మన హిందూ ధర్మ శాస్త్రాలలో , యోగ శాస్త్రం లో రక రకా లైన స్నానాలు గురించి చెప్పబడింది. ఇంతకీ మీది ఏ స్నానమో నిర్ణయించుకోండి...
- రుషి స్నానం,
- దేవ స్నానం,
- మానవ స్నానం,
- రాక్షస స్నానం...
ఇంతకీ మీది ఏ స్నానం...?
- బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇపుడు సిటీలలోనే కాదు... పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్గా మారింది.
- అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి... ఉదయం ఎంతకీ నిద్రలేవరు.
- సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు.
- కానీ, ఇది మంచి పద్ధతి కాదుంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎపుడు చేయాలి...? దాన్నిబట్టి ఉండే ఫలితాలు ఇవిగో...
- తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు.
- 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.
- ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం.
- ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు.ఇది అధమాతి అధమం.
- కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
- ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.
- చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం చెయడం అధమం.
- వేయి పనులున్నా వాటిని వదిలి సమయానికి స్నానం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
- ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఇంకో నదిని దూషించకూడదు.
- కొన్ని స్పాలలో, ఆయుర్వేదశాలల్లో చాకొలేట్, మట్టి వంటి ఇతర పదార్థాలతో స్నానం చేయటానికి ప్రత్యేక వసతులు ఉంటాయి.
- షాంపేనుతో స్నానం చేసిన ఉదాహరణలు అక్కడక్కడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఆరుబయట సూర్యుని కిరణాలు శరీరాన్ని తాకేట్టు పరుండటాన్ని కూడా స్నానంగా పరిగణిస్తారు.
ఈ సూర్య స్నానం (సన్ బాతింగ్) ముఖ్యంగా పాశ్చాత్య ప్రజలలో ప్రసిద్ధి చెందినది.
పురాణాలలో స్నానం:
- మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినది జలం, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలుబడదు.
- అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.
మంత్ర స్నానం:
- వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"
భౌమ స్నానం:
- పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్టమన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రాలతో చేసేది "భౌమ స్నానం".
- సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితంగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేసేది "ఆగ్నేయ స్నానం"
వాయువ్య స్నానం:
- ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేసేది "వాయువ్య స్నానం"
దివ్య స్నానం:
- లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.
వారుణ స్నానం:
- పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".
మానస స్నానం :
- నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.
స్నానాలలో తెలిసినంత వరకు 9 రకాలు ఉన్నాయి.
మానస స్నానం:
దైవాన్ని స్మరిస్తూ, మనసును నిలిపి చేయు స్నానం.
క్రియాంగ స్నానం:
జపం, మంత్రతర్పణ చేయుటకు చేసే స్నానం.
దైవ స్నానం:
ఉదయం 4-5 గంటల మధ్య చేయు స్నానం.
మంత్ర స్నానం:
వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం.
రుషి స్నానం:
ఉదయం 5-6 గంటల మధ్య చేయు స్నానం.
మానవ స్నానం:
ఉదయం 6-7 గంటల మధ్య చేయు స్నానం.
రాక్షస స్నానం:
ఉదయం 7 గంటల తరవాత చేసే స్నానం.
ఆతప స్నానం:
ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకునే స్నానం.
మలాపకర్షణ స్నానం:
మాలిన్యం పోవుటకు చేయు స్నానం.
స్నానం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వీడియో యూ.ర్.ఎల్. చూడండి..
Apr 25, 2014 - Uploaded by TeluguOne
Dharma Sandehalu | Types of taking Snanam (Bath) Hinduism || By Mylavarapu Srinivasa Rao. TeluguOne ...
Nov 4, 2016 - Uploaded by Aarogya Sutralu
[Telugu] Importance of Bathing || Telugu Health Tips || Health Tips In ... Benefits of Bathing || Snanam Ela ...
అలాగే నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి .
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి.
మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి