wowitstelugu.blogspot.com
భద్రాచలం శ్రీ వైకుంఠ శ్రీరాముడు వైభవాన్ని గురించి తెలుసు కోండి.
శ్రీరాముడు స్వయంభువుగా వెలసిన పుణ్యక్షేత్రం భద్రాద్రి. శ్రీరాముడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గర్భాలయంలో ఉన్న శ్రీరాముని మూలవిరాట్టు, వనవాసంలో ఉన్నప్పుడు వారు ఏర్పరుచుకున్న పర్ణశాల, ఇక్కడే నివసించిన శబరికి రాముడు ఇచ్చిన వరం ఇలా ఎన్నో విశేషాలు కలిగిన మహిమ గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి లేదా భద్రాచల క్షేత్రం. శ్రీరాముడు ఎక్కడ లేని విధంగా వైకుంఠ రాముడి గా దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భద్రాచలం ఎక్కడ ఉంది:
ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం.దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి.భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది.అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది.
స్థల పురాణం :
ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం భద్రుడనే భక్తుడు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం కఠోర తపస్సు చేయగా, విష్ణుమూర్తి ప్రత్యేక్షమై వరం కోరుకోమనగా, నేను కొండగా మారుతాను, నీవు నా పై నివాసం ఉండాలని కోరగా భద్రుడి తపస్సుకి మెచ్చిన శ్రీమహావిష్ణువు శ్రీరాముడు భద్రగిరి పైన కొలువై ఉన్నాడు. ఇక రామావతారంలో అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు సీతాసమేతుడై భద్రాద్రి కొండపైన ఉన్నాడని పురాణం.
పూర్వము సీతారాములు అరణ్యవాసంలో ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు శబరి అనే ఒక వృద్ధురాలు రాముడికి అమిత భక్తురాలు. ఈ అడవిలో లభించే పండ్లని వారికీ లేచి సరిగా ఉన్నాయో లేదో రుచి చూసి మరీ స్వయంగా తినిపించింది. దానికి సంతోషించిన శ్రీరాముడు ఆమె పేరు ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా శబరి అనే నది రూపంలో ఇక్కడే ప్రవహిస్తూ ఉండమని వరాన్ని ఇస్తాడు. ఈ నది భద్రాచలానికి సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ప్రవహించే శబరి నది కొంత దూరం ప్రవహించి గోదావరి నదిలో కలుస్తుంది.
భద్రాచలం ఆలయ విశేషాలు:-
1.
ఈ ఆలయం గర్భగుడిలో సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు నాలుగు చేతులతో దర్శనం ఇస్తాడు. శ్రీ రాముడువెలసిన మిగతా ఆలయాల్లో రాముడి మూలవిరాట్టు రెండు చేతులతో మానవుని రూపాన్ని పోలి ఉంటుంది.
2.
కానీభద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీ రాముడి విగ్రహం నాలుగు చేతులతో కుడి చేతిలో బాణంను, ఎడమచేతిలోవిల్లును ధరించి విష్ణువు వలె కుడిచేతిలో శంఖంను, ఎడమచేతిలో చక్రంని ధరించి ఉంటాడు.
3.
అందుకే ఇక్కడ వెలసిన రాముడిని వైకుంఠ రాముడిని, భద్రాద్రిరాముడు అని, చతుర్భుజ రాముడిని, గిరినారాయణుడని భక్తులు కొలుస్తుంటారు.
భద్రాచలం పరిసర ప్రాంతాల విశేషాలు:-
- భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు సీతా రామ కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు.
- పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
- పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది.
- అడవి, జలపాతాలు: భద్రాచలం పరిసరప్రాంతాలలో సుందరమైనటువంటి ఉన్నవి .
- కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
- పర్ణశాల: సీత రాముల వనవాసం పర్ణశాలలో జరిగింది, శ్రీ రామ పదాలు మరియు సీత నారచీర.
- సంస్కృతి సంప్రదాయాలు: భద్రాచలం చుట్టుపక్కల గిరిజన ప్రజలు సంస్కృతి సంప్రదాయాలు కట్టుబొట్టు ధింస్సా నృత్యం కొమ్మునృత్యం జాతరలు పండగలు జరుపుకుంటారు.
శ్రీ రాముడికి 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఆ 16 లక్షణాలు ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- గుణవంతుడు- గుణం కలిగినవాడు
- వీరుడు – మంచి ప్రతాపం కలిగినవాడు
- ధర్మజ్ఞుడు – ధర్మం అంటే ఏంటో తెలిసినవాడు
- కృతజ్ఞుడు – చేసిన మేలు మరువనివాడు
- సత్య వాక్య పరిపాలకుడు – ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు
- ధ్రుఢవ్రతుదు – స్థిర సంకల్పం కలవాడు
- ఉత్తమ చరిత్ర కలవాడు – మంచి నడవడి కలవాడు
- సర్వభూత హితడు – సర్వ ప్రాణుల హితాన్ని కోరేవాడు
- విద్వాంసుడు – అన్నివిద్యలలో జ్ఞానం కలవాడు
- సమర్ధుడు – సామర్థ్యం కలవాడు
- ప్రియవర్తనుడు – సదైక ప్రియదర్శనుడు
- ఆత్మవంతుడు `- ధైర్యం, వ్యక్తిత్వం కల్గవాడు
- జితక్రోధుడు – కోపాన్ని జయించేవాడు
- ద్యుతిమంతుడు – తానూ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు
- నిర్మల హృదయుడు -అసూయ లేనివాడు
- దుర్మార్గులకు అతి కోపిష్టి -ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు.

ఈ క్రింది యు.ట్యూబ్ .వీడియో యు . ఆర్ . యల్ ల లో భద్రాచలం గురించి
తెలుసుకోండి :-
Sita Ramachandra Swamy Temple - Bhadrachalam - YouTube
How To Visit Badrachalam Seetharamula Temple || Bhadrachalam ...
Note:
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .
“Useful post”
రిప్లయితొలగించండిAchyutha Packers and Movers
Hanamkonda Packers and Movers
Warangal Packers and Movers
Kazipet Packers and Movers
Karimnagar Packers and Movers
Hyderabad Packers and Movers
Parkal Packers and Movers
Jayashankar Bhupalpally Packers and Movers
Godavarikhani Packers and Movers
House Shifting Services Hanamkonda
House Shifting Services Kazipet