26, డిసెంబర్ 2018, బుధవారం

Janapada brahma B Vittalacharya, the director of magical innovations on silver screen

ఇంద్రజాల మహేంద్రజాలాలను వెండి తెరపై  అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు జానపదబ్రహ్మ బి.విఠలాచార్య

బి విఠలాచార్య 
బి.విఠలాచార్య (జనవరి 20, 1920 - మే 28, 1999) 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఈయన 1920 జనవరి 28 కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూశారు. సినీ వెండి తెరపై ఇంద్రజాల మహేంద్ర జాలాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బి.విఠలాచార్య తనదైన బాణీతో జానపద చిత్రాలకు ఊపు తీసుకు వచ్చిన మహా దర్శకుడాయన.
బాల్యం నుంచి నాటకాలు మరియు యక్షాగానలలో ఆయన ఆశక్తి చూపించే వారు. ఇతని తండ్రి గారు ఒక ప్రసిద్ధ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇతను మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సులో తన మంచి భవిష్యత్ కోసం  ఇంటిని అతను వదిలిపెట్టాడు. తన కజిన్  నుండి ఉడిపి రెస్టారెంట్ను కొనుగోలు చేశాడు. కొంతకాలం అతను ఈ హోటల్ విజయవంతంగా నడిపించాడు. అతను కొంతమంది మిత్రులతో పాటు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. జైలు కెళ్ళాడు  జైలు నుండి విడుదలైన తరువాత, అతను తన హోటల్ వ్యాపారాన్ని  తన సోదరులకు అప్పగించారు.
అతను హస్సన్ జిల్లాలో స్నేహితుడు శంకర్ సింగ్ మరియు ఇతరులుతో కలిసి ఒక టూరింగ్ థియేటర్  స్థాపించాడు.  ఆయన ప్రతిరోజూ టూరింగ్  సినిమాలు   నడిపేవాడు అందులో ఇతను ఎగ్జిక్యూటివ్ భాగస్వామి గా ఉండేవారు. ఈ  చిత్రాలు చూసి  ఆచరణాత్మకంగా  చిత్రనిర్మాణ  సాంకేతికతను  నేర్చుకున్నాడు. 
బి.విఠలాచార్య బియోగ్రఫీ:

  •  జనవరి 20, 1920, ఉడుపి, కర్ణాటక, భారత దేశం లో జన్మించారు.
  • ఇతర బిరుదులు  జానపద బ్రహ్మ
  • వృత్తి సినీ దర్శకుడు, విఠల్ ప్రొడాక్షన్స్
  • క్రియాశీలక సంవత్సరాలు 1944 To 1993
  • జీవిత భాగస్వామి జయలక్ష్మి
  • ఈయనకు ఒక భార్య, నలుగురు కుమారులు మరియు నలుగురు కుమార్తెలు కలరు.
  • ఈయన మే 28, 1999 (వయసు 79) మరణించారు.
ఇతరవివరాలు:

  • తెలుగులో నిర్మాతగాదర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు
  • ఈయ దర్శకత్వము వహించిన చిత్రాలలో 15 చిత్రాలు ఎన్. టి.రామారావు నటించినవే   అందులో 5   చిత్రాలను విఠలాచార్యేస్వయంగా నిర్మించాడు
  • ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించారు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్యమైనది
  • తక్కువ సినిమా సెటింగ్స్ తో ప్రాంతీయ ఖర్చుతో ఆయన కనులకింపైన జానపద కళా ఖండాలను రూపొందించేవారు.
  • 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఈయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు.  వీటిలో సాంఘీక చిత్రాలే అధికము. 
  • తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు.
  • యన్టీఆర్ తో విఠలాచార్య చిత్రాలతో విజయయాత్ర చేశారువారిద్దరి కాంబినేషన్ తో రూపొందిన చిత్రాల్లో తొంభైశాతం కమర్షియల్ సక్సెస్ను చూడడం విశేషం. 
  • జానపదాలు అనగానే తెలుగునాట యన్టీఆర్, బి.విఠలాచార్య కాంబినేషనే పలువురికి గుర్తుకు వచ్చేలా వారు సాగారు.
  • యన్టీఆర్ తరువాత విఠలాచార్య కాంతారావుతో ఎక్కువ చిత్రాలు రూపొందించారు. ప్రేక్షకుల  మదిలో కాంతారావుకు సైతం జానపదకథానాయకునిగా సుస్థిరస్థానం కల్పించింది విఠలాచార్య గారి సినిమాలే.
  • సినిమా యన్టీఆర్ తో తీస్తే, మరో సినిమా కాంతారావుతో తీస్తూ ముందుకు సాగారు  విఠలాచార్య   ఇద్దరితోనూచిక్కడు-దొరకడురూపొందించి రోజుల్లో కాసుల వర్షం కురిపించారు  దర్శక బ్రహ్మ విఠలాచార్య.  
  • కొంతకాలం పటు విఠలాచార్య మార్కు చిత్రాల హవా తగ్గింది
  •  జగన్మోహిని చిత్రంతో మళ్ళీ తనదైన బాణీ పలికించారాయన.
  • సినిమా దెయ్యాల చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలచింది.
  • విఠలాచార్య లేకపోయినా, ఆయన ట్రెండ్   నాటికీ జనాన్నితెలుగు భారతీయ  సినీ వినీలాకాశం లో అలరిస్తూనే ఉంది.

ఆయన దర్శకత్వము వహించిన చిత్రాలు :

సం.లు 
చిత్రం 
భాష 
నటులు 
దర్శక నిర్మాతలు 

1953

రాజ్య లక్ష్మి 

దర్శకుడు నిర్మాత 

1954

కన్యాదానం 

దర్శకుడు నిర్మాత


1956

వద్దంటే  పెళ్లి 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1957

జయవిజయ 

కన్నడ 

దర్శకుడు నిర్మాత

1957

మనే తుంబిడ హేను 

కన్నడ 

నిర్మాత

1958

అన్న చెల్లెలు 

తెలుగు 

దర్శకుడు

1958

మనే తుంబిడ హేను 

కన్నడ 

దర్శకుడు

1958

పెళ్లి మీద పెళ్లి 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1959

పెన్ కులాటిన్ వేళ్ళకు 

తమిళ్ 

దర్శకుడు

1960

అన్నా చెల్లెలు 

తెలుగు 

దర్శకుడు

1960

కనకదుర్గా పూజ మహిమ 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1961

వరలక్ష్మి వ్రతం 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1962

ఖైదీ కన్నయ్య 

దర్శకుడు

1962

మదన కామరాజు కథ 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1963

బందిపోటు 

తెలుగు 

దర్శకుడు

1963

గురువును మించిన శిష్యుడు 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1963

నవగ్రహ పూజ మహిమ 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1963

వీర కేసరి 

కన్నడ 

దర్శకుడు

1964

అగ్గిపిడుగు 

తెలుగు 

యన్ .టి.ఆర్.

దర్శకుడు నిర్మాత

1965

జ్వాలా దీప రహస్యం  

తెలుగు

కాంతారావు 

దర్శకుడు

1965

మంగమ్మ శపధం 

తెలుగు 

యన్ .టి .ఆర్ .

దర్శకుడు

1965

విజయ సింహ 

కన్నడ 

దర్శకుడు

1966

అగ్గిబరాటా 

తెలుగు 

యన్ .టి.ఆర్ 

దర్శకుడు నిర్మాత

1966

ఇద్దరు మొనగాళ్లు 

తెలుగు 

దర్శకుడు

1967

చిక్కాడు దొరకదు 

తెలుగు 

దర్శకుడు

1967

పిడుగు రాముడు 

తెలుగు 

దర్శకుడు

1967

అగ్గిదొర 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1968

భలే మొనగాడు 

తెలుగు 

దర్శకుడు

1968

కదలదు వదలదు 

తెలుగు 

దర్శకుడు

1969

గండి కోట రహస్యం 

తెలుగు 

యన్ .టి.ఆర్ 

దర్శకుడు

1969

అగ్గి వీరుడు 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1970

అలీబాబా 40 దొంగలు 

తెలుగు 

యన్ .టి .ఆర్ 

దర్శకుడు

1970

లక్ష్మి కటాక్షం 

తెలుగు 

యన్ .టి .ఆర్ 

దర్శకుడు

1971

రాజకోట రహస్యం 

తెలుగు 

యన్ .టి .ఆర్ 

దర్శకుడు

1971

సి.ఐ .డి 

దర్శకుడు

1972

బీదల పాట్లు 

తెలుగు 

ఏ .యన్ .ఆర్

దర్శకుడు నిర్మాత

1973

పల్లెటూరి చిన్నోడు 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1974

ఆడదాని అదృష్టం 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1975

కోటాలో పాగా 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1978

జగన్మోహిని 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1979

గంధర్వ కన్య 

తెలుగు 

దర్శకుడు నిర్మాత

1980

మదన మంజరి 

దర్శకుడు నిర్మాత

1983

నామమోహిని 

దర్శకుడు నిర్మాత

1984

జై భేతాళ 3 డి 

నరసింహరాజు 

కథ ,స్క్రీన్ప్లే 

1985`

మోహిని శపధం 

దర్శకుడు నిర్మాత

1986

వీర ప్రతాప్ 

దర్శకుడు

1987

శ్రీ దేవి కామాక్షి కటాక్షం 

తెలుగు 

కే.ఆర్ విజయ రమ్యకృష్ణ 

దర్శకుడు

1991

శ్రీ శైల భ్రమరాంబిక మహత్యం 

తెలుగు 

నరసింహరాజు కే. విజయ 

దర్శకుడు

1992

కరుణించిన కనకదుర్గ 

తెలుగు 

కే.ఆర్. విజయ 

దర్శకుడు



అప్పట్లో ఈయన చిత్రాలను యువకులు వృద్దులు విపరీతంగా చూసేవారు. ఇప్పటికి  ఆనాటి ప్రజలు ఈ చిత్రాలను టి.వి లలో కంప్యూటర్  ఛానళ్లలో ఇష్టంగా చూస్తున్నారు.

ఇతర ముఖ్య విశేషాలు: 

  • ఎన్.టి.రామారావు, కాంతారావులిద్దరికీమాస్ ఫాలోయింగ్తెచ్చింది విఠలాచార్య చిత్రాలే.  వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్వర్క్కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇదికమర్షియల్ ఆర్ట్అనబడే సినిమా
  • మన ప్రేక్షకులు క్లాస్ సినిమాలు చూడరు. మాస్ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలిఅన్న సూత్రం కూడా నమ్ముకున్నానుఅని విఠాలాచార్య చెప్పేవారు
  • సినిమా నిర్మాణంలోపొదుపుఎలా చెయ్యాలి? అన్న దారి చూపించిన వ్యక్తి కూడా ఆయనే. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ  అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు
  • అలాగే కాస్ట్యూమ్స్, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. ‘నటీనటుల కాల్ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లిందిఅని ఒక సందర్భంలో కాంతారావు చెప్పారు.
  • విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీనటులకీ, టెక్లీషియన్లకీ తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా - చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు పంపించేసేవారు. ఏది వచ్చినా రాకపోయినా విఠలాచార్య గారి చెక్కు వచ్చేస్తుందన్న నమ్మకం అందరికీ వుండేది. విధానం అరుదు! అలాగే నటీనటులకి కాల్ షీట్స్ అడ్జస్ట్ చెయ్యడంలో కూడా ఆయననంబర్వన్అనిపించుకునేవారు.
  • ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవారు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే సాధారణంగా డైరెక్టర్లు, నిర్మాతలూ వాళ్లని చూసేవారు కాదు. మేనేజర్ అడ్రస్ తీసుకుని పంపేస్తాడు. విఠలాచార్య అలా కాదు. వచ్చిన ప్రతీవాళ్లనీ తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించేవారు. విధానం కూడా అరుదే.
  • స్క్రిప్టు ముందు రాయించుకుని, షెడ్యూల్సు వేసుకుని టైముకి ముందుగానే షూటింగ్ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే చెల్లింది. సినిమా ఆరంభించకముందే - విడుదల తేదీ ఇవ్వడం ఎంతమందికి సాధ్యం? సినిమా పరిశ్రమలో ఇదికూడా అరుదే! ఇలాంటి అరుదైన వాటిని అమలుపరిచిన విఠలాచార్య జానపద చిత్రాలకి ఆదరణ తగ్గుతోందన్న ఆలోచనలో అక్కినేని నాగేశ్వరరావుతోబీదల పాట్లుతీశారు

  • తన టెక్నీషియన్లందరినీ మార్చి, నటీనటుల్నీ మార్చి మంచి క్వాలిటీతో చిత్రం రావాలని - కృషి చేసి తీశారు. తన విధానానికి భిన్నంగా తీశారు. ‘చిత్రం ఉత్తమంగా వుందిఅని అందరూ ప్రశంసించారు. కాని డబ్బు రాలేదు. ‘విఠలాచార్య సినిమా ఇలావుందేమిటి?’ అన్నారంతా. ‘నా పేరు కాకుండా ఇంకొకరి పేరు వేసివుంటే బాగా నడిచేదేమో!’ అని వ్యాఖ్యానించారు విఠలాచార్య
  • ఏది అలవాటు చేస్తే ధోరణిలో వెళ్లడమేశ్రేయస్కరంఅన్నది ఆయన అనుభవం  చెప్పిన నీతి.
ఇంకా ఇంగ్లీష్  లో  తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...

B. Vittalacharya - Wikipedia


విఠలాచార్య బయోగ్రఫీ ఇతర వివరాలు వీడియో యు .ఆర్.యల్  లు చూడండి...

B. Vittalacharya - Topic - YouTube


https://www.youtube.com/channel/UC9CYCIkTY0o86ZS9ZrxbGkA

Mohini Sapatham Telugu Full Movie | Narasimha Raju | Ahalya | B ...


https://www.youtube.com/watch?v=9-_7noe70-k&vl=en

నా ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com
నచ్చినట్లైతే like,share and subscribe చేయడం మర్చిపోకండి
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com 
కూడా  like,share and subscribe  చేయడం మర్చిపోకండి . 
wowitsviral.blogspot.com కూడా చూడండి .... థాంక్యూ. 

22, డిసెంబర్ 2018, శనివారం

Do you know how many God Vigneswara?

గణపతులు ఎంతమందో మీకు తెలుసా?

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). 

అవాంతర భేద గణపతులు 11 - మొత్తం - 32. నెల్లూరు లోని జ్యోతి వినాయక ఆలయం లో 32 గణపతి విగ్రహాలు కలవు.

1.  శ్రీ మహా గణపతి

       శ్రీ మహా గణపతి 

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. 
  • ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.
  • హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టంశిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే    అనే మంత్రంతో ప్రార్థించాలి.

2. శ్రీ వర గణపతి - 


                                                                         శ్రీ వర గణపతి
  • పాశం ,అంకుశం, తేనెకుండ, రత్నాల కుండా ఉంటుంది. వరాలు తీర్చే గణపతి 

3. శ్రీ శక్తి గణపతి -  

           శ్రీ శక్తి గణపతి
  • నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,  విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు.   ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.
  • ఆలింగ్య దేవీం హరితాంగయష్టింపరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్సంధ్యారుణం  పాశ స్ఫటీర్దధానంభయాపహం  శక్తి గణేశ మీదేఅనే మంత్రంతో   ఈ గణేశుని ప్రార్థించాలి. 

4. శ్రీ భక్తి  గణపతి 

         శ్రీ భక్తి  గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. 
  • ఈయనను... నాలికేరామ్ర కదలీ గుడపాయాస    ధారిణమ్శరచ్చంద్రాభ్వవుషం   భజే భక్త గణాధిపమ్అనే మంత్రంతో స్తుతించాలి...

  • ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

5. శ్రీ బాల గణపతి

        శ్రీ బాల గణపతి
  • ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు.

  • బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.  కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్ బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
  • అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

6. శ్రీ తరుణ గణపతి -  

           శ్రీ తరుణ గణపతి
  • వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. 

  • ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ   స్వదంత శాలీనమపి స్వహస్త్రైః   ధత్తే సదా య సతరుణాభః  పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః    అనే మంత్రంతో పూజించాలి.

7. శ్రీ ఉచ్చిష్ట గణపతి -  

     శ్రీ ఉచ్చిష్ట గణపతి 
  • నాలుగు చేతులు  వీణ, నీలం కలువ, జపమాల కలిగి, వరి  మొక్క కలిగి ఉంటాడు, ఈ దేవుని పూజిస్తే భవిషత్తు గురించి తెలుస్తుంది.

  • ఈయనను.... నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్   దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః   అనే మంత్రంతో ప్రార్థించాలి.

8. శ్రీ ఉన్మత్త గణపతి

         శ్రీ ఉన్మత్త గణపతి 

9. శ్రీ విద్యా గణపతి -

            శ్రీ విద్యా గణపతి

10. శ్రీ దుర్గా గణపతి

   శ్రీ దుర్గా గణపతి 
  • పాశం, జపమాల, విరిగిన దంతం, రోజా పుష్పం కలిగి ఉంటారు.

11. శ్రీ విజయ గణపతి

           శ్రీ విజయ గణపతి

  • సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు.ఈ గణపతిని....
  • పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనఃవిఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

12. శ్రీ వృత్త గణపతి -

13. శ్రీ విఘ్న గణపతి

  • గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి. కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. 
  • ఈయనను...శంఖేక్షు చాప కుసుమేషు కుఠార   పాశచక్ర స్వదంత సృణి మంజరికా  శరౌఘైపాణిశ్రి అఅఅ పరిసమీహిత భూషణా శ్రీవిఘ్నేశ్వరో   విజయతే తపనీయ గౌరః   అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. శ్రీ లక్ష్మీ గణపతి- 

           శ్రీ లక్ష్మీ గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. 
  • ఈ వినాయకుడిని సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
  • బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరఃశ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికేగౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసి ఉంటుంది  

15. శ్రీ నృత్య గణపతి

         శ్రీ నృత్య గణపతి

  • సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.
  • పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః   క్లుప్త పరాంగులీకుమ్ పీతప్రభం కల్పతరో రథః   స్థం భజామి తం నృత్త పదం గణేశమ్అనే మంత్రంతో   ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. శ్రీ శక్తి గణపతి -

        శ్రీ శక్తి గణపతి

17. శ్రీ మహా గణపతి

    శ్రీ మహా గణపతి

  • దంతం,దానిమ్మపండు, రత్నాలకుండ, నీలి కలవ కలిగి వుంటారు 

18. శ్రీ బీజ గణపతి -

19. శ్రీ దుంఢి గణపతి

  • విలువైన రత్నాల మాల, జపమాల.

20. శ్రీ పింగళ గణపతి - 

  • కోరికలు తీర్చే గణపతి దేవుడు 

21. శ్రీ హరిద్రా గణపతి -  

       శ్రీ హరిద్రా గణపతి

  • మోదకం అనే తీపి పదార్థం

22. శ్రీ ప్రసన్న గణపతి -

       శ్రీ ప్రసన్న గణపతి

23. శ్రీ వాతాపి గణపతి -

 శ్రీ వాతాపి గణపతి

24. శ్రీ హేరంబ గణపతి

        శ్రీ హేరంబ గణపతి

  • ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు.

  • అభయ వరదహస్త పాశదంతాక్షమాలసృణి పరశు రధానో ముద్గరం మోదకాపీఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రంగణపతి రతిగౌరః పాతు హేరంబ నామా    అనే మంత్రంతో స్తుతించవలసి ఉంటుంది. 
  • ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

25. శ్రీ త్ర్యక్షర గణపతి 

                                              శ్రీ త్ర్యక్షర గణపతి 

  • కల్పవృక్షం కొమ్మ, కలువ, దానిమ్మ పండు కలిగి వుంటారు.  

26. శ్రీ త్రిముఖ గణపతి - 


  శ్రీ త్రిముఖ గణపతి 

  • తేనెపాత్ర, పాశం, అంకుశం.

27. శ్రీ ఏకాక్షర గణపతి -

     శ్రీ ఏకాక్షర గణపతి 

28. శ్రీ వక్రతుండ గణపతి -

  శ్రీ వక్రతుండ గణపతి 

29. శ్రీ వరసిద్ధి గణపతి  

  శ్రీ వరసిద్ధి గణపతి 

  • పాశం, అంకుశం, తేనెకుండ, రత్నాల కుండ

30. శ్రీ చింతామణి గణపతి-

శ్రీ  చింతామణి గణపతి 

31. శ్రీ సంకష్టహర గణపతి

 శ్రీ సంకష్టహర గణపతి 
  • అన్నపాత్ర, పాశం, అంకుశం, కలిగి వుంటారు 

32 .శ్రీ త్రైలోక్య మోహన గణపతి -

శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః

  1. ఓం సుముఖాయ నమః
  2. ఓం ఏకదంతాయ నమః
  3. ఓం కపిలాయ నమః
  4. ఓం గజకర్ణకాయ నమః
  5. ఓం లంబోదరాయ నమః
  6. ఓం వికటాయ నమః
  7. ఓం విఘ్నరాజాయ నమః
  8. ఓం గణాధిపాయ నమః
  9. ఓం ధూమ్రకేతవే నమః
  10. ఓం గణాధ్యక్షాయ నమః
  11. ఓం ఫాలచంద్రాయ నమః
  12. ఓం గజాననాయ నమః
  13. ఓం వక్రతుండాయ నమః
  14. ఓం శూర్పకర్ణాయ నమః
  15. ఓం హేరంబాయ నమః
  16. ఓం స్కందపూర్వజాయ నమః

16 మంది  గణపతులను షోడశ గణపతులంటారు. షోడశ గణపతి స్తోత్రం...

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |

విద్యారంభే వివాహే ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య జాయతే || 3 ||


Ganapathi Stotram with Lyrics...



వినాయకుడి ఇంకా చాలా  తెలుసుకోండి...

నోట్  
ఈ బ్లాగ్ wowitstelugu.blogsopt.com
నచ్చినట్లైతే like,share and subscribe చేయడం మర్చిపోకండి
మరియు ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com 
కూడా  like,share and subscribe  చేయడం మర్చిపోకండి . 
wowitsviral.blogspot.com కూడా చూడండి .... థాంక్యూ.