10, మార్చి 2020, మంగళవారం

లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏమి చేయాలి శాస్త్రం చెప్పే విధి విధానాలు ఏమిటి? అష్ట లక్ష్మిల ప్రార్థనలు

wowitstelugu.blogspot.com

లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఏమి చేయాలి శాస్త్రం చెప్పే విధి విధానాలు ఏమిటి? అష్ట లక్ష్మిల ప్రార్థనలు 

లక్ష్మీ అనుగ్రహం కావాలని అందిరికీ కోరిక. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ తాపత్రయం పడుతుంటారు. ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిల్వ ఉండని వారు కొందరు, ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చు అయిపోతుందని మరికొందరు. ఎంత కష్టపడ్డా చాలీచాలనీ బతుకులు అని మరికొందరు.

వీరంతా శాస్త్రం చెప్పిన విధివిధానాలను పాటిస్తే తప్పక లక్ష్మీ అనుగ్రహం కలుగడమే కాదు పదిమందడికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు. ఆ నియమాలు ఏమిటో చూద్దాం.

  • తప్పనిసరిగా ప్రాతఃకాలమందే లేచి ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని వీలుంటే ఆవుపేడతో కళ్లాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి.

  • ఇంటి గదులను  చిమ్మేటప్పుడు నీటిలో ఉప్పును కొద్దిగా వేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి 

  • లక్ష్మి ముగ్గు లేదా కుబేర ముగ్గు వేసి  అలంకారం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం అలకరించినట్లే వెనుక (దక్షిణ ద్వారం కూడా అలంకరించాలి ) లేకపోతె లక్షి దేవి అక్కగారి కి ( జేష్టా దేవి కి కోపం వస్తే లక్ష్మి దేవి కి కూడా కోపం వస్తుంది. 
  • గుమ్మానికి పసుపు, కుంకుమ, రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన. 
  • గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు  మామిడి తోరణాలు కట్టడి ఉంచాలి

  • ఇంటి ప్రధాన ద్వారానికి అటు ఇటు కాలు పెట్టి మాట్లాడరాదు. 

  • ఇంటి ప్రధాన ద్వారం తొక్కి లోపాలకి ప్రవేశించరాదు.

  • గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.

  • గుమ్మానికి లోపల రాగి చెంబు పెట్టాలనుకొంటే  ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో ఒక (1) రూపాయ లేదా  (5)ఐదు రూపాయల బిళ్ళలు , పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. 

  • ప్రతి శుక్రవారం గడపలకు, తులసీకోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన దారిద్య్రనాశిని అనుగ్రహం కలుగుతుంది

  • ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసు కుంటే చాలా మంచిది, దుష్ట శక్తుల నివారణకు,  చెక్‌పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.

  • ఇంట్లోకి కాలు పెడుతున్నట్లు ఉన్న లక్ష్మి దేవి పటము అంత శుభప్రదం కాదు 

  • పద్మాసనం వేసుకొని కూర్చొన్న లక్ష్మి అమ్మవారి పటములు మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి 

  • ఇంటి ఇల్లాలు ఆడబడుచులు కానీ ఇంటిలో దుఃఖించరాదు. ఇంటి పెద్దలు వారు కంటి తడి పెట్టకుండా చూసుకోవాలి.

  • ముసలి తల్లిదండ్రులని పరుషముగా మాట్లాడడం, పనులు చేయించడం,   అవమానించడం చేయరాదు.

  • తులసి మొక్కకు నీరు పోయడం . దీపం వెలిగించడం చేయాలి.  
  • లక్ష్మి దేవికి ఎరుపురంగు అన్నా, పట్టు వస్త్రాలు అన్నా చాల  ఇష్టం, కావున స్త్రీలు లక్ష్మి అష్టోత్తరం చదివేటప్పుడు ఎరుపురంగు వస్త్రాలు ధరించాలి.

  • లక్ష్మి అష్టోత్తరం చదివిన తరువాత విష్ణు మూర్తిని కూడా స్మరించుకోవాలి  

  • లక్ష్మి దేవి కి ప్రసాదం తీపి పదార్దాలు , నేటితో చేసిన పదార్దాలు ప్రసాదం గా పెట్టాలి. 

  • చిన్నపిల్లలను భాద పెట్టరాదు 

  • భార్యాభర్తలు తరచూ కలహించుకోరాదు.

  • గోవును పూజించాలి. హింసించరాదు 

  • మంచం దిగకుండా రోజంతా మంచం మీద గడుపరాదు. 

  • ఇంటిని శుభ్రం గా అందం గా అలంకరించువాలి

  • అన్యాయంగా మోసం డబ్బు సంపాదించరాదు అది శాశ్వతం గా ఉండదు.
  • లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి.
  • విగ్రహం గట్టిగా పూర్తీ లోహంతో కూడి ఉండాలి. విగ్రహం గుల్లగా  ఉంటే పనికి రాదు ఇది గమనించాలి.
  •  ఆఫీసులో/ వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ, ధనప్రాప్తి కలుగుతుంది . పన్నీరు లో కొత్త తెల్లని వస్త్రాన్ని తడిపి ఎండబెట్టి ఆ వస్త్రంతో వత్తులు చేసి శుచి గా చేసిన వత్తులు వాడాలి. 
  • ప్రతి శుక్ర వారం ఆవునేతితో ఆ నేతి తడిపిన  మూడు వత్తులతో దీపారాధన చేస్తే సకల సంపదలు కలుగుతాయి. 
  • గురు , శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. 
  • శ్రీ మహాలక్ష్మీ స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహా ధనవంతులవుతారు -

  • శ్రీదేవీ భాగవతము ప్రతి రోజూ సంపుటిత సహిత శ్రీసూక్తం చదివితే అఖండలక్ష్మి కటాక్షం కలుగుతుంది. 

  • కమల సప్తమీ వ్రతమును చైత్ర,వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకా చేయటం వలన మహాసంపదలు కలుగుతాయి.

  • ఇంట్లో మనకు ఇంతకు పూర్వం బంగారపు లక్ష్మీదేవి ఉంగరం  ఉంటె కుడిచేతికి  ఉంగరపు వేలుకు ధరించాలి. 

  • కనకధారాస్తోత్రం  ప్రతిరోజూ త్రిసంధ్యలలోపఠిస్తే అపార సంపద చేకూరుతుంది.

  • శుక్రవారం లక్ష్మీదేవిని అష్ట గంధాలతో (కర్పూరం,కస్తూరి, పుణుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు,శ్రీగంధం)తో పూజిస్తే కీర్తి , ప్రతిష్టతలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

  • ఉగాది తరువాత వచ్చే శుక్రవారం ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరమంతా ధనానికి కొదవ ఉండదు.జాతకరీత్యా ఉన్నదోషాలు కొంత తొలగిపోతాయి.

  • శ్రావణమాసం ప్రతివారం అమ్మవారిని ఆరాధించాలి.  ఆనవాయితీ అనుసరించి  వ్రతాలూ చేయాలి.

  • అమ్మవారి ఆలయాలు వీలైనప్పుడల్లా దర్శించు కోవాలి.  అమ్మవారి పర్వదినాలో తప్పనిసరిగా దర్శించు కోవాలి.

  • అన్న్ని సందర్భాలలో అనాధ లకు, పేదలకు దాన ధర్మాలు,  అన్నదానాలు చేస్తుండాలి.

  • ధనాన్ని ఉంచే చోటు శుభ్రం గా ఉంది సువాసనలు వెదజల్లు తుండాలి (బీరువా )

  • సువాసనలు వెదజల్లే వట్టి వేరు బీరువాలో కొద్దిగా ఉంచాలి .

  • పసుపురంగు (లక్ష్మి) గవ్వలు  పదకొండు  బీరువాలో గాని దేవుడి గది గాని ఉంచాలి.

  • పసుపు కుంకుమ చిట్టి గాజుల దండ తో అమ్మవారిని అలంకరించాలి. 

  • తామర విత్తనాలు దండ అమ్మవారిని అలంకరించాలి 

  • మగవారు పర్సు  స్త్రీల హ్యాండ్ బాగ్  లేత గులాబీ లేదా ఎరుపు రంగును కలిగి ఉండాలి .

  • వివాహిత స్త్రీలు నుదుటను ఎప్పుడు కుంకుమ ధరించే ఉంచుకోవాలి,

  • వివాహిత స్త్రీల కాలికి మట్టెలు ఎప్పుడు ధరించి ఉండాలి.

  • ఎట్టి సమయం లోను జుట్టు విరబోసుకొని ఉండరాదు.

  • శుక్రవారం, లక్ష్మివారం ఎవ్వరికి డబ్బు అప్పుగా ఇవ్వరాదు.

  • అనవసరం గా తాగుడుకు జూదానికి అప్పులు ఎట్టి పరిస్థితులలోను చేయరాదు . 

పటించాల్సిన శ్లోకాలు : 

01

ఓం "సర్వమంగళ మాంగళ్యేశివే సర్వార్థసాధికే 

శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే" 

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః

02

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః 

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః 

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః

03.

ఓం శ్రీ ఓం నమః పరమ లక్ష్మయి విష్ణు వక్షస్థితాయై 

రమాయై ఆశ్రీత తారకా యై నమో వహ్ని జాయై నమః 

నమో భగవతే వాసుదేవాయ నమః 

04

ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ది స్వాహా 

05.

అష్టలక్ష్మిలు, అష్టలక్ష్మి  శ్లోకం 

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన  దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.


  • ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.


  • ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.





  • ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించింది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
  • గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించింది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయ

  • సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించింది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉంది.
  • విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించింది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించింది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.

  • విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
  • ధనలక్ష్మి :  ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించింది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది

  • అష్టలక్ష్మి  శ్లోకం 

    అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

    విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని 

    శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

    జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

    ఈ క్రింది వీడియో లింక్లు చూడండి ...

    శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలి ? lakshmi ...

    లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఈ .


    వీటితో అర్చన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ...


    Note:

    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

    చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

    నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

    నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

    కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.





















    8, మార్చి 2020, ఆదివారం

    అద్భుత చిత్రకారుడు రాజా రవి వర్మ గురించి తెలుసుకుందామా

    wowitstelugu.blogspot.com

    అద్భుత చిత్రకారుడు రాజా రవివర్మ    గురించి   తెలుసుకుందామా

    రాజా రవి వర్మ  చిత్రకారుడు 

    రాజా రవి వర్మ చిత్రకారుడు ఇతను 1846 ఏప్రిల్ 29 వ తేదీన కీలా మానుర్ , కేరళ రాష్ట్రము లో జన్మించారు. భార్య పేరు రాణీ భగీరధీ బాయ్. తండ్రి పేరు నీలకంఠన్ భట్టాద్రి ప్రసాద్, తల్లి ఉమాంబా  తాంబూరట్టి.

    చిన్నతనం :

    • రవి వర్మ రామాయణమహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. 

    • భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. 

    • చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 

    • 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచు కున్నప్పుడు  ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. 

    • తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.

    • చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. 

    • అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు.

    • పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

    • భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. 

    • ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. 

    వృత్తి కార్య కలాపాలు :

    • రవి వర్మ  తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. 
    • ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. 
    • ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. 
    • రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి.
    •  రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందింది.
    • 1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు 
    • రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు. 
    • అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. 
    • ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.
    • రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. 
    • దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. 
    •  1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. 
    •  మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. 
    • ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.

    రాజా రవి వర్మ కు పేరు తెచ్చిన చిత్రాలు :

    • దమయంతి హంస సంవాదము

    • పల్లె పడుచు

      • లేడీ విత్ ఫ్రూట్స్

      • స్వర్బత్ ప్లేయర్

      • శకుంతల

      • హార్ట్ బ్రోకెన్

      • శ్రీ కృష్ణ రాయబారము

      • రావణ జటాయు వధ

      • ఇంద్రజీత్ విజయము

      • బిక్షకుల కుటుంబము

      • లేడీ ప్లేయింగ్ స్వర్బత్

      • గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ

      • వరుణుని జయించిన రాముడు

      • నాయర్ల స్త్రీ

      • శృంగారంలో మునిగిన జంట

      • కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది

      • శంతనుడు మత్స్యగంధి

      • ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల

      • కణ్వుని ఆశ్రమములోని బాలిక. (ఋషి కన్య)

      • అలోచనలో మునిగిపోయిన స్త్రీ

      • వాద్యకారుల బృందము

      • సుభద్రార్జునులు

      రాజా రవివర్మ పేరిట పురస్కారాలు :

      రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు,సంస్కృతి అభ్యున్నతికై,విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది.

      ఆ  అవార్డు గ్రహీతలలో

      • కె.జి.సుబ్రహ్మణియన్ (2001)

      • ఎమ్.వి.దేవన్ (2002)

      • ఎ.రామచంద్రన్ (2003)

      • వాసుదేవన్ నాయర్ (2004)

      • కనై కున్హిరామన్ (2005)

      • వి.ఎస్.వల్లిథాన్ (2006)

      ఇతర గౌరవాలు 

      • రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను  నెలకొల్పారు. 

      • రవివర్మపై గల ఆసక్తి వల్ల సినిమా, వీడియోలలో కుడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.

      • ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన దాదాసాహెబ్ ఫాల్కే కూడా రవివర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే.

      రాజా రవి వర్మ పై వెలువడిన గ్రంధాలు :

      ఆంగ్ల పుస్తకాలు :

      • రాజా రవివర్మ మరియు ముద్రింపబడిన హిందూ దేవతలు,ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢిల్లీ  ఆక్స్ఫర్డ్  యూనివర్సిటీ ప్రెస్.2003.

      • రాజా రవివర్మ,ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు 1848-1906,క్లాసిక్ కలెక్షన్,వాల్యూమ్ 1,2.పర్సు రామ్ మంఘా రామ్, బెంగుళూరు.2005.

      • రాజా రవివర్మ: చిత్రకారుని ముఖచిత్రం, డైరీ  ఆఫ్ సి.రాజరాజవర్మ,ఎడిటెడ్ బై ఎర్విన్ న్యూ మేయర్, క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢిల్లీ ,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2005.

      • దేవుని చిత్రకళ,ఎన్రికో కాస్టెల్లి, గియోవాన్ని ఏప్రిల్.న్యూ ఢీల్లి. ఇల్ తామ్బురోపార్లాన్టి డాక్యుమెన్టేషన్ సెంటర్, ఎథ్నోగ్రాఫిక్ మ్యూసియమ్.2005.

      • ఫొటోస్ ఆఫ్ గాడ్స్,ది ప్రింటెడ్ ఇమేజ్ అండ్ పొలిటికల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా. బై క్రిస్టోఫర్ పిన్నె, లండన్, రీక్షన్ బుక్

      మలయాళం పుస్తకాలు :

      • రాజా రవివర్మయు మరియు చిత్రకళయు, కిలమానూర్ చంద్రన్,కేరళ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ.1999.

      • చిత్రమెళుదు  కొయితంబురాన్, పి.ఎన్.నారాయణ పిళ్ళై.

      • రాజా రవివర్మ,ఎన్.భాస్కరన్ నాయర్.

      రాజా రవి వర్మ పైన గల విమర్శలు :

      • రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించడం వల్ల సాంప్రదాయ చిత్ర కళ విలువ కోల్పోయింది అన్నారు.  

      • భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటము వలనా సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయింది అనేది కూడా  విమర్శకుల అభిప్రాయం

      • పౌరాణిక పాత్రల రూపకల్పనలోని పౌరాణిక సూత్రాలను విస్మరించటం (ఉదాహరణకు  ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను,  సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడు.

      ఈ క్రింది వీడియో యు .ఆర్ .యల్ లు లేదా లింక్ లు చూద్దాం రండి.

      Telugu Actress Gives Life To Ravi Varma Paining | Calendar ...



       - ఈ పేజీని అనువదించు

      శోథన ఫలితాలు

      శోథన ఫలితాలు

      వెబ్ ఫలితాలు

      శోథన ఫలితాలు

      వెబ్ ఫలితా

      నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

      చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

      నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

      నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


      ఈ క్రింది యు. ట్యూబ్ లో రాజా రవి వర్మ వీడియో చూడండి 







      4, మార్చి 2020, బుధవారం

      నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాల దర్శనం ఎంతో విశిష్టం ఎంతో పుణ్యం

      https://wowitstelugu.blogspot.com

      నవగ్రహాల దోష నివారణకు నవ నారసింహ క్షేత్రాల దర్శనం ఎంతో విశిష్టం ఎంతో పుణ్యఫలం


      హిరణ్యకశిపుడిని సంవరించి వికటహట్ట్ హాసాలు చేస్తూ అహోబిల కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో నరసింహ స్వామి వెలసారని ప్రతీతి

    • 1. జ్వాలా నరసింహ స్వామి
    • 2. అహోబిల నరసింహ స్వామి 

    • 3. మాలోల నరసింహ స్వామి
    • 4. వరాహ నరసింహస్వామి (క్రోడా)

    • 5. కారంజ నరసింహస్వామి
    • 6. భార్గవ నరసింహస్వామి

    • 7. యోగానంద నరసింహస్వామి
    • 8. చత్రవట నారసింహస్వామి

    • 9. పావన నరసింహ స్వామి

    • 1. జ్వాలా నరసింహ క్షేత్రము.

      (కుజగ్రహా అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)

      • నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది.

      • పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట.అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట.అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు,జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట.

      • ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట.

      • స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంది.

      • వైకుంఠవాసుని అశురుడు (హిరణ్యకశిపుడు) నిందించినను శ్రీమన్నారాయణుడు తొణకలేదు,

      • కాని తన భక్తుడైన ప్రహ్లదుని హింసించడం సహించలేక పోయాడు. అందుకే హరి నరహిగా ఆవిర్భవించాడు. 

      • ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసినందుకు ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" గా వ్యవహరిస్తారు.

      • ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు తొలుగుతాయి అని భక్తుల నమ్మకం.

      2. అహోబిల నరసింహస్వామి.
      (గురుగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)
      • నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన క్షేత్రమిదేనని స్థల పురాణం చెబుతుంది.

      • హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామిఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరటా.

      • అందుకీ ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

      • ముక్కోటి దేవతలు స్తోత్రము చేసిన కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా "స్వయంభు" తనకు తానే సాలగ్రామముగా, ఎవరు ప్రతిష్ఠచేయని మూర్తిగా ఈ బిలమునందే వెలసినారు.

      • ప్రహ్లాదుడు ప్రార్ధించగా గరుడాద్రి పర్వత క్రింద భవనాశిని తీరమునందు గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదియే ఈ అహోబిలం.

      • ఈ అహోబిలానికి దేవతలు స్తుతించినందున అహోబలం అని, బిలం నందు స్వయముగా వెలసినందుకు అహోబిలం అని రెండు విధాలుగా అభివర్ణించారు.

      • ఈ నరసింహా స్వామిని పూజించిన వారికి గురుగ్రహా దోషాలు నివారణ అవుతాయి.


      3. మాలోల నరసింహ స్వామి..
      (శుక్రగ్రహ అనుగ్రహానికి.. దోషాలు పోవడానికి..)
      • వేదాద్రి పర్వతంమీద లక్ష్మీనృసింహ స్వామిగా "మా" అనగ లక్ష్మి లోల యనగ "ప్రియుడు" అని అర్ధం.

      • ఈ దేవాలయానికి మార్కొండలక్ష్మమ్మపేటు అని కూడా పిలుస్తారు.

      • ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం కలదు.

      • స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు.

      • వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడినది.

      • ఇక్కడి శిల్పము వామపాదాన్ని మడుచుకొని, దక్షిణపాదాన్ని వంచి కిందకు వదలి సుఖాసీనుడై ఉన్నాడు.

      • స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకొన్నట్లుగా యున్నది.

      • స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో యున్నది. భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి.

      • ఇదొక ప్రశంతమైన సుందరమైన చోటు,

      • ధ్యాన అనుష్టాలకు చక్కని వేదిక.

      • ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందని ప్రతీతి.

      4. వరాహ నరసింహస్వామి (క్రోడా)
      (రాహుగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి)

      • వేదాద్రి పర్వతముయందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు.

      • భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి.

      • ఈ నరసింహా మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

      5. కారంజ నరసింహస్వామి.
      (చంద్రగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి)
      • కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.

      • పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి.

      • గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని తెలియుచున్నది

      • శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు "నాకు శ్రీరామ చంద్రమూర్తి తప్ప వేరెవ్వరు తెలువదని చెప్పగా అప్పుడు

      • " నృసింహుడు నేనే శ్రీరాముడనేనే నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శన మివ్వగా ఈ స్వామికి కారంస్వామి అని పేరు.

      • ఈ స్వామికి పాలనేత్రము (త్రినేత్రము) కలదు.

      • అందుకే అన్నమయ్య "పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ" అని పాడారు.

      • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ అనుగ్రహం లభించును.

      6. భార్గవ నరసింహస్వామి.
      (సూర్యగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి..)

      • పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు.కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు.

      • ఈ స్వామిని "భార్గోటి" అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు.

      • పరశురాముని పూజలందుకున్న దివ్యధామము ఇది .

      • ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశ (ఈశాన్యము) యున్నది.

      • స్వామి వారి విగ్రహం, పీఠంపై చతుర్బాహయుతమైశంఖు చక్రాన్వితములైన ఊర్ద్వబాహువుల, అసురుని ప్రేవులను చీలుస్తు రెండు హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్య కశిపుడు,ప్రక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు,

      • ప్రభావళి నందు దశావతారములతో ఈ విగ్రహము కలిగియున్నది.

      • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును.
      7. యోగానంద నరసింహస్వామి.
      (శనిగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి..)
      • యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు. కాబట్టి స్వామివారికి యోగానంద నరసింహ స్వామి అని పిలవబడుచున్నాడు.

      • యోగపట్టంతో, విలసిల్లినాడు,

      • ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడట.

      • మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వమును సాధించెను.

      • ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.

      • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును.


      8. చత్రవట నారసింహస్వామి.
      (కేతుగ్రహ అనుగ్రహానికి..దోషాలు పోవడానికి)
      • పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శాప విమోచనం గావించెను.

      • కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రం నందు గానం చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని

      • చత్రవట స్వామి అని పిలుస్తారు.

      • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును.


      9. పావన నరసింహ స్వామి.
      (బుధగ్రహ అనుగ్రహానికి దోషాలు పోవడానికి)
      • పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి.

      • ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్ధమగుచున్నది.

      • "భరద్వాజ" ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారు.

      • ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు.

      • ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో యున్నది.

      • పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించినంతనే పావనులగుదురు.

      • బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగును.

      • ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.

      • ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభించును.
      ఇంకా వివరాలకు ఈ క్రింది వీడియో యు .ఆర్. యల్ లు చూడండి.

      Pudami : అహోబిలం | Narasimha Swamy Temple ... - YouTube


      నోట్ :

      నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe 

      చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

      నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

      నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.