పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి ” పిప్పలాదుడు” అనే పేరు వస్తుంది.
చిన్న పిల్లవాడైన పిప్పలాదుడు పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.
- పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు.
- శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.
- ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు.
- అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు.
- అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం
(Pippalada proktha Sani Stotram)
(Dasaradha krutha Shani Stotram)
కుడిచేతిలోకి నీరు అక్షింతలు తీసుకుని ఓం అస్యశ్రీ శనిస్తోత్ర మహామంత్రస్య నుండీ జపే వినియోగః వరకు చెప్పిన తర్వాత నీరు వదిలేయాలి.
అథః వినియోగ:
ఓం అస్య శ్రీ శనిస్తోత్ర మంత్రస్య కశ్యప ఋషిః త్రిచ్చంద్ర: సౌరిర్దేవతా, శం బీజమ్, ని: శక్తి: కృష్ణ వర్ణేతి కీలకమ్, ధర్మార్థ కామ మోక్షాత్మ కచతుర్విధ – పురుషార్ధసిద్ద్యర్ధం జపేవినియోగః
అథ కరన్యాసం:
ఈ న్యాసం చెప్పేటప్పుడు పేరును బట్టి ఆ వేళ్లను స్పృశించాలి.
శనైశ్చరాయ అంగుష్టాభ్యాసం నమః
మందగతయే తర్జనీభ్యాం నమః
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమ: కృష్ణాంగాయ అనామికాభ్యాం నమః
శుశ్కోదరాయ కనిష్టాంగాయ అనామికాభ్యాం నమః
శుష్కోదరాయ కనిష్టకాభ్యాం నమః చాయాత్మజాయ
కరతల కరపృష్టాభ్యాం నమః. అథ హృదయాది న్యాసః
అస్త్రాయ ఫట్ అనేటప్పుడు ఎడమ అరచేతిపై కుడిచేతితో చప్పట్లు కొట్టి ఫట్ అనే ధ్వని చేయాలి.
శనైశ్చరాయ హృదయాయ నమః మందగతయే శిరసే స్వాహా
అథోజాయ శిఖాయై వషట్ కృష్ణాంగాయ కవచాయ హుమ్
శుష్కోదరాయ నేత్రత్రాయ వౌషట్ ఛాయాత్మజాయ
అస్త్రాయ ఫట్ అథ దిగ్భంధనమ్ ఓం భూర్భవ: స్వః
అంటూ నాలుగు వైపులా చిటికెలు వేయాలి.
అథః ధ్యానమ్ నీదు ద్యుతిమ్ శూలధరమ్ కిరీటినం
గ్రథస్థితం త్రాసకరం ధనుర్ధరమ్ చతుర్భుజం
సూర్యసుతం ప్రశాంతం వందే సదాభీష్టకరం
వరేణ్యమ్ శని స్తోత్ర్రం ప్రారంభం నమః
కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః
కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ
శుష్కోధర భయాకృతే నమః పుష్కలగాత్రాయ స్థూలరోమ్ణ్థ వై నమః
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే నమస్తే
కోట రక్షాయ దుర్నిరీక్ష్యాయ వై నమః నమో ఘోరాయ
రౌద్రాయ భీషణాయ కపాలినే నమస్తే సర్వభక్షాయ బలీముఖే నమోస్తుతే
సూర్య పుత్ర నమస్తేస్తు సంవర్తక నమోస్తుతే నమో మందగతే
తుభ్యం నిస్త్రీంశాయ నమోస్తుతే తపసా దగ్ధదేహాయ నిత్యం
యోగరతాయ చ నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో
హరసి తత్క్షణాత్ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విధ్యాధరోరగా:
తవ్యా విలోకితా: సర్వే నాశం యాన్తి సమూలతః ప్రసాదం కురు
సౌరే వరదీ భవ భాస్కరే ఏవం స్తుతస్తదా సారిగ్రహరాజో మహాబలః
అవ్రవీచ్చ శనిర్వాక్యం హృష్టరోమా చ పార్దివః తుష్టోహం
తవ రాజేంద్ర స్తోత్రేనానేన సువ్రత ఏవం వరం ప్రదాస్యామి యన్తే మనసి వర్తతే
దశరథ ఉవాచ పసన్నో యది మే సౌరే వరం దేహి మమేప్సితమ్
అద్య ప్రభ్రుతిప్పింగాక్ష పీడా దేవా న కస్యచిత్ ప్రసాదం కురు మే సౌరే వరోయం
మే మహేప్సితః శని ఉవాచ అదేయస్తు వరౌస్మాకం తుష్టోకం చ
దదామి తే త్వచాప్రోక్తం చ మే స్తోత్రం యే పఠిష్యంతి మానవాః
దేవాసుర మనుష్యాశ్చ సిద్ద విద్యాధరోరగా న తేషా బాధతే పీడా మత్క్రుచా వై
కదావన మృత్యుస్థానే చతుర్థే వా జన్మ వ్యయ ద్వితీయగే గోచరే జన్మకాలే
వా దశాస్వన్తర్దశాసు చ యః పఠేత్ ద్వి త్రి సంధ్యం వా శుచిర్భూత్వా సమాహితః
న తస్య జాయతే పీడా కృత వై మమనిశ్చితమ్ శని శాంత మంత్ర స్తుతి
(Dasaradha Prokta Shani Stotram)
అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః
శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః
దశరథ ఉవాచ
కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ ||
సురాసుర కింపురుషా గణేంద్రా
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పుర పట్టాణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
తిలైర్య వైర్మాష గుడాన్నదానై
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రైర్నిజ వాసరేచ
తస్మై నమః శ్రీరవినందనాయ ||
ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ ||
అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||
స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య
త్రాతా హరిః శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||
శన్యష్టకం యః పఠతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః ||
ఇతి శ్రీ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణం
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో దోష నివారణకు పిప్పలాద, దశరథ ప్రోక్త శని స్తోత్రం లు చూడండి.
"Who you spend your time with will have a great impact on what kind of life you live. Spend time with the right people."
-Joel Osteen
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి