1, ఏప్రిల్ 2020, బుధవారం

స్వరలక్ష్మి చలన చిత్ర అభినయన లక్ష్మి-ఎస్.వరలక్ష్మి

wowitstelugu.blogspot.com

స్వరలక్ష్మి చలన చిత్ర అభినయన లక్ష్మి-ఎస్.వరలక్ష్మి
S.Varlakshmi Great Singer and Actress
ఎస్.వరలక్ష్మి 1925 ఆగష్టు  13, జగ్గం పేటలో   జన్మించారు.  తెలుగు తమిళ  సినిమాలలో  నటీమణి, మరియు   గొప్ప  గాయకీమణి.  యస్.వరలక్ష్మి గూడవల్లి రామ బ్రహ్మం  ప్రోత్సాహం తో బాలనటిగా సినిమారంగంలోకి అడుగు పెట్టింది. 

  • అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశ లో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. 

  • "మహా మంత్రి తిమ్మరుసు", వెంకటేశ్వర మహత్యం లో ఆమె పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి . 

  • తమిళం లో " వీరపండియ కట్టబోమ్మన్ లోశివాజీ భార్యగా నటనలలో ఆ కాలము లో  చాల బాగుందని పేరు. 

  • వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. 

  • ప్రముఖ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె  కూడా ఉన్నారు 

  • మొదటి చిత్రం 'బాలయోగిని' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. 
  • 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలోకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. 
  • ఎస్.రాజేశ్వరరావుతో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. 
  • ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత 'మాయాలోకం' (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది 'పల్నాటి యుద్ధం' చిత్రంతోనే. 
  • ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు. 
  • అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి కచేరి చేసింది. శివాజీ గణేశన్‌తో కలిసి నటించిన 'వీరపాండ్య కట్టబ్రాహ్మణ్' చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినపుడు వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. 

  • పి.సూరిబాబు, రాజేశ్వరీ ట్రూప్‌లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు వేసింది వరలక్ష్మి. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి 'వరలక్ష్మీ పిక్చర్స్' ప్రారంభించి తొలిసారిగా 'సతీ సావిత్రి' (1957) నిర్మించింది.

  • తెలుగు సినిమా భవనపు పునాదిరాళ్లలో ఎస్.వరలక్ష్మి ఒకరు. ఏ కచేరీలోనూ, ఏ టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఔత్సాహిక గాయనీగాయకులెవరూ వరలక్ష్మి పాటల్ని ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడటం కష్టం.

  • నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84) మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో సెప్టెంబర్ 22, 2009 రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు. మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరు నెలలు బాధపడ్డారు.

  • ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ నట శిరోమణి భౌతికంగా దూరమైనా  అభినయ స్వరలక్ష్మిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే వుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు.


యస్.వరలక్ష్మి తన గాత్రాన్ని అందించిన  చిత్రాలు

  • సత్య హరిశ్చంద్ర (1965)

  • మహామంత్రి తిమ్మరుసు (1962)

  • సతీ సక్కుబాయి (1954)

  • స్వప్న సుందరి (1950)

  • జీవితం (1949)

  • బాలరాజు (1948)

  • పల్నాటి యుద్ధం (1947)

  • మాయాలోకం (1945)

యస్.వరలక్ష్మి నటించిన చిత్రాలు 

  • శ్రీరామచంద్రుడు (1989)

  • మదన మంజరి (1980)

  • గుణ (1992)

  • అభిమానవతి (1975)

  • నథయిల్ ముత్తు (1973)

  • బాలభారతం (1972)

  • బొమ్మా బొరుసా (1971)

  • ప్రేమనగర్ (1971)

  • ఆదర్శ కుటుంబం (1969)

  • అపూర్వ పిరవైగళ్ (1967)

  • భామా విజయం (1967)

  • శ్రీకృష్ణావతారం (1967)

  • శ్రీకృష్ణ పాండవీయం (1966)

  • సత్య హరిశ్చంద్ర (1965)

  • భబృవాహన (1964)

  • లవకుశ (1964)

  • శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)

  • మహామంత్రి తిమ్మరుసు (1962)

  • అభిమానం (1960)

  • శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)

  • వీరపాండియ కట్టబొమ్మన్ (1959)

  • మాంగల్యబలం (1958)

  • చక్రవర్తి తిరుమగళ్ (1957)

  • సతీ సావిత్రి (1957)

  • కనకతార (1956)

  • ఎత్తిరపరదత్తు (1954)

  • సతీ సక్కుబాయి (1954)

  • సౌదామిని (1950)

  • స్వప్నసుందరి (1950)

  • వాలి సుగ్రీవ (1950)

  • జీవితం (1949)

  • బాలరాజు (1948)

  • పల్నాటి యుద్ధం (1947)

  • మాయాలోకం (1945)

  • రైతు బిడ్డ (1939)

  • సేవాసదన్ (1938)

  • బాలయోగిని (1936) (బాలనటిగా)

ఈ క్రింది వీడియో యు . ఆర్ . యల్ లో ఈ మె  గురించి మరింత తెలుసు కోండి.

S Varalakshmi Personal Life Struggles | Actress & Singer ...

శోథన ఫలితాలు

KiranPrabha Talk Show on G.Varalakshmi , daring ... - YouTube

meerajaalagalaDaa - S.varalakshmi - YouTube

Old Telugu Songs - Ethukondala Pada - Jamuna, S V


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.


అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv


నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  


కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


















29, మార్చి 2020, ఆదివారం

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం లోని కొన్ని పద్యాలు

wowitstelugu.blogspot.com

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం  లోని కొన్ని పద్యాలు

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు మానవ రూపం లో జన్మించిన దైవ స్వరూపులు అయన చెప్పన కాలజ్ఞానం లోని విషయాలు అక్షర సత్యాలు గా ఈనాడు చలామణి అవుతున్నాయి.

వేదవాక్యాలు 

శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాల జ్ఞానం, ఆత్మజ్ఞానం (భక్తి మార్గం ,ముక్తి మార్గం) లోని మచ్చుకు కొన్ని పద్యాలు ...

కాల జ్ఞానం పద్యాలు

(కాలాన్ని అర్ధం చేసుకోవడం)

వీరబ్రహ్మము యెక్క వేద వాక్యంబులు

ధరణిలో తప్పక జరిగేనయా

కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!
(వీర బ్రహ్మం గారు చెప్పేవి వేదం వాక్యాలు ఈ భూమిలో తప్పక జరుగుతాయి. కలి మాయలో పడకుండా నన్ను నమ్మి మీరు తప్పించుకొనే మార్గం వెతకండి)

స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!
(స్వయంగ తనంత తాను ఎవరు వెలగరు అంటే పెద్దవారు కారు సూర్య చంద్రులు, గ్రహములు అన్ని ఆ పరమేశ్వరుని వల్లే వెలుగును )

అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!
(ఈ అనంత మైన విశ్వములో మన భూగోళ మెంత ఉన్నది . అందులో ఉన్న మన శక్తి ఎంత , సర్వమును కాపాడు శక్తి వంతుడవు నీవు, శరణు పొందుట నీ ధర్మము )

వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆధి పురుషుని నమ్ము!
ఎప్పుడు పుడతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు. మన బ్రతుకుతున్నపుడు ఏమవుతామో తెలియదు. ఇలాంటి జన్మ గురించి గర్వపడటం ఎందుకు అందరిని కాపాడు ఆదిపురుషుని నమ్ము ((పరమేశ్వరుడిని).

నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
(ప్రతి వ్యక్తి ఇది నాది అది నాది అని గర్వం గా చెబుతుంటారు. కానీ మీరు తల్లి నుండి పుడుతూనే ఏమి తేలేదు కదా . సమాధి చేయడానికి మాత్రం ఆరడుగుల నేల కావాలి అది కూడా మీది కాదు)

సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలోను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
( సముద్రాలను పొంగేలా, గాలి కదిలా చేసే శక్తి ప్రతి మనిషిలో ఉంది, నీలో శక్తిని భక్తి తో ధ్యానిస్తే దేవుడి దర్శనం కలుగుతుంది)

దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!
(మనుషులు దానం చేయడం పోవడం వల్లే తాము దరిద్రులు అవుతారు దానికి దేవుడిని నిందించి ఫలితమేముంది పదిమంది కి చేసే పుణ్యఫలం మాత్రమే మనకి అన్ని జన్మల లో మనతో వస్తుంది)

బాహ్యా విషయములకై పరుగెత్తినావంటే
యేడ్పించి నీపై స్వారి జేసేను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటే
ప్రకృతే నీపాద సేవ జేసేను!
(తాత్కాలిక విషయాలపైనా మనసు లగ్నం చేస్తే అవి మనని ఏడ్పించి మనపైన సవారీ చేస్తాయి. దేవుడి పైన మనసు లగ్నం చేస్తే ప్రకృతి అంతా మన వశమవుతాది)

దైవ ధ్యానము కన్న మించినది లేదయ
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు, కఠిన రోగంబులకు
దివ్యౌషధంబని నమ్మండయ!
(దేవుడిని ధ్యానించడం కంటే మించిన మంచి మార్గము ఇంక ఏది ఉండదు. అన్ని శక్తులు అందులోనే ఉంటాయి. అన్ని కష్టాలకు , రోగాలకు అదే గొప్ప మందు అని నమ్మండి )

దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!
(దేవుడనే వాడవు నీవే అనవసమైన కోర్కెలతో మనిషిగా మారిపోయావు. పనికి రాని కోర్కెలను మానివేస్తే నీవు కోదండ రాముడుగా ఉంటావు )

వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగ కాపాడుకొనియేరయ!
తమవెంట వచ్చేది మనస్సు బుద్దనుమాట
యోచింపకుండనే బ్రతికేరయ!
(చనిపోయేటప్పుడు మన శరీరము బట్టలు స్మశానని కి వెళ్లి పోయేవే వాటిని చాల శుచిగా శుభ్రం గా ఉంచుకొంటే చాలదు చివరవరకు ఉండేది మంచి మనస్సు అది మన వెంటే వస్తాదనే విషయాన్ని ఎందుకు ఆలోచించకుండా బ్రతుకుతారు)


ఆత్మ జ్ఞానం

(మనలో ఉన్న శక్తిని వెతకడం)

సకల జీవులందు ఆత్మశక్తివై శ్వాసరూపములో హంసగా సంచరిస్తున్న ఓ కాళీ మాతా!


కాలికాంబా యనుట లీలా వినోదంబు

కాదు కాదు! హంస! కాళికాంబే
హంస కాళికాంబె! ఆత్మ కాళిక సుమా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| కాళికాంబ అనుట వల్ల ఒక ఆనందమైన అనుభూతి కలుగుతుంది సకల జీవులందు శ్వాస రూపములో సంచరిస్తున్న ।హంస। గూడ ఒక ఆనందమైన అనుభూతిని
ఇచ్చేదే. ఆత్మశక్తి హంసరూపములో సంచరిస్తు ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆనందమైన అనుభూతియే ఆత్మ. ఆత్మశక్తియే కాళీమాతా.
గాలిరీతి విశ్వ గోళాలలో నుందు
దివుల భువుల మధ్య తిరుగగలవు
నీవు లేని చోటు నిక్కమ్ముగా లేదు
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళి మాతా! గాలి రూపములో, విశ్వగోళాలలో ఉంటావు. భూమి ఆకాశముల మధ్య తిరుగుతుంటావు... నీవులేని చోటు అంటు కచ్చితముగా ఎక్కడలేదు.
తల్లిదండ్రీ గురువు దైవమ్ములందున
తల్లి పూజ్యముఖ్య మెల్లరకును
సృష్టి కంతటికిని స్త్రీ ప్రధానముగదా
కాళికాంబ! హంస కాళికాంబ!
తా|| ఓ కాళీ మాతా! తల్లి తండ్రి, గురువు, దైవము, ఈ నాల్గింటియందు, సమస్త ప్రజలకు మొదటగా పూజింప దగినది తల్లి మాత్రమే. స్త్రీ ముఖ్యముగా సృష్టి అంతటికీ ప్రధానమై యున్నది.
కాలజ్ఞానం లో ఇప్పడి వరకు జరిగినవి మచ్చుకు కొన్ని :

  • నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటీతొ జనరేటరు)
  • ద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
  • కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
  • ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంథి)
  • తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, తదితరులు. చలన చిత్రాలు)
  • రాచరికాలు, రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు( ఇందిరాగాంధీ రాజభరణాల రద్దు)
  • ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
  • జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.( ఉదాహరణ : చైనా, మరియు ఇండియా )
  • బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.(వంశపారపర్య పౌరోహిత్యాలు రద్దు)
  • హైదరాబాదులో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కుని చనిపోతారు. (మత కలహాలు)
  • దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దేవస్థానాలలో దొంగతనాలు
  • చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావుపుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
  • రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. (శ్రీలంకలోని తీవ్రవాద నేపథ్యం లో జరిగిన పరిణామాలు)
  • గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. (లాల్ బహుద్దూర్ శాస్త్రి)
  • కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
  • అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి
  • నది గండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి (నేపాల్ భూకంపము)

  • కోరంకియ అను (కరోనా) జబ్బుతో కోట్లాది మంది కోడిలాగా తూగి చస్తారు ( ఇప్పుడు జరుగుతున్నది అదే )

ఈ క్రింది వీడియో లింకులు చూడండి ...





Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share

and subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.