24, జనవరి 2022, సోమవారం

గోమాత పురాణ గాథ, గోమాత వ్రతవిథి విధానము, విశిష్టత మరియు గోవుకు ఏ మేత కి ఏ ఫలితమో తెలుసుకుందాం

wowitstelugu.blogspot.com

గోమాత పురాణ గాథ, గోమాత వ్రతవిథి విధానము,  విశిష్టత మరియు  గోవుకు ఏ మేత కి  ఏ ఫలితమో తెలుసుకుందాం

గోవుని శ్రీమన్నారాయణుడి రూపంగా పురాణాలు చెబుతున్నాయి. మన దైనందిన జీవితంలో మనతోపాటు మమేకమై కలసిపోయిన జీవి గోవు ఈ చరాచర సృష్టిలోని సమస్త దేవతలు గోవులో నిక్షిప్తం అయి ఉన్నాయని, ఆ కారణంగా గోవును వధించడం, దూషించడం పాపంగా పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనాదిగా గోవును దైవస్వరూపంగా పూజిస్తున్నారు.

మన నిత్య జీవితంలో ‘గోవు’ ను మానవుడు ఒక ప్రధానావసరంగా ఉపయోగించు కుంటున్నాము. గోవుపాలు పిల్లలు పెద్దలు అందరు తాగుతారు. ఆవు పెరుగు ఆహారంగా స్వీకరిస్తాము, నెయ్యి తో అనేకరాలైన వంటలు వండుకుంటాం, పంచకం ఆయుర్వేద వైద్యానికి, పేడ ఇంధనం గాను వాడుకుంటాము. ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడ్తున్నాయి. భౌతిక ప్రపంచంలో మనకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఈ గోవును పురాణాలలో దైవంగా అభివర్ణించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన గోవును పూజించడం, అందునా ఓ పద్ధతి ప్రకారం పూజించడం సమస్త పుణ్యాలనిస్తుందంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి వాడుకలో ఉంది.

గోమాత పురాణ గాథ

గోవుకు సంబందించిన ఒక పురాణ గాథ ప్రాచుర్యం లో ఉంది. పూర్వమొకపుడు పాండురాజు భార్య అయిన కుంతీదేవి, తన మేనల్లుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీకృష్ణ్భగవానుని దగ్గరకు వెళ్ళి ‘‘మధుసూదనా... దోషభూయిష్టమైన ఋతు కాలంలో ఇంట్లోవారిని ముట్టుకోవడం, సూదితో వస్త్రాలను కుట్టడం లాంటి పనులు తెలిసీ తెలియక చేస్తూ వుంటారు. అలాగే పెద్దలను నిందించడం, స్వపర ద్రవ్యాపహరణం లాంటి దుష్కర్మలు తెలిసికొని, తెలియక కాని చేస్తూ వుంటారు. అలాంటి దుష్టకార్యాలు చేసినపుడు సంక్రమించిన పాపాలు పోవడానికి ఆచరించాల్సిన వ్రతమొక దానిని చెప్పమని అడిగిందట. దానికి శ్రీ కృష్ణుడు, కుంతీదేవిని ఉద్దేశించి, ఆయా పాపాలన్నీ పోవడానికి గోవ్రతమనే ఒక వ్రతం ఉందని దానిని ఆచరిస్తే ఆయా పాపాలన్నీ పోయి, సర్వసౌఖ్యాలు సొంత మవుతాయని చెప్పాడు.

వ్రతం నాలుగు (4) విధాలుగా ఉంటుందని, దీనిని ఆచరిస్తే పాప విముక్తులై, పుణ్యం సిద్ధిస్తుందని చెప్పాడు. అలాగే జపతపాలు, వ్రతోపవాసాలు తది తరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతం వల్ల కూడా కలుగుతుందని చెప్పాడు.

సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు ఈ వ్రతాన్ని ఆరంభించాలి. అలాగే రజో దోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. మకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడినకృష్ణ చతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి.

శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటి నుంచి ‘గోవుదైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది.

గోవ్రతం చేయడానికి చేయవలసిన నియమాలు:

  • ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.

  • నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్, పద్మక, నాగబంధం, మండలాలను నిర్మించాలి.

  • లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచా మృతాలతో  అభిషేకించాలి.

  • ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, లేదా వెండి లేదా యథాశక్తి చేయించాలి. అనంతరం పంచా మృతాలతో అభిషేకించాలి.

  • ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో నలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.

  • అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.

  • ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.

  • తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్ట చేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి.

  • పూర్ణాహుతినిచ్చిన తర్వాత ఆచార్యునికి  ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.

  • "గో"దానాన్ని శక్తి ఉంటే మిగిలిన దశ/షోడశ దానాలను చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.

ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన అన్ని పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భ భగవానుడు చెప్పాడు.

గోమాత విశిష్టత ఏమిటి? 

"గావో విశ్వస్యమాతర:"

గోవు సమస్త విశ్వానికి తల్లి . ” సమస్త జీవరాశిని పాలించి , పోషించి , కాపాడే తల్లి గోమాత”

”మహస్త వేవ గోర్మహమా ”

శత పధ బ్రాహ్మణం చెపుతుంది . ” గోవు మహిమ ఎంత వర్ణించినా తక్కువే ” అని అర్ధం. ” "దేను సదనం రాజీనా౦"

అంటే గోవు సమస్త సంపదలకు మూలం .

గావ: స్వర్గస్య సోపానం గావ:స్వర్గేపి పూజితా:

(మహాభారతం)

గోవులు స్వర్గానికి సోపానాలు . గోవులు స్వర్గం లో కూడా పూజింప బడుతాయి ” . ” గోఘ

భక్తశ్చలభతే యత్ యది చ్ఛతి మానవ: ( మహాభారతం)

" గోభక్తుడైన మానవుడు ఏమి కోరికలు కోరుకుంటాడో అతనికి అవన్నీ లభిస్తాయి ” .

యాయ౦ గావో భేదయిథాకృష౦చిద్ షీర౦చిత్ క్రునుథా సుప్రథీక౦ భద్ర / గృహం కృనుథ భద్రవాచో వృహద ఓవయి ఉచ్చతే సభాసు // ( ఋగ్వేదం )

ఓ గోమాతా, నువ్వు బలహీనుడిని కూడా బలవంతుని చేస్తావు. వర్చస్సును తెస్తావు . ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతావు . నీ అమృత ప్రాయమైన పాల గురించి అంతా చెప్పుకుంటారు” .

తృునోదకాది సంయుక్తం య: ప్రాపద్యాత్ గవాహ్నికమ్/ సోశ్మెధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయ: // ( బృహత్ పరాశర స్మృతి )

ప్రతి దినము గోవులకు నీరు త్రాగించి, గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యాగం చేసిననంత పుణ్యం వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

గోమాత గొప్పదనం 

  • ప్రాణవాయువు (Oxygen )ను పీల్చూకుని ప్రాణ వాయువు (Oxygen ) ను వదిలే ఏకైక ప్రాణి.

  • విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

  • వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాత ది.

  • ఆవునెయ్యి, బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తి వంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

  • ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన  పంచకావ్యం  లో ని 64 రకాల సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన ఔషదాలు  కనుగోన్నారు.

  • వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల ఔషదాలు కూడా కనుగొన్నారు. ఈ ఔషదాలు  ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.

  • ఇళ్ళను, వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

  • ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

  • ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు (Oxygen ) ఉత్పత్తి అవుతుంది.

గో  సూక్తులు : 

  • ''గోరక్షణ వల్లనే మన జాతి, మన ధర్మము రక్షింపబడును. గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.- గాంధీజీ.

  • ''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.- మహ్మద్ ప్రవక్త.

  • ''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''. - ఏసుక్రీస్తు.

  • ''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''. - హజరత్ మహమ్మద్.

  • ''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము. ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగా నుండును.గృహములు ఉన్నతి చెందును. నాగరికత పురోగమించును''. - బర్మార్డ్ మేక్ ఫెడన్.

  • ''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''. - హకీల హజ్మల్ ఖాన్.

  • ''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.  - తోహస్-వి-హింద్ బిజహరు
గోవుకు పెట్టె ఏ మేత వల్ల ఏ ఫలితం ఉంటాదో తెలుసు కుందాం

  • నానబెట్టిన ఉలవలు  -  వృత్తి లో  నిలకడ
  • నానబెట్టిన బొబ్బర్లు  -  ధనాభివృద్ది కలుగును 
  • నానబెట్టిన గోధుమలు - కీర్తి పట్టుదల పెరుగును

  • నానబెట్టిన మినుములు - ఆత్మ విశ్వాసం 
  • నానబెట్టిన  కందులు - కోపం తగ్గును
  • నాన బెట్టిన పెసలు - విద్యాభివృద్ధి 
  • తోటకూర బెల్లం - ప్రశాంతత కలుగును, దారిద్యం తొలగి పోవును 
  •  బంగాళా దుంపలు -  నరఘోష తొలగి పోవును 
  • క్యారట్లు - వ్యాపార అభివృద్ధి జరుగును 
  • బీట్రూట్ , పాలకూర - ఐశ్వర్యప్రాప్తి 
  • దోసకాయలు - శత్రు నివారణ
  • టమాటాలు - వివాహ ప్రాప్తి 
  • వంకాయలు - సంతాన ప్రాప్తి 
  • అరటిపండ్లు  -  ఉన్నత పదవి 
  • బెండకాయలు - మనో దేర్యం 
  • దొండకాయలు - మానసిక ప్రశాంతత 
  • మినప పిండి బెల్లం - అఖండ ఐశ్వర్యం 
  • గోధుమపిండి, బెల్లం - ఉద్యోగ ప్రాప్తి 
  • ఛాయపెసరపప్పు (నాన బెట్టింది ) - ఇంద్రియ నిగ్రహం 
  • కందిపప్పు (నాన బెట్టింది ) - రుణ విముక్తి 
  • మినపపప్పు  (నాన బెట్టింది ) - ఆరోగ్య ప్రాప్తి 
  • పచ్చిచెనగపప్పు (నాన బెట్టింది ) - కుటుంబ కలహాలు తొలగును 
  • తోటకూర బెల్లం - కోర్టు  వ్యవహార్లాలో  విజయం కలుగును
  • పొట్టు పెసలు (నాన బెట్టింది ) - బుద్ది కుశలత పెరుగును 

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్.ల లో గోమాత గురించి తెలుసుకోండి



Quote of the day:

When change happens, you have a choice for how you are going to respond. You can either lose your composure and react impetuously or use the event or situation as a learning opportunity to shift your mindset and respond appropriately. Begin to notice your responses when changes occur and do your best to choose a breakthrough over a breakdown."

- Susan C. Young

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి