వీర శైవం అంటే ఏమిటి ? వీర శైవం మతం గురించి కొన్నివివరాలు తెలుసుకుందామా
వీర శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.
🙏🙏ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.
🙏🙏ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది.
🙏🙏ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
🙏🙏శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.
🙏🙏కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వీరశైవ మతం ఆంధ్ర దేశములో అదుగుపెట్టే సమయానికి దేశములో మరొక రూపంలో శైవమతం అప్పుడే ప్రారంభం అయింది.
🙏🙏శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో వీరశైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు.
🙏🙏వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యుడు మొదలైన వీరు ముగ్గురిని పండిత త్రయం అని చెబుతారు.
ఈ మతం గురించి విశేషాలు :
- శివుడు "దక్షాధ్వర హరుడు " దక్షుడు చేసిన యజ్ఞాన్ని హరించినవాడని అర్ధం . దక్షుడి యజ్ఞాన్ని శివుడు ఎందుకు పాడుచేయవలసి వచ్చిందంటే తనకు జరగవలసిన మర్యాద అల్లుడుగా జరగనందుకు కాదు, దక్షుడు చేసిన పనికి తన సతి బలి అయిపోయినందుకు.
- దక్షయజ్ఞాన్ని హరించడమనేది వీరశైవం లో ప్రధాన అంశం. దక్షయజ్ఞం సమయం లోనే వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు లేకుంటే దక్షయజ్ఞ హరణం అనేదే లేదు . ఒకవిధం గా చెప్పాలంటే వీరశైవ మతానికి ఇదే పునాది గా చెప్పవచ్చు .
- వీర శివ మతస్తులకు వీరభద్రుడు ఆరాధ్యుడు. ప్రపంచం లోని అనాచారాన్ని,అనౌచిత్యాన్నీ సహించని మతం. అనౌచిత్యాని సహించలేన్నప్పుడు భక్తావేశం లో ఆత్మార్పణ చేసుకొవడం ఈ మతస్తుల్లో కనిపిస్తుంది.
- పరమ శివునికి ఆత్మార్పణ కావించడం అనేది అంత సులభమైన విషయం కాదు. కోట్లాది మందిలో ఏ ఒక్కరికో ఈ అవకాశం లభిస్తుంది
- వీర శైవులు ఆత్మార్పణకు శ్రీశైలాన్ని ఎన్నుకొనే వారు.
- ఒక్కప్పుడు వీర శైవులు ప్రోలయ వేమారెడ్డి కట్టించిన వీర శిరో మండపం లో తమ శిరస్సులను ఖండించుకొనేవారట. ఈ విషయాన్నీ తెలిపే చిత్రాన్ని శ్రీశైలం తూర్పు ప్రకారం పైన ఇప్పటికి మీరు చూడవచ్చు .
- ఈ కాలం లో ఇలాంటి సంప్రదాయాలు చట్టవిరుద్ధం నేరం కూడా .అయినప్పటికీ వీరశైవులు భక్తవేశం తో ఈటెలను తమ నాలుకలా లోను పెదవుల లోను, కంఠం లోను పొట్టల లోనూ గ్రుచ్చు కొని ఆలయాల దగ్గర ఊరేగింపుగా వెళ్లడం సంప్రదాయం గా కనిపిస్తుంది.
- శ్రీశైలం లో వీర శైవు భక్తులు ప్రతి ఉగాదికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇలాంటి సాంప్రదాయాల తో ఊరేగింపులు చేస్తుంటారు . నిప్పులపై నడిచి వెళ్లి తమ శక్తి సామర్జ్యాలని భక్తి భావాన్ని ప్రదరిస్తుంటారు.
👉లోకములు, వార్ధులు, శైలములు, వృక్షములు, దేవతలు, దానవులు, యోగీంద్రులు, గరుధ, ఖేచర, యక్ష, గంధర్వ సిద్ధవరులు, విద్యాధరులు, కిన్నరలు పశుపక్షి మృగ దైత్య పన్నగులు రుద్ర స్వరూపమునే రూపింతురు. దేహమే చంద్రధరుని మందిరము. ప్రాణమే-శివుడు- అని చెప్పి లింగన తన వీరశైవత్వమును చాటెను.
👉పంచాక్షరితో సమానమైన మంత్రము లేదు. శివునిబోలు దైవము, గౌరిని బోలు వైదువలు, గంగతో సమానమైన నదులు, సాగరను బోలు సరసులు, మేరునగమునుబోలు పర్వతములు, వారణాసికి సరివచ్చు తీర్ధములు, శంకరుని భక్తికి సమానమైన భక్తి ఇంక లేవట.
👉సకలవేదశాస్త్రాగమ పురాణముల సారంశమే పంచాక్షరీ మంత్రము. పంచమహాఘోర మహాపాపములాచరించినను జగత్రయమునే సంహరించినను పంచాక్షరీ మంత్ర దివ్య ప్రభావముచే విముక్తి కలుగునని వీరశైవుల నమ్మకము. దానినే లింగన వక్కాణించినాడు కూడా!
ఈ రోజు సూక్తి :
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి