపై నడిచి వెళ్లి తమ శక్తి సామర్జ్యాలని భక్తి  భావాన్ని ప్రదరిస్తుంటారు.
వీర శైవం విశిష్టత :

👉లోకములు, వార్ధులు, శైలములు, వృక్షములు, దేవతలు, దానవులు, యోగీంద్రులు, గరుధ, ఖేచర, యక్ష, గంధర్వ సిద్ధవరులు, విద్యాధరులు, కిన్నరలు పశుపక్షి మృగ దైత్య పన్నగులు రుద్ర స్వరూపమునే రూపింతురు. దేహమే చంద్రధరుని మందిరము. ప్రాణమే-శివుడు- అని చెప్పి లింగన తన వీరశైవత్వమును చాటెను.

👉పంచాక్షరితో సమానమైన మంత్రము లేదు. శివునిబోలు దైవము, గౌరిని బోలు వైదువలు, గంగతో సమానమైన నదులు, సాగరను బోలు సరసులు, మేరునగమునుబోలు పర్వతములు, వారణాసికి సరివచ్చు తీర్ధములు, శంకరుని భక్తికి సమానమైన భక్తి ఇంక లేవట. 

👉సకలవేదశాస్త్రాగమ పురాణముల సారంశమే పంచాక్షరీ మంత్రము. పంచమహాఘోర మహాపాపములాచరించినను జగత్రయమునే సంహరించినను పంచాక్షరీ మంత్ర దివ్య ప్రభావముచే విముక్తి కలుగునని వీరశైవుల నమ్మకము. దానినే లింగన వక్కాణించినాడు కూడా!


వీరశైవం గురించి వీడియో యు. ఆర్. యల్ .చూడండి

ఈ రోజు సూక్తి :

"When change happens, you have a choice for how you are going to respond. You can either lose your composure and react impetuously or use the event or situation as a learning opportunity to shift your mindset and respond appropriately. Begin to notice your responses when changes occur and do your best to choose a breakthrough over a breakdown." 
-Susan C. Young

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials  like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.